మైత్రేయ మహర్షి బోధనలు - 90
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 90 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 75. ప్రత్యేక దృష్టి - 2 🌻
భూమిపై తిరుగాడు దైవము దత్తాత్రేయుడు. అతడు సామాన్యులలో కలసిమెలసి తిరుగుచుండును. అతని నెవ్వరునూ గుర్తింపలేరు. కారణము మానవుల డాంబికతయే. డాంబిక విషయముల యందు సత్యము నేతి బీరకాయలోని నెయ్యివంటిది. ఆధ్యాత్మిక మార్గముననే చాటించుకొనుచు తమను తామే కీర్తించుకొను సంఘములు పెక్కు గలవు. అందు ఆధ్యాత్మికత నామమాత్రమే.
విలువగల విషయము లెప్పుడును మరుగున యుండును. ఒక రకమగు తమస్సు వాని నావరించి వెలుగును మరుగుగ నుంచును. కావున మహత్తర విషయములను, సన్నివేశములను, మనుష్యులను గుర్తించుటకు మీరు ప్రత్యేకమగు కన్నును ఏర్పాటు గావించు కొనవలెను. అట్టి దృష్టి లేనివాని జీవితము సత్యదూరమై సాగును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
18 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment