శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 343-1. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻


క్షేత్రమును, క్షేత్రము తెలిసినవారిని పాలించునది శ్రీదేవి అని అర్థము. క్షేత్ర మనగా దేహము. క్షేత్రజ్ఞు డనగా అందు వసించుచు దాని స్వరూప స్వభావముల నెరిగి జీవించువాడు. అన్ని దేహములు క్షేత్రములే. అందలి జీవులు క్షేత్రజ్ఞులే. వారు తమ తమ క్షేత్ర స్వరూప స్వభావముల నెటిగి అందు వసించినచో ఆనందము పొందగలరు. క్షేత్రమున వసించు జీవునకు క్షేత్ర వాసన చేత స్వభావము ఒకటి ఏర్పడును. త్రిగుణముల కలయికను బట్టి స్వభావ ముండును. వాటి సమ్మేళనమే రజస్సు, తమస్సు, సత్త్వములతో కూడిన స్వభావము. స్వభావము ననుసరించి ప్రవర్తించు చుండగ మనస్సు, ఇంద్రియములు, శరీరములకు అభ్యాసము లేర్పడును.

స్వభావము సమపాలుగ వుండనపుడు అభ్యాసములు బంధించును. త్రిగుణములు సామ్యము చెందినపుడు బంధము లేక జీవుడు దేహమున జీవించును. క్షేత్రము అష్ట ప్రకృతులతో కూడి యున్నది. అది మానవుని యందు అహంకారము, బుద్ధి, చిత్తము, పంచేంద్రియములుగ నున్నది. అహంకార స్వరూపుడైన జీవుడు బుద్ధి ననుసరించి జీవించినచో త్రిగుణములు సామ్యము చెంది జీవితము బంధములు లేక నడచును. బుద్ధి ననుసరించ నపుడు త్రిగుణములు విజృంభించి బద్ధుని చేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻

🌻 343-1. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻


The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



26 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సదవగాహన - 4 🌻


ఆధ్యాత్మిక‌ సాధనా యాన పథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింప బనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు. ఇట్టి ఓటములు, వెనుకంజలు తాత్కాలికములు మాత్రమే అని అతడు గుర్తెరుగవలెను. ప్రతి ఓటమి, వెనుకంజ విజయమునకు, ముందంజకు సోపానమే. తప్పు చేసినవాడు ఇక బాగుపడడనుట ప్రకృతి సూత్రము కాదు. ఎవనికయినను బాగుపడుటకును, సరిదిద్దు కొనుటకును ప్రకృతి వీలు కల్పించుచున్నది.

ఏ మానవుడును ఇతరుల కన్నా ఎక్కువగా గాని, తక్కువగా గాని తనను గూర్చి తలంచుట అవివేకము. ప్రతివాడును అమృతపుత్రుడే. మానవుని సహజ గుణములు దివ్యములే గాని అసురములు గావు‌ సత్సాంగత్యముతో, సత్కర్మాచరణముతో, సద్గురు స్మరణతో, సమిష్టి జీవనముతో సాధకుడు తన యందు దాగిన దివ్యగుణములను వికసింపజేసికొని, ముందజ వేయగలడు.


.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 510


🌹 . శ్రీ శివ మహా పురాణము - 510 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43

🌻. శివుని అద్భుత లీల - 2 🌻


ఇంతలో మణిగ్రీవుడు మొదలగు యక్షులు కానవచ్చిరి. వారిసేన గంధర్వుల సేన కంటె రెట్టింపు శోభతో ఆమెకు కానవచ్చెను (13). వారి ప్రభువైన మణి గ్రీవుని ప్రకాశమును చూచి ఆమె 'శివస్వామి ఈయనయే' అని మిక్కిలి ఆనందముతో పలికెను (14). 'ఈయన శివస్వామి కాదు. ఈతడు శివుని సేవకుడు' అని నీవు హిమవంతుని భార్యతో చెప్పితివి. ఇంతలో అగ్ని ముందుకు వచ్చెను (15). మణి కంఠుని కంటె కూడ రెట్టింపు శోభ గల ఆతనిని చూచి 'పార్వతీ పతి యగు రుద్రడీతడే' అని ఆమె పలికెను. అపుడు నీవు కాదని చెప్పితివి (16).

ఇంతలో అంతకంటె రెట్టింపు శోభ గల యముడు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (17). కాదని నీవు చెప్పితివి. ఇంతలో అంతకు రెట్టింపు శోభ గలవాడు, పుణ్యాత్ములకు ప్రభువు, శుభకారకుడు అగు నిర్‌ఋతి వచ్చెను (18). ఆయనను చూచి ఈతడే రుద్రుడని మేన ఆనందముతో పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వరుణుడు వచ్చెను (19). నిర్‌ఋతికంటెనూ రెట్టింపు శోభగల ఆతనిని చూచి ఆమె 'పార్వతీ పతియగు రుద్రుడు ఈతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (20).

ఇంతలో వరుణుని కంటె రెట్టింపు శోభ గల వాయువు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (21). కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వాయువు కంటె రెట్టింపు శోభ గలవాడు, యక్షులకు ప్రభువు అగు కుబేరుడు వచ్చెను (22). ఆతనిని చూచి ఆ మేన హర్షముతో ఈతడే రుద్రుడని పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో ఈశానుడు విచ్చేసెను (23). ఆతని యొక్క శోభ కుబేరుని శోభ కుబేరుని శోభకు రెట్టింపు ఉండుట ను గాంచి, ఆమె 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (24).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2022

గీతోపనిషత్తు -312


🌹. గీతోపనిషత్తు -312 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -1 📚


🍀 22-1. అభియుక్తుడు - ఈ శ్లోకమున మూడు పదములు విశిష్టముగ వాడబడినవి. 1. అనన్యచింతన, 2. పర్యుపాసన, 3. నిత్య అభియుక్తత. ఈ మూడు పదములు దాదాపుగ ఒకే సాధనను సూచించును. ఈ శ్లోకము ననుసరించిన జీవుడు లోకమున ధీరుడై యుండును. అట్టి వానికి ఈ సృష్టియందు ఎట్టి కోరిక యుండదు. ఎట్టి భయము ఉండదు. ఎటువంటి ఆరాటము ఉండదు. సతతము ఆత్మ యందు సర్వభూత మహేశ్వరుడగు పరమేశ్వరునితో రమించుచు, జీవించుచు నుండును. అట్టి జీవునకు, పరమేశ్వరునకు అభేద స్థితి ఏర్పడును. 🍀


22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : భగవద్గీత యందు మూడు వందల అరువదవ (360) శ్లోకమిది. ఒక వృత్తమునకు 360 డిగ్రీ లుండును. ఒక సంవత్సరమునకు 360 దినము లుండును. 360వ శ్లోకము భగవద్గీత యందలి కొలికిపూస, 18 అధ్యాయములు గల భగవద్గీత యందు 9వ అధ్యాయమగు 'రాజవిద్య - రాజగుహ్యము' హృదయము వంటిది. అందీ 22వ శ్లోకము భగవంతుని వాగ్దానము.

ఈ శ్లోకము ననుసరించిన జీవుడు లోకమున ధీరుడై యుండును. అట్టి వానికి ఈ సృష్టియందు ఎట్టి కోరిక యుండదు. ఎట్టి భయము ఉండదు. ఎటువంటి ఆరాటము ఉండదు. సతతము ఆత్మయందు సర్వభూత మహేశ్వరుడగు పరమేశ్వరునితో రమించుచు, జీవించుచు నుండును. అట్టి జీవునకు, పరమేశ్వరునకు అభేద స్థితి ఏర్పడును. ఈ శ్లోకమున మూడు పదములు విశిష్టముగ వాడబడినవి. 1. అనన్యచింతన, 2. పర్యుపాసన, 3. నిత్య అభియుక్తత. ఈ మూడు పదములు దాదాపుగ ఒకే సాధనను సూచించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2022

Happy Republic Day 2022 గణతంత్ర దినోత్సవ 2022 శుభాకాంక్షలు


🌹. గణతంత్ర దినోత్సవ 2022 శుభాకాంక్షలు, Happy Republic Day 2022 to all 🌹

సౌమ్య వాసరే, 26, జనవరి 2022

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ


26 Jan 2022


26-JANUARY-2022 బుధవారం MESSAGES గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26, బుధవారం, జనవరి 2022 సౌమ్య వాసరే 🌹 
🌹. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 312 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 510🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -140🌹  
5) 🌹 Osho Daily Meditations - 129🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 343-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 26, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం 🍀*

*బిభ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్*
*పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః |*
*శ్యామే నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే*
గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశోఽవతాత్*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*
*గణతంత్ర దినోత్సవం, Republic Day*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ నవమి 28:35:01 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: స్వాతి 10:07:36 వరకు
తదుపరి విశాఖ
సూర్యోదయం: 06:49:06
సూర్యాస్తమయం: 18:08:02
వైదిక సూర్యోదయం: 06:52:52
వైదిక సూర్యాస్తమయం: 18:04:17
చంద్రోదయం: 00:40:10
చంద్రాస్తమయం: 12:27:12
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగం: శూల 06:52:07 వరకు
తదుపరి దండ
కరణం: తైతిల 17:29:28 వరకు
వర్జ్యం: 15:25:30 - 16:56:30
దుర్ముహూర్తం: 12:05:56 - 12:51:12
రాహు కాలం: 12:28:34 - 13:53:26
గుళిక కాలం: 11:03:42 - 12:28:34
యమ గండం: 08:13:58 - 09:38:50
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 01:36:58 - 03:09:42
మరియు 24:31:30 - 26:02:30
ధూమ్ర యోగం - కార్య భంగం, 
సొమ్ము నష్టం 10:07:36 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -312 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -1 📚*
 
*🍀 22-1. అభియుక్తుడు - ఈ శ్లోకమున మూడు పదములు విశిష్టముగ వాడబడినవి. 1. అనన్యచింతన, 2. పర్యుపాసన, 3. నిత్య అభియుక్తత. ఈ మూడు పదములు దాదాపుగ ఒకే సాధనను సూచించును. ఈ శ్లోకము ననుసరించిన జీవుడు లోకమున ధీరుడై యుండును. అట్టి వానికి ఈ సృష్టియందు ఎట్టి కోరిక యుండదు. ఎట్టి భయము ఉండదు. ఎటువంటి ఆరాటము ఉండదు. సతతము ఆత్మ యందు సర్వభూత మహేశ్వరుడగు పరమేశ్వరునితో రమించుచు, జీవించుచు నుండును. అట్టి జీవునకు, పరమేశ్వరునకు అభేద స్థితి ఏర్పడును. 🍀*

*22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||*

*తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.*

*వివరణము : భగవద్గీత యందు మూడు వందల అరువదవ (360) శ్లోకమిది. ఒక వృత్తమునకు 360 డిగ్రీ లుండును. ఒక సంవత్సరమునకు 360 దినము లుండును. 360వ శ్లోకము భగవద్గీత యందలి కొలికిపూస, 18 అధ్యాయములు గల భగవద్గీత యందు 9వ అధ్యాయమగు 'రాజవిద్య - రాజగుహ్యము' హృదయము వంటిది. అందీ 22వ శ్లోకము భగవంతుని వాగ్దానము.*

*ఈ శ్లోకము ననుసరించిన జీవుడు లోకమున ధీరుడై యుండును. అట్టి వానికి ఈ సృష్టియందు ఎట్టి కోరిక యుండదు. ఎట్టి భయము ఉండదు. ఎటువంటి ఆరాటము ఉండదు. సతతము ఆత్మయందు సర్వభూత మహేశ్వరుడగు పరమేశ్వరునితో రమించుచు, జీవించుచు నుండును. అట్టి జీవునకు, పరమేశ్వరునకు అభేద స్థితి ఏర్పడును. ఈ శ్లోకమున మూడు పదములు విశిష్టముగ వాడబడినవి. 1. అనన్యచింతన, 2. పర్యుపాసన, 3. నిత్య అభియుక్తత. ఈ మూడు పదములు దాదాపుగ ఒకే సాధనను సూచించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 510 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 43

*🌻. శివుని అద్భుత లీల - 2 🌻*

ఇంతలో మణిగ్రీవుడు మొదలగు యక్షులు కానవచ్చిరి. వారిసేన గంధర్వుల సేన కంటె రెట్టింపు శోభతో ఆమెకు కానవచ్చెను (13). వారి ప్రభువైన మణి గ్రీవుని ప్రకాశమును చూచి ఆమె 'శివస్వామి ఈయనయే' అని మిక్కిలి ఆనందముతో పలికెను (14). 'ఈయన శివస్వామి కాదు. ఈతడు శివుని సేవకుడు' అని నీవు హిమవంతుని భార్యతో చెప్పితివి. ఇంతలో అగ్ని ముందుకు వచ్చెను (15). మణి కంఠుని కంటె కూడ రెట్టింపు శోభ గల ఆతనిని చూచి 'పార్వతీ పతి యగు రుద్రడీతడే' అని ఆమె పలికెను. అపుడు నీవు కాదని చెప్పితివి (16).

ఇంతలో అంతకంటె రెట్టింపు శోభ గల యముడు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (17). కాదని నీవు చెప్పితివి. ఇంతలో అంతకు రెట్టింపు శోభ గలవాడు, పుణ్యాత్ములకు ప్రభువు, శుభకారకుడు అగు నిర్‌ఋతి వచ్చెను (18). ఆయనను చూచి ఈతడే రుద్రుడని మేన ఆనందముతో పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వరుణుడు వచ్చెను (19). నిర్‌ఋతికంటెనూ రెట్టింపు శోభగల ఆతనిని చూచి ఆమె 'పార్వతీ పతియగు రుద్రుడు ఈతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (20).

ఇంతలో వరుణుని కంటె రెట్టింపు శోభ గల వాయువు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (21). కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వాయువు కంటె రెట్టింపు శోభ గలవాడు, యక్షులకు ప్రభువు అగు కుబేరుడు వచ్చెను (22). ఆతనిని చూచి ఆ మేన హర్షముతో ఈతడే రుద్రుడని పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో ఈశానుడు విచ్చేసెను (23). ఆతని యొక్క శోభ కుబేరుని శోభ కుబేరుని శోభకు రెట్టింపు ఉండుట ను గాంచి, ఆమె 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (24). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. సదవగాహన - 4 🌻*

*ఆధ్యాత్మిక‌ సాధనా యాన పథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింప బనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు. ఇట్టి ఓటములు, వెనుకంజలు తాత్కాలికములు మాత్రమే అని అతడు గుర్తెరుగవలెను. ప్రతి ఓటమి, వెనుకంజ విజయమునకు, ముందంజకు సోపానమే. తప్పు చేసినవాడు ఇక బాగుపడడనుట ప్రకృతి సూత్రము కాదు. ఎవనికయినను బాగుపడుటకును, సరిదిద్దు కొనుటకును ప్రకృతి వీలు కల్పించుచున్నది.*

*ఏ మానవుడును ఇతరుల కన్నా ఎక్కువగా గాని, తక్కువగా గాని తనను గూర్చి తలంచుట అవివేకము. ప్రతివాడును అమృతపుత్రుడే. మానవుని సహజ గుణములు దివ్యములే గాని అసురములు గావు‌ సత్సాంగత్యముతో, సత్కర్మాచరణముతో, సద్గురు స్మరణతో, సమిష్టి జీవనముతో సాధకుడు తన యందు దాగిన దివ్యగుణములను వికసింపజేసికొని, ముందజ వేయగలడు.*

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 129 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 129. SUFFERING 🍀*

*🕉 Nobody wants to suffer, but we carry the seeds of suffering within us. The whole point if working on ourselves is to burn those seeds. The burning itself may cause a little suffering, but it is nothing compared to a whole life of misery. 🕉*
 
*Once the seeds of suffering are destroyed, your whole life will become a life of delight. So if you are just avoiding suffering, and avoiding facing suffering that is inside you, you are creating a situation in which you will be full of suffering your whole life. Once the wounds you are carrying come to the surface they start healing. It is a healing process.*

*But I know that when you have a wound you don't want anybody to touch it. You don't really want to know that you have it. You want to hide it, but by hiding it, it is not going to heal. It has to be opened to the sunrays, to the winds. It may be painful in the beginning, but when it heals, you will understand. And there is no other way to heal it. It has to be brought to consciousness. Just the very bringing to consciousness is the process of healing.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 343-1. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻* 

*క్షేత్రమును, క్షేత్రము తెలిసినవారిని పాలించునది శ్రీదేవి అని అర్థము. క్షేత్ర మనగా దేహము. క్షేత్రజ్ఞు డనగా అందు వసించుచు దాని స్వరూప స్వభావముల నెరిగి జీవించువాడు. అన్ని దేహములు క్షేత్రములే. అందలి జీవులు క్షేత్రజ్ఞులే. వారు తమ తమ క్షేత్ర స్వరూప స్వభావముల నెటిగి అందు వసించినచో ఆనందము పొందగలరు. క్షేత్రమున వసించు జీవునకు క్షేత్ర వాసన చేత స్వభావము ఒకటి ఏర్పడును. త్రిగుణముల కలయికను బట్టి స్వభావ ముండును. వాటి సమ్మేళనమే రజస్సు, తమస్సు, సత్త్వములతో కూడిన స్వభావము. స్వభావము ననుసరించి ప్రవర్తించు చుండగ మనస్సు, ఇంద్రియములు, శరీరములకు అభ్యాసము లేర్పడును.*

*స్వభావము సమపాలుగ వుండనపుడు అభ్యాసములు బంధించును. త్రిగుణములు సామ్యము చెందినపుడు బంధము లేక జీవుడు దేహమున జీవించును. క్షేత్రము అష్ట ప్రకృతులతో కూడి యున్నది. అది మానవుని యందు అహంకారము, బుద్ధి, చిత్తము, పంచేంద్రియములుగ నున్నది. అహంకార స్వరూపుడైన జీవుడు బుద్ధి ననుసరించి జీవించినచో త్రిగుణములు సామ్యము చెంది జీవితము బంధములు లేక నడచును. బుద్ధి ననుసరించ నపుడు త్రిగుణములు విజృంభించి బద్ధుని చేయును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 343-1. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻*

*The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹