గీతోపనిషత్తు -312
🌹. గీతోపనిషత్తు -312 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -1 📚
🍀 22-1. అభియుక్తుడు - ఈ శ్లోకమున మూడు పదములు విశిష్టముగ వాడబడినవి. 1. అనన్యచింతన, 2. పర్యుపాసన, 3. నిత్య అభియుక్తత. ఈ మూడు పదములు దాదాపుగ ఒకే సాధనను సూచించును. ఈ శ్లోకము ననుసరించిన జీవుడు లోకమున ధీరుడై యుండును. అట్టి వానికి ఈ సృష్టియందు ఎట్టి కోరిక యుండదు. ఎట్టి భయము ఉండదు. ఎటువంటి ఆరాటము ఉండదు. సతతము ఆత్మ యందు సర్వభూత మహేశ్వరుడగు పరమేశ్వరునితో రమించుచు, జీవించుచు నుండును. అట్టి జీవునకు, పరమేశ్వరునకు అభేద స్థితి ఏర్పడును. 🍀
22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||
తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.
వివరణము : భగవద్గీత యందు మూడు వందల అరువదవ (360) శ్లోకమిది. ఒక వృత్తమునకు 360 డిగ్రీ లుండును. ఒక సంవత్సరమునకు 360 దినము లుండును. 360వ శ్లోకము భగవద్గీత యందలి కొలికిపూస, 18 అధ్యాయములు గల భగవద్గీత యందు 9వ అధ్యాయమగు 'రాజవిద్య - రాజగుహ్యము' హృదయము వంటిది. అందీ 22వ శ్లోకము భగవంతుని వాగ్దానము.
ఈ శ్లోకము ననుసరించిన జీవుడు లోకమున ధీరుడై యుండును. అట్టి వానికి ఈ సృష్టియందు ఎట్టి కోరిక యుండదు. ఎట్టి భయము ఉండదు. ఎటువంటి ఆరాటము ఉండదు. సతతము ఆత్మయందు సర్వభూత మహేశ్వరుడగు పరమేశ్వరునితో రమించుచు, జీవించుచు నుండును. అట్టి జీవునకు, పరమేశ్వరునకు అభేద స్థితి ఏర్పడును. ఈ శ్లోకమున మూడు పదములు విశిష్టముగ వాడబడినవి. 1. అనన్యచింతన, 2. పర్యుపాసన, 3. నిత్య అభియుక్తత. ఈ మూడు పదములు దాదాపుగ ఒకే సాధనను సూచించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
26 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment