శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 343-1. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻


క్షేత్రమును, క్షేత్రము తెలిసినవారిని పాలించునది శ్రీదేవి అని అర్థము. క్షేత్ర మనగా దేహము. క్షేత్రజ్ఞు డనగా అందు వసించుచు దాని స్వరూప స్వభావముల నెరిగి జీవించువాడు. అన్ని దేహములు క్షేత్రములే. అందలి జీవులు క్షేత్రజ్ఞులే. వారు తమ తమ క్షేత్ర స్వరూప స్వభావముల నెటిగి అందు వసించినచో ఆనందము పొందగలరు. క్షేత్రమున వసించు జీవునకు క్షేత్ర వాసన చేత స్వభావము ఒకటి ఏర్పడును. త్రిగుణముల కలయికను బట్టి స్వభావ ముండును. వాటి సమ్మేళనమే రజస్సు, తమస్సు, సత్త్వములతో కూడిన స్వభావము. స్వభావము ననుసరించి ప్రవర్తించు చుండగ మనస్సు, ఇంద్రియములు, శరీరములకు అభ్యాసము లేర్పడును.

స్వభావము సమపాలుగ వుండనపుడు అభ్యాసములు బంధించును. త్రిగుణములు సామ్యము చెందినపుడు బంధము లేక జీవుడు దేహమున జీవించును. క్షేత్రము అష్ట ప్రకృతులతో కూడి యున్నది. అది మానవుని యందు అహంకారము, బుద్ధి, చిత్తము, పంచేంద్రియములుగ నున్నది. అహంకార స్వరూపుడైన జీవుడు బుద్ధి ననుసరించి జీవించినచో త్రిగుణములు సామ్యము చెంది జీవితము బంధములు లేక నడచును. బుద్ధి ననుసరించ నపుడు త్రిగుణములు విజృంభించి బద్ధుని చేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻

🌻 343-1. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻


The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



26 Jan 2022

No comments:

Post a Comment