మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సదవగాహన - 4 🌻
ఆధ్యాత్మిక సాధనా యాన పథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింప బనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు. ఇట్టి ఓటములు, వెనుకంజలు తాత్కాలికములు మాత్రమే అని అతడు గుర్తెరుగవలెను. ప్రతి ఓటమి, వెనుకంజ విజయమునకు, ముందంజకు సోపానమే. తప్పు చేసినవాడు ఇక బాగుపడడనుట ప్రకృతి సూత్రము కాదు. ఎవనికయినను బాగుపడుటకును, సరిదిద్దు కొనుటకును ప్రకృతి వీలు కల్పించుచున్నది.
ఏ మానవుడును ఇతరుల కన్నా ఎక్కువగా గాని, తక్కువగా గాని తనను గూర్చి తలంచుట అవివేకము. ప్రతివాడును అమృతపుత్రుడే. మానవుని సహజ గుణములు దివ్యములే గాని అసురములు గావు సత్సాంగత్యముతో, సత్కర్మాచరణముతో, సద్గురు స్మరణతో, సమిష్టి జీవనముతో సాధకుడు తన యందు దాగిన దివ్యగుణములను వికసింపజేసికొని, ముందజ వేయగలడు.
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
26 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment