1) 🌹 01, FEBRUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀*
2) 🌹 కపిల గీత - 127 / Kapila Gita - 127 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719 🌹
🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 680 / Sri Siva Maha Purana - 680 🌹 🌻. గణేశుని వివాహము - 4 / The celebration of Gaṇeśa’s marriage - 4 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 301 / Osho Daily Meditations - 301 🌹 🍀 301. తల్లిదండ్రులు / 301. PARENTS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹 🌻 428. 'నిత్య యౌవనా' / 428. 'Nitya-yaovana' 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹01, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : భీష్మ - జయ ఏకాదశి, విష్ణు సహస్రనామ జయంతి, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 5 🍀*
8. వినాయకం నాయకవర్జితం ప్రియే
విశేషతో నాయకమీశ్వరాత్మనామ్ |
నిరంకుశం తం ప్రణమామి సర్వదం
సదాత్మకం భావయుతేన చేతసా
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పురుష ప్రకృతులు సత్యవస్తువు యొక్క వేర్వేరు శక్తులు. అనగా, నైష్కర్మ స్థితియే పురుషుడనీ, కర్మ ప్రవృత్తియే ప్రకృతియనీ, నైష్కర్మ్య స్థితి యందు ప్రకృతి లేదనీ, కర్మప్రవృత్తి యందు పురుషుడు లేడనీ భావింపరాదు. సంపూర్ణమైన కర్మప్రవృత్తిలో కూడ పురుషుడు మరుగున దాగియే యున్నాడు. అట్లే సంపూర్ణమైన నైష్కర్మ్యస్థితిలో కూడ ప్రకృతి విశ్రాంత రూపిణిగ నిలిచియే యున్నది. 🍀*
*🌹. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి 🌹*
*కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామ స్తోత్రము.*
*నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా*
*వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం*
*''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను''.*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 14:03:47 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: మృగశిర 27:24:48 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ఇంద్ర 11:29:39 వరకు
తదుపరి వైధృతి
కరణం: విష్టి 14:03:47 వరకు
వర్జ్యం: 06:54:16 - 08:41:12
దుర్ముహూర్తం: 12:06:50 - 12:52:23
రాహు కాలం: 12:29:36 - 13:55:00
గుళిక కాలం: 11:04:13 - 12:29:36
యమ గండం: 08:13:26 - 09:38:49
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 17:35:52 - 19:22:48
సూర్యోదయం: 06:48:02
సూర్యాస్తమయం: 18:11:10
చంద్రోదయం: 14:29:38
చంద్రాస్తమయం: 03:17:53
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 27:24:48 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
*కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు.*
*ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తిప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం.*
*విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి.*
*నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా*
*వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం*
*''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.*
*ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం*
*''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే*
*సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''*
*- అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.*
*ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ...'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 127 / Kapila Gita - 127🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 🌴*
*11. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః|*
*ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥*
*తాత్పర్యము : ఆత్మ దేహాది ఉపాధులకంటే వేరైనది. ఐనను అహంకారాది మిథ్యావస్తువుల యొక్క సాంగత్య కారణముగా ఈ దేహాదులు సత్యముగనే భాసించును. ఆ పరమాత్మ జగత్కారణ భూతమైన ప్రకృతికి అధిష్ఠాత - మహదాది కార్యవర్గముసు ప్రకాశింప జేయువాడు. కార్యకారణ రూపమగు సకల పదార్థముల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు.*
*వ్యాఖ్య : లింగమంటే దేహం. మనమే పేరు పెట్టినా, ఆ పేరు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఎపుడైతే పరమాత్మ స్వరూప జ్ఞ్యానం అవగతమవుతుందో, అపుడు దేహాసక్తి పోతుంది. అప్పుడు ముక్తలింగుడవుతాడు. ఆత్మ ఉంది అని చెప్పడానికి గుర్తుగా చెప్పబడుతున్న శరీరం మీద అనుబంధం వదిలి పెట్టబడుతుంది. దేవ తిర్యక్ మనుష్యాది బుద్ధిని విడిచిపెడతాడు. ఇది ముక్త లింగః - జీవుడు. ఇది పరమాత్మ జ్ఞ్యానం కలిగిన ఆత్మ జ్ఞ్యాని ప్రవర్తించే విధానం. దేహం యందు అభిమతి పోతుంది.*
*అలా అయిన తరువాత, ఎప్పుడు సత్ గానే ప్రకాశించే, ఉత్పత్తీ వినాశం లేని, సంకోచ వికాసమూ లేనీ, జీవాత్మకు బంధువైన, దేహాన్ని చూపేవాడైన, ప్రతీ వానిలోనూ (జీవుడిలోనూ, శరీరములోనూ) అంతర్యామిగా ఉండేవాడు, అద్వయం (రెండవ వాడైన వాడు లేని వాడు) ఐన వాడు అయిన పరమాత్మను దేహమునందు చూడగలడు. పరమాత్మ అనుగ్రహంతో ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడు, తెలుసుకున్న ఆత్మ స్వరూపముతో, లేనట్లుగా, అంతవరకూ ఉన్నట్లు అనిపించిన, అంతలోనే ఇది లేకుండా ఉండేదనుకునే శరీరములోనే, ఈ దేహములోనే పరమాత్మను చూస్తాడు. ప్రకృతి కంటే విడిగా ఉన్న ఆత్మను చూస్తాడు, ఆత్మకన్నా వేరుగా ఉన్న పరమాత్మను కూడా చూస్తాడు. దేహముగా అంతర్యామిగా ఉన్న ఆత్మలో, అంతర్యామిగా ఉన్న పరమాత్మ చేతనే, 1. ఆత్మ జ్ఞ్యానమూ 2. పరమాత్మ జ్ఞ్యానమూ 3. దేహజ్ఞ్యానమూ కలుగుతాయి. ఇంద్రియములచే చూడదగని ఆత్మను శరీరముతో ఎలా చూడగలడు. ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని మొదట ఎలా తెలుసుకోవాలి?*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 127 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴*
*11. mukta-liṅgaṁ sad-ābhāsam asati pratipadyate*
*sato bandhum asac-cakṣuḥ sarvānusyūtam advayam*
*Meaning : A liberated soul realizes the Absolute Personality of Godhead, who is transcendental and who is manifest as a reflection even in the false ego. He is the support of the material cause and He enters into everything. He is absolute, one without a second, and He is the eyes of the illusory energy.*
*PURPORT : A pure devotee can see the presence of the Supreme Personality of Godhead in everything materially manifested. He is present there only as a reflection, but a pure devotee can realize that in the darkness of material illusion the only light is the Supreme Lord, who is its support. It is confirmed in Bhagavad-gītā that the background of the material manifestation is Lord Kṛṣṇa. And, as confirmed in the Brahma-saṁhitā, Kṛṣṇa is the cause of all causes. In the Brahma-saṁhitā it is stated that the Supreme Lord, by His partial or plenary expansion, is present not only within this universe and each and every universe, but in every atom, although He is one without a second. The word advayam, "without a second," which is used in this verse, indicates that although the Supreme Personality of Godhead is represented in everything, including the atoms, He is not divided. His presence in everything is explained in the next verse.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719🌹*
*🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻*
*ఓం దీప్తమూర్తయే నమః | ॐ दीप्तमूर्तये नमः | OM Dīptamūrtaye namaḥ*
*దీప్తా జ్ఞానమయీ మూర్తి రస్యేతి స్వేచ్ఛయా హరేః ।*
*గృహీతా తైజసీ మూర్తిర్దీప్తాఽస్యేత్యథవా హరిః ।*
*దీప్తమూర్తితి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥*
*ప్రకాశించుచుండు జ్ఞానమయియగు మూర్తి ఎవనికి కలదో అట్టివాడు. లేదా ఎవరి ఆజ్ఞతోను పనిలేక తన ఇచ్ఛతో గ్రహించబడిన తైజస మూర్తి అనగా హిరణ్యగర్భ మూర్తి - దీప్తమగు, ప్రకాశించునది ఈతనికి కలదు. (సకల తైజసమూర్తుల సమష్టియే హిరణ్యగర్భమూర్తి.)*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 719🌹*
*🌻719. Dīptamūrtiḥ🌻*
*OM Dīptamūrtaye namaḥ*
दीप्ता ज्ञानमयी मूर्ति रस्येति स्वेच्छया हरेः ।
गृहीता तैजसी मूर्तिर्दीप्ताऽस्येत्यथवा हरिः ।
दीप्तमूर्तिति प्रोक्तो वेदविद्याविशारदैः ॥
*Dīptā jñānamayī mūrti rasyeti svecchayā hareḥ,*
*Grhītā taijasī mūrtirdīptā’syetyathavā hariḥ,*
*Dīptamūrtiti prokto vedavidyāviśāradaiḥ.*
*Resplendent is the nature of His superior knowledge. Or since He assumed by His own free will - His bright and flowing form, He is Dīptamūrtiḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 680 / Sri Siva Maha Purana - 680 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴*
*🌻. గణేశుని వివాహము - 4 🌻*
పార్వతీ పరమేశ్వరులు వచ్చి నారని తెలిసిన ఆ కుమారస్వామి విరక్తుడై మరియొక చోటకు పోవుటకు సంసిద్ధుడాయెను. దేవతలు, మునులు ప్రార్థించగా ఆతడు కూడా మూడు యోజనముల దూరమును విడచి అచటనే ఉండెను. ఇట్లు అదే స్థానములో కార్తికుడు కూడ ఉన్నాడు (34,35).
పార్వతీ పరమేశ్వరులు పుత్ర స్నేహముచే ఆర్ద్రమైన హృదయము గల వారై ప్రతి పర్వమునందు కుమారస్వామిని చూచుటకు అచటికి వెళ్లు చుందురు. ఓ నారదా! (36) అమావాస్య నాడు శంభుడు, పూర్ణిమనాడు పార్వతి తప్పని సరిగా అచటకు స్వయముగా వెళ్లుచుందురు (37). ఓ మహర్షీ! నీవు ప్రశ్నించిన విధముగా నేను కార్తీక గణశుల పరమ పవిత్ర గాథను వివరించితిని (38). ఈ గాథను వినిన బుద్ధిమంతుడగు మానవుడు పాపములన్నిటి నుండియూ విముక్తుడై తాను కోరుకునే శుభకామనలనన్నింటినీ పొందగలడు(39).
ఎవరైతే ఈ గాథను పఠించెదరో, పఠింపజేసెదరో, వినెదరో, వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందెదరనుటలో సందేహము లేదు (40). బ్రహ్మణుడు బ్రహ్మతేజస్సును. క్షత్రియుడు విజయమును, వైశ్యుడు ధనసమృద్ధిని పొందెదరు. శ్రూద్రుడు సత్పురుషులతో సమానుడగును (41). రోగి ఆరోగ్యవంతుడగును. భయపడినవాడు భయవిముక్తుడగును. అట్టి మానవుడు భూతప్రేతాది బాధలచే పీడింపబడడు (42). ఈ గాథ పుణ్యమును, కీర్తిని, సుఖమును, ఆయుర్దాయమును వర్ధిల్ల జేయును. సాటిలేని ఈ గాథ పుత్ర పౌత్రాదులనిచ్చి స్వర్గప్రాప్తిని కలిగించును (43).
ఓం నమశ్శివాయ
ఈ గాథ ముక్తిని ఇచ్చును. శ్రేష్ఠ మగు శివ జ్ఞానము నిచ్చును. పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమగు ఈ గాథ శివభక్తిని వర్థిల్ల జేయును (44). భక్తులు, మరియు కామనలు లేని ముముక్షువులు ఈ గాథను సర్వదా వినవలెను. సదాశివ స్వరూపము, మంగళకరమునగు ఈ గాథ శివాద్వైతము నిచ్చును (45).
శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో గణేశ వివాహము అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
కుమార ఖండము ముగిసినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 680🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴*
*🌻 The celebration of Gaṇeśa’s marriage - 4 🌻*
34. On coming to know that Śiva had come there with Pārvatī, Kumāra became unattached and was eager to go elsewhere.
35. On being requested by the gods and sages he stayed in a place three Yojanas away.
36. O Nārada, on the full and new moon days, Pārvatī and Śiva are excited by love towards their son and they go there to see him.
37. On new moon days, Śiva himself goes there. On full moon days, Pārvatī goes there certainly.
38. O great sage, whatever you had asked in regard to Kārttikeya and Gaṇeśa has been narrated by me.
39. On hearing this, an intelligent man becomes free from all sins. He achieves all desired fruits of auspicious nature.
40. Whoever reads, teaches, listens or narrates this story derives all desires. No doubt need be entertained in this respect.
41. A brahmin derives brahminical splendour, a Kṣatriya becomes victorious, a Vaiśya prosperous and a Śūdra attains equality with the good.
42. A sick man becomes free from sickness; a frightened man becomes free from fear; no man is harassed by the visitation of goblins, ghosts etc.
43. This narrative is sinless, conducive to glory and enhancer of happiness. It is conducive to longevity and attainment of heaven. It is unequalled and bestows sons and grandsons.
44. It confers salvation and reveals Śiva’s principles. It is pleasing to Pārvatī and Śiva and increases devotion to Śiva.
45. This shall always be heard by devotees and by those who seek liberation and are free from worldly desires. It confers identity with Śiva. It is conducive to welfare and is identical with Śiva himself.
Here Ends Kumara Kanda
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 301 / Osho Daily Meditations - 301 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 301. తల్లిదండ్రులు 🍀*
*🕉. మీ తల్లిదండ్రులతో ఒక అవగాహనకు రావడం ఎల్లప్పుడూ మంచిది. 🕉*
*గుర్జియేఫ్, 'మీరు మీ తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండక పోతే, మీరు మీ జీవితాన్ని కోల్పోయారు' అని చెప్పేవారు. మీకు మరియు మీ తల్లిదండ్రుల మధ్య కొంత కోపం కొనసాగితే, మీరు ఎప్పటికీ సుఖంగా ఉండరు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు కొంచెం దోషిగా అనుభూతి చెందుతారు. మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించు కోలేరు. తల్లిదండ్రులు కేవలం సామాజిక సంబంధం మాత్రమే కాదు. వారి నుండి మీరు వచ్చారు. మీరు వారిలో భాగం, వారి చెట్టు యొక్క కొమ్మ. మీరు ఇప్పటికీ వాటిలో పాతుకుపోయారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మీలో చాలా లోతుగా పాతుకుపోయినది ఏదో చనిపోతుంది.*
*తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మొదటి సారి మీరు ఒంటరిగా అయి, నిర్మూలించబడినట్లు అనిపిస్తుంది. కాబట్టి వారు సజీవంగా ఉన్నప్పుడు, మీరు చేయగలిగినదంతా చేయండి, తద్వారా అవగాహన ఏర్పడుతుంది. మీరు వారితో మాట్లాడచ్చు మరియు వారు మీతో మాట్లాడవచ్చు. అప్పుడు విషయాలు పరిష్కరించ బడతాయి మరియు కర్మ ఖాతాలు మూసివేయ బడతాయి. తద్వారా వారు ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మీరు దోష భావాన్ని అనుభవించరు, మీరు పశ్చాత్తాపపడరు; వారు మీతో సంతోషంగా ఉన్నారు; మీరు వారితో సంతోషంగా ఉన్నారు. విషయాలు స్థిరపడ్డాయని మీకు తెలుస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 301 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 301. PARENTS 🍀*
*🕉. It is always good to come to an understanding with your parents. 🕉*
*Gurdjieff used to say, "Unless you are in good communion with your parents, you have missed your life." If some anger persists between you and your parents, you will never feel at ease. Wherever you are, you will feel a little guilty. You will never be able to forgive and forget...Parents are not just a social relationship. It is out of them that you have come. You are part of them, a branch of their tree. You are still rooted in them. When parents die, something very deep-rooted dies within you.*
*When parents die, for the first time you feel alone, uprooted. So while they are alive, do everything that you can so that an understanding can arise and you can communicate with them and they can communicate with you. Then things settle and the accounts are closed. Then when they leave the world-and they will leave someday-you will not feel guilty, you will not repent; you will know that things have settled. They have been happy with you; you have been happy with them.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*
*🌻 428. 'నిత్య యౌవనా' 🌻*
*ముదుసలితనము లేనిది శ్రీమాత అని అర్థము. త్రికాలములకు లోనగు వారికి బాల్యము, యౌవనము, వార్ధక్యము వుండును. కాలము ప్రభావము చూపని వారికి వారు నిత్యమొకే మాదిరిగ నుందురు. కాలము దైవముపై మాత్రమే ప్రభావము చూపలేదు. సృష్టింపబడు సర్వజీవరాసులు కాలబద్ధులే. సృష్టికర్తయగు బ్రహ్మకు కూడ వార్ధక్య మున్నది. ప్రస్తుతము మన సృష్టికి కర్తయైన 'పద్మభూః' అను బ్రహ్మదేవుడు ద్వితీయ పరార్దమున ప్రవేశించెనని నిత్యము సంకల్పమున చెప్పుకొను చున్నాము కదా!*
*బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడ కాలమునకు లోబడు వారే. వారికినీ వార్ధక్యముండును. కాలము వారిని కూడ హరించును. కాలమున కతీతమగు ఈశ్వర తత్త్వము మాత్ర మెప్పుడునూ నిత్యనూతనముగ నుండును. దానినే నిత్యయౌవన మందురు. అట్టి నిత్య యౌవన తత్త్వము రూపు గట్టుగొని దిగివచ్చినచో ఎట్లుండును? అదియే లలితమగు శ్రీకృష్ణ రూపము. అది అపురూపము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*
*🌻 428. 'Nitya-yaovana' 🌻*
*It means that Shree Mata is ageless. Those who are under the influence of time have childhood, youth and old age. Those who are not influenced by time are forever in youth. Time does not affect God alone. All created beings are temporal. Old age is also before Brahma who is the creator. At present, we are always saying in our daily aphorisms that 'Padmabhu' , the present Lord Brahma, has entered the second phase!*
*Brahma, Vishnu and Maheshwar are all subject to time. They also have an old age. Time will drain them too. Only the philosophy of God, which has evolved over time, is eternally new. That is eternal youth. What will it be like when such an eternal philosophy takes shape and descends into earth? That is the beautiful form of Lord Krishna. That is incredible.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj