నిర్మల ధ్యానాలు - ఓషో - 296
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 296 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితమన్నది అస్తిత్వమిచ్చిన వరం. కాబట్టి అక్కడ అన్వేషించడం అన్నది కాదు స్వీకరించడం అన్నది విషయం. ఆనందాన్ని అందుకో. అదెక్కడో లేదు. మనం మరింతగా స్వీకరించే గుణంలో వుంది. ఆహ్వానంతో, నమ్మకంతో వుండు. 🍀
వ్యక్తి నరకాన్ని సృష్టించు కోవచ్చు. అది మన నిర్ణయం. మన బాధ్యత. జీవితంలో ముఖ్యమయిన విషయం జీవితమే. జీవితమన్నది అస్తిత్వమిచ్చిన వరం. కాబట్టి అక్కడ అన్వేషించడం అన్నది కాదు స్వీకరించడం అన్నది విషయం. ఆనందాన్ని అందుకో. అదెక్కడో టిబెట్లోనో, హిమాలయాల్లోనో లేదు. ఎక్కడికో ప్రయాణించాల్సిన పని లేదు. మరింత మరింతగా స్వీకరించే గుణంలో వుండడం చాలు. వరం ఎప్పుడూ వస్తూనే వుంటుంది. కానీ తలుపులు మూసి వుంటాయి.
సూర్యుడుంటాడు. మనం చీకట్లో వుంటాం. కళ్ళు మూసుకుని వుంటాం. వరమక్కడ వుంది. కళ్ళు తెరవాలి. కాంతి నందుకోవాలి. లేకుంటే చీకట్లోనే వుంటాం. జీవితానికి, అస్తిత్వానికి తలుపులు మూసుకోకు. మరింత స్పందనతో వుండు. ఆహ్వానంతో, నమ్మకంతో వుండు. జీవితం గురించి భయపడాల్సిన పన్లేదు. అన్ని మార్గాలకు అందుబాటులో వుండు. క్షణకాలం కూడా బాధ పడాల్సిన పన్లేదు. జీవితాంతం ఆనందంగా వుండొచ్చు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment