శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 236 / Sri Lalitha Chaitanya Vijnanam - 236
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 236 / Sri Lalitha Chaitanya Vijnanam - 236 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥🍀
🌻236. 'చతుషష్టి కళామయీ' 🌻
శ్రీమాత తత్త్వము అరువది నాలుగు కళల మయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు అరువది నాలుగు. ఆమెకు జరుపు ఆరాధనము అరువది నాలుగు ఉపచారములతో కూడి యున్నది. ఈ ఉపచారములు నేర్చుటకు అరువది నాలుగు విద్యలున్నవి. అవి ఈ విధముగ నున్నవి.
1) అక్షరజ్ఞానము (ఇదియే అక్షరాభ్యాసముగ ప్రథమ విద్య, 2) 2) చదువుట, 3) వ్రాయుట, 4) బహు భాషా జ్ఞానము, 5) పై భాషల యందు కవిత్వము చెప్పుట, 6) విన్నదానిని విన్నట్లు చెప్పుట, 7) జూదము, 8) వేదములు, 9) వేదాంగములు ఆరు, 10) శాస్త్రములు,
11) శాస్త్రాంగములు, 12) తంత్రములు - 6, 13) పురాణములు, 14) స్మృతులు, 15) కావ్యములు, 16) అలంకారములు, 17) నాటకములు, 18) శాంతము, 19) వశ్యము, 20) ఆకర్షణము,b
21) విద్వేషణము, 22) ఉచ్ఛాటనము, 23) మారణము 6 విధములు 24) గతి స్తంభనము, 25) జల స్తంభనము, 26) వృష్టి స్తంభనము, 27) అగ్ని స్తంభనము, 28) ఆయుధ స్తంభనము, 29) భాషా స్తంభనము, 30) వీర్య స్తంభనము, 31) శిల్ప విద్య, 32) గజహయ శిక్షణము, 33) రథ శిక్షణము, 34) నర శిక్షణము, 35) సాముద్రికము, 36) మల్లయుద్ధము, 37) పాక శిక్షణము, 38) విష శాస్త్రము, 39) సుషిరము, 40) అనద్ధము, 41) ఘనము, 42) ఇంద్రజాలము, 43) నృత్యము, 44) గీతము, 42) రసవాదము, 46) రత్న పరీక్ష, 47) చౌర్యము, 48) ధాతు పరీక్ష, 49) అదృశ్యము మొత్తము అరువది నాలుగు.
ఈ విద్యలన్నియూ కలవాడు పూర్ణ పురుషుడే. శ్రీకృష్ణుడు అన్ని విద్యలను ప్రదర్శించి చూపెను. ధర్మరాజాదులు, భీష్మ ద్రోణాదులు, ఇతర మహావీరులు, యిందలి కొన్ని విద్యలే యెరిగి యున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 236 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Catuḥṣaṣṭi-kalāmayī चतुःषष्टि-कलामयी (236) 🌻
She is in the form of sixty four types of arts. Kalā means art. There are sixty four types of arts in tantra śāstra-s. No concrete evidence is available to confirm or dispute these sixty four types. But these arts originate from aṣṭama siddhi (the eight super human powers). Śiva Himself declares to Pārvatī about these arts. Saundarya Laharī (verse 31) says Catuḥ-ṣaṣṭyā tantraiḥ sakalam meaning that these sixty four tantra-s constitute everything.
The above referred verse says, “Having deluded the entire universe with the sixty four tantra-s, which are devoted to producing various siddhis relating to each, the Lord of jīva-s (souls) again brought into this universe, due to Your compulsion, Your mantra (Pañcadaśī), which is the sole means of achieving, by itself all the objects of human desires.” These tantras originate from the Pañcadaśī mantra and culminate in the Pañcadaśī mantra.
Following are the sixty four arts: gītam, vādyam, nṛtyam, nātyam, ālekhyam, viśeṣaka-cchedyam, taṇḍula-kusuma-balivikārāḥ, puṣpāstaranam, daśana-vasanāṅgarāgāḥ, maṇi-bhūmikā-karma, śayana-racanam, udaka-vādyam, udaka-ghātaḥ, citrā_yogāḥ, mālya-granthana-vikalpāḥ, keśa-śekharāpīḍayojanam, nepathya-yogāḥ, karṇa-pattra-bhaṅgāḥ, gandha-yuktiḥ, bhūṣaṇa-yojanam, indrajālam, kaucumāra-yogāḥ, hasta-lāghavam, citraśākāpūpa-bhakṣya-vikāra-kriyā, pānaka-rasarāgāsava-yojanam, sūcīvāpa-karma, vīṇā-ḍama-ruka-sūtra-krīḍā, prahelikā, pratimā, durvacakayogāḥ, pustaka-vācanam, nāṭakākhyāyikā-darśanam, kāvya-samasyā-pūraṇam, paṭṭikā-vetrabāṇa-vikalpāḥ, tarkū-karmāṇi, takṣaṇam, vāstu-vidyā, rūpya-ratna-parīkṣā, dhātu-vādaḥ, maṇi-rāga-jñānam, ākara-jñānam, vṛkṣāyur-veda-yogāḥ, meṣa-kukkuṭa-lāvaka-yuddha-vidhiḥ, śuka-sārikā-pralāpanam, utsādanam, keśa-mārjana-kauśalam, akṣara-muṣṭikā-kathanam, mlechitaka-vikalpāḥ, deśa-bhāṣā-jñānam, puṣpa-śakaṭikā-nimitta-jñānam, yantra-mātṛkā, dhāraṇa-mātṛkā, saṃpāṭyam, mānasī_kāvya-kriyā, kriyā-vikalpāḥ, chalitakayogāḥ, abhidhāna-koṣa-cchando-jñānam, vastra-gopanāni, dyūta-viśeṣaḥ, ākarṣaṇa-krīḍā, bālaka-krīḍanakāni, vaināyikīnāṃ-vidyāṇāṃ-ñānam, vaijayikīnāṃ-vidyānāṃ-jñānam. However, the list varies from text to text.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2021
బాహ్య పరస్పరాధీనత తప్పదు
🌹. బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి, భారతదేశంలో మీరు ఏమైనా చెయ్యొచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ, అది ఇతరులకు సమస్యగా మారకూడదు. అలాగే మీరు ఇతరుల జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అవగాహన కలిగిన వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను ఎంత గౌరవిస్తాడో తన స్వేచ్ఛను కూడా అంతగానే గౌరవిస్తాడు.
ఎందుకంటే, ఇతరులు మీ స్వేచ్ఛను గౌరవించకపోతే మీ స్వేచ్ఛ నాశనమైనట్లేకదా! కాబట్టి, అది పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ‘‘నేను మీ స్వేచ్ఛను గౌరవిస్తాను, మీరు నా స్వేచ్ఛను గౌరవించండి. అప్పుడు ఇద్దరమూ స్వేచ్ఛగా ఉంటాం’’అనేది ఎవరూ హద్దులు మీరని రాజీవ్యవహారం. ఉదాహరణకు, మీ సొంత ఇంట్లో మీరు అర్థరాత్రి గట్టిగా పాడాలనుకున్నా పాడలేరు. ఎందుకంటే, అది పొరుగువారికి నిద్రాభంగం కలిగిస్తుంది. కాబట్టి, మీరు రాజీపడక తప్పదు.
బాహ్య ప్రపంచంలో మనం మనుషులతో మాత్రమే కాదు, అన్ని విషయాలలోనూ పరస్పరాధీనులమే. చెట్లు మీరు వదిలిన కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని మీకు కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తాయి. వాటిని నరికేస్తే మీరు చనిపోతారు. ధూమపానం ద్వారా మీరు చెట్లకు కావలసిన కార్బన్ డైయాక్సైడ్‌ను అందించినప్పుడు అవి చాలా సంతోష పడతాయి. అందుకు మూలకారణం తెలుసుకోమని నేను మీకు చెప్తే వెంటనే మీరు ధూమపానం మానేస్తారు. అప్పుడు చెట్లు చాలా బాధపడతాయి.
కాబట్టి, మన పరస్పరాధీనత కేవలం చెట్లతో మాత్రమే కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో కూడా ఉంది. నిజానికి, అన్నీ పరస్పరాధీనమైనవే. ఆ పరస్పరాధీనతను ఆనందించండి. అంతేకానీ, దానిని బానిసత్వంగా భావించకండి. పరస్పరాధీనత బానిసత్వంకాదు. మీరు ఇతరులపై, ఇతరులు మీపై ఆధారపడి ఉన్నారు. అది సోదరభావ సంబంధం. చిన్న గడ్డిపరకకు కూడా నక్షత్రాలతో సంబంధముంది.
కానీ, మీ అంతర్గత ప్రపంచంలో, మీ అంతర్గత సామ్రాజ్యంలో మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలరు. అక్కడ మీరు దేనికోసమో బాధపడవలసిన, దేనిపైనో తిరుగుబాటు చెయ్యవలసిన అవసరముండదు. బాహ్య పరస్పరాధీనత తప్పదని, అనివార్యమని తెలుసుకోండి. జరిగే వాటిలో అది ఒక భాగం. దానిని ఏమీ చెయ్యలేము. ఏమీ చెయ్యలేని దానిని అంగీకరించడమొక్కటే మార్గం.
కాబట్టి, ఏదో ఇష్టం లేని రాజీనామా ఇచ్చినట్లు కాకుండా, మనస్ఫూర్తిగా, ఆనందంగా దానిని అంగీకరించండి. ఇది మన విశ్వం. మనం అందులో భాగం. మనం ద్వీపాలం కాదు, మొత్తం ఖండంలో భాగం.
మీ స్వేచ్ఛ్భావన మీ అహంభావం మూలాలలో ఎక్కడో నాటుకుని ఉంది. మనం అహాలం కాదు. అహానిది అవాస్తవ అస్తిత్వం. ఎందుకంటే, మనం విడిగా లేము. అప్పుడు మనకు అహాలు ఎలా ఉంటాయి?
‘‘నేను’’ అనేది కేవలం భాషకు ఉపయోగపడే పదం మాత్రమే. అంతేకానీ, దానికి ఎలాంటి సారంలేదు, వాస్తవికత లేదు. అది కేవలం ఏమీలేని నీడ మాత్రమే.
మీరు మీ ఎరుక లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ మీకు తప్పక లభిస్తుంది. మీరు మీ శరీరాన్ని, ఆలోచనా పద్ధతులను నిశితంగా పరిశీలిస్తూ సాక్షిగా ఉండండి.
అప్పుడు మెల్లమెల్లగా మీరు హిందు, మహమ్మదీయ, క్రైస్తవ, సామ్యవాదులు కాదని, అసలు మీరు ఎలాంటి ఆలోచన కాదని, చివరికి మీరు మనసు, కోపము, దురాశలు కూడా కాదని మీకు తెలుస్తుంది.
నిర్మల సాక్షీతత్వానుభవమే సంపూర్ణ స్వేచ్చానుభవం. కానీ, అది అంతర్గతానికి సంబంధించిన విషయం. అంతర్గతంలో పూర్తి స్వేచ్ఛతో ఉన్న వ్యక్తి బాహ్య స్వేచ్ఛను ఆశించడు. అలాంటి వ్యక్తికి ప్రకృతిని యథాతథంగా స్వీకరించగల సామర్థ్యముంటుంది.
సాక్షిగా ఉండడం ద్వారా అంతర్గత స్వేచ్ఛను సృష్టించి అందులో జీవించండి. అప్పుడు మీరు బాహ్య పరస్పరాధీనతను తెలుసుకో గలుగుతారు. అది ఒక అందమైన ఆశీర్వాదం. దానికి తల వొంచి అందులో విశ్రాంతి పొందండి. అంతేకానీ, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యవలసిన అవసరంలేదు. గుర్తుంచుకోండి: అసలైన స్వేచ్ఛాపరుడు మాత్రమే తల వొంచగలడు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2021
వివేక చూడామణి - 46 / Viveka Chudamani - 46
🌹. వివేక చూడామణి - 46 / Viveka Chudamani - 46 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 14. శరీరము - 4 🍀
165. ప్రాణ శక్తి పంచ కర్నేంద్రియాలతో జత కలిపినపుడు గొప్ప పొర ఏర్పడి దాని వలన మరియొక కోశము తయారై, అది అన్ని కార్యక్రమాలలో తన ప్రత్యేకతను కనపరుస్తుంది.
166. ఆత్మ ఒక్కటే ఈ శరీరమునకు అతి శక్తివంతమైన కవచము. ఎందువలనంటే అది ప్రాణ వాయువుతో కూడి ఉన్నది. ఆ వాయువు ఈ శరీరము లోపల, బయటకు శ్వాస రూపంలో వ్యక్తమవుతుంది. కాని దానికి తెలియదు. తన యొక్క కష్ట సుఖాలతో ఇతరుల కష్ట సుఖాలకు శాశ్వతముగా ఆత్మ పై ఆధారపడి ఉంటుందని.
167. మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియాలు మానసికమైన ఒక పొరగా ఏర్పడి, వివిధ విషయాలలో చలిస్తూ ‘నేను’ ‘నాది’ అని భావిస్తుంటుంది. అది శక్తివంతమైనది మరియు అనేకమైన పేర్లు, పనులలో భేదాలను సృష్టిస్తుంది. అది శక్తివంతమైన పొరలతో గత జన్మల స్మృతులతో నిండి ఉంటుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 46 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Body - 4 🌻
165. The Prana, with which we are all familiar, coupled with the five organs of action, forms the vital sheath, permeated by which the material sheath engages itself in all activities as if it were living.
166. Neither is the vital sheath the Self – because it is a modification of Vayu, and like the air it enters into and comes out of the body, and because it never knows in the least either its own weal and woe or those of others, being eternally dependent on the Self.
167. The organs of knowledge together with the mind form the mental sheath – the cause of the diversity of things such as "I" and "mine". It is powerful and endued with the faculty of creating differences of name etc., It manifests itself as permeating the preceding, i.e. the vital sheath.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2021
దేవాపి మహర్షి బోధనలు - 57
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 38. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 12 🌻
“శ్రీమతి బెయిలీ గారూ! మీ రెవరు? మీ రేమి చేయు చుందురు? మనమిదివరకు కలసినపుడు కూడా మీ గురించి నా కేమీ తెలుపలేదు. మిమ్ము గూర్చి మాకేమీ తెలియదు." అనిరి. నే నిట్లు పలికితిని, "నే నొక సామాన్య స్త్రీని, జన్మతః ఆంగ్లేయురాలను. ప్రస్తుతం అమెరికా దేశస్థురాలను. సామాన్యుల గూర్చి ఎవరికి మాత్రము ఏమి తెలియును? నా గురించి మీ కేమీ తెలియకపోవుట సహజము.
చెప్పుకొనుటకు కూడా నేను ఏ ప్రత్యేకతలూ లేని దానిని. నేను సంఘమున ఒక అజ్ఞాత వ్యక్తిని.” రాజుగారు మౌనముగా తలయూపి, నేనేమయినా కోరినచో తన సహచరులతో దానిని తప్పక నిర్వర్తించగలనని తెలిపి వెడలి పోయిరి. అటుపైన మామధ్య పరిచయము పెరిగినది.
ఒక రోజున కలిసి కారులో ప్రయాణము చేయుచుండగా అకస్మాత్తుగా రాజుగారు నావంక ప్రేమపూర్వకముగా చూసి, “శ్రీమతి బెయిలీ! నాకు కూడా జ్వాల కూల్ మహర్షిగారు వ్యక్తిగతముగా తెలియునని మీకు తెలుపు చున్నాను. ఈ వార్త మీకేమైనా సంతోషము కలిగించునా?” అని చిరునవ్వు నవ్విరి.
మరల బిత్తరపోవుట నావంతైనది. అప్రయత్న ముగ నిఠారుగ కూర్చొని “యస్ సర్” అని పలికితిని. ఒక క్షణమాగి “మీరు తెలిపిన వార్త నన్ను ఆశ్చర్యపరచుటయే గాక, హృదయమును తబ్బిబ్బు చేయుచున్నది. నా ఆనందమునకు అవధులు లేవు. మీరు మరల మరల నన్ను కలియుటలో యింత గంభీరమైన ఆంతర్యము కలదని నేనూహించలేదు. ఎంతైననూ మీరు గంభీరులు.” అని పలికితిని.
పరమగురువుల అనుయాయులందరూ గంభీరులే! పవిత్ర విషయములు రహస్యముగ నుంచగలిగినవారే వారి మార్గాను యాయులు కాగలరు అని తెలిపిరి. వారికే గురుసాన్నిధ్యము అందిన ఫలము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 338, 339 / Vishnu Sahasranama Contemplation - 338, 339
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 338/ Vishnu Sahasranama Contemplation - 338 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻338. తారః, तारः, Tāraḥ🌻
ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ
తారః, तारः, Tāraḥ
గర్భజన్మజరామృత్యు లక్షణాత్తారయన్ భయాత్ ।
తార ఇత్యుచ్యతే విష్ణుః ॥
గర్భవాసము, జన్మము, ముసలితనము, మృత్యువు అను వానివలన కలిగెడి భయమునుండి దాటించును గనుక అ విష్ణుదేవునకు తారః అని ప్రసిద్ధి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 338🌹
📚. Prasad Bharadwaj
🌻338. Tāraḥ🌻
OM Tārāya namaḥ
Garbhajanmajarāmr̥tyu lakṣaṇāttārayan bhayāt,
Tāra ityucyate viṣṇuḥ.
गर्भजन्मजरामृत्यु लक्षणात्तारयन् भयात् ।
तार इत्युच्यते विष्णुः ॥
Since Lord Viṣṇu liberates beings from the fear of residence in womb, birth, old age, death etc., He is Tāraḥ.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2
Na te’bhvasyeśa bhavasya kāraṇaṃ vinā vinodaṃ bata tarkayāmahe,
Bhavo nirodhaḥ stitirpyavidyayā kr̥tā yatastvayyabhayāśrayātmani. 39.
:: श्रीमद्भागवते - दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::
न तेऽभ्वस्येश भवस्य कारणं विना विनोदं बत तर्कयामहे ।
भवो निरोधः स्तितिर्प्यविद्यया कृता यतस्त्वय्यभयाश्रयात्मनि ॥ ३९ ॥
O Supreme Lord, You are not an ordinary living entity appearing in this material world as a result of fruitive activities. Therefore Your appearance or birth in this world has no other cause than Your pleasure potency. Similarly, the living entities, who are part of You, have no cause for miseries like birth, death and old age, except when these living entities are conducted by Your external energy.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 339 / Vishnu Sahasranama Contemplation - 339🌹
🌻339. శూరః, शूरः, Śūraḥ🌻
ఓం శూరాయ నమః | ॐ शूराय नमः | OM Śūrāya namaḥ
శూరః, शूरः, Śūraḥ
శూరో విక్రమణాత్ స్మృతః విక్రమమును అనగా పురుష ప్రయత్నమును ప్రదర్శించ సమర్థుడు. అత్యంత పౌరుషశాలి. విక్రమించును.
:: శ్రీమద్రామాయణము - అయోధ్యాకాండము ::
స శూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః ।
అసంత్రస్తోఽప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి ॥ 12 ॥
దివ్యాస్త్రసంపన్నుడును, నరశ్రేష్ఠుడును ఐన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలె ప్రశాంతముగా, నిర్భయముగా నివసింపగలడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 339🌹
🌻339. Śūraḥ🌻
OM Śūrāya namaḥ
Śūro vikramaṇāt smr̥taḥ / शूरो विक्रमणात् स्मृतः One of great prowess.
Śrīmad Rāmāyaṇa - Book II
Sa śūraḥ puruṣavyāghraḥ svabāhubalamāśritaḥ,
Asaṃtrasto’pyaraṇyastho veśmanīva nivatsyati. 12.
:: श्रीमद्रामायण - अयोध्याकांड ::
स शूरः पुरुषव्याघ्रः स्वबाहुबलमाश्रितः ।
असंत्रस्तोऽप्यरण्यस्थो वेश्मनीव निवत्स्यति ॥ १२ ॥
Rama the hero and the tiger among men, relying on the strength of his own arms, will dwell fearlessly in the forest as if in his own palace.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
15 Mar 2021
🌹. 64 కళలు వివరణ సహితం 🌹
*🌹. 64 కళలు వివరణ సహితం 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),
2. వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),
3. నృత్యము (భావాభినయము),
4. అలేఖ్యము (చిత్రలేఖనము),
5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),
6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),
7. పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),
8. దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),
9. మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),
10. శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),
11. ఉదక వాద్యము (జలతరంగిణి),
12. ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),
13. చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),
14. మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),
15. శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),
16. నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),
17. కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),
18. గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),
19. భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),
20. ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),
21. కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),
22. హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),
23. విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),
24. పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),
25. సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),
26. సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),
27. వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),
28. ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),
29. ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),
30. దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),
31. పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),
32. నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),
33. కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),
34. పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),
35. తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),
36. తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),
37. వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),
38. రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),
39. ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),
40. మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),
41. వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),
42. మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),
43. శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),
44. ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),
45. అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),
46. మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),
47. దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),
48. పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),
49. నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),
50. యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),
51 ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),
52. సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),
53. మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),
54. కావ్యక్రియ (కావ్యములను రచించుట),
55. అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),
56. క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),
57. ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),
58. ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),
59. ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),
60. ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),
61 బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),
62. వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),
63. వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),
64. వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).
🌹 🌹 🌹 🌹 🌹