నిర్మల ధ్యానాలు - ఓషో - 3


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 3 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


జీవితాన్ని గొప్ప సవాళ్ళు చుట్టు ముట్టినపుడే జీవనశక్తులన్నీ ఒకే కేంద్రం నుంచీ వజ్రకాంతుల్లో ధగధగలాడతాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకో. మతాన్ని భయంతో మేళవించకు. మతాన్ని నిర్భయంతో మేళవించు. ధైర్యంతో, సాహసంతో జత కలుపు. అట్లాంటి సాహసం నీకు మార్గ నిర్దేశం చేస్తుంది.

అదెలాంటిదంటే అగమ్యగోచరమయిన సముత్రంలో చిన్ని పడవలో ఎట్లాంటి మార్గనిర్దేశం, ఎట్లాంటి చుక్కాని లేకుండా ప్రయాణించడం లాంటిది. అవతలి తీరం గురించి ఏమీ అవగాహన లేని ప్రయాణం. కేవలం భూమి గుండ్రంగా వుందన్న ఒకే ఒక దృష్టి. వ్యక్తి తన చైతన్యరీత్యా కొలంబస్ కావాలి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 21

వివేక చూడామణి - 60 / Viveka Chudamani - 60


🌹. వివేక చూడామణి - 60 / Viveka Chudamani - 60🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 18. విశ్వము - 2 🍀


217. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి.

218. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది.

219. ఒక జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 60 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 18. The Universe - 2 🌻



217. That which clearly manifests Itself in the states of wakefulness, dream and profound sleep; which is inwardly perceived in the mind in various forms as an unbroken series of egoistic impressions; which witnesses the egoism, the Buddhi, etc., which are of diverse forms and modifications; and which makes Itself felt as the Existence-Knowledge-Bliss Absolute; know thou this Atman, thy own Self, within thy heart.

218. Seeing the reflection of the sun mirrored in the water of a jar, the fool thinks it is the sun itself. Similarly the stupid man, through delusion, identifies himself with the reflection of the Chit caught in the Buddhi, which is Its superimposition.

219. Just as the wise man leaves aside the jar, the water and the reflection of the sun in it, and sees the self-luminous sun which illumines these three and is independent of them;

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2021

దేవాపి మహర్షి బోధనలు - 71

🌹. దేవాపి మహర్షి బోధనలు - 71 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 52. ప్రజ్ఞావిలాసము 🌻


వస్తువులను చూచుచున్నపుడు నిశితముగ చూడుము. నిజము నకు ప్రతి వస్తువును సంఖ్య, శబ్దము, వర్ణము, పదార్థము యొక్క సముదాయము. వీటిని సమీకరించు శక్తి వీటి నావరించి యుండును. దానినే ప్రజ్ఞ యందురు.

అది సాధారణ దృష్టికి అవ్యక్తముగ నుండును. కాని ఈ సమీకరణ ప్రజ్ఞను మాత్రమే దర్శించుట దీక్షగా అవలంబించి నచో శబ్దము, వర్ణము, పదార్థము కేవలము ఆ ప్రజ్ఞ యొక్క తొడుగులుగ గోచరించును. క్రమశః ప్రజ్ఞయందు, నీ ప్రజ్ఞ అను సంధానమై లో దృష్టి ఏర్పడగలదు. ఇట్లు పరిసరముల కన్పించు రూపములన్నియు కూడ శబ్ద, వర్ణ, పదార్థముల సమీకరణమే అని తెలియును.

నీ యందు కూడ సమస్తమును అట్లే సమీకరింపబడియుండుట తెలియును. ఒకే ప్రజ్ఞ వేరు వేరు కేంద్రములుగ ఏర్పడి, వేరు వేరు సమీకరణములను చేసుకొని రూపాత్మకమైనదని తెలియును. ప్రజ్ఞ ఒక్కటియే గాన, అది నీవే గనుక, సమస్తము నందును "నే నను” ప్రజ్ఞయే నిలచి యున్నదని, ప్రజ్ఞకు విభజనము లేదని, విభజనము కేవలము ఒక భావన యని తెలియును.

పై భావము నీయందు స్థిరపడినకొలది సమస్తము నీ కనుకూల మగుచుండును. అప్పుడు నీవు పూర్ణ ప్రజ్ఞావంతుడవై, నీ రూపము నతిక్రమించి అన్నిటియందు నేనుగ భాసించగలవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2021

13-APRIL-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589🌹 
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 41🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 366 367 / Vishnu Sahasranama Contemplation - 366, 367🌹
4) 🌹 Daily Wisdom - 97🌹
5) 🌹. వివేక చూడామణి - 60🌹
6) 🌹Viveka Chudamani - 60🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 71🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 3🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 251 / Sri Lalita Chaitanya Vijnanam - 251🌹 
ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 28 🌴*

28. ఆశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థ! పరమపురుషుని యందు శ్రద్ధలేకుండా ఒనర్చునటువంటి యజ్ఞము, దానము లేదా తపస్సనునది ఆశాశ్వతమైనది. “అసత్” అని పిలువబడు అట్టి కర్మ ప్రస్తుతజన్మము నందును, రాబోవు జన్మము నందును నిరుపయోగమే.

🌷. భాష్యము :
ఆధ్యాత్మిక లక్ష్యమనునది లేకుండా ఒనర్చుబడునదేదైనను వాస్తవమునకు వ్యర్థమైనదే. అట్టి కర్మ యజ్ఞమైనను, దానమైనను లేదా తపమైనను నిరుపయోగమే కాగలదు. కనుకనే అట్టి కర్మలు హేయములని ఈ శ్లోకమున ప్రకటింపబడినది. వాస్తవమునకు ప్రతికర్మయు శ్రీకృష్ణభగవానుని నిమిత్తమై కృష్ణభక్తిభావనలో ఒనరింపవలసియున్నది. 

అటువంటి శ్రద్ధ మరియు తగిన నిర్దేశము లేనిచో ఎట్టి ఫలమును లభింపబోదు. సమస్త వేదవాజ్మయమున పరమపురుషుని యందలి శ్రద్ధయే ఉపదేశింపబడినది. వేదోపదేశముల అనుసరణము యొక్క ముఖ్యలక్ష్యము శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుటయే. 

ఈ విషయమును మరియు నియమమును పాటించకుండా ఎవ్వరును జయమును పొందలేరు. కనుక ఆధ్యాత్మికగురువు నేతృత్వమున తొలినుండియే కృష్ణభక్తిభావనలో కర్మ నొనరించుట ఉత్తమోత్తమ మార్గము. సర్వమును విజయవంతమొనర్చుటకు ఇదియే ఉత్తమమార్గము.

బద్దజీవనమునందు జనులు దేవతలను, భూతప్రేతములను లేదా కుబేరుడు వంటి యక్షులను పూజించుటకు ఆకర్షితులగుదురు. 

సత్త్వగుణము రజస్తమోగుణముల కన్నను మెరుగైనదైనను, కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలిచినవాడు త్రిగుణములకు అతీతుడు కాగలడు. గుణములందు క్రమముగా ఉన్నతిని పొందు మార్గమొకటున్నను భక్తుల సాంగత్యమున ప్రత్యక్షముగా కృష్ణభక్తిలో మనుజుడు నిలువగలిగినచో అది ఉత్తమమార్గము కాగలదు.

 అదియే ఈ అధ్యాయమున ఉపదేశింపబడినది. ఈ విధానమున జయమును సాధింపగోరినచో మనుజుడు తొలుత సరియైన గురువును పొంది ఆయన నిర్దేశమునందు శిక్షణను బడయవలసియుండును. పిదప అతడు శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను పొందగలడు. 

కాలక్రమమున అట్టి శ్రద్ధ పరిపక్వమైనపుడు కృష్ణప్రేమగా పిలువబడును. ఆ ప్రేమయే సర్వజీవుల అంతిమలక్ష్యము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనను ప్రత్యక్షముగా స్వీకరింపవలెననుట ఈ సప్తదశాధ్యాయపు సందేశమై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “శ్రద్ధాత్రయవిభాగములు” అను సప్తదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.                                                     

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 589 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 28 🌴*

28. aśraddhayā hutaṁ dattaṁ
tapas taptaṁ kṛtaṁ ca yat
asad ity ucyate pārtha
na ca tat pretya no iha

🌷 Translation : 
Anything done as sacrifice, charity or penance without faith in the Supreme, O son of Pṛthā, is impermanent. It is called asat and is useless both in this life and the next.

🌹 Purport :
Anything done without the transcendental objective – whether it be sacrifice, charity or penance – is useless. 

Therefore in this verse it is declared that such activities are abominable. Everything should be done for the Supreme in Kṛṣṇa consciousness. Without such faith, and without the proper guidance, there can never be any fruit. In all the Vedic scriptures, faith in the Supreme is advised. In the pursuit of all Vedic instructions, the ultimate goal is the understanding of Kṛṣṇa. 

No one can obtain success without following this principle. Therefore, the best course is to work from the very beginning in Kṛṣṇa consciousness under the guidance of a bona fide spiritual master. That is the way to make everything successful.

 Although there is a process of gradual elevation, if one, by the association of pure devotees, takes directly to Kṛṣṇa consciousness, that is the best way. And that is recommended in this chapter. To achieve success in this way, one must first find the proper spiritual master and receive training under his direction. 

Then one can achieve faith in the Supreme. When that faith matures, in course of time, it is called love of God. This love is the ultimate goal of the living entities. One should therefore take to Kṛṣṇa consciousness directly. That is the message of this Seventeenth Chapter.

Thus end the Bhaktivedanta Purports to the Seventeenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Divisions of Faith.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 040 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 1, శ్లోకం 40
40
అధర్మాబిభవాత్‌ కృష్ణ
ప్రద్యుషన్తి కులస్త్రియ: |
స్త్రీషు దుష్టాసు వార్‌ష్ణేయ
జాయతే వర్ణసంకర: ||

తాత్పర్యము : ఓ కృష్ణా ! వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.

భాష్యము : మానవ సహజ శాంతి సామరస్యాలు, ఆధ్యాత్మిక పురోగతి మంచి సంతానముపై ఆధారపడి ఉంటాయి. వర్ణాశ్రమ ధర్మాలనేవి మంచి సంతానము కొనసాగేటట్లు, సమాజ శ్రేయస్సు కాపాడబడేటట్లు రూపొందించబడినవి. ఈ ధర్మాలు స్త్రీల పాతివ్రత్యము మీద ఆధారపడి ఉంటాయి. పిల్లలు ఎలా సులభంగా మోసగించబడతారో, అలాగే స్త్రీలు సులువుగా తప్పుదోవ పట్టించబడతారు. కాబట్టి, స్త్రీలు, పిల్లలు కుటుంబ పెద్దలచే రక్షింపబడవలెను. వర్ణాశ్రమ ధర్మాలను పాటించినట్లయితే, అనేక సంక్షేమ కార్యాలలో పాల్గొని వారు తప్పుదోవ పట్టే అవకాశము ఉండదు. అలా వర్ణాశ్రమ ధర్మాలను పాటించనిచో, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలిసే అవకాశము ఏర్పడి అనవసరపు పిల్లలు పుట్టి, మానవ సమాజము అథోగతి పట్టే అవకాశము ఉంటుంది. దుర్మార్గాలు, మోసాలు చివరికి యుద్ధాలు సర్వ సామాన్యమైపోతాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 366, 367 / Vishnu Sahasranama Contemplation - 366, 367 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 366. హేతుః, हेतुः, Hetuḥ🌻*

*ఓం హేతవే నమః | ॐ हेतवे नमः | OM Hetave namaḥ*

అస్య జగతః ఉపాదానం నిమిత్తంచ కారణం స ఏవ ఈ జగత్తునకు ఉపాదానకారణమును నిమిత్తకారణమును ఆతడే. ఈ రెండు ప్రకారముల చేతను జగత్సృష్టికి హేతువు ఆతడే.

కుండకు మన్ను, కుండలమునకు బంగారము ఉపాదాన కారణములు. వానిని చేయు కుమ్మరియు స్వర్ణకారుడును నిమిత్తకారణములు. అటులే పరమాత్మ జగత్తునకు ఉపాదాన నిమిత్త కారణములు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 366🌹*
📚. Prasad Bharadwaj 

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 367 / Vishnu Sahasranama Contemplation - 367🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻367. దామోదరః, दामोदरः, Dāmodaraḥ🌻*

*ఓం దామోదరాయ నమః | ॐ दामोदराय नमः | OM Dāmodarāya namaḥ*

దామోదరః, दामोदरः, Dāmodaraḥ
దమాదిసాధనోదారోత్కృష్టామతి రస్తిసా ।
తయా గమ్యత ఇతి స దామోదర ఇతీర్యతే ॥

దమము అనగా ఇంద్రియ సంయమనము మొదలగు రూపముగల సాధనముచే ఉత్కృష్టము అగు ఏ మతికలదో అట్టి మతి యున్నవారిచే తెలియబడువాడు.

:: మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
దమాత్ సిద్ధిం పరీప్సన్తో మాం జనాః కామయన్తి హ ।
దివం చోర్వీం చ మధ్యం చ తస్మాద్ దమోదరో హ్యహమ్ ॥ 44 ॥

మనుష్యులు దమము అనగా ఇంద్రియనిగ్రహము ద్వారా సిద్ధిని పొందే ఇచ్ఛతో నన్ను పొందాలని కోరిక కలిగియుండి ఆ దమముద్వారానే వారు పృథివీ, స్వర్గము మరియు మధ్యవర్తి లోకాలలో ఉన్నత గమ్యాలను చేరుకోవాలని అభిలషిస్తారు. అందుకే నేను దామోదరుడుగా ప్రసిద్ధికెక్కాను.

:: మహాభారతే ఉద్యోగ పర్వణి యానసంధి పర్వణి సప్తతిమోఽధ్యాయః ::
న జాయతే జనిత్రాయమజస్తస్మాదనీకజిత్ ।
దేవానాం స్వప్రకాశత్వాద్ దమాద్ దమోదరో విభుః ॥ 8 ॥

శత్రుసేనలపై విజయాన్ని పొందే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏ జన్మదాత ద్వారానూ జన్మను గ్రహించరుగావున ఆయన అజుడు. దేవతలు స్వయంప్రకాశ స్వరూపులై ఉంటారు కాబట్టి ఉత్కృష్ట రూపంలో ప్రకాశమానులు కావటంచేత శ్రీకృష్ణ భగవానుడిని 'ఉదర' అని పిలుస్తారు మరియూ దమము అనే గుణముతో సంపన్నులు కావడంచేత ఆయనకు 'దామ' అని మరో పేరు. ఈ ప్రకారముగా దామ మరియూ ఉదర - ఈ రెండు శబ్దాల సంయోగ కారణాన ఆయన దామోదరుడుగా ప్రసిద్ధికెక్కారు.

:: శ్రీ మహాపురాణే (బ్రహ్మపురాణే) చతురశీత్యధికశతతమోఽధ్యాయః ::
దదర్శ చాల్పదన్తాస్యం స్మితహాసం చ బాలకమ్ ।
తమోర్మద్యగతం బద్ధం దామ్నా గాఢం తథోదరే ॥ 41 ॥

కొలదిగ దంతములుగల నోరు గలవాడును చిరునగవుతో కూడినవాడును అగు బాలకుని - ఆ రెండు జంట మద్ధి చెట్ల నడుమ నున్నవానిని - త్రాటితో తన ఉదరము దృఢముగా కట్టబడియున్నవానిని చూచెను. తన ఉదరము నందలి ఆ దామ బంధనముచే (త్రాటితో కట్టబడుటచే) అతడు అటు తరువాతనుండి 'దామోదరుడు' అను వ్యవహారమును పొందినవాడాయెను.

దామాని లోకనామాని తాని యస్యోదరాంతరే ।
తేన దామోదరో దేవః శ్రీధరః శ్రీ సమాశ్రితః ॥

'దామములు' అనునది లోకములకు నామము. అవి ఎవని ఉదరాంతరమున అనగా ఉదరమునకు నడుమ ఉన్నవో అట్టి వాడును, శ్రీ (లక్ష్మి) చేత సమాశ్రితుడు (లెస్సగా ఆశ్రయించబడినవాడు) అగు శ్రీధరదేవుడు ఆ హేతువు చేతనే దామోదరుడుగా అయ్యెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 367🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 367. Dāmodaraḥ 🌻*

*OM Dāmodarāya namaḥ*

दमादिसाधनोदारोत्कृष्टामति रस्तिसा ।
तया गम्यत इति स दामोदर इतीर्यते ॥

Damādisādhanodārotkr̥ṣṭāmati rastisā,
Tayā gamyata iti sa dāmodara itīryate.

He is attained by udāra and utkr̥ṣṭa i.e., superior disciplines of dāma i.e., self restraint; Hence He is Dāmodaraḥ.

:: महाभारते शांति पर्वणि मोक्षधर्म पर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
दमात् सिद्धिं परीप्सन्तो मां जनाः कामयन्ति ह ।
दिवं चोर्वीं च मध्यं च तस्माद् दमोदरो ह्यहम् ॥ ४४ ॥

Mahābhāra - Book 12, Mokṣadharma Section, Chapter 341
Damāt siddhiṃ parīpsanto māṃ janāḥ kāmayanti ha,
Divaṃ corvīṃ ca madhyaṃ ca tasmād damodaro hyaham. 44.

He is known as Dāmodaraḥ as He is attained by dāma (self-control) etc.

:: श्री महापुराणे (ब्रह्मपुराणे)चतुरशीत्यधिकशततमोऽध्यायः ::
ददर्श चाल्पदन्तास्यं स्मितहासं च बालकम् ।
तमोर्मद्यगतं बद्धं दाम्ना गाढं तथोदरे ॥ ४१ ॥

Brahma Purāṇa - Chapter 184
Dadarśa cālpadantāsyaṃ smitahāsaṃ ca bālakam,
Tamormadyagataṃ baddhaṃ dāmnā gāḍaṃ tathodare. 41.

The inhabitants of Gokula saw the boy smiling with few or tiny teeth.She (Yaṣodā) bound Him tightly with a rope round His waist and betwixt them (the two trees). He became Dāmodara due to binding with a dāma or rope from that time.

दामानि लोकनामानि तानि यस्योदरांतरे ।
तेन दामोदरो देवः श्रीधरः श्री समाश्रितः ॥

Dāmāni lokanāmāni tāni yasyodarāṃtare,
Tena dāmodaro devaḥ śrīdharaḥ śrī samāśritaḥ.

Dama means the worlds. He in whose abdomen these worlds have their existence, that Lord, known also as Śrīnivāsa and Śrīdhara, is Dāmodara.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 97 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 6. Even Among Human Beings We have Various Grades 🌻*

According to Hegel, the renowned German philosopher, the lowest level is brute consciousness, which is inseparable from sheer material existence. 

The second stage, above this, is nature-reactive self-preservative consciousness, observable in plant life. The third stage is of a crude seeking of oneself in others, expressed in the presence of a psychological want, a need and a love which specifically concentrates itself in the reproductive consciousness. 

The fourth is the stage of self-consciousness which is the special faculty of man, beyond the level of the mere animal satisfaction of self-preservation and self-reproduction in the form of reaction to external stimuli. 

Yet, human life here is incipient and not fully developed. Even among human beings we have various grades: there is the animal man, the selfish man, the good man, the saintly man and the God-man. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 60 / Viveka Chudamani - 60🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 18. విశ్వము - 2 🍀*

217. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి. 

218. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది. 

219. ఒక జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 60 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 18. The Universe - 2 🌻*

217. That which clearly manifests Itself in the states of wakefulness, dream and profound sleep; which is inwardly perceived in the mind in various forms as an unbroken series of egoistic impressions; which witnesses the egoism, the Buddhi, etc., which are of diverse forms and modifications; and which makes Itself felt as the Existence-Knowledge-Bliss Absolute; know thou this Atman, thy own Self, within thy heart.

218. Seeing the reflection of the sun mirrored in the water of a jar, the fool thinks it is the sun itself. Similarly the stupid man, through delusion, identifies himself with the reflection of the Chit caught in the Buddhi, which is Its superimposition.

219. Just as the wise man leaves aside the jar, the water and the reflection of the sun in it, and sees the self-luminous sun which illumines these three and is independent of them;

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 71 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 52. ప్రజ్ఞావిలాసము 🌻*

వస్తువులను చూచుచున్నపుడు నిశితముగ చూడుము. నిజము నకు ప్రతి వస్తువును సంఖ్య, శబ్దము, వర్ణము, పదార్థము యొక్క సముదాయము. వీటిని సమీకరించు శక్తి వీటి నావరించి యుండును. దానినే ప్రజ్ఞ యందురు. 

అది సాధారణ దృష్టికి అవ్యక్తముగ నుండును. కాని ఈ సమీకరణ ప్రజ్ఞను మాత్రమే దర్శించుట దీక్షగా అవలంబించి నచో శబ్దము, వర్ణము, పదార్థము కేవలము ఆ ప్రజ్ఞ యొక్క తొడుగులుగ గోచరించును. క్రమశః ప్రజ్ఞయందు, నీ ప్రజ్ఞ అను సంధానమై లో దృష్టి ఏర్పడగలదు. ఇట్లు పరిసరముల కన్పించు రూపములన్నియు కూడ శబ్ద, వర్ణ, పదార్థముల సమీకరణమే అని తెలియును. 

నీ యందు కూడ సమస్తమును అట్లే సమీకరింపబడియుండుట తెలియును. ఒకే ప్రజ్ఞ వేరు వేరు కేంద్రములుగ ఏర్పడి, వేరు వేరు సమీకరణములను చేసుకొని రూపాత్మకమైనదని తెలియును. ప్రజ్ఞ ఒక్కటియే గాన, అది నీవే గనుక, సమస్తము నందును "నే నను” ప్రజ్ఞయే నిలచి యున్నదని, ప్రజ్ఞకు విభజనము లేదని, విభజనము కేవలము ఒక భావన యని తెలియును.

పై భావము నీయందు స్థిరపడినకొలది సమస్తము నీ కనుకూల మగుచుండును. అప్పుడు నీవు పూర్ణ ప్రజ్ఞావంతుడవై, నీ రూపము నతిక్రమించి అన్నిటియందు నేనుగ భాసించగలవు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 3 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

జీవితాన్ని గొప్ప సవాళ్ళు చుట్టు ముట్టినపుడే జీవనశక్తులన్నీ ఒకే కేంద్రం నుంచీ వజ్రకాంతుల్లో ధగధగలాడతాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకో. మతాన్ని భయంతో మేళవించకు. మతాన్ని నిర్భయంతో మేళవించు. ధైర్యంతో, సాహసంతో జత కలుపు. అట్లాంటి సాహసం నీకు మార్గ నిర్దేశం చేస్తుంది.

అదెలాంటిదంటే అగమ్యగోచరమయిన సముద్రంలో చిన్ని పడవలో ఎట్లాంటి మార్గనిర్దేశం, ఎట్లాంటి చుక్కాని లేకుండా ప్రయాణించడం లాంటిది. అవతలి తీరం గురించి ఏమీ అవగాహన లేని ప్రయాణం. కేవలం భూమి గుండ్రంగా వుందన్న ఒకే ఒక దృష్టి. వ్యక్తి తన చైతన్యరీత్యా కొలంబస్ కావాలి. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #నిర్మలధ్యానములు
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 251 / Sri Lalitha Chaitanya Vijnanam - 251 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।*
*చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀*

*🌻 251. 'చిన్మయీ' 🌻* 

చైతన్యమయమైనది శ్రీదేవి అని అర్థము. చిన్మయమనగా చైతన్యమయము. శ్రీమాతయే సృష్టి చైతన్యము. ఆమె ఉద్భవించుటయే సృష్టి మేల్కాంచుట. సృష్టిలోని ప్రతి వస్తువు నందు కూడ ఆమె ప్రభావమే మేల్కాంచి యుండును. గుణ రూపమున మనకు గోచరించుచుండును. 

ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు, కారముగ ఆహార పదార్థములలో గోచరించునది శ్రీమాతయే. అట్లే పండ్లయందు వివిధమగు రుచులుగను, పువ్వులయందు సుగంధములుగను, సుగంధ ద్రవ్యములయందు సువాసనలుగను శ్రీమాత గోచరించును. 

పంచభూతముల యందు ఆయా గుణములతో గోచరించును. జంతువుల యందు, మానవుల యందు వారి వారి స్వభావములకు మూలమైన సత్వ, రజస్తమో గుణ సంమిశ్రమముగ భాసించును. 

అట్లే దేవతలయందు, దానవులయందు కూడ భాసించును. శ్రీమాత చైతన్యము త్రిగుణాత్మకమై సృష్టి అంతయూ ఆవరించి యుండగ త్రిగుణముల మిశ్రమమును బట్టి అనేకానేక జీవుల ప్రవర్తనము లుండును. గుణముల మిశ్రమములలోని భేదములే జీవుల స్వభావములోని భేదములుగ గోచరించును. 

అందరూ జీవులే! జీవులుగ అందరూ శ్రీమాత సంతానమే! వారి నావరించి యుండు త్రిగుణముల మిశ్రమము వారి వారి అనుభవములకు సంబంధించి యుండును. మంచి చెడులు, ఉచ్చ నీచములు, కుడిఎడమలు, స్థూల సూక్ష్మములు అన్నియూ గుణముల మిశ్రమమే. అన్నిటి యందు గల ఈ గుణ మిశ్రమమున కాధారము శ్రీమాత చైతన్యమే. ఈ చైతన్య ముద్భవించనిచో జీవులందరూ నిద్రాణమగు స్థితి యందుందురు. 

నిద్రాణ స్థితిలో రాజు, బంటు, పోలీసు, దొంగ, తెలిసినవారు, తెలియనివారు అందరూ సమానులే. సృష్టి క్రీడ అంతయూ గుణములుగ చైతన్యము మేల్కాంచినపుడే యుండును. ఈ చైతన్య స్వరూపము శ్రీమాత. త్రిగుణాత్మకము కాని ఈ చైతన్యమును శుద్ధ చైతన్య మందురు. శుద్ధ చైతన్యమున ఇచ్ఛ కాని, ఆ ఇచ్ఛను నిర్వర్తించవలసిన జ్ఞానముగాని, తత్సంబంధిత క్రియగాని ఇంకనూ మేల్కాంచి యుండవు. కేవలము చైతన్యమే యుండును. 

తానున్నాను అన్న భావన తప్ప మరియొక భావన లేని స్థితి యది. ఈ శుద్ధ చైతన్య స్వరూపమే చిన్మయ స్వరూపము. ఈ స్వరూపము సత్య ప్రకాశముగ నుండును. స్వయం ప్రకాశముగ నుండును. తనకు తానే సహజమగు వెలుగుగ నుండును. సత్యమే తానుగ నున్నానను జ్ఞానమే (భావమే) ఈ వెలుగు. 

అట్టి చేతన యందు సహజమగు ఆనంద ముండును. సత్, చిత్ అను ప్రకాశముగ మాత్రమే నుండుట వలన, త్రిగుణముల యందింకను జొరబడకుండుట వలన, ఎట్టి కోరిక లేకుండుట వలన పరిపూర్ణమైన ఆనంద ముండును. కేవలము సత్ చిత్లే యున్నప్పుడు కలుగు ఆనందము వర్ణనాతీతము. అదియే పరమానందము ఈ స్థితిని సత్ చిత్ ఆనందా- సచ్చిదానంద అందురు. ఈ సచ్చిదానంద స్థితి శ్రీదేవి సహజ స్థితి. జీవులకది గమ్యము. 

త్రిగుణముల కావల ఈ చిన్మయ స్థితిని జీవుడు పొందగలడు. త్రిగుణముల కీవల సంసార బంధమున నుండును. చిన్మయ స్థితిని పొందినవారు త్రిగుణములలో ప్రవేశించినను బంధింప బడక నుందురు. వారే ముక్తజీవులు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 251 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Cinmayī चिन्मयी (251) 🌻*

She is in the form pure consciousness. Cin here means cit. Pure consciousness is that stage of awareness, where there is no differentiation between the known, the knower and the knowledge. The absence of this triad while realising the Brahman, is pure cit (also chit) or consciousness. Please refer nāma 254 also.

{Further reading on consciousness: Consciousness can be explained as an alert cognitive state in which one is aware of himself and his situation. Brahman is pure consciousness known as cit. When cit becomes reflected as cosmic conscience in the form of God, it does not lose its omniscience and omnipotence. When cit is reflected as individual conscience, it degenerates from absolute consciousness to limited individual consciousness. This is known as citta (individual conscience) and is different from cit.  

The cosmic conscience, the Brahman initiates macrocosmic manifestation of prakṛti while the individual conscience initiates the microcosmic manifestation. Both cit and citta set in evolutionary forces into motion. There are different levels of consciousness, the lowest being the stage of action and the highest being turya and finally turyātīta.}

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌹*
ప్రసాద్ భరద్వాజ 

ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం.

ప్లవ అంటే, దాటించునది అని అర్థం. 
   "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం.  

    వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. 
      శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి.

 ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి.
అందుకే, ప్లవ నామ సంవత్సరానికి ఆందరికి శుభ స్వాగతం, సుస్వాగతం
🙏🙏🙏. ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹