🌹. దేవాపి మహర్షి బోధనలు - 71 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 52. ప్రజ్ఞావిలాసము 🌻
వస్తువులను చూచుచున్నపుడు నిశితముగ చూడుము. నిజము నకు ప్రతి వస్తువును సంఖ్య, శబ్దము, వర్ణము, పదార్థము యొక్క సముదాయము. వీటిని సమీకరించు శక్తి వీటి నావరించి యుండును. దానినే ప్రజ్ఞ యందురు.
అది సాధారణ దృష్టికి అవ్యక్తముగ నుండును. కాని ఈ సమీకరణ ప్రజ్ఞను మాత్రమే దర్శించుట దీక్షగా అవలంబించి నచో శబ్దము, వర్ణము, పదార్థము కేవలము ఆ ప్రజ్ఞ యొక్క తొడుగులుగ గోచరించును. క్రమశః ప్రజ్ఞయందు, నీ ప్రజ్ఞ అను సంధానమై లో దృష్టి ఏర్పడగలదు. ఇట్లు పరిసరముల కన్పించు రూపములన్నియు కూడ శబ్ద, వర్ణ, పదార్థముల సమీకరణమే అని తెలియును.
నీ యందు కూడ సమస్తమును అట్లే సమీకరింపబడియుండుట తెలియును. ఒకే ప్రజ్ఞ వేరు వేరు కేంద్రములుగ ఏర్పడి, వేరు వేరు సమీకరణములను చేసుకొని రూపాత్మకమైనదని తెలియును. ప్రజ్ఞ ఒక్కటియే గాన, అది నీవే గనుక, సమస్తము నందును "నే నను” ప్రజ్ఞయే నిలచి యున్నదని, ప్రజ్ఞకు విభజనము లేదని, విభజనము కేవలము ఒక భావన యని తెలియును.
పై భావము నీయందు స్థిరపడినకొలది సమస్తము నీ కనుకూల మగుచుండును. అప్పుడు నీవు పూర్ణ ప్రజ్ఞావంతుడవై, నీ రూపము నతిక్రమించి అన్నిటియందు నేనుగ భాసించగలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Apr 2021
No comments:
Post a Comment