🌹 28, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 28, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 28, FEBRUARY 2023 MONDAY, మంగళవారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita -333 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 23 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 180 / Agni Maha Purana - 180 🌹 🌻. పిండికాది లక్షణములు / The characteristics of the pedestal (piṇḍikā-lakṣaṇa) 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 045 / DAILY WISDOM - 045 🌹 🌻 14. ప్రపంచం మరియు మనము తప్ప మరేమీ లేదు / 14. The World and Ourselves, There is Nothing Else 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 310 🌹
6) 🌹. శివ సూత్రములు - 47 / Siva Sutras - 47 🌹 
🌻 15. హృదయే చిత్తసంఘటాత్‌ దృశ్య స్వప దర్శనం - 3 / 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹28, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. అపరాజితా స్తోత్రం - 8 🍀*

15. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
16. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సమస్త ప్రపంచమూ చైతన్య మయమేనన్న అనుభూతి నీవు పొందడానికి, నీ యందు మనస్సుతో పాటుగా నీ భౌతిక చైతన్యం కూడా నిద్ర నుండి మేల్కొని, అన్నిటిలోనూ అనుస్యూతమైవున్న ఏకత్వాన్ని గుర్తించడం అవసరం. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-నవమి 28:20:18 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: రోహిణి 07:20:52 వరకు
తదుపరి మృగశిర
యోగం: వషకుంభ 16:25:04 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బాలవ 15:19:46 వరకు
వర్జ్యం: 13:31:28 - 15:17:36
దుర్ముహూర్తం: 08:56:42 - 09:43:49
రాహు కాలం: 15:25:26 - 16:53:47
గుళిక కాలం: 12:28:44 - 13:57:05
యమ గండం: 09:32:02 - 11:00:23
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 03:51:52 - 05:35:56
సూర్యోదయం: 06:35:20
సూర్యాస్తమయం: 18:22:08
చంద్రోదయం: 12:24:39
చంద్రాస్తమయం: 01:11:22
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మతంగ యోగం - అశ్వ లాభం
07:20:52 వరకు తదుపరి రాక్షస యోగం
- మిత్ర కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita - 333 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 23 🌴*

*23. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగిన: |*
*ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||*

🌷. తాత్పర్యం :
*ఓ భరతవంశశ్రేష్టుడా! ఏయే కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగనునో లేక తిరిగిరాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.*

🌷. భాష్యము :
సంపూర్ణశరణాగతులైన అనన్యభక్తులు తమ దేహత్యాగము ఎప్పుడు జరుగునున్న విషయము గాని, ఈ విధముగా జరుగనున్నదనెడి విషయము గాని పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో వదలి సులభముగా, నిశ్చింతగా, సుఖముగా వారు కృష్ణధామమును చేరుదురు. కాని అనన్యభక్తులు గాక ఆత్మానుభమునకై కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగాది పద్ధతులపై ఆధారపడెడివారు మాత్రము తగిన సమయమునందే దేహత్యాగము చేయవలసియుండును. దానిపైననే వారు ఈ జన్మ, మృత్యువులు కలిగిన జగమునాకు తిరిగి వచ్చుటయో లేక తిరిగి రాకపోవుటయో ఆధారపడియుండును.

యోగియైనవాడు పూర్ణత్వమును సాధించినచో ఈ భౌతికజగమును వీడుటకు సరియైన స్థితిని, సమయమును నిర్ణయించుకొనగలడు. కాని పూర్ణుడుగాని వాని సఫలత యాదృచ్చికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగముపై ఆధారపది యుండును. ఏ సమయమున మరణించినచో తిరిగి వెనుకకు రావలసిన అవసరము కలుగదో అట్టి తగిన సమయములను గూర్చి శ్రీకృష్ణభగవానుడు రాబోవు శ్లోకములో వివరింపనున్నాడు. ఆచార్యులైన శ్రీ బలదేవవిద్యాభూషణుల వ్యాఖ్యానము ననుసరించి “కాలము” అను సంస్కృతపదము ఇచ్చట కాలము యొక్క అధిష్టానదేవతను సూచించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 333 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 23 🌴*

*23 . yatra kāle tv anāvṛttim āvṛttiṁ caiva yoginaḥ*
*prayātā yānti taṁ kālaṁ vakṣyāmi bharatarṣabha*

🌷 Translation : 
*O best of the Bhāratas, I shall now explain to you the different times at which, passing away from this world, the yogī does or does not come back.*

🌹 Purport :
The unalloyed devotees of the Supreme Lord, who are totally surrendered souls, do not care when they leave their bodies or by what method. They leave everything in Kṛṣṇa’s hands and so easily and happily return to Godhead. But those who are not unalloyed devotees and who depend instead on such methods of spiritual realization as karma-yoga, jñāna-yoga and haṭha-yoga must leave the body at a suitable time in order to be sure of whether or not they will return to the world of birth and death.

If the yogī is perfect he can select the time and situation for leaving this material world. But if he is not so expert his success depends on his accidentally passing away at a certain suitable time. The suitable times at which one passes away and does not come back are explained by the Lord in the next verse. According to Ācārya Baladeva Vidyābhūṣaṇa, the Sanskrit word kāla used herein refers to the presiding deity of time.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 180 / Agni Maha Purana - 180 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 55*

*🌻. పిండికాది లక్షణములు - 1 🌻*

హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! నే నిపుడు ప్రతిమల పిండికల లక్షణమును చెప్పెదను. పిండిక పొడవు ప్రతిమ పొడవుతో సమానముగా ఉండవలెను; వెడల్పు దానిలో సగముండవలెను. దాని ఎత్తు ప్రతిమ ఎత్తులో సగముండవలెను. లేదా దాని విస్తారము పొడవులో తృతీయాంశముండవలెను. దాని మూడ వంతుచే మేఖల నిర్మింపవెలను. నీరు ప్రవహించుటకై ఉన్న గర్తము కొలత, మేఖల కొలతతో తుల్యముగా నుండవలెను. ఆ గర్తము ఉత్తరమువైపు కొంచెము పల్లముగా నుండవలెను. పిండిక విస్తారములో నాల్గవవంతుతో జలము బైటకు పోవుటకై ప్రణాలము నిర్మించవలెను. మూలభాగమున దానివిస్తారము మూలముతో సమముగా నుండవలెను. పైకి పోయినకొలది సగముండవలెను. ఆ జలమార్గము పిండికా విస్తారములో మూడవవంతుగాని, సగముగాని ఉండవలెను. దాని పొడవు ప్రతిమాపొడవెంతయో అంతే ఉండవలెనని చెప్పబిడనది. లేదా ప్రతిమ పొడవు పిండిక పొడవులో సగముండవలెను. ఈ విషయము బాగుగా అర్ధముచేసికొని దానికి సూత్రపాతము చేయవలెను.

వెనుక చెప్పినట్లు, ప్రతిమ ఎత్తు షోడశభాగసంఖ్యానుసారముగ చేయవలెను. ఎనిమిది భాగము క్రిందనున్న అర్ధాంగముగా చేయవలెను. దీనిపైననున్న మూడుభాగములు గ్రహించి కంఠమును నిర్మింపవలెను. మిగిలిన భాగములను ఒక్కొక్క దానిని ప్రతిష్ఠ, నిర్గమము, పట్టిక మొదలగువాటి రూపమున విభజింపవలెను. ఇది ప్రతిమాపిండికల సామాన్య లక్షణము. ప్రాసాదద్వార దైర్ఘ్యవిస్తారములనుపట్టి ప్రతిమా గృహ ద్వారముండవలెను. ప్రతిమల ప్రభలపై ఏనుగులు, సర్పములు మొదలగు వాటి మూర్తులను నిర్మింపవలెను. శ్రీహరియొక్క పిండికను గూడ యథోచిత శోభాసంపన్నముగ నుండునట్లు చేయవలెను. అన్ని దేవప్రతిమల ప్రమాణము విష్ణు ప్రతిమకు చెప్పిన ప్రమాణమువలె నుండవలెను. దేవీప్రతిమల ప్రమాణము లక్ష్మీప్రతిమకు చెప్పిన విధముననే ఉండవలెను.

శ్రీ అగ్నిమహాపురాణమునందు పిండికాది లక్షణమును ఏబదియైదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 180 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 55*
*🌻The characteristics of the pedestal (piṇḍikā-lakṣaṇa) - 1 🌻*

The Lord said:
I. I shall describe (the characteristics of) the pedestal of images [i.e., piṇḍikā]. They have the same length as (the height) of the image and have breadth half (the height) of (the image).

2. Or the breadth should be half or one-third of the measure of the height. The girdle should be equal to one-third of its breadth.

3. The cavity should be of the same measure and should be inclined towards the posterior part. A quarter of the breadth (should be left out) for the canal as outlet.

4. (The width) of the forepart (of the channel) should be half of the breadth of the base. The water-course should be one-third of the breadth (of the base).

5. Or else the length of the liṅga is said to be equal to half (the length) of the base or equal to the length (of the base).

6. The height (of the pedestal [i.e., piṇḍikā]) should be divided into sixteen parts as before. The lower six divisions should be made to comprise two parts. The neck should be three parts.

7. The foundation, projections, joint, seat and other remaining parts should each comprise one part. This will hold good in the case of ordinary images.

8. The door-way (leading) to the image is said to be proportionate to the door-way of the temple. The canopy over the image should be endowed with elephants and tigers.

9. The pedestal of (the image of) Hari also should always be made beautiful. The measures (laid down) for the images of Viṣṇu shall apply to (the images of) all gods. Those measures set forth for the image of Lakṣmī shall apply to all (images of) the goddesses.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 45 / DAILY WISDOM - 45 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. ప్రపంచం మరియు మనము తప్ప మరేమీ లేదు 🌻*

*ఈ ప్రపంచంలో మనం చూసేది రెండు విషయాలు మాత్రమే: ప్రపంచం మరియు మనం. ఇంకేమీ లేదు. మనం చుట్టూ చూస్తే, ఖగోళ మరియు భౌగోళిక విస్తరణ యొక్క విస్తారమైన ప్రపంచాన్ని చూస్తాము. ఈ శక్తివంతమైన ప్రపంచంలో మనం చిన్న వ్యక్తులుగా ఉన్నాము. మనం ఇంకా ఏమి చూడగలం? 'నేను ఇక్కడ ఉన్నాను మరియు ప్రపంచం అక్కడ ఉంది.' వ్యక్తి మరియు ప్రపంచం- ఇవే వాస్తవాలు. బహుశా, మనం రెండు వాస్తవాలను కలిగి ఉన్నామని చెప్పవచ్చు. ఇదే సత్యం అయితే, మరియు మనం సత్యాన్ని అన్వేషిస్తున్నట్లైతే, ఈ నిర్వచనం నుండి మనం ప్రపంచాన్ని అన్వేషిస్తున్నామని లేదా మనల్ని మనం అన్వేషించుకుంటున్నామని మని అర్థం చేసుకోవచ్చు.*

*సహజంగానే, అది ఇలాగే ఉండాలి. ఎందుకంటే మేము చెప్పినట్లుగా రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి: మేము అక్కడ ఉన్నాము మరియు ప్రపంచం ఇక్కడ ఉంది. మనం వాస్తవమైతే, లేదా ఈ ప్రపంచం వాస్తవమైతే, మనం మనల్నిగానీ, ప్రపంచాన్ని గానీ, లేదా రెండింటినీ వెతుకుతున్నాము. కానీ, వాస్తవానికి, మనం ఈ రెండింటినీ కనుగొనలేదు. మనం ప్రపంచాన్ని అన్వేషిస్తున్నట్లు అనిపించినా, ప్రపంచం మన ఆధీనంలో లేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 45 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 14. The World and Ourselves, There is Nothing Else 🌻*

*There are only two things that we see in this world: the world and ourselves. There is nothing else. If we look around, we see the vast world of astronomical phenomena and geographical extension, and we are there as small individuals in this mighty world. What else can we see? “I am here, and the world is there.” The individual and the world are the realities. Perhaps we may say, in a general manner, that we conceive two realities. If this is our concept of what is real, and we are certainly in search of what is real, it would follow from this answer or definition that we are in search of the world, or we are in search of ourselves.*

*Naturally, this should be so, because there are only two things, as we said: We are there, and the world is there. If we are there as a reality, or the world is there as a reality, we are in search of either of these, or both of them. But, actually, we have not found either of these. Though we seem to be in search of the world, the world is not under our possession.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 310 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. విలువైన దాన్ని అందుకోవడమన్నది ఉన్నత లక్ష్యం. కొంతమందే నిలుపుకుంటారు. కొంత మంది ఖాళీ చేతుల్తో వస్తారు. ఖాళీ చేతుల్తో వెళతారు. అందుకు సిగ్గుపడాలి. 🍀*

*చాలా వీలవుతుంది. ఐతే దాన్ని సాధ్యం చేయాలి. దానికి చైతన్యంతో పని చేయాలి. అదెలాంటిదంటే నీ దగ్గర కావలసినంత భూమి వుంది. కావలసినంత నీరు, కావలసినన్ని గింజలు వున్నాయి. కానీ నువ్వు పొలంలో విత్తనాలు వెయ్యలేదు. పూలు పూయవు, భూమి ఎడారిగానే వుంటుంది. గడ్డి పెరుగుతుంది. చెట్లు పెరుగుతాయి. పనికిమాలినవి అడ్డదిడ్డంగా పెరుగుతాయి. విలువైన దాన్ని అందుకోవడమన్నది ఉన్నత లక్ష్యం.*

*నువ్వేమీ చెయ్యకపోతే అడ్డదిడ్డంగా చెట్లు పెరుగుతాయి. అక్కడ గులాబీ పూలకోసం వెతికి లాభం లేదు. అందరూ గొప్ప హామీలతో వస్తారు. కొంతమందే నిలుపుకుంటారు. కొంత మంది ఖాళీ చేతుల్తో వస్తారు. ఖాళీ చేతుల్తో వెళతారు. అందుకు సిగ్గుపడాలి. కానీ నా సన్యాసులు పూర్తిగా సంతృప్తిగా వుంటారు. వాళ్ళు హామీలు నెరవేరుస్తారు. నిలుపుకుంటారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 047 / Siva Sutras - 047 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 15. హృదయే చిత్తసంఘటాత్‌ దృశ్య స్వప దర్శనం - 3 🌻*
*🌴. మనస్సును దాని కేంద్రములో ఉంచడం ద్వారా అవగాహన చేసుకొను శూన్యతను గ్రహించవచ్చు.🌴*

*యోగి విషయానికొస్తే, అతను మెలకువగా ఉన్నప్పుడు కూడా ఈ దశలను చేరుకోగలడు. అతను మెలకువగా ఉన్నప్పుడు కూడా తన మనస్సును వస్తుమయ ప్రపంచం నుండి వేరు చేయగలడు. దానిని చైతన్యంతో ఏకం చేయగలడు. అతను ఇప్పుడు విశ్వజనీనత మరియు ఏకత్వం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకున్నాడు. అతను ఇంద్రియాల ప్రభావాన్ని విస్మరించగలడు.*

*ఇక్కడ ప్రస్తావించబడిన శూన్యత ఆత్మ యొక్క స్థానం అయిన హృదయంలో ఉంది. ఒక వ్యక్తి తన మనస్సు మరియు ఆత్మ మధ్య సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, అతని చైతన్యం విశ్వవ్యాప్త చైతన్యంగా మారుతుంది. ఒక వ్యక్తి లోపల చూడటం ద్వారా దీన్ని చేయగలిగినప్పుడు (లోపలికి చూడటం అనేది అతని ఆత్మ మరియు అతని మనస్సును అనుసంధానించే ప్రక్రియ. రెండూ అతని అంతరంగంలో అందుబాటులో ఉంటాయి), అతను లోపలికి చూడడమే కాదు, మొత్తం విశ్వాన్ని తనదిగా చూస్తాడు. అతని చైతన్యం ఇప్పుడు శివ చైతన్యానికి వాహనం అవుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 047 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 3 🌻*
*🌴. By fixing the mind on its core one can comprehend perceivable emptiness.🌴*

*In the case of a yogi, he is able to reach these stages even when he is awake. He is able to disconnect his mind from the objective world even while he is awake and unites it with the essence of consciousness. He now understands the spirit of Universality and Oneness. He is able to discard the influence of senses.*

*The void that is referred here is within the heart, the seat of soul. When one establishes a connection between his mind and soul, his consciousness transforms into universal consciousness. When one is able to do this by looking within (looking within is the process of connecting his soul and his mind, both of them are available within his inner self), he not only looks within, but also looking at the entire universe as his own. His consciousness now becomes the vehicle of Shiva consciousness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 436 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 436 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀

🌻 436. 'కురుకుళ్ళ' - 1 🌻


చిత్తము, అహంకారముల యందు వసించియుండు శ్రీమాత అని అర్ధము. జీవుడు చతుర్వ్యూహములలో వసించుచుండును. అవి వరుసగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములుగ చెప్పవచ్చును. లేక 1) జీవుని యందలి దైవము (ఈశ్వరుడు) 2) జీవుడు (దైవ మందలి జీవుడు) 3) బుద్ధి (విచక్షణ జ్ఞానము) 4) చిత్తము (స్వభావముతో కూడియున్న జీవుడు) ఇందు మొదటి వ్యూహమును నారాయణు డనియు, రెండవ వ్యూహమును నరుడనియూ కూడ పిలుతురు. జీవుడు ఈశ్వరునితో కూడియున్నప్పుడు బుద్ధి ప్రకాశించి ధర్మాధర్మ విచక్షణతో జీవించును. అట్లు కూడియుండ నపుడు అహంకారియై వర్తించును. అహంకారియై నిలచినపుడు విచక్షణను కోల్పోవును. అపుడతని స్వభావము ప్రకోపించి ఇచ్చ వచ్చి నట్లు ప్రవర్తించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻


🌻 436. 'Kurukulla' - 1 🌻

It means Srimata resides in the mind and egos. Jiva resides in the four boundaries. They are Vasudeva, Sankarsan, Pradyumna and Aniruddha strategies respectively. Or 1) The Divine in Spirit (Isvara) 2) Jiva (The Spirit in Divine) 3) Buddhi (Discernment Knowledge) 4) Chitta (The Spirit in Its nature) Here the first boundary is called Narayana and the second boundary is also called Nara. When the soul is united with God, the intellect shines and lives with discerning capacity between Dharma and Adharma. If not, then it lives with arrogance. When you are arrogant, you lose your discretion. The temper gets angry and behaves without discretion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Osho Daily Meditations - 314. UNSTRUCK MUSIC / ఓషో రోజువారీ ధ్యానాలు - 314. నిరంతర సంగీతం


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 314 / Osho Daily Meditations - 314 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 314. నిరంతర సంగీతం 🍀

🕉. సంస్కృతంలో నాడ అనే పదానికి 'సంగీతం' అని అర్ధం, కానీ స్పానిష్ భాషలో దీని అర్థం 'ఏమీ లేదు.' అది కూడా ఒక అందమైన అర్థం, ఎందుకంటే నేను మాట్లాడుతున్న సంగీతం శూన్యం సంగీతం, ఇది నిశ్శబ్ద సంగీతం. ఆధ్యాత్మికవేత్తలు దీనిని నిరంతర సంగీతం అంటారు. 🕉


సృష్టించబడని ఒక సంగీతం ఉంది, అది మన ఉనికిలో అంతర్వాహినిగా ఉంది; ఇది అంతర్గత సామరస్యం యొక్క సంగీతం. బాహ్య గోళంలో కూడా సంగీతం ఉంది - నక్షత్రాలు, గ్రహాల సామరస్యతగా. ఉనికి మొత్తం సంగీతం లాంటిది. మనుషులు తప్ప, ఏదీ శృతి మించదు. ప్రతిదీ అద్భుతమైన సామరస్యంతో ఉంది. అందుకే చెట్లకు, జంతువులకు, పక్షులకు చాలా దయ ఉంది. మానవత్వం మాత్రమే వికృతంగా మారింది. కారణం ఏమిటంటే, మనల్ని మనం మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాము. మనం ఏదో కావాలని ప్రయత్నించాము. మారాలనే కోరిక ఏర్పడిన క్షణం, ఒకరు వికారమవుతారు, ఒకరు శ్రుతి మించిపోతారు. ఇది మనసిక వికారం.

ఎందుకంటే ఉనికికి మాత్రమే తెలుసు; మానవులు ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఆ అసంతృప్తి వికారాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఫిర్యాదులతో నిండి ఉన్నారు, కేవలం ఫిర్యాదులు తప్ప మరేమీ లేవు. ప్రజలకు ఇది కావాలి, అది కావాలి. కానీ అవి ఎప్పటికీ నెరవేరవు; వారు పొందినప్పటికీ, వారు మరింత కోరుకుంటారు. 'ఎక్కువ' ఎప్పుడూ కొనసాగుతుంది. మనస్సు మరింత ఎక్కువగా అడుగుతుంది. అది మనిషికి వచ్చే రోగం. ఒక వ్యక్తి పడిపోతున్న క్షణం, అకస్మాత్తుగా ఒక సంగీతం వినబడుతుంది. ఆ సంగీతం ఉప్పొంగడం ప్రారంభించినప్పుడు, మీ అంతటా ప్రవహించడం ప్రారంభించి, ఆపై మిమ్మల్ని దాటి ఇతర వ్యక్తులకు చేరి, అది అందరితో భాగస్వామ్యం అవుతుంది. అది బుద్ధుల దయ. ఈ అంతర్గత సంగీతం సామరస్యంతో నిండి ఉంది. సామరస్యం పొంగిపొర్లుతూనే ఉంటుంది; అది ఇతర వ్యక్తులకు కూడా చేరుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 314 🌹

📚. Prasad Bharadwaj

🍀 314. UNSTRUCK MUSIC 🍀

🕉. In Sanskrit the word nada means "music," but in Spanish it means "nothing." That too is a beautiful meaning, because the music I am talking about is the music of nothingness, it is the music of silence. The mystics have called it unstruck music. 🕉


There is a music that is uncreated, that is just there as an undercurrent in our being; it is the music of inner harmony. There is also a music in the outer sphere--the harmony of the stars, the planets; the whole of existence is like an orchestra. Except for human beings, nothing is out of tune; everything is in tremendous harmony. That's why trees have so much grace, and the animals and the birds. Only humanity has become ugly, and the reason is that we have tried to improve on ourselves; we have tried to become something. The moment the desire to become arises, one becomes ugly, one falls out of tune, because existence knows only being; becoming is a fever in the mind.

Human beings are never contented. That discontent creates ugliness, because people are full of complaints, only complaints and nothing else. People want this, they want that, and they are never fulfilled; even if they get, they want more. The "more" persists- the mind goes on asking for more and more. Becoming is the disease of man. The moment one drops becoming, suddenly a music is heard. And when that music starts overpouring, starts flowing all over you and then beyond you to other people, it becomes a sharing. That is the grace of the Buddhas. They are full of inner music, harmony, and the harmony goes on overflowing; it reaches other people also.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 693 / Sri Siva Maha Purana - 693

🌹 . శ్రీ శివ మహా పురాణము - 693 / Sri Siva Maha Purana - 693 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴

🌻. శివ స్తుతి - 6 🌻


ఋతువులన్నింటిలో వసంత ఋతువు నీవే పర్వదినము లన్నింటిలో సంక్రమణము నీవే. గడ్డి జాతులన్నింటిలో దర్భ నీవే. పెద్ద వృక్షములలో మర్రి నీవే (47). యోగములలో వ్యతీపాత యోగము నీవే. లతలలో సోమలతవు నీవే. బుద్ధులలో ధర్మబుద్ధివి నీవే. మిత్రులలో భార్యవు నీవే (48). ఓ మహేశ్వరా! సత్పురుషులగు సాధకులలోని ప్రాణాయామము నీవే. జ్యోతిర్లింగము లన్నింటిలో నీవు విశ్వేశ్వరుడవని ఋషులు చెప్పెదరు (49). బంధువులందరిలో ధర్మమనే బంధువు నీవే. ఆశ్రములలో సన్న్యాసాశ్రమము నీవే. పురుషార్థములన్నింటిలో మోక్షము నీవే. రుద్రులలో నీలకంఠుడు, రక్తవర్ణుడు అగు రుద్రుడు నీవే (50).

ఆదిత్యులలో విష్ణువు నీవే. వానరులలో హనుమంతుడవు నీవే. యజ్ఞములలో జపయజ్ఞము నీవే. శస్త్రధారులలో శ్రీరాముడవు నీవే (51). గంధర్వులలో చిత్రరథుడు నీవే. వసువులలో నిశ్చయముగా అగ్నిని నీవే. మాసములలో అధికమాసము నీవే. వ్రతములలో చతుర్దశీ వ్రతము నీవే (52). గొప్ప ఏనుగులలో ఐరావతము నీవే. సిద్ధులలో కపిలుడవు నీవేనని పెద్దలు చెప్పెదరు. సర్పములలో శేషుడవు నీవే. పితృదేవతలలో ఆర్యముడవు నీవే (53). గణకులలో కాలము నీవే. దైత్యులలో బలినీవే. ఇన్ని మాటలేల? ఓ దేవదేవా! నీవే ఒకే అంశముతో జగత్తునంతనూ వ్యాపించి యున్నావు. వస్తువునకు బయట నీవు ఉన్నావు. వస్తువునందు సారరూపుడవై నీవే ఉన్నావు (54, 55).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 693🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴

🌻 The Prayer of the gods - 6 🌻


47. Among the seasons you are the spring; among holy occasions you are the Saṃkrama; among grasses you are the Kuśa grass; among gross trees you are the Banyan tree.

48. Among the Yogas you are the Vyatīpāta; among creepers you are the Soma creeper; among intellectual activities you are the virtuous inclination, among intimate ones you are the wife.

49. Among the pure activities of the aspirant, O great lord, you are Prāṇāyāma; among all Jyotirliṅgas you are Viśveśvara.

50. Among all kindred beings you are Dharma. In all stages of life you are Sannyāsa. You are the supreme Liberation in all Vargas. Among Rudras you are Nīlalohita.

51. Among all Ādityas you are Vāsudeva; among the monkeys you are Hanumat; among the sacrifices you are Japayajña; among the weapon-bearers you are Rāma:

52. Among the Gandharvas you are Citraratha; among the Vasus you are certainly the fire; among the months you are the intercalary month; among the holy rites you are the Caturdaśī rite.

53. Among all lordly elephants you are Airāvata3; among all Siddhas you are Kapila; among all serpents you are Ananta, among all Pitṛs you are Aryaman.

54-55. You are Kāla (Time) among those who calculate; among Asuras you are Bali. O lord of gods, of what avail is a detailed narration? You preside over the entire universe and remain partially stationed within and partially without.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 732 / Vishnu Sahasranama Contemplation - 732


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 732 / Vishnu Sahasranama Contemplation - 732🌹

🌻732. పదమనుత్తమమ్, पदमनुत्तमम्, Padamanuttamam🌻

ఓం పదమనుత్తమాయ నమః | ॐ पदमनुत्तमाय नमः | OM Padamanuttamāya namaḥ


పద్యతే గమ్యతే బ్రహ్మ ముముక్షుభిరితీర్యతే ।
పదమిత్యుత్తమం నాస్తి బ్రహ్మణస్తదనుత్తమమ్ ।
పదమనుత్తమమితి నామైకం సంవిశేషణమ్ ॥

మోక్షమును కోరువారిచే చేరబడును కావున 'పదమ్‍' అనబడును. దేనికంటె మరి గొప్పది లేదో అట్టిది 'అనుత్తమమ్‍'. అన్నిటికంటెను గొప్పదియు, ముముక్షువులకు చేరునదియు అగు స్తానమో అది పదమనుత్తమమ్‍; అది పరమాత్మ తత్త్వమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 732🌹

🌻732. Padamanuttamam🌻

OM Padamanuttamāya namaḥ

पद्यते गम्यते ब्रह्म मुमुक्षुभिरितीर्यते ।
पदमित्युत्तमं नास्ति ब्रह्मणस्तदनुत्तमम् ।
पदमनुत्तममिति नामैकं संविशेषणम् ॥

Padyate gamyate brahma mumukṣubhiritīryate,
Padamityuttamaṃ nāsti brahmaṇastadanuttamam,
Padamanuttamamiti nāmaikaṃ saṃviśeṣaṇam.

Padam means the state that is attained by those who desire salvation. That beyond which there is not a superior is anuttamam. Padamanuttamam is one Name wherein the second word is adjective - The Supreme Abode.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 140 / Kapila Gita - 140


🌹. కపిల గీత - 140 / Kapila Gita - 140 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 24 🌴


24. భుక్తభోగా పరిత్యక్తా దృష్టదోషా చ నిత్యశః|
నేశ్యరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ॥

తాత్పర్యము : విషయభోగములను అనుదినము అనుభవించిన పురుషుడు ఆ భోగములయందలి దోషములను దర్శించి, ఆ భోగములయెడల విరక్తుడై, వాటిని విడచిపెట్టును. అట్టి పరిస్థితిలో అతడు స్వస్వరూపమునందు నిలిచి స్వాధీనుడగును. అనగా - బంధవిముక్తుడగును. అట్టి పురుషునికి ప్రకృతి ఏవిధమైన అశుభమును కలిగింపజాలదు.

వ్యాఖ్య : జీవుడు వాస్తవానికి భౌతిక వనరులను ఆస్వాదించేవాడు కానందున, భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే అతని ప్రయత్నం అంతిమంగా విసుగు చెందుతుంది. నిరాశ ఫలితంగా, అతను సాధారణ జీవి కంటే ఎక్కువ శక్తిని కోరుకుంటాడు మరియు తద్వారా ఆనందించే సర్వోన్నత వ్యక్తి యొక్క ఉనికిలో కలిసిపోవాలని కోరుకుంటాడు. ఈ విధంగా అతను ఎక్కువ ఆనందం కోసం ఒక ప్రణాళికను అభివృద్ధి చేస్తాడు.

ఎప్పుడైతే ఒకడు నిజానికి భక్తి సేవలో స్థితుడై ఉంటాడో, అది అతని స్వతంత్ర స్థానం. తక్కువ బుద్ధిమంతులు భగవంతుని శాశ్వత సేవకుని స్థానాన్ని అర్థం చేసుకోలేరు. 'సేవకుడు' అనే పదం వాడినందున, వారు గందరగోళానికి గురవుతారు; ఈ దాస్యం ఈ భౌతిక ప్రపంచం యొక్క దాస్యం కాదని వారు అర్థం చేసుకోలేరు. భగవంతుని సేవకునిగా ఉండటమే గొప్ప స్థానం. ఎవరైనా దీనిని అర్థం చేసుకోగలిగితే మరియు భగవంతుని యొక్క శాశ్వతమైన సేవకుని యొక్క అసలు స్వభావాన్ని పునరుద్ధరించగలిగితే, ఒకరు పూర్తిగా స్వతంత్రంగా నిలబడతారు. భౌతిక సంపర్కం ద్వారా జీవి యొక్క స్వాతంత్ర్యం పోతుంది. ఆధ్యాత్మిక రంగంలో అతనికి పూర్తి స్వాతంత్ర్యం ఉంది, అందువల్ల భౌతిక స్వభావం యొక్క మూడు రీతులపై ఆధారపడే ప్రశ్నే లేదు. ఈ స్థితిని భక్తుడు పొందుతాడు, అందువల్ల అతను దాని దోషాన్ని చూసిన తర్వాత భౌతిక ఆనందానికి సంబంధించిన ధోరణిని వదులుకుంటాడు.

భక్తునికి మరియు అవ్యక్తుడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, వ్యక్తిత్వం లేనివాడు పరమాత్మతో ఐక్యం కావడానికి ప్రయత్నిస్తాడు, తద్వారా అతను ఆటంకాలు లేకుండా ఆనందిస్తాడు, అయితే ఒక భక్తుడు ఆనందించే మనస్తత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి, భగవంతుని అతీతమైన ప్రేమపూర్వక సేవలో నిమగ్నమై ఉంటాడు. ఆ సమయంలో అతను ఈశ్వరుడు, పూర్తిగా స్వతంత్రుడు. భగవంతుని ప్రేమతో చేసే సేవ నుండి పొందిన అతీంద్రియ ఆనందం నిజమైన స్వాతంత్ర్యం.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 140 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 24 🌴


24. bhukta-bhogā parityaktā dṛṣṭa-doṣā ca nityaśaḥ
neśvarasyāśubhaṁ dhatte sve mahimni sthitasya ca

MEANING : By discovering the faultiness of his desiring to lord it over material nature and by therefore giving it up, the living entity becomes independent and stands in his own glory.

PURPORT : Because the living entity is not actually the enjoyer of the material resources, his attempt to lord it over material nature is, at the ultimate issue, frustrated. As a result of frustration, he desires more power than the ordinary living entity and thus wants to merge into the existence of the supreme enjoyer. In this way he develops a plan for greater enjoyment.

When one is actually situated in devotional service, that is his independent position. Less intelligent men cannot understand the position of the eternal servant of the Lord. Because the word "servant" is used, they become confused; they cannot understand that this servitude is not the servitude of this material world. To be the servant of the Lord is the greatest position. If one can understand this and can thus revive one's original nature of eternal servitorship of the Lord, one stands fully independent. A living entity's independence is lost by material contact. In the spiritual field he has full independence, and therefore there is no question of becoming dependent upon the three modes of material nature. This position is attained by a devotee, and therefore he gives up the tendency for material enjoyment after seeing its faultiness. The living entity is īśvara only when engaged in the service of the Lord. In other words, transcendental pleasure derived from loving service to the Lord is actual independence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 27, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, రోహిణి వ్రతం, Masik Durgashtami, Rohini Vrat🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 22 🍀


41. వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః |
సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః

42. భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్ఠిభాగో గవాంపతిః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భౌతిక వస్తువులలోని చైతన్యం ప్రాణివర్గాలలో మనమెరిగిన చైతన్యం వంటిది కానిమాట నిజమే. కాని స్థూలదృష్టికి కానరాకుండా దాగివున్న ఆ చైతన్యం ఆయథార్థ మవడానికి వీలులేదు. కనుకనే, భౌతిక వస్తువుల యెడ మనం పూజ్యభావం అలవరచుకొని, వాటిని దుర్వినియోగం చెయ్యకుండా కడు సంయమంతో వాడుకొనడం అవసరం. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: శుక్ల-అష్టమి 26:23:16 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: రోహిణి 31:20:03 వరకు

తదుపరి మృగశిర

యోగం: వైధృతి 16:12:34 వరకు

తదుపరి వషకుంభ

కరణం: విష్టి 13:39:06 వరకు

వర్జ్యం: 22:39:40 - 24:23:44

దుర్ముహూర్తం: 12:52:26 - 13:39:30

మరియు 15:13:36 - 16:00:40

రాహు కాలం: 08:04:13 - 09:32:27

గుళిక కాలం: 13:57:08 - 15:25:22

యమ గండం: 11:00:41 - 12:28:54

అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51

అమృత కాలం: 27:51:52 - 29:35:56

సూర్యోదయం: 06:35:59

సూర్యాస్తమయం: 18:21:50

చంద్రోదయం: 11:37:31

చంద్రాస్తమయం: 00:16:00

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ

ఫలం 31:20:03 వరకు తదుపరి

ఆనంద యోగం - కార్య సిధ్ధి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹