శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 202 / Sri Lalitha Chaitanya Vijnanam - 202

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 202 / Sri Lalitha Chaitanya Vijnanam - 202 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖

🌻 202. 'సర్వేశ్వరీ' 🌻

సకలమునకు ఈశ్వరి శ్రీదేవి అని అర్థము.

సృష్టి యందు సర్వమూ శ్రీదేవి అధీనముననే యున్నది. సృష్టి చైతన్యము శ్రీదేవియే. అన్ని జీవరాశులయందు ఆమె చైతన్యమే విరాజిల్లుతూ నున్నది. త్రిగుణములుగాని పంచభూతములు గాని తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలవు.

అట్లే జీవులు కూడ తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలరు. జీవులయందు ఇచ్చగాని, జ్ఞానముకాని, క్రియాశక్తిగాని పనిచేయుటకు వారి యందున్న చైతన్యమే ఆధారము. చేతన లేనప్పుడు జీవునికి తనకు తా నున్నాడని కూడ తెలియదు. అందరి యందు, అన్నిటి యందు తానుండి, ఆయా ధర్మములను నిర్వర్తించు శక్తిగా శ్రీదేవియే యున్నది.

ఇది ఆమె ఈశ్వరత్వము. ఉప్పు ఉప్పగా నుండుట, వేప చేదుగ నుండుట, నిమ్మ పులుపుగ నుండుట, తేనె తీపిగ నుండుట యందు కూడ శ్రీదేవి అస్థిత్వము దర్శింప వచ్చును. ఇట్లందరి జీవుల సమస్త చేష్టలకు ఆధారముగా నున్నది శ్రీదేవి. సృష్టి యందు సమస్తమునకు ఆమె ఈశ్వరి. ఆమెకు ఈశ్వరుడాయన. ఆయన (ఈశ్వరుడు) కూడ కనుపింపవలె నన్నచో ఆమెయే ఆధారము. ఆమె లేని ఆయన జగత్తునకు లేడు. ఆయన లేక ఆమె ఏమియూ చేయలేదు. నిజమునకు ఆమె ఆయన ఒకటియే.

కనిపించునపు డామె యగును, సంకల్పించినపుడు ఆయన యగును. ఏమీ సంకల్పించని స్థితిలో కేవలము తానుగ నుండును, ఆ తాను ఆమె కాదు, ఆయన కాదు. రెండునూ ఏకము చెందిన స్థితి. ఆ ఏకత్వము నుండి తాను అస్థిత్వము (ఆయన)గను, చేతన (ఆమె)గను ఏర్పడుదురు. ఇవి రెండును అవిభాజకములు.

అందు వలననే సర్వేశ్వరి, సర్వేశ్వరుడని సంబోధింతురు. సత్, చిలు లేనిచో ఏమియూ లేదు. కావున వారిదే ఈశ్వరత్వము. ఈశ్వరత్వ మనగా అన్నిటి యందునూ అస్థిత్వముగను, చైతన్యముగను వశించి స్వామిత్వమును నెరపుట.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 202 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Sarveśvarī सर्वेश्वरी (202) 🌻

She is the supreme ruler of the universe and leads the beings to the Brahman as discussed in the previous nāma. Ruler is the one who is concerned about his citizens. She has no superior or equal as discussed in nāma 198. Hence She is the Supreme ruler.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021

స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి

🌹. స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

తప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే. 

ఒక తప్పు మీ లోతుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దానిని మరొక దానితో సమతౌల్యం చెయ్యాలి. అప్పుడే మనిషి నిర్భయుడవుతాడు. కనుక ఏ విషయంలోనైనా మీరు నెలరోజుల పాటు ఒక యోధుడుగా ఉండండి. అపుడు మీరు నిజంగా చాలా చక్కని అనుభూతిని పొందుతారు.

తప్పించుకుని పారిపోయేవారిని ఎవరైనా నీచంగా భావిస్తారు. ఎందుకంటే అది పిరికిపందలు చేసే పని. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకోండి. అప్పుడే పోరాడడం, పారిపోవడాలను వదిలించు కోగలుగుతారు. 

ఎందుకంటే, ధైర్యంగా ఉండడమనేది కూడా మీలోని పిరికితనానికి చిహ్నమే. కాబట్టి ధైర్యం, పిరికి తనాలు మాయమైన వెంటనే ఎవరైనా నిర్భయులవుతారు. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడండి.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021

వివేక చూడామణి - 15 / VIVEKA CHUDAMANI - 15

🌹. వివేక చూడామణి - 15 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. బ్రహ్మ జ్ఞానము - 3 🍀

66. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్దతుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమరల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.

67. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న (49వ శ్లోకము) చాలా గొప్పది. శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న రహస్యమయమైన జ్ఞాన సౌందర్యాన్ని వెలికి తీసేదిగా ఉన్నది. తద్వారా జ్ఞానార్ధులు విముక్తి మార్గమును తెలుసుకొనగలరు.

68. ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పుచున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 15 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj

🌻 Brahma Jnana - 3 🌻

66. Therefore the wise should, as in the case of disease and the like, personally strive by all the means in their power to be free from the bondage of repeated births and deaths.

67. The question that thou hast asked today is excellent, approved by those versed in the Scriptures, aphoristic, pregnant with meaning and fit to be known by the seekers after Liberation.

68. Listen attentively, O learned one, to what I am going to say. By listening to it thou shalt be instantly free from the bondage of Samsara.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021

దేవాపి మహర్షి బోధనలు - 25

🌹. దేవాపి మహర్షి బోధనలు - 25 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌻 16. వృషభము  - వాక్కు🌻

ప్రతి అణువు పరిణామములో ఒక సూర్యమండలము కాగలదు. ప్రతి జీవుడును అటులనే పరిణామ క్రమమున అనగా పరమపదము చేరుకొను మార్గమున ఒక బ్రహ్మాండ శరీరమును ధరించగలడు. నిజమునకు విశ్వమంతయు ఏకాక్షరము నుండి ఉద్భవించినదియే కదా! పరమపదము నుండి ఉద్భవించిన వాక్కు ఈ సమస్త విశ్వ నిర్మాణమునకు ఆధారమై నిలచియున్నది. దీనినే దివ్యసం ని కూడ నిర్వచింతురు. 

దీని పంచాంగములే పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు మరియు కర్మేంద్రియములు.  పై తెలుపబడిన నాలుగు పంచకములను వాక్కుయే అధిష్ఠించి యుండును. దీనినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని తెలుపుదరు. పంచాంగముగ నేర్పడిన సృష్టికి అధిష్టాన దేవత సరస్వతి లేక వాక్కుయే. ప్రవహించునది కావున సరస్వతి యనిరి. వాక్కును వృషభముగ కూడ పేర్కొనిరి. 

మనయందు ఈ వృషభము కంఠధ్వని రూపమున వ్యక్తమగుచున్నది. కంఠధ్వనిని సమర్థవంతముగ, శ్రావ్యముగ, పవిత్రముగ నిర్వర్తించుకొనువారు తమ జీవనమును పునర్ నిర్మాణమును చేసుకొనగలరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 274, 275 / Vishnu Sahasranama Contemplation - 274, 275

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 274 / Vishnu Sahasranama Contemplation - 274 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 274. ప్రకాశనః, प्रकाशनः, Prakāśanaḥ🌻

ఓం ప్రకాశనాయ నమః | ॐ प्रकाशनाय नमः | OM Prakāśanāya namaḥ

సర్వప్రకాశనశీలమస్యాస్తీతి ప్రకాశనః అన్నిటిని తన ప్రకాశముచే ప్రకాశింపజేయుట ఈతని శీలము లేదా అలవాటు లేదా స్వభావము గనుక ఈతడు ప్రకాశనః.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 274🌹
📚. Prasad Bharadwaj

🌻274. Prakāśanaḥ🌻

OM Prakāśanāya namaḥ

Sarvaprakāśanaśīlamasyāstīti prakāśanaḥ / सर्वप्रकाशनशीलमस्यास्तीति प्रकाशनः One whose nature it is to illumine all and hence He is Prakāśanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 275 / Vishnu Sahasranama Contemplation - 275 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 275. ఓజస్తేజోద్యుతిధరః, ओजस्तेजोद्युतिधरः, Ojastejodyutidharaḥ🌻

ఓం ఓజస్తేజోద్యుతిధరాయ నమః | ॐ ओजस्तेजोद्युतिधराय नमः | OM Ojastejodyutidharāya namaḥ

ఓజస్తేజోద్యుతిధరః, ओजस्तेजोद्युतिधरः, Ojastejodyutidharaḥ

ఓజస్తేజో ద్యుతిధర ఇతి దేవస్స ఉచ్యతే ।
అథవౌజస్తేజోద్యుతి నామద్వయ మిహేష్యతే ॥

ఓజః అనగా ప్రాణబలము. తేజః అనగా శౌర్యాది గుణములు. ద్యుతి అనగా దీప్తి లేదా ప్రకాశము. ఓజస్సునూ, తేజస్సునూ, ద్యుతినీ అనగా ప్రాణబలమూ, శౌర్యమూ మరియూ ప్రకాశములను ధరించువాడు.

లేదా ఓజః, తేజః, ద్యుతిధరః అనునవి మూడు వేరు వేరు నామములు. అపుడు ఓజః అనగా ప్రాణబలము, తేజః అనగా శౌర్యాదికము మరియూ ద్యుతిధరః అనగా ద్యుతిని లేదా జ్ఞానరూపమగు ప్రకాశమును ధరించును.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ॥ 10 ॥
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥

నన్ను ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగా నెరుంగుము. మఱియు, బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరులయొక్క ధైర్యమునూ నేనే అయియున్నాను. భరతకులశ్రేష్టుడవగు ఓ అర్జునా! నేను బలవంతులయొక్క ఆశ, అనురాగము లేని బలమునూ, ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కోరికయు అయియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 275🌹
📚. Prasad Bharadwaj

🌻275.Ojastejodyutidharaḥ🌻

OM Ojastejodyutidharāya namaḥ

Ojastejo dyutidhara iti devassa ucyate,
Athavaujastejodyuti nāmadvaya miheṣyate.

ओजस्तेजो द्युतिधर इति देवस्स उच्यते ।
अथवौजस्तेजोद्युति नामद्वय मिहेष्यते ॥

Ojaḥ / ओजः means prānabala or the vital energy or inherent vitality. Tejaḥ / तेजः indicates qualities like valor, puissance etc. Dyuti / द्युति is brightness or radiance. So the divine name means One who is possessed of these three qualities.

Or, this can be considered as made up of three divine names. Ojaḥ / ओजः meaning prānabala, Tejaḥ / तेजः meaning qualities like valor and Dyutidharaḥ / द्युतिधरः meaning the One emanating Dyuti or radiating knowledge.

Śrīmad Bhagavad Gīta - Chapter 7
Bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanam,
Buddhirbuddhimatāmasmi tejastejasvināmaham. (10)
Balaṃ balavatāṃ cāhaṃ kāmarāgavivarjitam,
Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. (11)

श्रीमद्भगवद्गीत - विज्ञान योग
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ १० ॥
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥

O Pārtha, know Me to be the eternal Seed of all beings. I am the intellect of the intelligent, I am courage of the courageous. And of the strong I am the strength which is devoid of passion and attachment. Among creatures, I am desire which is not contrary to righteousness, O scion of Bharata dynasty.

🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।
बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।
Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021

7-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 632 / Bhagavad-Gita - 632🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 274, 275 / Vishnu Sahasranama Contemplation - 274, 275🌹
3) 🌹 Daily Wisdom - 51🌹
4) 🌹. వివేక చూడామణి - 15🌹
5) 🌹Viveka Chudamani - 15🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 25🌹
7)  🌹. స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 202 / Sri Lalita Chaitanya Vijnanam - 202 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 632 / Bhagavad-Gita - 632 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 49 🌴*

49. ఆసక్తబుద్ధి: సర్వత్ర జితాత్మా విగతస్పృహ: |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||

🌷. తాత్పర్యం : 
ఆత్మనిగ్రహము కలవాడును, అనాసక్తుడును, భౌతికసుఖములను త్యజించువాడును అగు మనుజుడు సన్న్యాసము ద్వారా కర్మఫల విముక్తి యనెడి అత్యున్నత పూర్ణత్వస్థాయిని బడయగలడు.

🌷. భాష్యము :
తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశననియు, తత్కారణముగా తన కర్మఫలముల ననుభవించు అధికారము తనకు లేదనియు ప్రతియొక్కరు తలచవలెను. నిజమైన సన్న్యాసము యొక్క భావమిదియే. 

వాస్తవమునకు అతడు శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నందున అతని కర్మల ఫలములన్నియును శ్రీకృష్ణుని చేతనే అనుభవనీయములై యున్నవి. ఇదియే నిజమైన కృష్ణభక్తిరసభావనము. అనగా కృష్ణభక్తిభావన యందు వర్తించువాడు నిజముగా సన్న్యాసియే. అతడు సన్న్యాసాశ్రమమునందున్నట్టివాడే. 

అటువంటి భావనలో వర్తించువాడు కృష్ణుని ప్రీత్యర్థమై వర్తించుచున్నందున సదా సంతృప్తుడై యుండగలడు. భౌతికవిషయముల యెడ అనురక్తుడు గాక అట్టివాడు భగవానుని దివ్యసేవానందమునకు అన్యమైన ఆనందమును పొందుట యందు అలవాటు లేకుండును. వాస్తవమునకు సన్న్యాసియైనవాడు పూర్వకర్మఫలముల నుండి ముక్తుడై యుండవలెను. కాని కృష్ణభక్తిభావనాయుతుడైన మనుజుడు నామమాత్ర సన్న్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పూర్ణత్వమును బడయగలడు. 

అటువంటి మన:స్థితియే “యోగారూఢత్వము” అనబడును. అదియే యోగమునందలి పూర్ణస్థితి. తృతీయాధ్యాయమున నిర్ధారింపబడినట్లు “యస్త్వాత్మరతి రేవ స్యాత్ – ఆత్మ యందే తృప్తి నొందువానికి ఎటువంటి కర్మఫలముల భయముండదు.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 632 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 49 🌴*

49. asakta-buddhiḥ sarvatra
jitātmā vigata-spṛhaḥ
naiṣkarmya-siddhiṁ paramāṁ
sannyāsenādhigacchati

🌷 Translation : 
One who is self-controlled and unattached and who disregards all material enjoyments can obtain, by practice of renunciation, the highest perfect stage of freedom from reaction.

🌹 Purport :
Real renunciation means that one should always think himself part and parcel of the Supreme Lord and therefore think that he has no right to enjoy the results of his work. Since he is part and parcel of the Supreme Lord, the results of his work must be enjoyed by the Supreme Lord. This is actually Kṛṣṇa consciousness. The person acting in Kṛṣṇa consciousness is really a sannyāsī, one in the renounced order of life. By such a mentality, one is satisfied because he is actually acting for the Supreme. 

Thus he is not attached to anything material; he becomes accustomed to not taking pleasure in anything beyond the transcendental happiness derived from the service of the Lord. A sannyāsī is supposed to be free from the reactions of his past activities, but a person who is in Kṛṣṇa consciousness automatically attains this perfection without even accepting the so-called order of renunciation. 

This state of mind is called yogārūḍha, or the perfectional stage of yoga. As confirmed in the Third Chapter, yas tv ātma-ratir eva syāt: one who is satisfied in himself has no fear of any kind of reaction from his activity.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 274, 275 / Vishnu Sahasranama Contemplation - 274, 275 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 274. ప్రకాశనః, प्रकाशनः, Prakāśanaḥ🌻*

*ఓం ప్రకాశనాయ నమః | ॐ प्रकाशनाय नमः | OM Prakāśanāya namaḥ*

సర్వప్రకాశనశీలమస్యాస్తీతి ప్రకాశనః అన్నిటిని తన ప్రకాశముచే ప్రకాశింపజేయుట ఈతని శీలము లేదా అలవాటు లేదా స్వభావము గనుక ఈతడు ప్రకాశనః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 274🌹*
📚. Prasad Bharadwaj 

*🌻274. Prakāśanaḥ🌻*

*OM Prakāśanāya namaḥ*

Sarvaprakāśanaśīlamasyāstīti prakāśanaḥ / सर्वप्रकाशनशीलमस्यास्तीति प्रकाशनः One whose nature it is to illumine all and hence He is Prakāśanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 275 / Vishnu Sahasranama Contemplation - 275🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 275. ఓజస్తేజోద్యుతిధరః, ओजस्तेजोद्युतिधरः, Ojastejodyutidharaḥ🌻*

*ఓం ఓజస్తేజోద్యుతిధరాయ నమః | ॐ ओजस्तेजोद्युतिधराय नमः | OM Ojastejodyutidharāya namaḥ*

ఓజస్తేజోద్యుతిధరః, ओजस्तेजोद्युतिधरः, Ojastejodyutidharaḥ

ఓజస్తేజో ద్యుతిధర ఇతి దేవస్స ఉచ్యతే ।
అథవౌజస్తేజోద్యుతి నామద్వయ మిహేష్యతే ॥

ఓజః అనగా ప్రాణబలము. తేజః అనగా శౌర్యాది గుణములు. ద్యుతి అనగా దీప్తి లేదా ప్రకాశము. ఓజస్సునూ, తేజస్సునూ, ద్యుతినీ అనగా ప్రాణబలమూ, శౌర్యమూ మరియూ ప్రకాశములను ధరించువాడు.

లేదా ఓజః, తేజః, ద్యుతిధరః అనునవి మూడు వేరు వేరు నామములు. అపుడు ఓజః అనగా ప్రాణబలము, తేజః అనగా శౌర్యాదికము మరియూ ద్యుతిధరః అనగా ద్యుతిని లేదా జ్ఞానరూపమగు ప్రకాశమును ధరించును.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ॥ 10 ॥
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥

నన్ను ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగా నెరుంగుము. మఱియు, బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరులయొక్క ధైర్యమునూ నేనే అయియున్నాను. భరతకులశ్రేష్టుడవగు ఓ అర్జునా! నేను బలవంతులయొక్క ఆశ, అనురాగము లేని బలమునూ, ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కోరికయు అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 275🌹*
📚. Prasad Bharadwaj 

*🌻275.Ojastejodyutidharaḥ🌻*

*OM Ojastejodyutidharāya namaḥ*

Ojastejo dyutidhara iti devassa ucyate,
Athavaujastejodyuti nāmadvaya miheṣyate.

ओजस्तेजो द्युतिधर इति देवस्स उच्यते ।
अथवौजस्तेजोद्युति नामद्वय मिहेष्यते ॥

Ojaḥ / ओजः means prānabala or the vital energy or inherent vitality. Tejaḥ / तेजः indicates qualities like valor, puissance etc. Dyuti / द्युति is brightness or radiance. So the divine name means One who is possessed of these three qualities.

Or, this can be considered as made up of three divine names. Ojaḥ / ओजः meaning prānabala, Tejaḥ / तेजः meaning qualities like valor and Dyutidharaḥ / द्युतिधरः meaning the One emanating Dyuti or radiating knowledge.

Śrīmad Bhagavad Gīta - Chapter 7
Bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanam,
Buddhirbuddhimatāmasmi tejastejasvināmaham. (10)
Balaṃ balavatāṃ cāhaṃ kāmarāgavivarjitam,
Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. (11)

श्रीमद्भगवद्गीत - विज्ञान योग
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ १० ॥
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥

O Pārtha, know Me to be the eternal Seed of all beings. I am the intellect of the intelligent, I am courage of the courageous. And of the strong I am the strength which is devoid of passion and attachment. Among creatures, I am desire which is not contrary to righteousness, O scion of Bharata dynasty.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 51 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 20. We Cannot Know the Universe Unless We Know Ourselves 🌻*

We cannot know the universe unless we know ourselves. While this is true, the reverse also is true, at the same time. We cannot know ourselves truly, unless we know the whole universe. The one is the same as the other. Now, how does science lead us to this conclusion? The secret is the discovery of an indivisible continuum of nature, outside which no individual, nothing, can exist. 

The space-time continuum which scientists speak of today, in the relativity cosmos, is inclusive of yourself and myself and all things. We cannot stand outside it. We are an eddy in this ocean of force which is called the space-time continuum, and so, how can we know it unless we know ourselves, since we are a part of it?

 Also, it becomes more obvious on account of the fact that to know is to have an awareness of the fact; and awareness is an essentiality of our being. Our being and our consciousness of our being are the same; they are not two different things. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 15 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. బ్రహ్మ జ్ఞానము - 3 🍀*

66. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్దతుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమరల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.

67. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న (49వ శ్లోకము) చాలా గొప్పది. శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న రహస్యమయమైన జ్ఞాన సౌందర్యాన్ని వెలికి తీసేదిగా ఉన్నది. తద్వారా జ్ఞానార్ధులు విముక్తి మార్గమును తెలుసుకొనగలరు.

68. ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పుచున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 15 🌹* 
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj 

*🌻 Brahma Jnana - 3 🌻*

66. Therefore the wise should, as in the case of disease and the like, personally strive by all the means in their power to be free from the bondage of repeated births and deaths.

67. The question that thou hast asked today is excellent, approved by those versed in the Scriptures, aphoristic, pregnant with meaning and fit to be known by the seekers after Liberation.

68. Listen attentively, O learned one, to what I am going to say. By listening to it thou shalt be instantly free from the bondage of Samsara.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 25 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 16. వృషభము - వాక్కు🌻*

ప్రతి అణువు పరిణామములో ఒక సూర్యమండలము కాగలదు. ప్రతి జీవుడును అటులనే పరిణామ క్రమమున అనగా పరమపదము చేరుకొను మార్గమున ఒక బ్రహ్మాండ శరీరమును ధరించగలడు. నిజమునకు విశ్వమంతయు ఏకాక్షరము నుండి ఉద్భవించినదియే కదా! పరమపదము నుండి ఉద్భవించిన వాక్కు ఈ సమస్త విశ్వ నిర్మాణమునకు ఆధారమై నిలచియున్నది. దీనినే దివ్యసం ని కూడ నిర్వచింతురు. 

దీని పంచాంగములే పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు మరియు కర్మేంద్రియములు. పై తెలుపబడిన నాలుగు పంచకములను వాక్కుయే అధిష్ఠించి యుండును. దీనినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని తెలుపుదరు. పంచాంగముగ నేర్పడిన సృష్టికి అధిష్టాన దేవత సరస్వతి లేక వాక్కుయే. ప్రవహించునది కావున సరస్వతి యనిరి. వాక్కును వృషభముగ కూడ పేర్కొనిరి. 

మనయందు ఈ వృషభము కంఠధ్వని రూపమున వ్యక్తమగుచున్నది. కంఠధ్వనిని సమర్థవంతముగ, శ్రావ్యముగ, పవిత్రముగ నిర్వర్తించుకొనువారు తమ జీవనమును పునర్ నిర్మాణమును చేసుకొనగలరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

తప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే. 

ఒక తప్పు మీ లోతుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దానిని మరొక దానితో సమతౌల్యం చెయ్యాలి. అప్పుడే మనిషి నిర్భయుడవుతాడు. కనుక ఏ విషయంలోనైనా మీరు నెలరోజుల పాటు ఒక యోధుడుగా ఉండండి. అపుడు మీరు నిజంగా చాలా చక్కని అనుభూతిని పొందుతారు.

తప్పించుకుని పారిపోయేవారిని ఎవరైనా నీచంగా భావిస్తారు. ఎందుకంటే అది పిరికిపందలు చేసే పని. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకోండి. అప్పుడే పోరాడడం, పారిపోవడాలను వదిలించు కోగలుగుతారు. 

ఎందుకంటే, ధైర్యంగా ఉండడమనేది కూడా మీలోని పిరికితనానికి చిహ్నమే. కాబట్టి ధైర్యం, పిరికి తనాలు మాయమైన వెంటనే ఎవరైనా నిర్భయులవుతారు. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడండి.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 202 / Sri Lalitha Chaitanya Vijnanam - 202 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |*
*సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖*

*🌻 202. 'సర్వేశ్వరీ' 🌻*

సకలమునకు ఈశ్వరి శ్రీదేవి అని అర్థము.

సృష్టి యందు సర్వమూ శ్రీదేవి అధీనముననే యున్నది. సృష్టి చైతన్యము శ్రీదేవియే. అన్ని జీవరాశులయందు ఆమె చైతన్యమే విరాజిల్లుతూ నున్నది. త్రిగుణములుగాని పంచభూతములు గాని తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలవు. 

అట్లే జీవులు కూడ తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలరు. జీవులయందు ఇచ్చగాని, జ్ఞానముకాని, క్రియాశక్తిగాని పనిచేయుటకు వారి యందున్న చైతన్యమే ఆధారము. చేతన లేనప్పుడు జీవునికి తనకు తా నున్నాడని కూడ తెలియదు. అందరి యందు, అన్నిటి యందు తానుండి, ఆయా ధర్మములను నిర్వర్తించు శక్తిగా శ్రీదేవియే యున్నది. 

ఇది ఆమె ఈశ్వరత్వము. ఉప్పు ఉప్పగా నుండుట, వేప చేదుగ నుండుట, నిమ్మ పులుపుగ నుండుట, తేనె తీపిగ నుండుట యందు కూడ శ్రీదేవి అస్థిత్వము దర్శింప వచ్చును. ఇట్లందరి జీవుల సమస్త చేష్టలకు ఆధారముగా నున్నది శ్రీదేవి. సృష్టి యందు సమస్తమునకు ఆమె ఈశ్వరి. ఆమెకు ఈశ్వరుడాయన. ఆయన (ఈశ్వరుడు) కూడ కనుపింపవలె నన్నచో ఆమెయే ఆధారము. ఆమె లేని ఆయన జగత్తునకు లేడు. ఆయన లేక ఆమె ఏమియూ చేయలేదు. నిజమునకు ఆమె ఆయన ఒకటియే.

కనిపించునపు డామె యగును, సంకల్పించినపుడు ఆయన యగును. ఏమీ సంకల్పించని స్థితిలో కేవలము తానుగ నుండును, ఆ తాను ఆమె కాదు, ఆయన కాదు. రెండునూ ఏకము చెందిన స్థితి. ఆ ఏకత్వము నుండి తాను అస్థిత్వము (ఆయన)గను, చేతన (ఆమె)గను ఏర్పడుదురు. ఇవి రెండును అవిభాజకములు. 

అందు వలననే సర్వేశ్వరి, సర్వేశ్వరుడని సంబోధింతురు. సత్, చిలు లేనిచో ఏమియూ లేదు. కావున వారిదే ఈశ్వరత్వము. ఈశ్వరత్వ మనగా అన్నిటి యందునూ అస్థిత్వముగను, చైతన్యముగను వశించి స్వామిత్వమును నెరపుట. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 202 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Sarveśvarī सर्वेश्वरी (202) 🌻*

She is the supreme ruler of the universe and leads the beings to the Brahman as discussed in the previous nāma. Ruler is the one who is concerned about his citizens. She has no superior or equal as discussed in nāma 198. Hence She is the Supreme ruler. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 543 / Bhagavad-Gita - 543 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 6 🌴*

06. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశ: ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ||

🌷. తాత్పర్యం : 
ఓ పృథాకుమారా! ఈ లోకమునందు దైవాసురలనెడి రెండురకముల జీవులు కలరు. దైవీగుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపియుంటిని. ఇక ఆసురస్వభావము గలవారి గుణములను నా నుండి ఆలకింపుము.

🌷. భాష్యము :
అర్జునుడు దైవీగుణములతో జన్మించినాడని పలుకుచు అతనికి ధైర్యమును గొలిపిన శ్రీకృష్ణభగవానుడు ఇక ఆసురీగుణములను వివరింప ఉద్యుక్తుడగుచున్నాడు. జగమునందు బద్ధజీవులు రెండు తరగతులుగా విభజింపబడియుందురు. అందు దైవీగుణములతో జన్మించినవారు నియమబద్ధమైన జీవితమును గడుపుదురు. 

అనగా వారు శాస్త్రవిధులకు మరియు ప్రామాణికులైనవారి ఉపదేశములకు కట్టుబడియుందురు. వాస్తవమునకు ప్రతియొక్కరు ఈ విధముగనే ప్రామాణిక శాస్త్రాధారముగా తమ ధర్మమును నిర్వర్తించవలయును. 

ఇట్టి స్వభావమే దైవీస్వభావమనబడును. అట్లుగాక శాస్త్రనియమములను పాటింపక కేవలము తనకు తోచిన రీతిగా వర్తించువాడు దానవస్వభావము (ఆసురప్రవృత్తి) కలవాడని పిలువబడును. 

అనగా శాస్త్రమునందు తెలియజేయబడిన విధి నియమములను పాటించుట తప్ప దైవీసంపదకు వేరొక్క ప్రమాణము లేదు. 

దేవదానవులు ఇరువురును ప్రజాపతి నుండియే జన్మించిరి వేదవాజ్మయము తెలుపుచున్నది. కాని వారివురి నడుమ భేదమేమనగా ఒక తరగతివారు వేదవిధులను ఆమోదించగా, ఇంకొకరు వానిని ఆమోదించరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 543 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 06 🌴*

06. dvau bhūta-sargau loke ’smin
daiva āsura eva ca
daivo vistaraśaḥ prokta
āsuraṁ pārtha me śṛṇu

🌷 Translation : 
O son of Pṛthā, in this world there are two kinds of created beings. One is called divine and the other demoniac. I have already explained to you at length the divine qualities. Now hear from Me of the demoniac.

🌹 Purport :
Lord Kṛṣṇa, having assured Arjuna that he was born with the divine qualities, is now describing the demoniac way. The conditioned living entities are divided into two classes in this world. 

Those who are born with divine qualities follow a regulated life; that is to say they abide by the injunctions in scriptures and by the authorities. One should perform duties in the light of authoritative scripture. 

This mentality is called divine. One who does not follow the regulative principles as they are laid down in the scriptures and who acts according to his whims is called demoniac or asuric. 

There is no other criterion but obedience to the regulative principles of scriptures. It is mentioned in Vedic literature that both the demigods and the demons are born of the Prajāpati; the only difference is that one class obeys the Vedic injunctions and the other does not.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹