స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి


🌹. స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

తప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే. 

ఒక తప్పు మీ లోతుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దానిని మరొక దానితో సమతౌల్యం చెయ్యాలి. అప్పుడే మనిషి నిర్భయుడవుతాడు. కనుక ఏ విషయంలోనైనా మీరు నెలరోజుల పాటు ఒక యోధుడుగా ఉండండి. అపుడు మీరు నిజంగా చాలా చక్కని అనుభూతిని పొందుతారు.

తప్పించుకుని పారిపోయేవారిని ఎవరైనా నీచంగా భావిస్తారు. ఎందుకంటే అది పిరికిపందలు చేసే పని. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకోండి. అప్పుడే పోరాడడం, పారిపోవడాలను వదిలించు కోగలుగుతారు. 

ఎందుకంటే, ధైర్యంగా ఉండడమనేది కూడా మీలోని పిరికితనానికి చిహ్నమే. కాబట్టి ధైర్యం, పిరికి తనాలు మాయమైన వెంటనే ఎవరైనా నిర్భయులవుతారు. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడండి.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹


07 Feb 2021

No comments:

Post a Comment