సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 1


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 1 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃  బ్లావెట్‌స్కీ జీవితము 🍃


1. జీవుడు వ్యష్టి ఆత్మ. ప్రకృతి సమష్టి ఆత్మ. ఈ రెంటికి మూలం, కారణం పరమాత్మ.

2. లోకంలో ఆకర్షణీయమైనవి (ప్రేయస్సు). హితమైనవి (శ్రేయస్సు). ఈరెండు మానవుని దగ్గరకు వచ్చినప్పుడు తెలివిగల వాడు హితమైన వాటిని ఎన్నుకుంటాడు. మూర్ఖుడు ఆకర్షణీయమైన జలతారు వలలో పడి చిక్కులు అనుభవిస్తాడు.

3. స్థూల, సూక్ష్మ కారణ శరీరాల కన్నా 'ఆత్మ' వేరైనది.

4. ఆత్మను పొందటానికి తీవ్ర సాధన తప్ప వేరు మార్గము లేదు.

5. ఒకరు మరొకరిని ప్రేమించటానికి కారణము ఇతరుల రూపంలో ఉన్న తన ఆత్మను తాను ప్రేమించటమే.

6. రహస్య సిద్ధాంతములను ప్రకటించిన బ్లావెట్‌స్కీని గూర్చి తెలుసుకోవలసి ఉంటుంది.

7. బ్లావెట్‌స్కీ తన ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆదేశానుసారము 1875లో మూడు ప్రధాన విషయములతో (ఊనీలి ఊనీలిళిరీళిచీనీరిబీబిజి ఐళిబీరిలిశిగి) దివ్య జ్ఞాన సమాజమును కల్నల్‌ ఆల్కాట్‌ సహకారముతో స్థాపించింది.

8. బ్లావెట్‌స్కీ అసలు పేరు హెలెనా పెట్రోవ్‌నా. భర్త పేరు బ్లావెట్‌స్కీ. తాను 1831 లో 30/31 అర్థరాత్రి జులై నెలలో జన్మించింది.

9. హెలెనా 19వ శతాబ్దంలో పుట్టిన అద్భుత వ్యక్తులలో ఒకరు. ఈమె విజ్ఞానములో కాని, దర్శన మనో శాస్త్రములలో కాని చూపిన అసమానధైర్య సాహసాలు ఆనాటి సమాజానికి రుచించలేదు. కాని క్రమక్రమంగా తన రచనలలోని సత్యమును గ్రహించగలిగారు.

10. బ్లావెట్‌స్కీ 1879లో తన రహస్య సిద్ధాంతములతో (ఊనీలి ఐలిబీజీలిశి ఈళిబీశిజీరిదీరీ) అను గ్రంథము వ్రాయుట మొదలుపెట్టింది.

11. బ్లావెట్‌స్కీ రహస్య సిద్ధాంతములను తయారు చేస్తుంటే, కల్నల్‌ ఆల్కాట్‌ దివ్య జ్ఞాన సమాజపు అభివృద్ధికై కృషి కొనసాగించాడు.

12. హెలెనా బాల్యము రష్యాలోని నరాట్‌ సరాట్‌వా గ్రామానికి చెందిన తన బామ్మ తాతల సంరక్షణలలో జరిగింది. ఫదీఫ్‌ అను పేరు గల ఆమె తాత ఆ ప్రదేశానికి గవర్నర్‌గా పనిచేశారు.

13. హెలెనా చిన్నప్పటి నుండి అదృశ్య శరీర ధారులతో మాట్లాడుతూ ఉండటము జరుగుతుండేది.

14. హెలెనా తన 17 ఏళ్ళ వయస్సులో తన కంటే అధిక వయస్సు గల జనరల్‌ బ్లావెట్‌స్కీ, ఇరివాన్‌ ప్రాంతపు గవర్నర్‌తో వివాహం జరిగింది. ఈ వివాహము ఆమెకు ఇష్టము లేదు. అందువలన మూడు నెలల తరువాత భర్త గృహము నుండి తప్పించుకొని తన ఇంటికి తిరిగి వచ్చింది. తన భర్త నుండి దూరముగా ఉండుటకు ఆమె అనేక సంవత్సరాలు అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటూ దేశ సంచారము చేసింది. ఆమె తండ్రి తనకు ఆర్థిక సహాయము చేసేవారు.

15. వివాహము తరువాత ఆమె బ్లావెట్‌స్కీగా పిలువబడింది.

16. 1851లో బ్లావెట్‌స్కీ మొదటిసారిగా తన ఆధ్యాత్మిక గురువును భౌతికంగా కలుసుకుంది. అప్పటి నుండి ఆయన బ్లావెట్‌స్కీని అనేక ప్రమాదకర పరిస్థితుల నుండి రక్షిస్తు, ఆమెకు అనేక ప్రాకృతిక, రహస్యవాద, ఆధ్యాత్మిక సిద్ధులను పొందుటకు తోడ్పడినాడు.

17. బ్లావెట్‌స్కీ హిమాలయములలో అత్యధిక భాగము గడిపి అచటి గుహలలో అతి ప్రాచీన గురువుల గ్రంథములు చదివి, సాధనలు చేసి అనేక అంతర్‌తలాల (అంతరిక్ష) రహస్యాలను అవగతము చేసుకుంది. అపుడే ఆవిడ ''దివాయిస్‌ ఆఫ్‌ సైలెన్సు'' అనే పుస్తకములో ఆ విషయాలు తెలిపింది.

18. 1873లో బ్లావెట్‌స్కీ అమెరికా చేరి తాను చేసిన కృషిని అచటి ప్రజలకు అవగాహన కలిగించుటకై ఆధ్యాత్మిక ప్రచారము కొనసాగించింది.

19. ప్రజలకు ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రచారం చేయుటకు రెండు విధానాలు అవలంబించింది.
1. తన ఆధ్యాత్మిక శక్తులను ప్రదర్శించుట.
2. అతి ప్రాచీన జీవితపు లోతులను తరచి విప్పిచెప్పగలిగిన జ్ఞానము, పరమ గురువుల చేత రక్షింపబడుతుందని, అది పరమార్థ ప్రయోజనాలకు ఉపయోగించగల సత్పాత్రులకు మాత్రమే ఇవ్వబడుతుందని, ఆ గురువులనే సిద్ధపురుషులని మాష్టర్సు అని చోహాన్సు అని వారిని గూర్చి తెల్పింది అది నిరూపించుటకు 1877లో  ఐసిస్‌ అన్‌వీల్‌డు అను గ్రంథములో, 1888లో లోను తెలియబర్చింది.

20. 1875లో స్థాపింపబడిన దివ్య జ్ఞాన సమాజము యొక్క మూడు ముఖ్యమైన లక్ష్యములు.
1. జాతి, మత, లింగ, వర్ణ భేదము లేకుండా సంపూర్ణ మానవ జాతి యొక్క విశ్వ సౌభ్రాతృత్వ భావనకు కృషి చేయుట.
2.  మతము లేక దర్మము-  - దర్శనము వేదాంతము - మరియు  విజ్ఞానము ఈ మూడింటి మధ్య సమన్వయము సాధించుట. 3. ప్రకృతిలోను, మనిషిలోను అంతర్గతంగా దాగి వున్న శక్తులన్ని బహిర్గత మొనర్చుట.

21. 1979లో బ్లావెట్‌స్కీ మరియు కల్నల్‌ ఆల్కాట్‌ భారతదేశం వచ్చి దివ్య జ్ఞాన సమాజం యొక్క రహస్య సమావేశాలు జరిపి 1000 మందికి పైగా సభ్యులచే విశిష్ఠ సాధనలు చేయించి, వారు తరువాత కార్యక్రమములను కొనసాగించుటకు కృషి చేశారు.

22. బ్లావెట్‌స్కీ తన రహస్య సిద్ధాంతాలలో 1) విశ్వనిర్మాణ ప్రక్రియను 2) మానవ జాతి నిజమైన చరిత్ర 3) ప్రపంచ ఇతిహాసములలోని రహస్యాలను తెలుసుకొనే విధానము, 4) తీవ్రసాధకులకు ప్రకృతిలోని ఆధ్యాత్మిక వైజ్ఞానిక రహస్యాలను తెలుసుకొనే మార్గములు తెలియబర్చారు. వీటిని అనుభూతిలోకి పొందలేనంత వరకు అవి రహస్యాలే.

23. బ్లావెట్‌స్కీ తన 61వ సంవత్సరములో 1891లో తన శరీరమును వదలి వెళ్ళినప్పటికి, ప్రజానీకానికి అనేక వేల సంవత్సరాల నుండి మూసి ఉన్న రహస్యాలను బహిరంగపర్చి, మానవునికి, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియబర్చారు.

24.   Spiritualaity (విజ్ఞానం) ఈనాడు చాలా ప్రముఖ పాత్ర వహించినప్పటికి, వైజ్ఞానిక (హేతువాద) దృష్టి కోణములేని ఏ విషయము స్వీకరించలేని స్థితికి వచ్చింది.

25. ఆధ్యాత్మికత అలా కాక కేవలము నమ్మకము మీద ఆధారపడుటచే తన అస్తిత్వమును కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మికత తిరిగి తన పూర్వ ప్రతిష్ఠను పొందాలంటే అది తన విలువలను గౌరవాన్ని పెంచుకోవాలి.

26. ఆధ్యాత్మికత ప్రకారంగా ప్రకృతిలో రెండు శక్తులు పనిచేస్తున్నాయి.
1) జీవితము 2) పదార్థము.

27. జీవితములో తన పరిధిని పరిమితము చేసుకున్న చివరి దశలో పదార్థము అవుతుంది. పదార్థము చేతనత్వ వికాసము (ఎఱుక) పొందినప్పుడు జీవితము ప్రకటించబడుతుంది.

28. జీవితము యొక్క చేతన ద్వారా వికాసము చెందే మార్గములో 10 దశలున్నాయి. వీటిలో 7వ మెట్టు వరకు చేతనత్వము మీద పదార్థము తన అధికారమును నెరుపుచూ ఉంటుంది. ఆ స్థితిలో చేతనత్వము సంతులనమొంది, వికాసము సమతాస్థితినొందుతుంది.

29. సమతాస్థితి అనంత కాలము కొనసాగుతుంటుంది. ఈ స్థితిలో జన్మ, మృత్యు చక్రము కొనసాగుతుంది.

30. జీవితము పదార్థ స్థితిలోకి మారిన తరువాత, పదార్థానికి జీవితము తొలగిపోయింది. కృష్ణావతార స్థితిలో మొదటి సారి తన నుండి తాను ప్రేరణ పొందుతుంది. తత్ఫలితముగా ప్రకృతిని జీవితము స్వాధీన పర్చుకొని, ప్రకృతిలోని చీకటిని దూరం చేసుకొవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

31. ప్రకృతిని అదుపులోకి తెచ్చుకొన్న మానవుడు అస్త్రవిద్య ద్వారా వాక్‌ శక్తిని ఉపయోగించి, ఈనాడు యంత్రాలు చేసే పనిని అప్పుడు వాక్‌ శక్తి ద్వారా చేయటం జరిగింది.
 
32. వాక్‌ శక్తి యొక్క అస్త్ర ప్రయోగాన్ని అరికట్టక పోయిన, జీవితము అవ్యక్త మనోమయ పరిధి నుండి స్థూల జగత్తుకు దిగలేదు. అందువలన అస్త్ర విద్యను అవ్యక్తము చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని నాశనం జరగలేదు. తిరిగి అస్త్రవిద్యను పునరుద్ధరించే మార్గములు ఆధ్యాత్మిక శాస్త్రాలలో స్పష్టంగా నిర్దేసింపబడలేదు.

33. అస్త్రవిద్యను తిరిగి పొందాలంటే కర్మ, భక్తి, జ్ఞాన యోగాల సమన్వయమే మార్గమని చెప్పి వదలివేశారు.

34. అవ్యక్త మనోమయ స్థితిలో ఉన్న ఆదిశక్తి భూమిమీదకు దిగి వచ్చి ప్రకృతిని, దైవీప్రకృతిగా మార్చుటకు ఆధ్యాత్మిక గురువులు చేతనత్వాన్ని ఉద్దీప్యం చేయుటకు భక్తి, కర్మ, జ్ఞాన యోగాలను సమన్వయపర్చే మార్గాలను చెప్పటం జరిగింది.

35. ప్రకృతిని దైవీప్రకృతిగా మార్చుటకు మూడు అంచెలను రూపొందించారు. 1) 'తమసోమా జోతిర్గమయ' 2) 'అసతోమా సద్గమయ' 3) 'మృత్యోర్మా అమృతంగమయ'.

36. తమసోమా జోతిర్గమయ: అంధకారము నుండి వెలుగులోకి తీసుకొని వెళ్ళుట. క్రీ.శ.17వ శతాబ్దంలో శాస్త్రజ్ఞులు కాంతి యొక్క అధ్యయనం చేసి, దాని స్వభావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేసినారు. అగ్ని యొక్క వివిధ ఉపయోగాలు, అగ్నిని ఉపయోగించి ధాతువులను శుద్ధి చేయుట, క్రొత్త క్రొత్త పదార్థములు తయారుచేయుట. ఇవన్నీ ఆత్మ శక్తి యొక్క వెలుగు అభివ్యక్తీకరణలే. అందువలన మనమందరము గుప్తవిద్య యొక్క విభిన్న వెలుగులుగా గుర్తించాలి. ప్రతిరోజు రాత్రి వెలుగుతున్న అనేక విద్యుత్‌ దీపాలే ఇందుకు నిదర్శనము.

37. మహాభారతములో అగ్ని గుండము నుండి ఉత్పన్నమైన దృష్టద్యుమ్న, ద్రౌపదిలు పంచతత్త్వములలో ఉన్న సంస్కారములను వెలికి తీయుటకు చేసే ప్రయత్నములే. ఈ ప్రక్రియ యజ్ఞవిద్య, అగ్ని విద్య. అన్నీ కూడా అంధకారములోనుండి ప్రకృతిలోనికి తీసుకొనివచ్చే సామూహిక ప్రయత్నాలు.

38. అసతోమా సద్గమయ: ప్రకృతిలోని అనేక పదార్థాలు, భిన్న భిన్న గుణాలు, ధర్మాలు కలిగినట్లు అనిపించిన ఇవన్నీ కూడా ధన, రుణ విద్యుదావేశాల కలయిక మాత్రమే అని ఆధునిక విజ్ఞానము నొక్కి చెబుతుంది.

39. ఈ విరాట్‌ విద్యుత్‌ చేతనత్వపు అతి సూక్ష్మ కణమని తెలుపుతోంది. అందువల్ల విద్యుత్‌ శాస్త్ర చమత్కారాలన్నీ ఆత్మ శక్తి యొక్క అవతరణ ప్రకృతిలో జరుగుటవలన, ఈ శక్తిధార 'అసతోమాసద్గమయ' అను సూత్రము ప్రకారమే జరుగుచున్నది. అవాస్తవం నుండి వాస్తవం వైపు ప్రయాణించినపుడే ప్రకృతి దైవ ప్రకృతిగా మారుతుంది.

40. 'మృత్యోర్మా అమృతంగమయ':నిస్త్రాణంగా, శక్తిహీనంగా ఉన్న అతి సూక్ష్మ కణములోనుండి, స్వచ్ఛందంగా ఉన్న ఏ బాహ్య పరికరము యొక్క సహాయము లేకుండా నిరంతరము వెదజల్లబడుతున్న రేడియో ధార్మిక కిరణాలు ప్రతి పరమాణువులోనున్న అనంత శక్తి సామర్ధ్యాలు 20వ శతాబ్దములో ప్రకటితమయ్యాయి.

41. భక్తి, జ్ఞాన, కర్మల సమన్వయ సాధనల ద్వారా వ్యక్తి తనలోని అంతర్గత శక్తిని వెలికితీయుట ద్వారా నవయుగ నిర్మాణానికి బాటలు వేయగలడు.

42. భౌతిక స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఆత్మిక శక్తిని అవతార స్థాయికి, కోరుకున్న దిశలో ప్రేరణ కల్పించుటకు ఏమి చేయాలో ఎలా ప్రకృతి శక్తులను వినియోగించాలో, తీసుకోవల్సిన జాగ్రత్తలేమిటో, ఫలితాలేమిటో విశదంగా తన గుప్తవిద్యలో తెలియజేసిన వ్యక్తి బ్లావెట్‌స్కీ.

43. బ్వావెట్‌స్కీ తన 'ఐసీస్‌ అన్‌వీల్డు' అను పుస్తకము ద్వారా ఆనాటి ఆధ్యాత్మికతను గూర్చి ప్రపంచములోనున్న దురభిప్రాయాలను తొలగించుటకు కృషి చేసింది. అది చదివిన వారు అది చాలా బాగుందని, కాని అర్థంకావటంలేదని తెలిపినారు.

44. అందుకు సమాధానంగా గుప్తవిద్య ద్వారా 'ఐసీస్‌ అన్‌వీల్డు' గ్రంథములోని విషయములను వ్యాఖ్యానిస్తూ మానవ జీవితాన్ని సమగ్రంగా విశదపర్చే అద్భుత గ్రంథంగా తెలియజేయుట జరిగింది.

45. గుప్తవిద్యను అర్థము చేసుకోవటానికి ముందు మూడు పదాలను గూర్చి సంపూర్ణంగా తెలుసుకోవాలి. 1) జీవితము 2) జడత్వము 3) చేతనత్వము లేక మనస్సు.

46. మొదటిదైన జీవితము మీద కాలప్రభావము ఉండదు. ఇది దేని ప్రభావము వలన మారదు.

47. రెండవదైన జడత్వము. ఇది పదార్థము ద్వారా వ్యక్తీకరించబడుతుంది. ఇది జీవితానికి వాహకముగా పనిచేస్తుంది. అందువలన కాల ప్రవాహములో ఇవి జీవితంలోని అనేక కోణాలను అభివ్యక్తీకరించే స్థాయికి పరిణతి చెందింది.

48. మన వర్తమానానికి మన గతానుభవమే నాంది. అలాగే మన భవిష్యత్తు మన వర్తమానం మీద ఆధారపడి ఉంది. గతాన్ని మార్చలేము. అందువలన ప్రస్తుతం మన చేతిలో నున్న వర్తమానాన్ని సంపన్నం చేసుకుందాం.

49. శాస్త్రజ్ఞులు; పరమాణువులు, అణువులు, జీవకణాలు వాటి ప్రత్యేక లక్షణాలు గల ప్రాణి సముదాయాలు, గ్రహాలు, పాలపుంతలను గూర్చి అనేక విషయాలు తెలియజేసారు.

50. జీవ పరిణామ సిద్ధాంతము ప్రకారము మానవజాతి ఏర్పడి, విజ్ఞానములో అతి త్వరితముగా అనేక మార్పులు చెందగల్గుతుంది.

51. విశ్వములోని అనేక జాతుల సామూహిక గుప్తవిద్యలు అనగా ఖనిజ, వృక్ష, జంతు, మానవ, అతిమానవ జాతులలో కేవలము మానవ జాతికి మాత్రమే మనస్సు అనే అతిజటిల స్థితి ఏర్పడి, త్వరలో అత్యద్భుత లక్షణాలను వ్యక్తపరచే స్థితికి చేరుకున్నాడు.

52. ఈ మనస్సునే చేతనత్వమని ఎఱుక అని పిల్చి, అనేక బోధనా పద్ధతుల ద్వారా జీవితము యొక్క అభివ్యక్తీకరణకు ప్రయత్నాలు జరుగుచున్నవి.

53. ఈ జీవితపు 'గుప్తవిద్య'ను తెలుసుకొనుటకు అనేక త్రిపుటులను తెలుసుకోవలసి ఉంటుంది.
 
1. జీవితము, మనస్సు, పదార్థము.
2. బ్రహ్మ (సృష్టి), విష్ణు (స్థితి), మహేశ్వరుడు (లయము).
3. చీకటి, సంధ్య, వెలుతురు. 
4. సుషుప్తి, స్వప్నము, జాగ్రత్తు
5. రజోగుణము, సత్వగుణము, తమోగుణము.
6. స్వర్గలోకము, భువర్‌లోకము, భూలోకము
7. ఆగామి, ప్రారబ్దము, సంచితము
8. ఆత్మికము, దైవికము, భౌతికము
9. దైవము, సూర్యుడు, పవిత్రాత్మ
10. మనసా, వాచా, కర్మణా
11. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి
12. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము
13. సాలోక్య, సాయుజ్య, సారూప్య
14. చూసేవాడు, చూసే ప్రక్రియ, చూడబడే పదార్థము.
15. వేదాంతము, మతము, విజ్ఞానము మొదలుగునవి.

54. పైవాటన్నింటిలో మూడవదైన అవస్థాత్రయము చాలా కనిష్ట స్థాయికి చెందినది. మొదటిది అతి ఉచ్ఛస్థాయికి చెందినది.

55. జాగ్రదావస్థ మనకి ప్రముఖమైనదిగా అనిపిస్తుంది. ఈ స్థితిలో అన్నియూ మనకు అవగాహనలో అదుపులో ఉన్నట్లు తోచుచున్నది. ఇదే స్వప్నావస్థలో క్షణక్షణానికి మారే పరిస్థితులు, ఒకదానికొకటి సంబంధములేని సంఘటనలుగా గోచరిస్తున్నాయి. సుషుప్తి లేక నిద్రావస్థలో ఏ సంఘటనలు లేకపోవుటయె గాక కాలము, ప్రపంచము కూడా అంతరించిపోయాయి. మొత్తము ఘనీభవించిన అంధకారమే మిగులుతుంది.

56. మనము జాగ్రదావస్థకే అధిక ప్రాధాన్య మిస్తాము. స్వప్నావస్థలో అనేక మంది ప్రేరణను పొంది, ఆధునిక విజ్ఞానమును సృష్టించినప్పటికి, అందుకు కారణమైన సుషుప్తి స్థితిలోని అనగా నిద్రావస్థలోనే ఆ ప్రేరణనకు తగిన సూచన లభిస్తున్నదని గ్రహించాలి.

57. సామాన్యులకు రాత్రి చీకటిగా ఉంటుంది. కాని జ్ఞాని రాత్రి యందు మెలుకువతో ఉండి ఎఱుకతో ఉంటాడు. పగలు స్థిత ప్రజ్ఞులకు రాత్రితో సమానము. 'ఎఱుకే బ్రహ్మము' కావున స్థిత ప్రజ్ఞులు రాత్రి యందు సంయమనముతో కూడిన ఆత్మిక స్థితిలో ఉంటారు.

58. సంయమన స్థితిలో ఉన్న వ్యక్తి ఎఱుకతో ఉండి మనస్సును స్థిరపర్చి సమగ్రంగా విషయాన్ని గ్రహించగలుగుతాడు.

59. సాధారణ స్థితిలోని వ్యక్తుల మనస్సులు స్థిరముగా లేక వారు వర్తమానములో చేస్తున్న పనిని వదలి, వేరే విషయాలను గూర్చి ఆలోచిస్తుంటారు.

60. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్థలో మనము ఉపయోగించుకోవలసిన వాహనాలు, స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు.

61. స్థూల శరీరానికి జాగ్రదావస్థలో 11 ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 1 మనస్సు) పనిచేస్తుంటాయి.

62. ఈ 11 ఇంద్రియములపై ఆధిపత్యము సాధించాలంటే కనీసం 5 సంవత్సరాలు వ్యక్తి నిరంతర శ్రమ చేయాలి. అందుకు క్రమశిక్షణతో కూడిన జీవితము అవసరము.

63. అందుకు ఉపాసనా విధానాల ద్వారా ఈ 11 ఇంద్రియాలను స్వాధీనం చేసుకొన్నప్పుడు సూక్ష్మ శరీరము చైతన్యవంతమవుతుంది.

64. కారణ శరీరం కారణ జగత్తులో శరీరాన్ని ఆ ప్రపంచానికి అనుగుణంగా మలుచుకోవాలంటే చిత్తవృత్తుల నిరోధము విశిష్ఠ పాత్ర వహిస్తుంది.

65. చిత్త వృత్తుల నిరోధము వలన వసుధైక కుటుంబము, సంఘశక్తి, కారణ జగత్తులో ఆత్మ శక్తి వికాసానికి తోడ్పడుతుంది.

66. గుప్తవిద్యలోని మొదటి మూడు స్థితులలో పూర్వ సృష్టి లయంచెంది నిద్రావస్థలో ఉన్నప్పుడు నూతన సృష్టికి ముందు కారణ జగత్తులో జరిగే ప్రక్రియ వర్ణన ఉంటుంది.

67. గుప్త విద్యను అర్ధం చేసుకొనుటకు కావలసిన రెండు షరతులు:
1) జాగరూకత - అనగా వ్యక్తి తనకు అలవాటైన లేక అభ్యాసంలో ఉన్న పనిని జాగరూకతతో చేయుట. మెలుకువగా ఉన్న క్షణాలలో ఒక్క క్షణం కూడా ఏమరుపాటుతో ఉండకూడదు.
2) అలవాటు: చేస్తున్న పనిలోని ఔచిత్యాన్ని గుర్తించాలి. మనిషి జీవితంలో అనేక పనులు చేయవల్సి ఉంటుంది. అందు ఏది ముందు, ఏది వాయిదా వేయవచ్చు అనే విషయాన్ని బుద్ధిని ఉపయోగించి తెలుసుకొని ఏది తక్షణం చేయవలయునో అది చేయుట. అందుకు వ్యక్తి తన దివ్య చక్షువులను ఉపయోగించాలి.

68. దివ్య చక్షువులు లభించాలంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహము ఉండాలి.

69. పరమేశ్వరుని అనుగ్రహము పొందాలంటే జ్ఞాని తన ప్రాణ మనస్సులను పరమేశ్వరుని యందే ఉంచి, ఇంద్రియ నిగ్రహులై ఎల్లప్పుడూ అతనిని భావిస్తూ, అతని విషయాలనే ముచ్చటించుకుంటూ, నిత్యసంతోషులై ఉండాలి. అట్టివారికి పరమాత్మ ఎల్లప్పుడు వెంట వుండి అంతఃస్పూర్తి కలిగిస్తూ అవసరానికి అనుగుణ్యమైన పనులను మనచేత చేయిస్తుంటాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించి వివేకము కలిగిస్తాడు.

70. అభ్యాస లక్షణాలు:- 1) ఇంద్రియ నిగ్రహము 2) ఏకాగ్రత 3) నిరంతర దైవ భావన 4) దైవాన్ని గూర్చిన చర్చ 5) వివాద రహితంగా సంతోషంగా వుండుట.

71. అహంకారాన్ని వదలివేసిన వాడు, అణకువ కలిగినవాడే పరమాత్మ కృపను పొందగలడు.

72. బ్లావెట్‌స్కీకి ఈ గుప్తవిద్యను వ్రాస్తున్నపుడు ఆమె కళ్ళ ముందు ఒక తాళపత్ర గ్రంథము ఉందని, అది హిమాలాయాలలో అతి రహస్య ప్రదేశంలో దేని వలన కూడా నశింపబడని విధంగా ఉందని, దానిని బుక్ ఆఫ్ డ్ఙ్యాన్ అని అంటారని, అందులోని 7 శ్లోకాలకు మాత్రమే గుప్తవిద్య మొదటి భాగములో వివరించబడినదని తెలుస్తుంది.

73. గుప్తవిద్యే కాక ఆధ్యాత్మిక స్తోత్ర, పురాణాలు, ఉపనిషత్తులు, యోగుల వాక్యాలు చదవాలంటే దివ్య దృష్టిని ఉపయోగించే చదవాలి.

 74. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పమని స్పష్టంగా గుర్తించాలి.

75. ఏకాగ్రత, లక్ష్య శుద్ధితో ఒక కార్యమును చేపట్టీ, మిగతా విషయాలలో విరక్తి వైరాగ్యం కలిగి ఉండాలి.

76. మన శరీరాలను ప్రయోగశాలగా ఉపయోగించుకొని సాధన చేసిన మానవ శరీరంలో చేతనత్వ ప్రభావాలు సమతా స్థితికి చేరుకుంటాయి. ఆ స్థితిలో వ్యక్తి తన సూక్ష్మ, స్థూల, కారణ శరీరములను ఉపయోగించి పిండాండము, బ్రహ్మాండములతో సంబంధము స్థాపించుకొనగలిగే పరిశోధనా శాలగా మలచుకొని ఉపయోగించుకొనుట జరుగుతుంది.

77. శరీరాన్ని వుపయోగించే ప్రక్రియలో
ఎ) నిద్రాస్థితి అనగా కారణ జగత్తు, కారణ శరీరము, విత్తనము నాటే స్థలముగా. 
బి) స్వప్నావస్థ సూక్ష్మ జగత్తు, కలుపు మొక్కలు తీసివేసే స్థలముగా.
సి) జాగ్రదావస్థ; స్థూల జగత్తు, స్థూల శరీరము చేసిన ఫలితాలు పొందే క్షేత్రంగా గుర్తించాలి.
ఈ మొత్తం ప్రక్రియ విత్తనం నాటుకో, పంటకోసుకో. ఇదే కర్మ సిద్ధాంతము.

78. నేడు మనం జాగ్రత్‌ స్థితిలో సర్వం ఇదే అనుకొని దానిలో మాత్రమే మార్పు తెచ్చుటకు ప్రయత్నిస్తున్నాము. జాగ్రత్‌ స్థితికి మూలకారణమైన స్వప్న, సుషుప్తి స్థితులను గూర్చి ఆలోచించుటలేదు.

79. బ్లావెట్‌స్కీ యొక్క 'గుప్తవిద్య'లో స్వప్న, సుషుప్తి స్థితులను అర్థం చేసుకొని అచట గల అలౌకిక  శక్తులను ఉపయోగించి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆనందమయం చేసుకొని, భౌతిక ప్రపంచాన్ని స్వర్గంవలె తీర్చిదిద్దే స్థితులను, పృథ్విని నియంత్రించే స్థితికి తీసుకువస్తుంది.

80. వివిధ ప్రాచీన గ్రంథాల ఆధారంగా దేవతల నుండి ఋషుల వరకు జరిగే అనేక పరిణామాల వివరాలు ఇవ్వబడ్డాయి. భవిష్యత్‌ వాణిని గూర్చి, మానవ జాతుల గూర్చి, జంతువులు, ఖనిజ, వృక్ష  సంపదలు, మానవులు, దేవతలు, పరమగురువుల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలను గూర్చి వివరించబడినాయి.

81. సూక్ష్మ దృష్టితో పరిశీలించిన ఖనిజ జగత్తులో రేడియో దార్మికత, పరమాణు శక్తిని కనుగొనుట, వృక్ష జగత్తుకు కూడా ప్రాణుల వలె స్పందన కలదని, పుష్పముల ద్వారా వ్యాధి నివారణ, సంకర జాతి రకముల తయారీ, వాటికి కావలిసిన ఖనిజములు, ఎరువులు, మందులు ఉపయోగించుట తెలుసుకొనబడింది.

82. క్రమముగా ఎద్దు, గుఱ్ఱములు, మేకలు మరి కొన్ని విశిష్ఠ జాతుల సముదాయము మానవ జాతికి దగ్గరగుట, ప్రపంచ యుద్ధములు, అనేక మంది గురువుల ద్వారా దేవతల నిజస్వరూపములను గ్రహించుట, భవిష్యత్తులో అతి మానవ (గురువులు), దేవతలు, పరమ గురువుల మధ్య జరిగే కర్మ సంబంధమైన ఇచ్చిపుచ్చుకొనుటలు మనము చూడబోతున్నాము.

83. 20వ శతాబ్దము తరువాత ఇంకా ఎక్కువ తెలుసుకొన్న శిష్యులు, గురువులు గుప్త విద్యను గూర్చి విస్తృత ప్రచారము చేసినచో, బ్లావెట్‌స్కీ యొక్క కృషి సఫలమవుతుంది.

84. గుప్త విద్యను మనం తెలుసుకొని ఆధ్యాత్మిక సంస్థల ద్వారా సూక్ష్మ జగత్తులో జరుగుచున్న అనేక దివ్య ప్రణాళికలు అమలు జరుగుటకు తోడ్పడవలసి ఉన్నది. లేనిచో గుప్తవిద్య మరుగునపడే అవకాశమున్నది.

85. గుప్త విద్య గురించి చెప్పే అతి ప్రాచీన గ్రంథములో ఇలా ఉన్నది.

1. ప్రశ్న:- ఎల్లప్పుడు ఉన్నది ఏది?
జవాబు:- ఆకాశం. అదే శాశ్వత ఆనుపాదక తత్త్వము.

2. ప్రశ్న:- ఎప్పుడూ ఉండేది ఏది?
జవాబు:- వేరులోని గింజ.

3. ప్రశ్న:- ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేది ఏది? 
జవాబు:- మహా శ్వాస.

4. ప్రశ్న:- అంటే మూడు శాశ్వతాలు ఉన్నాయా?

జవాబు:- కాదు. మూడూ ఒక్కటే. ఈ మూడూ చేతనత్వ భాషలో సుషుప్తి, స్వప్న, జాగ్రదావస్థలు. గుప్తవిద్యలో శ్లోకాలలో సృష్టి ఎలా మొదలైంది, ప్రళయ స్థితిలోకి ఎలా వెళతుంది, మధ్యలోనే క్రమపరిమాణము ఎలా జరిగిందో తెలుసుకుందాము. తరువాత వ్యక్తిగతంగా దీనిని ఎలా ఉపయోగించుకోవాలో గ్రహిస్తాము.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹

09/Mar/2019