శ్రీ లలితా సహస్ర నామములు - 131 / Sri Lalita Sahasranamavali - Meaning - 131

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 131 / Sri Lalita Sahasranamavali - Meaning - 131 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 131. అష్టమూర్తి, రజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ ।
ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా ॥ 131 ॥ 🍀

🍀 662. అష్టమూర్తి :
8 రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
🍀 663. అజా :
పుట్టుకలేనిది
🍀 664. జైత్రీ :
సర్వమును జయించినది
🍀 665. లోకయాత్రావిధాయినీ :
లోకములను నియమించునది
🍀 666. ఏకాకినీ :
ఏకస్వరూపిణీ
🍀 667. భూమరూపా :
భూదేవిరూపము ధరించునది
🍀 668. నిర్ద్వైతా :
అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
🍀 669. ద్వైత వర్జితా :
ద్వైతభావము లేనిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 131 🌹

📚. Prasad Bharadwaj
 
🌻 131. Ashtamurtirajajaitri lokayatra vidhaeini
Ekakini bhumarupa nirvaita dvaitavarjita ॥ 131 ॥ 🌻

🌻 662 ) Ashta moorthy -
She who has eight forms
🌻 663 ) Aja -
She who has not have birth
🌻 664) jethree -
She who has won over ignorance
🌻 665 ) Loka yathra vidahyini -
She who makes the world rotate(travel)
🌻 666 ) Ekakini -
She who is only herself and alone
🌻 667 ) Bhooma roopa -
She who is what we see , hear and understand
🌻 668 ) Nirdwaitha -
She who makes everything as one
🌻 669 ) Dwaitha varjitha -
She who is away from “more than one”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Sep 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 సాధన- సమిష్టి జీవనము - 5 🌻

తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన‌ మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే‌ దివ్యానంద స్పర్శ‌ అందుతుంది.

ఇంకో విషయము. ఆధునిక యువత చాలా వరకు ఇంగిత జ్ఞానంతో కన్నా, ఉద్వేగాలకు, ఆవేశాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ముఖ్యకారణము తల్లిదండ్రులు, మానవుల గుండె లోతుల్ని తడిమి రసప్లావితం చేయగల కావ్యాలను వారికి అందింపలేక పోవడమే. సాధకులు అనుదినమూ రామాయణ భారత‌ భాగవతాది కావ్యపఠనము విధిగా అవలంభించాలి.

రానున్న శతాబ్దములలో సమిష్టి జీవనం అన్ని సరిహద్దులను చెరపేసి విస్తరిస్తుంది. ఇది పరమగురువుల ప్రణాళిక. దీనికి అనుగుణముగా సాగలేనివారే వెనుకబడిపోతారు. క్రొత్తవారు చేరతారు అంతే.

....✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹

21 Sep 2021

వివేక చూడామణి - 132 / Viveka Chudamani - 132

🌹. వివేక చూడామణి - 132 / Viveka Chudamani - 132🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 5 🍀

434. ఎపుడు వస్తువులలో ఆనందమిచ్చేవి మరియు దుఃఖములు కలిగించేవి అయినప్పటికి వాటి వలన ఎట్టి సుఖదుఃఖాలు అనుభవించకుండా రెండింటిని సమ దృష్టితో చూసేవాడు విముక్తి చెందినవాడు.

435. బాహ్య, అంతర్గత భావన లేకుండా సన్యాసులు వారి మనస్సును బ్రహ్మానంద స్థితిని అనుభవించుటలో నిమగ్నమై ఉంటారో అట్టి వారు విముక్తి చెందిన వారు.

436. ఎవరైతే తాను ‘నేను’ ‘నాది’ అనే వాటితో పనిలేకుండా ఆ భావాలకు అతీతముగా జీవిస్తారో, శరీర భావన, శరీర ఆనందములతో పనిలేకుండా, వాటి విధులను పట్టించుకోకుండా ఉంటారో అట్టి వారు విముక్తిని పొందినవారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 132 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 5 🌻

434. When things pleasant or painful present themselves, to remain unruffled in mind in both cases, through the sameness of attitude, is a characteristic of one liberated-in-life.

435. The absence of all ideas of interior or exterior in the case of a Sannyasin, owing to his mind being engrossed in tasting the bliss of Brahman, is a characteristic of one liberated-in-life.

436. He who lives unconcerned, devoid of all ideas of "I" and "mine" with regard to the body, organs, etc., as well as to his duties, is known as a man liberated-in-life.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

21 Sep 2021

శ్రీ శివ మహా పురాణము - 455

🌹 . శ్రీ శివ మహా పురాణము - 455🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 31

🌻. శివ మాయ - 4 🌻

అపుడు భక్తవల్సలుడు, మహేశ్వరుడు, మాయావతి, వికార రహితుడునగు ఆ శంభు భగవానుడు హిమవంతుని వద్దకు బయలు దేరెను (31). హిమవంతుడు సభామధ్యములో బంధువర్గముతో, స్వయముగా పార్వతితో గూడి ఆనందముగా కొలువు దీరి యుండెను (32).

ఇంతలో అచటకు సదాశివుడు ఏతెంచెను ఆయన దండమును, ఛత్రమును పట్టుకొని, దివ్యమగు వస్త్రములను, ప్రకాశించే తిలకమును ధరించు యుండెను (33). ఆయన చేతిలో స్ఫటికమాలను, మెడలో సాలగ్రామమును ధరించి, హరినామమును భక్తితో జపించుచుండెను. ఆ బ్రాహ్మణుడు సాధువేషమును ధరించి యుండెను (34).

ఆయనను చూచి హిమవంతుడు పరివారముతో సహాలేచి నిలబడెను. అపూర్వమగు ఆ అతిథికి భక్తితో సాష్టాంగ నమస్కారము నాచరించెను (35). పార్వతి బ్రాహ్మణ రూపములో నున్న ప్రాణప్రియునకు భక్తితో నమస్కరించెను. ఆ దేవి మనస్సులో ఆయనను గుర్తెరింగి పరమానందముతో స్తుతించెను (36).

బ్రాహ్మణ వేషధారియగు శివుడు వారందరిని ప్రీతి పూర్వకముగా నాశీర్వదించెను. వత్సా! ఆయన మనస్సులో పార్వతికి, తనకు నచ్చిన ఆశీస్సులను అధికముగా నిచ్చెను (37). ఆ బ్రాహ్మణుడు పర్వతరాజగు హిమవంతునిచే మహాదరముతో నీయబడిన మధుపర్కము మొదలగు అతిథిపూజను పూర్ణముగా స్వీకరించెను (38).

ఓ మునీ! పర్వతరాజగు హిమవంతుడు ఆ బ్రాహ్మణోత్తముని మహాప్రీతితో చక్కగా పూజించి కుశలమడిగెను (39). తరువాత పర్వతరాజు ఆయనను 'మీరెవరు?' అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు వెంటనే సాదరముగా పర్వతరాజుతో నిట్లనెను (40).

ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడిట్లు పలికెను -

ఓ పర్వతరాజా! నేను బ్రాహ్మణుడను, వైష్ణవుడను, మహాపండితుడను. జ్యోతిష వృత్తిని చేపట్టి భూమండలము నందు తిరుగాడు చుందును (41). నేను నాకు నచ్చిన విధముగా తిరిగెదను. అన్ని చోట్లకు వెళ్లుచుందును. గురువు యొక్క అనుగ్రహముచే నాకు సర్వము తెలియును. నేను పరోపకారమును చేయుచుందును. పరిశుద్ధమగు అంతఃకరణము గలవాడను. దయానిదిని. వికారములు లేనివాడను (42).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

21 Sep 2021

గీతోపనిషత్తు -256

🌹. గీతోపనిషత్తు -256 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 2-3

🍀 2-3. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2

తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది.

వివరణము : జీవులు ప్రకృతి యందలి రూపము, రంగు, గుణము సత్యము వలననే ప్రకాశించు చున్నారు. కనుక సూటిగ సత్యమును చూడ వచ్చును. తనయందు, తన పరిసరముల యందు సూటిగ సత్యమును చూడవచ్చును. పై విధానముగ సత్యమును సూటిగ లోపల బయట చూడవచ్చును గనుక ఇది ప్రత్యక్ష అవగతమని భగవానుడు సెలవిచ్చినాడు.

ఇట్లు తనయందు, సమస్తమునందు సత్యమును దర్శించు వాడు సహజముగనే ధర్మము నందుండును. అధర్మము దరిచేరదు. ప్రత్యేకించి ప్రయత్నించి ధర్మము లభ్యసించ వలసిన అవసరముండదు. మరియు ఇట్టివాడు అన్ని కాలముల యందు, దేశముల యందు సుఖముగనే యుండును. ఈ నిరంతర సుఖ స్థితి నుండి అతడవస్థితి చెందడు. ఈ అనుష్ఠానము కూడ సుఖముగనే యుండును. కనుక దీని ననుష్ఠించుట ఉత్తమము.

ఇట్లు నిత్యము తన లోపల, తన వెలుపల సత్యమునే దర్శించు ప్రయత్నమున వుండు సాధకునకు ఇతర సాధనలు అనావశ్యకము. కేవలము సంప్రదాయబద్ధులై అనేకానేక సాధనలు ఆత్మసాక్షాత్కారము కొరకు మానవులు యుగముల తరబడి చేయుచు నున్నారేగాని అవి యన్నియు రాజవిద్యవలె సూటిగ నుండవు. ఆ సాధనల యందు సుళువుండదు. సుఖముకూడ ఉండదు. దీని నుపాసించుటకు వలసినది నిజమగు ధైర్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

21 Sep 2021

21-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం  21-సెప్టెంబర్-2021, శుభ మంగళవారం 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 256  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 455🌹 
4) 🌹 వివేక చూడామణి - 132 / Viveka Chudamani - 132 🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -84🌹  
6) 🌹 Osho Daily Meditations - 74🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 132 / Sri Lalita Sahasranamavali - Meaning - 132 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు - 2 🍀*

*యత్ర యత్ర రఘునాథ కీర్తనం*
*తత్ర తత్ర కృత మస్తకాంజలిం|*
*భాస్పవారి పరిపూర్ణ లోచనం*
*మారుతిం నమత రాక్షసాంతకం||*

*భావము:- దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీరాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించి పోయే వాడైన హనుమంతునికి నమస్కారము.*
🌻 🌻 🌻 🌻 🌻

21 మంగళవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, శరద్ ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 29:53:29 వరకు తదుపరి 
కృష్ణ విదియ
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: ఉత్తరాభద్రపద 29:07:51 వరకు తదుపరి రేవతి
యోగం: దండ 14:25:18 వరకు తదుపరి వృధ్ధి
 కరణం: బాలవ 17:38:21 వరకు
వర్జ్యం: 14:04:00 - 15:44:20
దుర్ముహూర్తం: 08:30:29 - 09:19:02
రాహు కాలం: 15:11:04 - 16:42:06
గుళిక కాలం: 12:08:59 - 13:40:01
యమ గండం: 09:06:54 - 10:37:56
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32
అమృత కాలం: 24:06:00 - 25:46:20
సూర్యోదయం: 06:04:49
సూర్యాస్తమయం: 18:13:08
వైదిక సూర్యోదయం: 06:08:20
వైదిక సూర్యాస్తమయం: 18:09:37
చంద్రోదయం: 18:42:39, చంద్రాస్తమయం: 06:11:31
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: మీనం
ఆనందాదియోగం: సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
29:07:51 వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం
పండుగలు :   
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -256 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 2-3
 
*🍀 2-3. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀*

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2

తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది. 

వివరణము : జీవులు ప్రకృతి యందలి రూపము, రంగు, గుణము సత్యము వలననే ప్రకాశించు చున్నారు. కనుక సూటిగ సత్యమును చూడ వచ్చును. తనయందు, తన పరిసరముల యందు సూటిగ సత్యమును చూడవచ్చును. పై విధానముగ సత్యమును సూటిగ లోపల బయట చూడవచ్చును గనుక ఇది ప్రత్యక్ష అవగతమని భగవానుడు సెలవిచ్చినాడు. 

ఇట్లు తనయందు, సమస్తమునందు సత్యమును దర్శించు వాడు సహజముగనే ధర్మము నందుండును. అధర్మము దరిచేరదు. ప్రత్యేకించి ప్రయత్నించి ధర్మము లభ్యసించ వలసిన అవసరముండదు. మరియు ఇట్టివాడు అన్ని కాలముల యందు, దేశముల యందు సుఖముగనే యుండును. ఈ నిరంతర సుఖ స్థితి నుండి అతడవస్థితి చెందడు. ఈ అనుష్ఠానము కూడ సుఖముగనే యుండును. కనుక దీని ననుష్ఠించుట ఉత్తమము. 
 
ఇట్లు నిత్యము తన లోపల, తన వెలుపల సత్యమునే దర్శించు ప్రయత్నమున వుండు సాధకునకు ఇతర సాధనలు అనావశ్యకము. కేవలము సంప్రదాయబద్ధులై అనేకానేక సాధనలు ఆత్మసాక్షాత్కారము కొరకు మానవులు యుగముల తరబడి చేయుచు నున్నారేగాని అవి యన్నియు రాజవిద్యవలె సూటిగ నుండవు. ఆ సాధనల యందు సుళువుండదు. సుఖముకూడ ఉండదు. దీని నుపాసించుటకు వలసినది నిజమగు ధైర్యము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 455🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 31

*🌻. శివ మాయ - 4 🌻*

అపుడు భక్తవల్సలుడు, మహేశ్వరుడు, మాయావతి, వికార రహితుడునగు ఆ శంభు భగవానుడు హిమవంతుని వద్దకు బయలు దేరెను (31). హిమవంతుడు సభామధ్యములో బంధువర్గముతో, స్వయముగా పార్వతితో గూడి ఆనందముగా కొలువు దీరి యుండెను (32).

ఇంతలో అచటకు సదాశివుడు ఏతెంచెను ఆయన దండమును, ఛత్రమును పట్టుకొని, దివ్యమగు వస్త్రములను, ప్రకాశించే తిలకమును ధరించు యుండెను (33). ఆయన చేతిలో స్ఫటికమాలను, మెడలో సాలగ్రామమును ధరించి, హరినామమును భక్తితో జపించుచుండెను. ఆ బ్రాహ్మణుడు సాధువేషమును ధరించి యుండెను (34). 

ఆయనను చూచి హిమవంతుడు పరివారముతో సహాలేచి నిలబడెను. అపూర్వమగు ఆ అతిథికి భక్తితో సాష్టాంగ నమస్కారము నాచరించెను (35). పార్వతి బ్రాహ్మణ రూపములో నున్న ప్రాణప్రియునకు భక్తితో నమస్కరించెను. ఆ దేవి మనస్సులో ఆయనను గుర్తెరింగి పరమానందముతో స్తుతించెను (36). 

బ్రాహ్మణ వేషధారియగు శివుడు వారందరిని ప్రీతి పూర్వకముగా నాశీర్వదించెను. వత్సా! ఆయన మనస్సులో పార్వతికి, తనకు నచ్చిన ఆశీస్సులను అధికముగా నిచ్చెను (37). ఆ బ్రాహ్మణుడు పర్వతరాజగు హిమవంతునిచే మహాదరముతో నీయబడిన మధుపర్కము మొదలగు అతిథిపూజను పూర్ణముగా స్వీకరించెను (38). 

ఓ మునీ! పర్వతరాజగు హిమవంతుడు ఆ బ్రాహ్మణోత్తముని మహాప్రీతితో చక్కగా పూజించి కుశలమడిగెను (39). తరువాత పర్వతరాజు ఆయనను 'మీరెవరు?' అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు వెంటనే సాదరముగా పర్వతరాజుతో నిట్లనెను (40).

ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడిట్లు పలికెను -

ఓ పర్వతరాజా! నేను బ్రాహ్మణుడను, వైష్ణవుడను, మహాపండితుడను. జ్యోతిష వృత్తిని చేపట్టి భూమండలము నందు తిరుగాడు చుందును (41). నేను నాకు నచ్చిన విధముగా తిరిగెదను. అన్ని చోట్లకు వెళ్లుచుందును. గురువు యొక్క అనుగ్రహముచే నాకు సర్వము తెలియును. నేను పరోపకారమును చేయుచుందును. పరిశుద్ధమగు అంతఃకరణము గలవాడను. దయానిదిని. వికారములు లేనివాడను (42). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 132 / Viveka Chudamani - 132🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 27. విముక్తి - 5 🍀*

434. ఎపుడు వస్తువులలో ఆనందమిచ్చేవి మరియు దుఃఖములు కలిగించేవి అయినప్పటికి వాటి వలన ఎట్టి సుఖదుఃఖాలు అనుభవించకుండా రెండింటిని సమ దృష్టితో చూసేవాడు విముక్తి చెందినవాడు. 

435. బాహ్య, అంతర్గత భావన లేకుండా సన్యాసులు వారి మనస్సును బ్రహ్మానంద స్థితిని అనుభవించుటలో నిమగ్నమై ఉంటారో అట్టి వారు విముక్తి చెందిన వారు. 

436. ఎవరైతే తాను ‘నేను’ ‘నాది’ అనే వాటితో పనిలేకుండా ఆ భావాలకు అతీతముగా జీవిస్తారో, శరీర భావన, శరీర ఆనందములతో పనిలేకుండా, వాటి విధులను పట్టించుకోకుండా ఉంటారో అట్టి వారు విముక్తిని పొందినవారు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 132 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 27. Redemption - 5 🌻*

434. When things pleasant or painful present themselves, to remain unruffled in mind in both cases, through the sameness of attitude, is a characteristic of one liberated-in-life.

435. The absence of all ideas of interior or exterior in the case of a Sannyasin, owing to his mind being engrossed in tasting the bliss of Brahman, is a characteristic of one liberated-in-life. 

436. He who lives unconcerned, devoid of all ideas of "I" and "mine" with regard to the body, organs, etc., as well as to his duties, is known as a man liberated-in-life.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 *సాధన- సమిష్టి జీవనము - 5* 🌻

తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన‌ మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే‌ దివ్యానంద స్పర్శ‌ అందుతుంది. 

ఇంకో విషయము. ఆధునిక యువత చాలా వరకు ఇంగిత జ్ఞానంతో కన్నా, ఉద్వేగాలకు, ఆవేశాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ముఖ్యకారణము తల్లిదండ్రులు, మానవుల గుండె లోతుల్ని తడిమి రసప్లావితం చేయగల కావ్యాలను వారికి అందింపలేక పోవడమే. సాధకులు అనుదినమూ రామాయణ భారత‌ భాగవతాది కావ్యపఠనము విధిగా అవలంభించాలి. 

రానున్న శతాబ్దములలో సమిష్టి జీవనం అన్ని సరిహద్దులను చెరపేసి విస్తరిస్తుంది. ఇది పరమగురువుల ప్రణాళిక. దీనికి అనుగుణముగా సాగలేనివారే వెనుకబడిపోతారు. క్రొత్తవారు చేరతారు అంతే.

....✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 73 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 73. LOVE 🍀*

*🕉 Every lover feels that something is missing, because love is unfinished. It is a process, not a thing, Every lover is bound to feel that something is missing. Don’t interpret it wrongly. It simply shows the love in itself is dynamic. 🕉*

Love is just like a river, always moving. In the very movement is the life of the river. Once it stops it becomes a stagnant thing; then it is no longer a river. The very word river shows a process, the very sound of it gives you th e feeling of movement. Love is a river. So don't think that something is missing; it is part of love's process. And it is good that it is not completed. When something is missing you have to do something about it-that is a call from higher and higher peaks. Not that when you reach them you will feel fulfilled; love never feels fulfilled. It knows no fulfillment, but it is beautiful because then it is alive forever and ever. 

And you will always feel that something is not in tune. That too is natural, because when two persons are meeting, two different worlds are meeting. To expect that they will fit perfectly is to expect the impossible, and that will create frustration. At the most there are a few moments when everything is in tune, rare moments. This is how it has to be. Make all efforts to create that intuneness, but always be ready if it doesn't happen perfectly. And don't be worried about it, otherwise you will fall more and more out of tune. It comes only when you are not worried about it. It happens only when you are not tense about it, when you are not even expecting it-just out of the blue.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 132 / Sri Lalita Sahasranamavali - Meaning - 132 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 132. అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ ।*
*బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా ॥ 132 ॥ 🍀*
 
🍀 670. అన్నదా : 
సర్వజీవులకు ఆహారము ఇచ్చునది 

🍀 671. వసుదా : 
సంపదలిచ్చునది 

🍀 672. వృద్ధా : 
ప్రాచీనమైనది 

🍀 673. బ్రహ్మత్మైక్యస్వరుపినీ : 
ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి 

🍀 674. బృహతీ : 
అన్నిటికన్న పెద్దది 

🍀 675. బ్రాహ్మణీ : 
బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ 

🍀 676. బ్రాహ్మీ : 
సరస్వతీ 

🍀 677. బ్రహ్మానందా :
 బ్రహ్మానందస్వరూపిణీ 

🍀 678. బలిప్రియా : 
బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది  

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 132 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 132. Annada vasudha vrudha bramhatmaikya svarupini*
*Bruhati bramhani bhramhi bramhananda balipriya ॥ 132 ॥ 🌻*

🌻 670 ) Annadha - She who gives food

🌻 671 ) Vasudha -   
She who gives wealth

🌻 672 ) Vriddha -   
She who is old

🌻 673 ) Brhmatmykya swaroopini -   
She who merges herself in brahma-the ultimate truth

🌻 674 ) Brihathi -   
She who is big

🌻 675 ) Brahmani -   
She who is the wife of easwara

🌻 676 ) Brahmi -   
She who has one aspect of Brhma

🌻 677 ) Brahmananda -   
She who is the ultimate happiness

🌻 678 ) Bali priya -   
She who likes the strong

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹