శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 266 / Sri Lalitha Chaitanya Vijnanam - 266

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 266 / Sri Lalitha Chaitanya Vijnanam - 266 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀

🌻266. 'గోప్త్రీ'🌻

గోప్యము గలది శ్రీమాత అని అర్థము. సమస్త వ్యూహములను, ధర్మములను, సంస్కారములను, వాక్కును, నిర్వర్తించు చున్ననూ శ్రీమాత గోప్యముగనే నుండును. ఆమె సంరక్షణము కూడ గోప్యముగనే యుండును. సున్నితము సూక్ష్మము అయి వుండును. జీవుల యందు ఆమె చేతనయే వర్తించు చున్నను జీవులా చేతనను చూడరు. స్వభావమును, కదలికలను మాత్రమే చూతురు. కావున ఎంత తెలిపిననూ జీవులకు మరుపే కలుగుచుండును.

అణువణువునందు ప్రాణుల యందు వర్ణించలేని వైవిధ్యముతో నర్తించుచున్న ఆమెను చేతనగ ఎవరు దర్శింపగలరు? ప్రాణస్పందనగ ఎవరు దర్శింపగలరు? నామము, రూపము, ప్రవర్తనయే దర్శింతురు. రూపము కూడ ఆమెయే అయిననూ దర్శింప లేరు. ఇంతకన్నా విచిత్ర మేమున్నది? ఇతరులు మాటాడినపుడు వాక్కును దర్శింతుమా! భాషను, భావమును దర్శింతుము. కనుకనే శ్రీదేవి ఇట్లు పలుకును.

“నన్ను చూచుచునే చూడరు. నన్ను వినుచునే వినరు. ఉతత్వ: పశ్యన్ నదదర్శ వాచమ్ ఉతత్వశృణ్వన్ నశృణేతి యేనామ్.” శ్రీదేవి పై విధముగ కనబడుచున్ననూ, వినబడుచున్ననూ, కనబడక వినబడుచున్ననూ వినబడక రహస్యముగ నున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 266 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Goptrī गोप्त्री (266) 🌻

She is in the form of the God of creation Brahma. Brahma has four heads. The four heads could mean the components of antaḥkaraṇa mind, intellect, consciousness and ego. Without these four, creation is not possible. There are many stories about Brahma’s four heads. He had five heads, possibly meaning the five elements or five prāṇa-s (prāṇa, apāna, vyāna, samāna and udāna) that are needed for creation.

The fifth head was cut off by Śiva for having shown disrespect to Him. There is yet another story, which says that Brahma had split his body horizontally into two, a male and a female form (different from ardhanārīśvara form of Śiva where Śiva’s body is dissevered vertically, the other half occupied by Śaktī). Brahma is said to be the great-grandfather, Viṣṇu the grandfather and Śiva the father of this universe.

(Further reading on the process of creation (in brief): The soul, which is also known as puruṣa can manifest only if interacts with prakṛti, which is also known as Nature, the creative self-unfoldment. When the soul gets associated with prakṛti, the latter unfolds first into subtle non-materialistic form and later into gross form. When gross form is formed, it gives rise to three types of bodies called gross (sthūla), subtle (sūkṣma) and cause (kāraṇa). Gross is the outer body, subtle and cause are the inner bodies.

Until a soul is liberated, subtle and cause bodies continue their association with the soul. Only the gross body is perishable. The imperceptible impressions of many lives become embedded in these bodies, thereby causing predominance of certain qualities in the mind in each rebirth. They are the seeds of karmas that are embedded in a soul.}

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 18

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 18 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఉనికి మన లోనికి ప్రవేశించినప్పుడు మనం అస్తిత్వంగా పరిణామం చెందుతాం 🍀

మనిషి అస్తిత్వానికి అతిధిగా వుండడానికి సమర్థుడు. అస్తిత్వాన్ని తన ఇల్లుగా కలిగి వుండడానికి అర్హుడు. వ్యక్తి అస్తిత్వానికి అతిథిగా, అస్తిత్వాన్ని తన ఇల్లుగా కలిగి వుండని పక్షంలో అతను అసంపూర్ణంగా మిగిలిపోతాడు. అస్తిత్వాన్ని తన లోపలికి అనుమతించకుంటే అతను ఆందోళనకు లోనవుతాడు. అసహనానికి గురవుతాడు.

ఎందుకంటే ఏ క్షణం మన ఉనికి మన లోనికి ప్రవేశిస్తుందో మనం అస్తిత్వంగా పరిణామం చెందుతాం. అది మన అంతిమ విధి. అట్లా సంపూర్ణత అందుకున్నపుడే సంతృప్తి. ఆనందం కలుగుతాయి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2021

వివేక చూడామణి - 75 / Viveka Chudamani - 75

🌹. వివేక చూడామణి - 75 / Viveka Chudamani - 75🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 20. శరీర బంధనాలు - 1 🍀

264. పైన తెలిపిన 10 శ్లోకాల్లో చెప్పబడిన సత్యాన్ని అనుసరించి ప్రతి వ్యక్తి విచక్షణా జ్ఞానముతో తన మనస్సులో తాను ధ్యానము చేసిన, ఆ ధ్యాన స్థితిలో తాను గుర్తించిన వేద సూత్రాలను విచారించి, దాన్ని అనుసరించి సత్యాన్ని ఏవిధమైన అనుమానము లేకుండా గ్రహించాలి. ఎలానంటే తన అరచేతిలోని నీటిని దర్శించినట్లు.

265. శరీరములోని ఆత్మిక జ్ఞానాన్ని ఏ విధమైన మాలిన్యము, దాని ప్రభావము లేకుండా తెలుసుకొని; ఎలా నంటే ఒక రాజు తన సైన్యాన్ని గూర్చి తెలుసుకొన్నట్లు, తాను తన ఆత్మలో శాశ్వతంగా స్థిరపడి జ్ఞానాన్ని పొంది విశ్వాన్ని బ్రహ్మములో విలీనము చేయాలి.

266. బుద్ది అనే గృహంలో బ్రహ్మము తాను మొత్తముగా మరియు సూక్ష్మ స్థితిలో పూర్తిగా, ఉన్నతంగా రెండవది ఏదీ లేకుండా, తాను బ్రహ్మము అనే గృహలో, తన తల్లి గర్భములోని పిండము వలె ఉన్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 75 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 20. Bondages of Body - 1 🌻

264. On the Truth, inculcated above, one must oneself meditate in one’s mind, through the intellect, by means of the recognised arguments. By that means one will realise the truth free from doubt etc., like water in the palm of one’s hand.

265. Realising in this body the Knowledge Absolute free from Nescience and its effects – like the king in an army – and being ever established in thy own Self by resting on that Knowledge, merge the universe in Brahman.

266. In the cave of the Buddhi there is the Brahman, distinct from the gross and subtle, the Existence Absolute, Supreme, the One without a second. For one who lives in this cave as Brahman, O beloved, there is no more entrance into the mother’s womb.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2021

దేవాపి మహర్షి బోధనలు - 86

🌹. దేవాపి మహర్షి బోధనలు - 86 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 67. సహవాసము 🌻

సాధకునకు సహవాస విషయములో అప్రమత్తత అవసరము. కలసిన ప్రతి మనిషితో స్నేహము చేయుట తగదు. స్నేహమునకు గుణము ప్రధానమై యుండవలెను. అంతటా నీరు ఉన్నా త్రాగటానికి కొంత నీరే పనికి వస్తుంది. అందుచే స్నేహము విషయమున సాధకుడు శ్రద్ధ వహించవలెను.

సాధకుడనగా సత్యసాధకుడు. అతడు సత్యాన్వేషకుడు. నీవు సాధకుడనను కొనుచున్నచో సత్యాన్వేషణము నందు శ్రద్ధ కలవారితోనే సహవాసము చేయవలెను. అట్లు కానిచో సాధన కుంటుపడగలదు. పరిచయస్తుల గుణగణములను పరిశీలించుకొని సహవాసము చేయుటకు పూనుకొనుము.

దుస్సాంగత్యము దురభ్యాస ముల నేర్పరచి జన్మ జన్మలకును వెంటాడును. అందువలన సత్సాంగత్యమే శరణ్యము. సత్సాంగత్యము వలననే మనసునకు సంగదోషము తొలగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 396, 397 / Vishnu Sahasranama Contemplation - 396, 397

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 396 / Vishnu Sahasranama Contemplation - 396🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻396. విరతః, विरतः, Virataḥ🌻

ఓం విరతాయ నమః | ॐ विरताय नमः | OM Viratāya namaḥ

రతం విషయసేవాయాం విగతం యస్య చక్రిణః ।
స విష్ణుర్విరత ఇతి కీర్త్యతే విబుదోత్తమైః ॥

ఈతనికి శబ్దవిషయ సుఖముల అనుభవ విషయమున రతము అనగా ఆసక్తి తొలగినదియై ఉన్నది. తానే స్వయముగా నిత్యానందరూపుడు కావున తాను పొందవలసిన సుఖము లేవియు లేవు కావున ఆతనికి విషయ సుఖములను అనుభవించవలయునను ఆసక్తి లేదనుట తగినదియే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 396🌹

📚. Prasad Bharadwaj

🌻396. Virataḥ🌻

OM Viratāya namaḥ

Rataṃ viṣayasevāyāṃ vigataṃ yasya cakriṇaḥ,
Sa viṣṇurvirata iti kīrtyate vibudottamaiḥ.

रतं विषयसेवायां विगतं यस्य चक्रिणः ।
स विष्णुर्विरत इति कीर्त्यते विबुदोत्तमैः ॥

The One in whom the desire for enjoyments has ceased. Since He is always blissfully content, there is no other pleasure that is worth seeking.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 397 / Vishnu Sahasranama Contemplation - 397🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻397. మార్గః, मार्गः, Mārgaḥ🌻

ఓం మార్గాయ నమః | ॐ मार्गाय नमः | OM Mārgāya namaḥ

యం విదిత్వాఽమృతత్వాయ కల్పంతే యోగినో హరిమ్ ।
ముముక్షవస్స ఏవాయం పంథా మార్గ ఇతీర్యతే ॥

ఎవని విషయమున నిలుచు ఏ జ్ఞానముచే ముముక్షువులగు యోగులు అమృతత్వమును పొంద సమర్థులగుచున్నారో ఆతడును ఆ జ్ఞానమును 'మార్గము'. త్రోవయూ ఆ త్రోవను నడిచి చేరదగిన గమ్యమును విష్ణువే!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 397🌹

📚. Prasad Bharadwaj

🌻397. Mārgaḥ🌻

OM Mārgāya namaḥ

Yaṃ viditvā’mr̥tatvāya kalpaṃte yogino harim,
Mumukṣavassa evāyaṃ paṃthā mārga itīryate.

यं विदित्वाऽमृतत्वाय कल्पंते योगिनो हरिम् ।
मुमुक्षवस्स एवायं पंथा मार्ग इतीर्यते ॥

That path by knowing which the liberation seeking ascetics attain to immortality. He is the path and destination too.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2021

18-MAY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-37 / Bhagavad-Gita - 1-37🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 605 / Bhagavad-Gita - 605 - 18-16🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 396 397 / Vishnu Sahasranama Contemplation - 396, 397🌹
4) 🌹 Daily Wisdom - 112🌹
5) 🌹. వివేక చూడామణి - 75🌹
6) 🌹Viveka Chudamani - 75🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 86🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 18🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 266 / Sri Lalita Chaitanya Vijnanam - 266 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 37 / Bhagavad-Gita - 37 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 37 🌴*

37. తస్మాన్నార్హా వయం హన్తుం 
ధార్తరాష్ట్రాన్ స్వబాన్దవాన్ |
స్వజనం హి కథం హత్వా 
సుఖిన: శ్యామ మాధవ ||

🌷. తాత్పర్యం : 
ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?

🌷. భాష్యము : 
వేదనిర్దేశము ననుసరించి ఆరు రకముల దుర్మార్గులు కలరు. వారే 
1. విషము పెట్టువాడు 
2. ఇంటికి నిప్పుపెట్టువాడు 
3. మారణ ఆయుధములతో దాడి చేయువాడు 
4. ఇతరుల ధనమును దోచెడివాడు 
5. ఇతరుల స్థలము నాక్రమించెడివాడు 
6. పరుల భార్యను చెరపట్టెడివాడు. అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య వ్యక్తినైనను సరియైన కార్యమే. కాని అర్జునుడు సామాన్యవక్తి కాడు. 

సాధుస్వభావమును కలిగియున్న కారణమున వారి యెడ అతడు సాదుస్వభావము వర్తించదలెచెను. అయినను అటువంటి సాధువర్తనము క్షత్రియునకు సంభందించినది కాదు. రాజ్యమును పాలించు భాద్యతాయుతుడైన రాజు సాదు స్వభావమును కలిగి యుండవలెను గాని పిరికివాడై యుండకూడదు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 37 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 
*🌴 Chapter 1 - Vishada Yoga - Verse 37 🌴*

37. tasmān nārhā vayaṁ hantuṁ dhārtarāṣṭrān sa-bāndhavān
sva-janaṁ hi kathaṁ hatvā sukhinaḥ syāma mādhava

🌷 Translation :
Sin will overcome us if we slay such aggressors. Therefore it is not proper for us to kill the sons of Dhṛtarāṣṭra and our friends. What should we gain, O Kṛṣṇa, husband of the goddess of fortune, and how could we be happy by killing our own kinsmen?

🌷 Purport : 
According to Vedic injunctions there are six kinds of aggressors: (1) a poison giver, (2) one who sets fire to the house, (3) one who attacks with deadly weapons, (4) one who plunders riches, (5) one who occupies another’s land, and (6) one who kidnaps a wife. Such aggressors are at once to be killed, and no sin is incurred by killing such aggressors. Such killing of aggressors is quite befitting any ordinary man, but Arjuna was not an ordinary person. 

He was saintly by character, and therefore he wanted to deal with them in saintliness. This kind of saintliness, however, is not for a kṣatriya. Although a responsible man in the administration of a state is required to be saintly, he should not be cowardly. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 605 / Bhagavad-Gita - 605 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 16 🌴*

16. తత్త్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు య: |
పశ్యత్యకృతబుద్ధిత్యాన్న స పశ్యతి దుర్మతి: ||

🌷. తాత్పర్యం : 
కనుక ఈ ఐదు అంశములను గుర్తించక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థదృష్టితో గాంచలేడు.

🌷. భాష్యము :
పరమాత్ముడు హృదయమునందు మిత్రుని రూపమున నిలిచియుండి తనచే కార్యములు ఒనరింపజేయుచున్నాడని మూఢుడైనవాడు తెలిసికొనజాలడు. కార్యస్థానమైన దేహము, కర్త, ఇంద్రియములు, ప్రయత్నము అనునవి కార్యము యొక్క భౌతికకారణములు కాగా, పరమాత్ముడు చరమకారణమై యున్నాడు. 

కనుక ప్రతియొక్కరు ఈ నాలుగు భౌతికకారణములనే గాక పరమకారణము సైతము గాంచవలసియున్నది. పరమాత్ముని గాంచనివాడే తనను తాను కర్తగా భావించును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 605 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 16 🌴*

16. tatraivaṁ sati kartāram ātmānaṁ kevalaṁ tu yaḥ
paśyaty akṛta-buddhitvān na sa paśyati durmatiḥ

🌷 Translation : 
Therefore one who thinks himself the only doer, not considering the five factors, is certainly not very intelligent and cannot see things as they are.

🌹 Purport :
A foolish person cannot understand that the Supersoul is sitting as a friend within and conducting his actions. Although the material causes are the place, the worker, the endeavor and the senses, the final cause is the Supreme, the Personality of Godhead. 

Therefore, one should see not only the four material causes but the supreme efficient cause as well. One who does not see the Supreme thinks himself to be the doer.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 396, 397 / Vishnu Sahasranama Contemplation - 396, 397 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻396. విరతః, विरतः, Virataḥ🌻*

*ఓం విరతాయ నమః | ॐ विरताय नमः | OM Viratāya namaḥ*

రతం విషయసేవాయాం విగతం యస్య చక్రిణః ।
స విష్ణుర్విరత ఇతి కీర్త్యతే విబుదోత్తమైః ॥

ఈతనికి శబ్దవిషయ సుఖముల అనుభవ విషయమున రతము అనగా ఆసక్తి తొలగినదియై ఉన్నది. తానే స్వయముగా నిత్యానందరూపుడు కావున తాను పొందవలసిన సుఖము లేవియు లేవు కావున ఆతనికి విషయ సుఖములను అనుభవించవలయునను ఆసక్తి లేదనుట తగినదియే.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 396🌹*
📚. Prasad Bharadwaj

*🌻396. Virataḥ🌻*

*OM Viratāya namaḥ*

Rataṃ viṣayasevāyāṃ vigataṃ yasya cakriṇaḥ,
Sa viṣṇurvirata iti kīrtyate vibudottamaiḥ.

रतं विषयसेवायां विगतं यस्य चक्रिणः ।
स विष्णुर्विरत इति कीर्त्यते विबुदोत्तमैः ॥

The One in whom the desire for enjoyments has ceased. Since He is always blissfully content, there is no other pleasure that is worth seeking.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 397 / Vishnu Sahasranama Contemplation - 397🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻397. మార్గః, मार्गः, Mārgaḥ🌻*

*ఓం మార్గాయ నమః | ॐ मार्गाय नमः | OM Mārgāya namaḥ*

యం విదిత్వాఽమృతత్వాయ కల్పంతే యోగినో హరిమ్ ।
ముముక్షవస్స ఏవాయం పంథా మార్గ ఇతీర్యతే ॥

ఎవని విషయమున నిలుచు ఏ జ్ఞానముచే ముముక్షువులగు యోగులు అమృతత్వమును పొంద సమర్థులగుచున్నారో ఆతడును ఆ జ్ఞానమును 'మార్గము'. త్రోవయూ ఆ త్రోవను నడిచి చేరదగిన గమ్యమును విష్ణువే!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 397🌹*
📚. Prasad Bharadwaj

*🌻397. Mārgaḥ🌻*

*OM Mārgāya namaḥ*

Yaṃ viditvā’mr̥tatvāya kalpaṃte yogino harim,
Mumukṣavassa evāyaṃ paṃthā mārga itīryate.

यं विदित्वाऽमृतत्वाय कल्पंते योगिनो हरिम् ।
मुमुक्षवस्स एवायं पंथा मार्ग इतीर्यते ॥

That path by knowing which the liberation seeking ascetics attain to immortality. He is the path and destination too.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥
రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥
Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 112 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 21. The Study of Man is the Study of Consciousness 🌻*

The processes of life are, broadly speaking, those which are studied in the fields of politics, world history, sociology, ethics, economics, aesthetics, psychology, biology, chemistry, physics and astronomy. 

Everything connected with man can be said to be comprehended within this outline of the framework of life’s activity. But all this has to be related to consciousness; else, they would not exist even as subjects of study or objects of experience. The problem of man is therefore the problem of consciousness. 

The study of man is the study of consciousness. Since it is impossible to conceive a real division of consciousness within itself, it is also not possible to imagine that there can be real objects of consciousness. If there are no such real objects, the whole of life would be a drama played by consciousness within itself in the realm of its infinite compass. There cannot be a greater joy than the identification of existence and consciousness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 75 / Viveka Chudamani - 75🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 20. శరీర బంధనాలు - 1 🍀*

264. పైన తెలిపిన 10 శ్లోకాల్లో చెప్పబడిన సత్యాన్ని అనుసరించి ప్రతి వ్యక్తి విచక్షణా జ్ఞానముతో తన మనస్సులో తాను ధ్యానము చేసిన, ఆ ధ్యాన స్థితిలో తాను గుర్తించిన వేద సూత్రాలను విచారించి, దాన్ని అనుసరించి సత్యాన్ని ఏవిధమైన అనుమానము లేకుండా గ్రహించాలి. ఎలానంటే తన అరచేతిలోని నీటిని దర్శించినట్లు.
 
265. శరీరములోని ఆత్మిక జ్ఞానాన్ని ఏ విధమైన మాలిన్యము, దాని ప్రభావము లేకుండా తెలుసుకొని; ఎలా నంటే ఒక రాజు తన సైన్యాన్ని గూర్చి తెలుసుకొన్నట్లు, తాను తన ఆత్మలో శాశ్వతంగా స్థిరపడి జ్ఞానాన్ని పొంది విశ్వాన్ని బ్రహ్మములో విలీనము చేయాలి.

266. బుద్ది అనే గృహంలో బ్రహ్మము తాను మొత్తముగా మరియు సూక్ష్మ స్థితిలో పూర్తిగా, ఉన్నతంగా రెండవది ఏదీ లేకుండా, తాను బ్రహ్మము అనే గృహలో, తన తల్లి గర్భములోని పిండము వలె ఉన్నది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 75 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 20. Bondages of Body - 1 🌻*

264. On the Truth, inculcated above, one must oneself meditate in one’s mind, through the intellect, by means of the recognised arguments. By that means one will realise the truth free from doubt etc., like water in the palm of one’s hand.

265. Realising in this body the Knowledge Absolute free from Nescience and its effects – like the king in an army – and being ever established in thy own Self by resting on that Knowledge, merge the universe in Brahman.

266. In the cave of the Buddhi there is the Brahman, distinct from the gross and subtle, the Existence Absolute, Supreme, the One without a second. For one who lives in this cave as Brahman, O beloved, there is no more entrance into the mother’s womb.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 86 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 67. సహవాసము 🌻*

సాధకునకు సహవాస విషయములో అప్రమత్తత అవసరము. కలసిన ప్రతి మనిషితో స్నేహము చేయుట తగదు. స్నేహమునకు గుణము ప్రధానమై యుండవలెను. అంతటా నీరు ఉన్నా త్రాగటానికి కొంత నీరే పనికి వస్తుంది. అందుచే స్నేహము విషయమున సాధకుడు శ్రద్ధ వహించవలెను. 

సాధకుడనగా సత్యసాధకుడు. అతడు సత్యాన్వేషకుడు. నీవు సాధకుడనను కొనుచున్నచో సత్యాన్వేషణము నందు శ్రద్ధ కలవారితోనే సహవాసము చేయవలెను. అట్లు కానిచో సాధన కుంటుపడగలదు. పరిచయస్తుల గుణగణములను పరిశీలించుకొని సహవాసము చేయుటకు పూనుకొనుము. 

దుస్సాంగత్యము దురభ్యాస ముల నేర్పరచి జన్మ జన్మలకును వెంటాడును. అందువలన సత్సాంగత్యమే శరణ్యము. సత్సాంగత్యము వలననే మనసునకు సంగదోషము తొలగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 18 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ఉనికి మన లోనికి ప్రవేశించినప్పుడు మనం అస్తిత్వంగా పరిణామం చెందుతాం 🍀*

మనిషి అస్తిత్వానికి అతిధిగా వుండడానికి సమర్థుడు. అస్తిత్వాన్ని తన ఇల్లుగా కలిగి వుండడానికి అర్హుడు. వ్యక్తి అస్తిత్వానికి అతిథిగా, అస్తిత్వాన్ని తన ఇల్లుగా కలిగి వుండని పక్షంలో అతను అసంపూర్ణంగా మిగిలిపోతాడు. అస్తిత్వాన్ని తన లోపలికి అనుమతించకుంటే అతను ఆందోళనకు లోనవుతాడు. అసహనానికి గురవుతాడు. 

ఎందుకంటే ఏ క్షణం మన ఉనికి మన లోనికి ప్రవేశిస్తుందో మనం అస్తిత్వంగా పరిణామం చెందుతాం. అది మన అంతిమ విధి. అట్లా సంపూర్ణత అందుకున్నపుడే సంతృప్తి. ఆనందం కలుగుతాయి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 266 / Sri Lalitha Chaitanya Vijnanam - 266 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀*

*🌻266. 'గోప్త్రీ'🌻* 

గోప్యము గలది శ్రీమాత అని అర్థము. సమస్త వ్యూహములను, ధర్మములను, సంస్కారములను, వాక్కును, నిర్వర్తించు చున్ననూ శ్రీమాత గోప్యముగనే నుండును. ఆమె సంరక్షణము కూడ గోప్యముగనే యుండును. సున్నితము సూక్ష్మము అయి వుండును. జీవుల యందు ఆమె చేతనయే వర్తించు చున్నను జీవులా చేతనను చూడరు. స్వభావమును, కదలికలను మాత్రమే చూతురు. కావున ఎంత తెలిపిననూ జీవులకు మరుపే కలుగుచుండును. 

అణువణువునందు ప్రాణుల యందు వర్ణించలేని వైవిధ్యముతో నర్తించుచున్న ఆమెను చేతనగ ఎవరు దర్శింపగలరు? ప్రాణస్పందనగ ఎవరు దర్శింపగలరు? నామము, రూపము, ప్రవర్తనయే దర్శింతురు. రూపము కూడ ఆమెయే అయిననూ దర్శింప లేరు. ఇంతకన్నా విచిత్ర మేమున్నది? ఇతరులు మాటాడినపుడు వాక్కును దర్శింతుమా! భాషను, భావమును దర్శింతుము. కనుకనే శ్రీదేవి ఇట్లు పలుకును. 

“నన్ను చూచుచునే చూడరు. నన్ను వినుచునే వినరు. ఉతత్వ: పశ్యన్ నదదర్శ వాచమ్ ఉతత్వశృణ్వన్ నశృణేతి యేనామ్.” శ్రీదేవి పై విధముగ కనబడుచున్ననూ, వినబడుచున్ననూ, కనబడక వినబడుచున్ననూ వినబడక రహస్యముగ నున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 266 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Goptrī गोप्त्री (266) 🌻*

She is in the form of the God of creation Brahma. Brahma has four heads. The four heads could mean the components of antaḥkaraṇa mind, intellect, consciousness and ego. Without these four, creation is not possible. There are many stories about Brahma’s four heads. He had five heads, possibly meaning the five elements or five prāṇa-s (prāṇa, apāna, vyāna, samāna and udāna) that are needed for creation.  

The fifth head was cut off by Śiva for having shown disrespect to Him. There is yet another story, which says that Brahma had split his body horizontally into two, a male and a female form (different from ardhanārīśvara form of Śiva where Śiva’s body is dissevered vertically, the other half occupied by Śaktī). Brahma is said to be the great-grandfather, Viṣṇu the grandfather and Śiva the father of this universe. 

(Further reading on the process of creation (in brief): The soul, which is also known as puruṣa can manifest only if interacts with prakṛti, which is also known as Nature, the creative self-unfoldment. When the soul gets associated with prakṛti, the latter unfolds first into subtle non-materialistic form and later into gross form. When gross form is formed, it gives rise to three types of bodies called gross (sthūla), subtle (sūkṣma) and cause (kāraṇa). Gross is the outer body, subtle and cause are the inner bodies.  

Until a soul is liberated, subtle and cause bodies continue their association with the soul. Only the gross body is perishable. The imperceptible impressions of many lives become embedded in these bodies, thereby causing predominance of certain qualities in the mind in each rebirth. They are the seeds of karmas that are embedded in a soul.}

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹