దేవాపి మహర్షి బోధనలు - 86
🌹. దేవాపి మహర్షి బోధనలు - 86 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 67. సహవాసము 🌻
సాధకునకు సహవాస విషయములో అప్రమత్తత అవసరము. కలసిన ప్రతి మనిషితో స్నేహము చేయుట తగదు. స్నేహమునకు గుణము ప్రధానమై యుండవలెను. అంతటా నీరు ఉన్నా త్రాగటానికి కొంత నీరే పనికి వస్తుంది. అందుచే స్నేహము విషయమున సాధకుడు శ్రద్ధ వహించవలెను.
సాధకుడనగా సత్యసాధకుడు. అతడు సత్యాన్వేషకుడు. నీవు సాధకుడనను కొనుచున్నచో సత్యాన్వేషణము నందు శ్రద్ధ కలవారితోనే సహవాసము చేయవలెను. అట్లు కానిచో సాధన కుంటుపడగలదు. పరిచయస్తుల గుణగణములను పరిశీలించుకొని సహవాసము చేయుటకు పూనుకొనుము.
దుస్సాంగత్యము దురభ్యాస ముల నేర్పరచి జన్మ జన్మలకును వెంటాడును. అందువలన సత్సాంగత్యమే శరణ్యము. సత్సాంగత్యము వలననే మనసునకు సంగదోషము తొలగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment