✍️. రాంకర్రి జ్ఞాన కేంద్ర ౹ Ram Karri
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఏడేడు పద్నాలుగు లోకాలంటారే అవి ఏవి ? 🍀
లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు.
లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే
మొదటి భావన ప్రకారం
కటి (మొల) నుండి పై భాగం ఏడు అవయవాలుగా,
క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
రెండవ భావన ప్రకారం
భూలోకం పాదాలు,
భువర్లోకం నాభి,
సువర్లోకం హృదయం,
మహర్లోకం ఉరోభాగం,
జనలోకం కంఠం,
తపోలోకం పెదవులు,
బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
మూడవ భావన ప్రకారం
భూలోకం పాదాలు,
భువర్లోకం నాభి,
స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.
బ్రహ్మాండ పురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.
🌻. ఊర్ధ్వ లోకాలు (7) :
భూలోకం,
భువర్లోకం,
సువర్ణలోకం (దేవలోకం ఇంద్రుడు ఉండే లోకం ) అంటే స్వర్గం,
మహార్లోకం,
జనోలోకం,
తపోలోకం,
సత్య లోకం(మోక్ష దశ..పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ )
మనిషి ఊర్ధ్వ ముఖంగా మాత్రమే ప్రయాణం చేయాలి.
84 లక్షల జీవరాసుల్లో మానవుడు మాత్రమే పైకి చూడగలడు.
🌻. అధోలోకాలు ( 7) :
అతల..బలి చక్రవర్తి ఉండే చోటు
సుతల..బలి చక్రవర్తి చోటు
వితల..శివుడు అంశం
తలాతల.. మయుడు ఉండే చోటు
మహాతల.. నాగులు ఉండే చోటు
రసాతల..రాక్షసులు ఉండే చోటు
పాతాళం.. వాసుకి ఉండే చోటు హిరణ్యకశపుడు.
🍀. మానవ దేహంలో 14 లోకాలు : 🍀
ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది.
మన శరీరంలో మూలాధారం నుంచి పైకి క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి.
వాటికి పైన ఉన్నది.
సహస్రారం/ సహస్రపద్మం.
ఇవన్నీ కలిపి ఏడు.
అలగే మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది.
ఈ మొత్తం అన్నీ కలిపి 14 వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసు కోవచ్చు.
1. మూలాధారం :
వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది.
ధారణశక్తి కి కేంద్రస్థానం.
మహాగణపతి అధిదేవత.
ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం :
బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది.
వివేకము దీని లక్షణం.
3. మణిపూరం :
నాభిలో ఉంటుంది.
సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం :
హృదయం దగ్గర ఉంటుంది.
అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం :
కంఠంలో ఉంటుంది.
దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ :
కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం :
తలమీద ఉంటుంది.
ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.
నరకాలు పాతాళ లోకాల గురించి పరిశీలిద్ధాం :
1. అతలం :
అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది.
తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం :
నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది.
ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది.
తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం :
బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది.
అసూయ దీని లక్షణం.
4. తలాతలం :
అంధకారం, తామసికం దీని లక్షణం.
పిక్కల్లో ఉంటుంది.
క్రింది స్థాయి చక్రం ఇది.
గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం.
5. రసాతలం :
కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం.
స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo.
6. మహాతలం :
అవివేకము దీని లక్షణము.
పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం.
నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.
7. పాతాళం :
కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది.
దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం.
అరికాలులో ఉంటుంది.
ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.
కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
30 Jul 2021