నిర్మల ధ్యానాలు - ఓషో - 207


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 207 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జనం మంచి మంచి మాటలు వింటారు, అభినందిస్తారు. కానీ అర్థం చేసుకోరు. ఎక్కడ బుద్ధిహీనత, రాజకీయం వున్నాయో అక్కడ జీవితమంతా మొదటి స్థానంలో వుండడానికి ఆరాటపడని వాళు ధన్యులు.🍀

పిల్లలు పెద్దల్నించీ నేర్చుకుంటారు. పెద్దలేం చేస్తే పిల్లల్లలది చేస్తారు. మన పిల్లలు హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు చూపే టీవీలు చూస్తున్నారు. 'తెలుసుకుంటున్నారు' దౌర్జన్యాన్ని చూసి దౌర్జన్యం నేర్చుకుంటున్నారు. అక్కడ చూసేదంతా బాహ్యమయినది. లోపలికి చూసేది కాదు. మహాత్ములు మళ్ళీ మళ్ళీ దైవం నీలోనే వుంది అన్నారు. వారి వారి అనుయాయూలు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. ఎంత తెలివి తక్కువతనం.

ఎక్కడ బుద్ధిహీనత, రాజకీయం వున్నాయో అక్కడ జీవితమంతా మొదటిస్థానంలో వుండడానికి ఆరాటపడని వాళు ధన్యులు. వాళ్ళు మొదటి స్థానంలో వుంటారు. జనం మంచి మంచి మాటలు వింటారు. వాటిని అభినందిస్తారు. కానీ అర్థం చేసుకోరు. మనం బుద్ధుడు, కృష్ణుడు లాంటి గురువుల్ని కోల్పోయాం. మానవ జాతి చేసుకున్న దురదృష్టమదే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


09 Jul 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 307 - 2. అందం యొక్క లక్షణం / DAILY WISDOM - 307 - 2. The Characteristic of Beauty


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 307 / DAILY WISDOM - 307 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 2. అందం యొక్క లక్షణం 🌻


వస్తువు యొక్క అందం అనే లక్షణం, ఒక వ్యక్తి యొక్క మనస్సులోని వెలితికి ప్రతిరూపంగా సరిగ్గా సరిపోతుంది. మనస్సులో ఒక రకమైన వెలితి ఉంటుంది మరియు దాని యొక్క ఖచ్చితమైన ప్రతిరూపం వస్తువు యొక్క అందం. ఇది పూర్తిగా మానసిక ప్రశ్న. ఒక వ్యక్తి యొక్క మానసిక నిర్మాణంలో ఒక నిర్దిష్ట లోపము ఉంటుంది, అది ఆ వ్యక్తిని అశాంతిగా, అసంతృప్తిగా ఉంచుతుంది. వివిధ వ్యక్తుల విషయంలో వివిధ కారణాల వల్ల అశాంతి మరియు దుఃఖం ఏర్పడవచ్చు మరియు సంతోషాన్ని కలిగించడానికి ఆ నిర్దిష్ట రకమైన మనస్సు ముందు ఆ సంబంధిత వస్తువును ఉంచాలి.

నాకు అందంగా కనిపించేది మీకు అందంగా కనిపించక పోవచ్చు. కొందరు కొన్నిసార్లు అసహ్యకరమైన విషయాలకు కూడా ఆకర్షితులవుతారు. మీరు అందవిహీనంగా మరియు రసహీనంగా భావించేవి మరొక వ్యక్తికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, ఎందుకంటే వారు వేరే రకమైన మానసిక స్థితిలో ఉన్నారు. మనల్ని ఏది ఆకర్షిస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు ఆకలితో ఉంటే తప్ప, ఆహారం సంతృప్తికరంగా ఉండదు. మీ నిర్దిష్ట రకమైన ఆకలి మీకు అవసరమైన ఆహారాన్ని నిర్ణయిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 307 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 2. The Characteristic of Beauty 🌻


Beauty is the characteristic of that object which exactly fits in as a counterpart of the lack in the mind of a person. There is a kind of lacuna in the mind, and the exact counterpart of it is the beauty of the object. It is a purely psychological question. There is a particular lacuna in the mental structure of a person which keeps that person restless, unhappy, etc. Though everyone is unhappy in some way, the cause of that unhappiness is not uniform in all cases. The restlessness and unhappiness may be caused by different factors in the case of different persons, and a corresponding object must be presented before that particular type of mind in order that it may be made to feel happy.

What looks beautiful to me may not look beautiful to you. People sometimes get attracted even to ugly things. What you may consider as ugly and uninteresting may be an attractive thing for another person, because he/she is in a different kind of mental make-up. Each one has to find out what it is that attracts. Unless you are hungry, the food will not be satisfying. Your particular kind of hunger will determine the kind of diet that you need.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Jul 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 628 / Vishnu Sahasranama Contemplation - 628


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 628 / Vishnu Sahasranama Contemplation - 628🌹

🌻628. భూశయః, भूशयः, Bhūśayaḥ🌻

ఓం భూశయాయ నమః | ॐ भूशयाय नमः | OM Bhūśayāya namaḥ


లఙ్కాం ప్రతి స పన్థానమన్విష్యన్ సాగరం ప్రతి ।
భూమౌ శేత ఇతి హరిర్భూశయః ప్రోచ్యతే బుధైః ॥

లంకా (సేతునిర్మాణ) విషయమున మార్గము నన్వేషించుచు, ఆ సంధర్భమున సాగరము నుద్దేశించి భూమిపై శయనించిన రామరూపుడగు పరమాత్మ భూశయః.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే ఏకవింశః సర్గః ::
తతః సాగరవేలాయాం దర్భాన్ ఆస్తీర్య రాఘవః ।

అఞ్జలిం ప్రాఙ్గ్ముఖః కృత్వా ప్రతిశిశ్యే మహోదధేః ।
బాహుం భుజగబోగాభమ్ ఉపధాయారిసూదనః ॥ 1 ॥

శత్రుభయంకరుడైన శ్రీరాముడు సముద్రతీరమునందలి ఇసుకతిన్నెపై వాడియైన మొనలుగల దర్భలను పఱచుకొనెను. పిదప ఆ ప్రభువు ప్రాజ్ముఖుడై, సముద్రమునకు అంజలి ఘటించి, సర్పశరీరమువలె మృదువైనదియు, పూర్వము మేలిమి బంగారు ఆభరణములతో అలంకృతమైనదియు అగు తన కుడిచేతిని తలగడగా జేసికొని శయనించెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 628🌹

🌻628.Bhūśayaḥ🌻

OM Bhūśayāya namaḥ

लङ्कां प्रति स पन्थानमन्विष्यन् सागरं प्रति ।
भूमौ शेत इति हरिर्भूशयः प्रोच्यते बुधैः ॥


Laṅkāṃ prati sa panthānamanviṣyan sāgaraṃ prati,
Bhūmau śeta iti harirbhūśayaḥ procyate budhaiḥ.

In His search for a route to reach Lanka, Lord Rāma lay on the ground and hence He is called Bhūśayaḥ.


:: श्रीमद्रामायणे युद्धकाण्डे एकविंशः सर्गः ::

ततः सागरवेलायां दर्भान् आस्तीर्य राघवः ।
अञ्जलिं प्राङ्ग्मुखः कृत्वा प्रतिशिश्ये महोदधेः ।
बाहुं भुजगबोगाभम् उपधायारिसूदनः ॥ १ ॥


Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 21

Tataḥ sāgaravelāyāṃ darbhān āstīrya rāghavaḥ,
Añjaliṃ prāṅgmukhaḥ kr̥tvā pratiśiśye mahodadheḥ,
Bāhuṃ bhujagabogābham upadhāyārisūdanaḥ. 1.

Thereafter Rāma, the annihilator of enemies, spreading sacred grass on the sea shore, making a respectful salutation to the great ocean with his face turned eastward, lied down with his arm, resembling the body of a snake, as his head rest.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


09 Jul 2022

09 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹09, July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి వ్రతం ప్రారంభం, Gauri Vrat Begins (Gujarat) 🌻


🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 4 🍀

7. నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ

8. జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : వాసుదేవుడ్ని అవిద్యా స్వరూపంతో ఉపాసించిన వాడికి మోక్షం కొన్ని యుగాలు పడుతుంది. విద్యా స్వరూపంతో ఉపాసించిన వాడికి ఆ జన్మతోనే అంతమై పోతుంది. 🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల-దశమి 16:40:01 వరకు

తదుపరి శుక్ల-ఏకాదశి

నక్షత్రం: స్వాతి 11:25:43 వరకు

తదుపరి విశాఖ

యోగం: సిధ్ధ 06:48:03 వరకు

తదుపరి సద్య

కరణం: గార 16:34:01 వరకు

వర్జ్యం: 16:40:14 - 18:10:18

దుర్ముహూర్తం: 07:32:43 - 08:25:10

రాహు కాలం: 09:04:31 - 10:42:53

గుళిక కాలం: 05:47:48 - 07:26:09

యమ గండం: 13:59:36 - 15:37:58

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 02:55:20 - 04:28:00

మరియు 25:40:38 - 27:10:42

సూర్యోదయం: 05:47:48

సూర్యాస్తమయం: 18:54:41

చంద్రోదయం: 14:22:40

చంద్రాస్తమయం: 01:16:48

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: తుల

సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

11:25:43 వరకు తదుపరి శుభ యోగం

- కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

09 - JULY - 2022 SATURDAY MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 09, జూలై 2022 శనివారం, స్థిర వాసరే Saturday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 229 / Bhagavad-Gita - 229 - 5- 25 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 628 / Vishnu Sahasranama Contemplation - 628🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 307 / DAILY WISDOM - 307🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 207 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹09, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి వ్రతం ప్రారంభం, Gauri Vrat Begins (Gujarat) 🌻*

*🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 4 🍀*

*7. నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |*
*తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ*
*8. జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |*
*తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : వాసుదేవుడ్ని అవిద్యా స్వరూపంతో ఉపాసించిన వాడికి మోక్షం కొన్ని యుగాలు పడుతుంది. విద్యా స్వరూపంతో ఉపాసించిన వాడికి ఆ జన్మతోనే అంతమై పోతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-దశమి 16:40:01 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: స్వాతి 11:25:43 వరకు
తదుపరి విశాఖ
యోగం: సిధ్ధ 06:48:03 వరకు
తదుపరి సద్య
 కరణం: గార 16:34:01 వరకు
వర్జ్యం: 16:40:14 - 18:10:18
దుర్ముహూర్తం: 07:32:43 - 08:25:10
రాహు కాలం: 09:04:31 - 10:42:53
గుళిక కాలం: 05:47:48 - 07:26:09
యమ గండం: 13:59:36 - 15:37:58
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 02:55:20 - 04:28:00
మరియు 25:40:38 - 27:10:42
సూర్యోదయం: 05:47:48
సూర్యాస్తమయం: 18:54:41
చంద్రోదయం: 14:22:40
చంద్రాస్తమయం: 01:16:48
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: తుల
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
11:25:43 వరకు తదుపరి శుభ యోగం
- కార్య జయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 229 / Bhagavad-Gita - 229 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 25 🌴*

*25. లభన్తే బ్రహ్మనిర్వాణం ఋషయ: క్షీణకల్మషా: |*
*ఛిన్నద్వైధా యతాత్మాన: సర్వభూతహితే రతా: ||*

🌷. తాత్పర్యం :
*అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైనవారును, సర్వజీవహితము కొరకే పనిచేయువారును, సర్వపాపదూరులైనవారును అగు ఋషులే బ్రహ్మనిర్వాణమును పొందుదురు.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాపూర్ణుడే వాస్తవమునాకు సర్వజీవుల హితకార్యమునందు నియుక్తుడైనవాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూలకారణమనెడి నిజజ్ఞానమును కలిగి తద్భావానలో వర్తించినప్పుడు మనుజుడు సర్వుల హితార్థమై వర్తించినవాడగును. శ్రీకృష్ణభగవానుడు దివ్యభోక్త, దివ్యయజమాని, పరమమిత్రుడు అనెడి విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణమై యున్నది. 

కనుక మానవుల యందు ఈ చైతన్యమును జాగృతము చేయుటకై వర్తించుట వాస్తవమునకు అత్యంత ఘనమైన హితకార్యమై యున్నది. బ్రహ్మనిర్వాణమును బడయనిదే ఎవ్వరును అట్టి శ్రేష్ఠమైన క్షేమకరకార్యము నొనరింపలేరు. కృష్ణభక్తిరసభావనాయుతుడు శ్రీకృష్ణుని దేవదేవత్వమున ఎట్టి సందేహమును కలిగియుండడు. అతడు సంపూర్ణముగా పాపదూరుడై యుండుటయే అందులకు కారణము. అదియే దివ్యమైన ప్రేమస్థితి.

మానవుల యొక్క కేవల బాహ్యక్షేమమును చూచుట యందు మాత్రమే నియుక్తుడైనవాడు వాస్తవమునకు ఎవారికినీ హితమును గూర్చలేడు. మనస్సు, దేహములకు కూర్చబడు తాత్కాలిక ఉపశమనము నిత్యతృప్తిని ఎన్నడును కూర్చలేదు. జీవనసంఘర్షణ మందలి కష్టములకు నిజమైన కారణము శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును జీవుడు మరచుటయే. తనకు శ్రీకృష్ణుతోతో గల నిత్యసంబంధమును మనుజుడు సంపూర్ణముగా అవగతము చేసికొనినప్పుడు భౌతికజగమునందు ఉన్నప్పటికిని అతడు ముక్తపురుషుడే కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 229 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 25 🌴*

*25. labhante brahma-nirvāṇam ṛṣayaḥ kṣīṇa-kalmaṣāḥ*
*chinna-dvaidhā yatātmānaḥ sarva-bhūta-hite ratāḥ*

🌷 Translation : 
*Those who are beyond the dualities that arise from doubts, whose minds are engaged within, who are always busy working for the welfare of all living beings and who are free from all sins achieve liberation in the Supreme.*

🌹 Purport :
Only a person who is fully in Kṛṣṇa consciousness can be said to be engaged in welfare work for all living entities. When a person is actually in the knowledge that Kṛṣṇa is the fountainhead of everything, then when he acts in that spirit he acts for everyone. The sufferings of humanity are due to forgetfulness of Kṛṣṇa as the supreme enjoyer, the supreme proprietor and the supreme friend. Therefore, to act to revive this consciousness within the entire human society is the highest welfare work. One cannot be engaged in such first-class welfare work without being liberated in the Supreme. A Kṛṣṇa conscious person has no doubt about the supremacy of Kṛṣṇa. He has no doubt because he is completely freed from all sins. This is the state of divine love.

A person engaged only in ministering to the physical welfare of human society cannot factually help anyone. Temporary relief of the external body and the mind is not satisfactory. The real cause of one’s difficulties in the hard struggle for life may be found in one’s forgetfulness of his relationship with the Supreme Lord. When a man is fully conscious of his relationship with Kṛṣṇa, he is actually a liberated soul, although he may be in the material tabernacle.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 628 / Vishnu Sahasranama Contemplation - 628🌹*

*🌻628. భూశయః, भूशयः, Bhūśayaḥ🌻*

*ఓం భూశయాయ నమః | ॐ भूशयाय नमः | OM Bhūśayāya namaḥ*

*లఙ్కాం ప్రతి స పన్థానమన్విష్యన్ సాగరం ప్రతి ।*
*భూమౌ శేత ఇతి హరిర్భూశయః ప్రోచ్యతే బుధైః ॥*

*లంకా (సేతునిర్మాణ) విషయమున మార్గము నన్వేషించుచు, ఆ సంధర్భమున సాగరము నుద్దేశించి భూమిపై శయనించిన రామరూపుడగు పరమాత్మ భూశయః.*

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే ఏకవింశః సర్గః ::
తతః సాగరవేలాయాం దర్భాన్ ఆస్తీర్య రాఘవః ।
అఞ్జలిం ప్రాఙ్గ్ముఖః కృత్వా ప్రతిశిశ్యే మహోదధేః ।
బాహుం భుజగబోగాభమ్ ఉపధాయారిసూదనః ॥ 1 ॥

శత్రుభయంకరుడైన శ్రీరాముడు సముద్రతీరమునందలి ఇసుకతిన్నెపై వాడియైన మొనలుగల దర్భలను పఱచుకొనెను. పిదప ఆ ప్రభువు ప్రాజ్ముఖుడై, సముద్రమునకు అంజలి ఘటించి, సర్పశరీరమువలె మృదువైనదియు, పూర్వము మేలిమి బంగారు ఆభరణములతో అలంకృతమైనదియు అగు తన కుడిచేతిని తలగడగా జేసికొని శయనించెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 628🌹*

*🌻628.Bhūśayaḥ🌻*

*OM Bhūśayāya namaḥ*

लङ्कां प्रति स पन्थानमन्विष्यन् सागरं प्रति ।
भूमौ शेत इति हरिर्भूशयः प्रोच्यते बुधैः ॥

*Laṅkāṃ prati sa panthānamanviṣyan sāgaraṃ prati,*
*Bhūmau śeta iti harirbhūśayaḥ procyate budhaiḥ.*

*In His search for a route to reach Lanka, Lord Rāma lay on the ground and hence He is called Bhūśayaḥ.*

:: श्रीमद्रामायणे युद्धकाण्डे एकविंशः सर्गः ::
ततः सागरवेलायां दर्भान् आस्तीर्य राघवः ।
अञ्जलिं प्राङ्ग्मुखः कृत्वा प्रतिशिश्ये महोदधेः ।
बाहुं भुजगबोगाभम् उपधायारिसूदनः ॥ १ ॥

Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 21
Tataḥ sāgaravelāyāṃ darbhān āstīrya rāghavaḥ,
Añjaliṃ prāṅgmukhaḥ kr̥tvā pratiśiśye mahodadheḥ,
Bāhuṃ bhujagabogābham upadhāyārisūdanaḥ. 1.

Thereafter Rāma, the annihilator of enemies, spreading sacred grass on the sea shore, making a respectful salutation to the great ocean with his face turned eastward, lied down with his arm, resembling the body of a snake, as his head rest.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 307 / DAILY WISDOM - 307 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 2. అందం యొక్క లక్షణం 🌻*

*వస్తువు యొక్క అందం అనే లక్షణం, ఒక వ్యక్తి యొక్క మనస్సులోని వెలితికి ప్రతిరూపంగా సరిగ్గా సరిపోతుంది. మనస్సులో ఒక రకమైన వెలితి ఉంటుంది మరియు దాని యొక్క ఖచ్చితమైన ప్రతిరూపం వస్తువు యొక్క అందం. ఇది పూర్తిగా మానసిక ప్రశ్న. ఒక వ్యక్తి యొక్క మానసిక నిర్మాణంలో ఒక నిర్దిష్ట లోపము ఉంటుంది, అది ఆ వ్యక్తిని అశాంతిగా, అసంతృప్తిగా ఉంచుతుంది. వివిధ వ్యక్తుల విషయంలో వివిధ కారణాల వల్ల అశాంతి మరియు దుఃఖం ఏర్పడవచ్చు మరియు సంతోషాన్ని కలిగించడానికి ఆ నిర్దిష్ట రకమైన మనస్సు ముందు ఆ సంబంధిత వస్తువును ఉంచాలి.*

*నాకు అందంగా కనిపించేది మీకు అందంగా కనిపించక పోవచ్చు. కొందరు కొన్నిసార్లు అసహ్యకరమైన విషయాలకు కూడా ఆకర్షితులవుతారు. మీరు అందవిహీనంగా మరియు రసహీనంగా భావించేవి మరొక వ్యక్తికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, ఎందుకంటే వారు వేరే రకమైన మానసిక స్థితిలో ఉన్నారు. మనల్ని ఏది ఆకర్షిస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు ఆకలితో ఉంటే తప్ప, ఆహారం సంతృప్తికరంగా ఉండదు. మీ నిర్దిష్ట రకమైన ఆకలి మీకు అవసరమైన ఆహారాన్ని నిర్ణయిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 307 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 2. The Characteristic of Beauty 🌻*

*Beauty is the characteristic of that object which exactly fits in as a counterpart of the lack in the mind of a person. There is a kind of lacuna in the mind, and the exact counterpart of it is the beauty of the object. It is a purely psychological question. There is a particular lacuna in the mental structure of a person which keeps that person restless, unhappy, etc. Though everyone is unhappy in some way, the cause of that unhappiness is not uniform in all cases. The restlessness and unhappiness may be caused by different factors in the case of different persons, and a corresponding object must be presented before that particular type of mind in order that it may be made to feel happy.*

*What looks beautiful to me may not look beautiful to you. People sometimes get attracted even to ugly things. What you may consider as ugly and uninteresting may be an attractive thing for another person, because he/she is in a different kind of mental make-up. Each one has to find out what it is that attracts. Unless you are hungry, the food will not be satisfying. Your particular kind of hunger will determine the kind of diet that you need.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 207 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జనం మంచి మంచి మాటలు వింటారు, అభినందిస్తారు. కానీ అర్థం చేసుకోరు. ఎక్కడ బుద్ధిహీనత, రాజకీయం వున్నాయో అక్కడ జీవితమంతా మొదటి స్థానంలో వుండడానికి ఆరాటపడని వాళు ధన్యులు.🍀*

*పిల్లలు పెద్దల్నించీ నేర్చుకుంటారు. పెద్దలేం చేస్తే పిల్లల్లలది చేస్తారు. మన పిల్లలు హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు చూపే టీవీలు చూస్తున్నారు. 'తెలుసుకుంటున్నారు' దౌర్జన్యాన్ని చూసి దౌర్జన్యం నేర్చుకుంటున్నారు. అక్కడ చూసేదంతా బాహ్యమయినది. లోపలికి చూసేది కాదు. మహాత్ములు మళ్ళీ మళ్ళీ దైవం నీలోనే వుంది అన్నారు. వారి వారి అనుయాయూలు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. ఎంత తెలివి తక్కువతనం.*

*ఎక్కడ బుద్ధిహీనత, రాజకీయం వున్నాయో అక్కడ జీవితమంతా మొదటిస్థానంలో వుండడానికి ఆరాటపడని వాళు ధన్యులు. వాళ్ళు మొదటి స్థానంలో వుంటారు. జనం మంచి మంచి మాటలు వింటారు. వాటిని అభినందిస్తారు. కానీ అర్థం చేసుకోరు. మనం బుద్ధుడు, కృష్ణుడు లాంటి గురువుల్ని కోల్పోయాం. మానవ జాతి చేసుకున్న దురదృష్టమదే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹