🌹 10, JUNE 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 10, JUNE 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 10, JUNE 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 190 / Kapila Gita - 190🌹 
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 44 / 4. Features of Bhakti Yoga and Practices - 44 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 782 / Vishnu Sahasranama Contemplation - 782 🌹 
🌻782. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 743 / Sri Siva Maha Purana - 743 🌹
🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 2 / Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 2 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 362 / Osho Daily Meditations - 362 🌹 
🍀 362. సాహసోపేతంగా ఉండండి / 362. REMAIN ADVENTUROUS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3 🌹 
🌻 459. ‘నళినీ’ - 3 / 459. 'Nalini' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 10, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 01 🍀*
 
*ఓం వేంకటేశో విరూపాక్షో విశ్వేశో విశ్వభావనః |*
*విశ్వసృడ్విశ్వ సంహర్తా విశ్వప్రాణో విరాడ్వపుః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దర్శనం - ఆదేశం - దర్శనం, ఆదేశం అనేవి సాధనలో భగవంతునికి చాల దూరంలో ఉన్న స్థితిని సూచిస్తాయి. ప్రాణమనః కోశాలు దర్శనం ద్వారా భగవత్సంసర్గనూ, ఆదేశం ద్వారా భగవదాలంబననూ, పొందాలని ఆశించడం జరుగుతుంది. కాని, ఈ ప్రాణమనో భూమికలు సామాన్యంగా అపరి శుద్ధములైన కారణాన, పొరపాట్లు సంభవించడానికి వీలున్నది. ఈ భూమికలు రూపాంతరం చెందితే తప్ప, కర్మక్షేత్రంలో భగవత్సంయోగ రూపమైన పూర్ణ సత్యప్రాప్తి కలుగనేరదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ సప్తమి 14:03:29 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: శతభిషం 15:40:08 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: వషకుంభ 12:48:15
వరకు తదుపరి ప్రీతి
కరణం: బవ 14:05:29 వరకు
వర్జ్యం: 21:45:52 - 23:17:20
దుర్ముహూర్తం: 07:26:12 - 08:18:47
రాహు కాలం: 08:58:14 - 10:36:50
గుళిక కాలం: 05:41:01 - 07:19:37
యమ గండం: 13:54:04 - 15:32:40
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 08:55:00 - 10:25:00
మరియు 30:54:40 - 32:26:08
సూర్యోదయం: 05:41:01
సూర్యాస్తమయం: 18:49:54
చంద్రోదయం: 00:37:16
చంద్రాస్తమయం: 11:47:50
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 15:40:08 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 190 / Kapila Gita - 190 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 44 🌴*

*44. తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికామ్|*
*దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్ఠతే॥*

*తాత్పర్యము : కావున, భగద్భక్తుడు జీవుల స్వరూపములలో దాగియున్న కార్యకారణరూపముగా పరిణమించెడు భగవంతుని అచింత్యమగు మాయాశక్తిని భగవదనుగ్రహముచే జయించి, తన వాస్తవస్వరూపము అగు పరబ్రహ్మమునందు ప్రతిష్ఠితుడై యుండును.*

*వ్యాఖ్య : వంకర కట్టెలో గానీ, పొడుగు కట్టెలో గానీ ఒకే నిప్పు చాలారకాలుగా కంపిస్తుంది. అలాగే ఆత్మ కూడా చాలా రకాలుగా కనపడుతుంది. ఈ ప్రకృతి దైవీం (దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా- గీత). ఇది కార్య కారణ రూపములో ఉంటుంది. ఇది మన ఊహకు అందదు. అలాంటి ప్రకృతిని విడిచిపెట్టిన వాడే స్వస్వరూపముతో ఉండగలడు. ప్రకృతిని వదిలిపెట్టాకే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలడు. ప్రకృతి వదిలి పెట్టాలంటే కార్య కారణం గురించి అర్థం కావాలి. ప్రకృతి పురుషున్ని విడిచిపెట్టదు కదా అని దేవహూతి అడిగిన ప్రశ్నకు సమాధానముగా కపిలుడు చెప్పిన సమాధానం ఇది.*

*శ్రీమద్భాగవత మహాపురాణము నందలి తృతీయ స్కంధము నందు "భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు" అను ఇరువది ఎనిమిది అధ్యాయము సమాప్తము.*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 190 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 44 🌴*

*44. tasmād imāṁ svāṁ prakṛtiṁ daivīṁ sad-asad-ātmikām*
*durvibhāvyāṁ parābhāvya svarūpeṇāvatiṣṭhate*

*MEANING : Thus the yogī can be in the self-realized position after conquering the insurmountable spell of māyā, who presents herself as both the cause and effect of this material manifestation and is therefore very difficult to understand.*

*PURPORT : It is stated in Bhagavad-gītā that the spell of māyā, which covers the knowledge of the living entity, is insurmountable. However, one who surrenders unto Kṛṣṇa, the Supreme Personality of Godhead, can conquer this seemingly insurmountable spell of māyā. Here also it is stated that the daivī prakṛti, or the external energy of the Supreme Lord, is durvibhāvyā, very difficult to understand and very difficult to conquer. One must, however, conquer this insurmountable spell of māyā, and this is possible, by the grace of the Lord, when God reveals Himself to the surrendered soul. It is also stated here, svarūpeṇāvatiṣṭhate. Svarūpa means that one has to know that he is not the Supreme Soul, but rather, part and parcel of the Supreme Soul; that is self-realization. To think falsely that one is the Supreme Soul and that one is all-pervading is not svarūpa. This is not realization of his actual position. The real position is that one is part and parcel. It is recommended here that one remain in that position of actual self-realization. In Bhagavad-gītā this understanding is defined as Brahman realization. After Brahman realization, one can engage in the activities of Brahman. As long as one is not self-realized, he engages in activities based on false identification with the body. When one is situated in his real self, then the activities of Brahman realization begin.*

*With this, Chapter "Features of Bhakti Yoga and Practices" End.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 782 / Vishnu Sahasranama Contemplation - 782🌹*

*🌻782. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ🌻*

*ఓం శుభాఙ్గాయ నమః | ॐ शुभाङ्गाय नमः | OM Śubhāṅgāya namaḥ*

*ధ్యేయత్వాచ్ఛోభనై రఙ్గైః శుభాఙ్గః ఇతి కథ్యతే*

*శోభనములగు అందమైన అంగములతో కూడిన సుందర రూపుడిగా భక్తుల సుద్ధాంతఃకరణములతో ధ్యానము చేయబడ దగిన వాడు కనుక శుభాంగః.*

*దుంధుభి ధ్వనివలె గంభీరమైన కంఠ స్వరము కలవాడు. నిగనిగలాడు శరీర ఛాయ కలవాడు. ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండ పరిపుష్టములైన చక్కని అంగములు కలవాడు. మేఘ శ్యామ వర్ణ శోభితుడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 782🌹*

*🌻782. Śubhāṅgaḥ🌻*

*OM Śubhāṅgāya namaḥ*

ध्येयत्वाच्छोभनै रङ्गैः शुभाङ्गः इति कथ्यते / 
*Dhyeyatvācchobhanai raṅgaiḥ śubhāṅgaḥ iti kathyate*

*As He has to be meditated by devotees as having beautiful well formed limbs, He is called Śubhāṅgaḥ.*

*He has a voice like the sound of a kettle-drum. He has a shining skin. He is full of splendor. He is square-built. His limbs are built symmetrically. He is endowed with a dark-brown complexion.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥
శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥
Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,Indrakarmā mahākarmā kr‌takarmā kr‌tāgamaḥ ॥ 84 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 743 / Sri Siva Maha Purana - 743 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴*
*🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 2 🌻*

ఇంద్రుడిట్లు పలికెను -

ఓయీ! నీవెవరిని? ఎచటనుండి వచ్చితివి? నీ పేరేమి? సత్యమును పలుకుము. శంబుడు తన ధామునందే ఉన్నాడా? లేక ఆ ప్రభుడు ఎచటి కైననూ వెళ్లియున్నాడా? (10)

సనత్కుమారుడిట్లు పలికెను -

ఇంద్రుడిట్లు ప్రశ్నించగా ఆ తాపసుడు ఏమియూ పలుకలేదు. ఇంద్రుడు మరల ప్రశ్నించగా ఆ తాపసుడు సమాధానము నీయలేదు (11). లోకములకు ప్రభువగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. మహాయోగి, లీలచే వివిధరూపములను దరించువాడు అగు ఆ ప్రభుడు మిన్నకుండెను (12). ఈ విధముగా ఇంద్రుడు అనేక పర్యాయములు ప్రశ్నించెను. కాని దిగంబరుడగు ఆ భగవానుడు ఇంద్రుని జ్ఞానమును పరీక్షింప గోరి, ఏమియు పలుకలేదు (13). ముల్లోకముల ఐశ్వర్యముచే గర్వించియున్న దేవేంద్రుడు అపుడు కోపించి, ఆ జటాధారిని గద్దించి ఇట్లు పలికెను (14).

ఇంద్రుడిట్లు పలికెను -

ఓరీ! నేను ప్రశ్నించు చున్ననూ నీవు ఉత్తరము నీయకున్నావు. కావున నిన్ను వజ్ర ముతో సంహరించెదను. ఓరీ దుర్బుద్ధీ! నిన్ను కాపాడు వారెవరు గలరు? (15)

సనత్కుమారుడిట్లు పలికెను -

వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి ఆతనిని సంహరించుటకు వజ్రమును పైకి ఎత్తెను (16). ఇంద్రుడు వజ్రమును ఎత్తుటను గాంచి, సదా మంగళస్వరూపుడగు శంకరదేవుడు ఆ వజ్రపు దెబ్బను స్తంభింపజేసెను. (17). అపుడు రుద్రుడు క్రోధావేశమును పొంది, భయంకరమగు కన్నులు గలవాడై తేజస్సుతో దహించి వేయునా యన్నట్లు మండిపడెను (18). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 743🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴*

*🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 2 🌻*

Indra said:—
10. O, who are you? Where have you come from? What is your name? Tell me truly. Is the lord Śiva in his apartment or has he gone anywhere?

Sanatkumāra said:—
11. O sage, on being asked by Indra thus, he did not say anything. Indra asked him again. But the naked person did not say anything.

12. Indra, the supreme lord of the worlds, asked again. The lord the great Yogin who assumes forms variously kept quiet.

13. The naked lord, though asked repeatedly by Indra, did not say anything, for he wanted to test the knowledge of Indra.

14. Then the lord of Gods, proud of the wealth of the three worlds, became enraged. Rebuking the lord with matted hair he spoke these words.

Indra said:—
15. “O evil-minded one, though asked you did not reply to me. Hence I am going to kill you with my thunderbolt. Who can save you?”

Sanatkumāra said:—
16. After saying this and looking at him ferociously Indra raised his thunderbolt in order to kill him.

17. On seeing Indra lifting up his thunderbolt, Śiva prevented the fall of the thunderbolt by making his hand benumbed.

18. Then Śiva became furious. His eyes became terrible. He blazed with his burning splendour.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 362 / Osho Daily Meditations  - 362 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 362. సాహసోపేతంగా ఉండండి 🍀*

*🕉. ఎల్లప్పుడూ సాహసోపేతంగా ఉండండి. జీవితం అన్వేషకులుగా ఉన్నవారికి చెందినదని ఒక్క క్షణం కూడా మర్చిపోకండి. ఇది స్థిరత్వానికి చెందినది కాదు; అది ప్రవహించేది. ఎప్పుడూ సరస్సుగా మారవద్దు; ఎప్పుడూ నదిగానే వుండండి. 🕉*

*మనస్సు కొత్తదనాన్ని తట్టుకోలేదు. అది ఏమిటో గుర్తించలేము, దానిని వర్గీకరించలేము, దానిపై లేబుల్స్ పెట్టలేము; అది కొత్తది అబ్బురపరుస్తుంది. ఏదైనా కొత్త విషయం ఎదురైనప్పుడు మనస్సు తన సమర్ధతను కోల్పోతుంది. గతంతో, పాతవాటితో, సుపరిచితమైన వాటితో, మనసు చాలా తేలికగా ఉంటుంది, ఎందుకంటే అది ఏమిటో, ఎలా చేయాలో, ఏమి చేయాలో, ఏది చేయకూడదో దానికి తెలుసు. తెలిసిన వాటిలో ఇది పరిపూర్ణమైనది; అది బాగా తెలిసిన వాతావరణంలో మసలుతోంది. చీకటిలో కూడా అది కదలగలదు; పరిచయమున్న వాతావరణం మనస్సు భయపడకుండా ఉండటానికి సహాయపడుతుంది. కానీ అర్థం చేసుకోవలసిన సమస్యల్లో ఇది ఒకటి: మనస్సు ఎల్లప్పుడూ తెలిసిన వాటితో మాత్రమే భయపడదు, అది మిమ్మల్ని ఎదగనివ్వదు.*

*ఎదుగుదల కొత్తదానితో ఉంటుంది మరియు మనస్సు పాత వాటికి మాత్రమే భయపడదు. కాబట్టి మనసు పాతవాటిని అంటిపెట్టుకుని కొత్తవాటికి దూరంగా ఉంది. పాతది జీవితానికి పర్యాయపదంగా కనిపిస్తుంది, మరియు కొత్తది మరణానికి పర్యాయపదంగా కనిపిస్తుంది; అది విషయాలను చూసే మనస్సు యొక్క మార్గం. మనసును పక్కన పెట్టాలి. జీవితం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రతిదీ మారుతోంది: ఈ రోజు అది ఉంది, రేపు అది ఉండకపోవచ్చు. మీరు దాన్ని మళ్లీ చూడవచ్చు; ఎప్పుడన్నది ఎవరికి తెలుసు? దీనికి నెలలు, సంవత్సరాలు లేదా జీవితాలు పట్టవచ్చు. కాబట్టి అవకాశం తలుపు తట్టినప్పుడు, దానితో వెళ్లండి. ఇది ప్రాథమిక చట్టంగా ఉండనివ్వండి: ఎల్లప్పుడూ పాతదాని కంటే కొత్తదాన్ని ఎంచుకోండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 362 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 362. REMAIN ADVENTUROUS 🍀*

*🕉. Always remain adventurous. Never forget for a single moment that l!fe belongs to those who are explorers. It does not belong to the static; it belongs to the flowing. Never become a reservoir; always remain a river.  🕉*

*The mind cannot cope with the new. It cannot figure out what it is, it cannot categorize it, it cannot put labels on it; it is puzzled by the new. The mind loses all its efficiency when it confronts something new. With the past, with the old, with the familiar, the mind is very at ease, because it knows what it is, how to do, what to do, what not to do. It is perfect in the known; it is moving in well-traveled territory. Even in darkness it can move; the familiarity helps the mind to be unafraid. But this is one of the problems to be understood: Because the mind is always unafraid only with the familiar, it does not allow you growth.*

*Growth is with the new, and the mind is only unafraid of the old. So the mind clings to the old and avoids the new. The old seems to be synonymous with life, and the new seems to be synonymous with death; that is the mind's way of looking at things. You have to put the mind aside. Life never remains static. Everything is changing: Today it is  there, tomorrow it may not be. You may come across it again; who knows when? Maybe it will take months, years, or lives. So when an opportunity knocks at the door, go with it. Let this be a fundamental law: Always choose the new over the old.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 459 - 3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 459  - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 459. ‘నళినీ’ - 3 🌻* 

*పరబ్రహ్మమునకు, సగుణ బ్రహ్మమునకు నడుమ నిర్గుణ బ్రహ్మమున్నదని పెద్దలు పలుకుదురు. ఇందు పదు నాలుగు స్థితులున్నట్లుగ పరమ గురువు మాస్టర్ సి.వి.వి. వివరించినారు. తల్లి నుండి బిడ్డకు యేర్పడు సంబంధమిది. అన్నింటినీ అనుసంధాన మొనర్చు తత్త్వము. ఇట్టి సృష్టి నాళము శ్రీమాత గనుక నళినీ అని పిలుతురు. నల మహారాజుచే ఆరాధింపబడిన దేవి అగుటచే శ్రీమాతను నళిని అనుట కూడ కద్దు. నలుడు యుధిష్ఠిరుని వలె ధర్మమూర్తి. అతడు శ్రీమాత భక్తుడు. శ్రీమాత ఆరాధనమున నిలచి కష్టనష్టములను ఓర్పుతో భరించి, కృతకృత్యుడై శాశ్వతమగు యశోకీర్తులను పొందెను. శాశ్వత దివ్యమూర్తియై నిలచెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 459 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 459. 'Nalini' - 3 🌻*

*Elders say that between Parabrahman ( The absolute) and Saguna Brahma ( The creation with Gunas) is Nirguna Brahma( The creation beyond Gunas). There are fourteen such states as Param Guru Master C.V.V. Explained. It is a relationship between a mother and child. A philosophy that connects everything. Such vessel of creation is Srimata. Hence she is called Nalini. The goddess worshiped by Nala Maharaja is also known as Nalini. Nala is a righteous like Yudhisthira. He is a devotee of Sri Mata. He stood in the worship of Sri Mata and bore the hardships with patience and got eternal glory as a result. He stood as the Eternally glorious.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

Siva Sutras - 096 - 2-06. guru rupāyah - 3 / శివ సూత్రములు - 096 - 2-06. గురు రూపాయః - 3


🌹. శివ సూత్రములు - 096 / Siva Sutras - 096 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-06. గురు రూపాయః - 3 🌻

🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువు సాధనం. 🌴


ఆధ్యాత్మిక మార్గంలో, ప్రాథమికాలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే, అది ఆశించేవారిని ఎక్కడికీ నడిపించదు. అతను అదే స్థాయిలో ఇరుక్కుపోయి ముందుకు సాగలేడు. పురోగతి లేకపోవడం వల్ల అతను నిరాశ చెందుతాడు మరియు ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటాడు, తద్వారా విముక్తిని పొందే గొప్ప అవకాశాన్ని కోల్పోతాడు. అందుకే గురువు యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గురువు స్వీయ-సాక్షాత్కారమైన వ్యక్తి అయితే, అతను తన శిష్యుడిని అంతిమ సత్యం గ్రహించడానికి సరైన మార్గంలో తీసుకువెడతాడు. ఎవరి అనుగ్రహం ద్వారా శివుడు సాక్షాత్కరిస్తాడో ఆ శక్తి ఒక గురువు రూపంలో వ్యక్తమవుతుందని కూడా చెప్పవచ్చు. ఈ వివరణ రెండు విషయాలను నిర్ధారిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 096 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-06. guru rupāyah - 3 🌻

🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self. 🌴


In Spiritual Path, If the basics are not understood properly, it leads the aspirant nowhere. He gets stuck at the same level and unable to proceed further. Because of the lack of progression he becomes frustrated and decides to deviate from spiritual path, thereby losing a great opportunity to attain liberation. That is why the need of a guru is emphasised. If the guru is a Self-realised person, he will take his disciple through the correct path to realise the Ultimate Reality. It can also be said that Śaktī, through whose grace Śiva is realised, manifests in the form of a guru. This interpretation confirms two things.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 359


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 359 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనసు స్వంత బుద్ధి లేనిది. నీకు వాస్తవానికి చెందిన అంతర్దృష్టి నివ్వదు. అది గ్రహించడానికి నీ హృదయం పని చేయాలి. ప్రేమ అంటే హృదయ స్పందన తప్ప మరొకటి కాదు. 🍀


ప్రేమించే హృదయమే అస్తిత్వ హృదయాన్ని స్పర్శిస్తుంది. మనసు బోలుది. పైపైది. మనసుకు లోతులు తెలీవు. ఎత్తులు తెలీవు. శిఖరాలూ తెలీవు. లోయలూ తెలీవు. మనసు బుద్ధి లేనిది. స్వంత బుద్ధి లేనిది. నీకు వాస్తవానికి చెందిన అంతర్దృష్టి నివ్వదు. అది గ్రహించడానికి నీ హృదయం పని చేయాలి. ప్రేమ అంటే హృదయస్పందన తప్ప మరొకటి కాదు. దాని పాట అది పాడటానికి హృదయాన్ని అనుమతించు. దాన్ని మనసు ఖండించినా లెక్క పెట్టకు. దాని పని ఖండించడమే. బాధా సందర్భంలో కూడా హృదయం గానం చెయ్యనీ. ఇది సందర్భమా? అట్లా పాడొచ్చా? అని మనసన్నా లెక్కపెట్టకు.

నీ హృదయం పాడనీ, ఆడనీ, పరవశించనీ మనసు నించీ కుక్కలు మొరగనీ. అది సహేతుకం కాదని అరచి గీపెట్టనీ. లెక్కపెట్టకు. అది లోపలి కవిత్వాన్ని ఖండిస్తుంది. లోపలి ప్రేమని ఖండిస్తుంది. నిన్ను హృదయం నించి లాగెయ్యడానికి ప్రయత్నిస్తుంది. దాని మాట వినకు. ఆడు, పాడు, ఆనందించు. అట్లా చేస్తూ వుంటే మనసు ఒకరోజు ఆశ్చర్యపోతుంది. కుక్కలు మొరగడం ఆపుతాయి. కుక్కలు అదృశ్యమవుతాయి. అది గొప్ప ఆశీర్వాదం అందిన రోజు. పూలు నీపై వర్షించిన రోజు. అస్తిత్వం అన్ని రకాలయిన ఆనందాల్ని నీ మీద వర్షిస్తుంది. నువ్వు సంపూర్ణతతో సంధానం చెందుతావు. అనంతంతో నీకు అనుబంధ మేర్పడుతుంది. నువ్వు రుషివవుతావు. అది నీకు అంతర్నేత్రాన్నిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹




DAILY WISDOM - 94 - 3. What is Gravitation if not a Spiritual Urge? / నిత్య ప్రజ్ఞా సందేశములు - 94 - 3. ఆధ్యాత్మిక కోరిక కాకపోతే గురుత్వాకర్షణ అంటే ఏమిటి?




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 94 / DAILY WISDOM - 94 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 3. ఆధ్యాత్మిక కోరిక కాకపోతే గురుత్వాకర్షణ అంటే ఏమిటి? 🌻


ప్రతి జీవం యొక్క మూలం విశ్వం లోని ఇతర జీవుల ఉనికి యొక్క మూలాలతో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా ప్రతి జీవి , ఇతర జీవుల ఉనికిలో మమేకమవ్వడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సంకల్పానికి నాంది. ఆధ్యాత్మిక ప్రేరణ కాకపోతే గురుత్వాకర్షణ అంటే ఏమిటి? ఆధ్యాత్మికం కాకపోతే భూమిని సూర్యుని చుట్టూ తిప్పే ఈ శక్తి ఏమిటి? గురుత్వాకర్షణ శక్తి ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందో మనం ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే ఇది భౌతిక వి మాత్రమే తెలుసు.

కానీ, అదంతా కేవలం రకరకాల పేర్లు వల్ల వచ్చిన ప్రశ్నలు. మనం దానిని భౌతికంగా, మానసికంగా, సామాజికంగా, నైతికంగా, నైతికంగా లేదా ఆధ్యాత్మికంగా పిలుస్తాము. విషయం ఏమిటంటే, ఇది ముఖ్యంగా ఏమిటి? నైతిక శక్తి యొక్క ఆకర్షణ, మానసిక విషయాల యొక్క ఆకర్షణ, ప్రేమ మరియు ఆప్యాయత యొక్క ఆకర్షణ వంటి ఏదైనా ఆకర్షణలు ఎందుకు ఉన్నాయి? ఒక వస్తువును మరొకదాని వైపుకు లాగడం ఏమిటి? ఏదైనా ఏదో ఒక కేంద్రం వైపు ఎందుకు ఆకర్షింపబడాలి? ఈ ఆకర్షణ వెనుక ఉద్దేశం ఏమిటి, మరియు రహస్యం ఏమిటి?


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 94 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 3. What is Gravitation if not a Spiritual Urge? 🌻


There is a struggle of every individual structure or pattern to communicate itself with other such centres of force, and it is this tendency within the individual patterns or structures to melt into the being of others that is the beginning of all spiritual aspiration. What is gravitation if not a spiritual urge? What is this force that pulls the Earth round the Sun if it is not spiritual? We may wonder how the force of gravitation can be spiritual, because it is known to be a physical phenomenon.

But, it is all a question of nomenclature. We may call it physical, psychological, social, ethical, moral, or spiritual, as we like. The point is, what is it essentially? Why is there any pull at all—the pull of moral force, the pull of psychic contents, the pull of love and affection? What is it that pulls one thing towards another? Why is it that anything should gravitate towards some centre? What is the intention, what is the purpose, what is the motive and what is the secret behind this urge?


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 229 / Agni Maha Purana - 229


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 229 / Agni Maha Purana - 229 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 68

🌻. ఉత్సవవధి కథనము -1 🌻


హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవము లేని దేవతాప్రతిష్ఠ నిష్ఫలము, అందుచే దేవతాస్థాపనము చేసిన సంవత్సరమునందే ఏక రాత్రోత్సవము లేదా త్రిరాత్రోత్సవము లేదా అష్ఠరాత్రోత్సవము చేయవలెను. అయనసమయమునందు గాని, విషువసంక్రాంతి సమయమునందు గాని శయనోపవనమునందు లేదా దేవతా గృహమునందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగలాంకురారోపణము, నృత్యగీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. అంకురారోపణమునకు మూకుళ్ళు ఉత్తమమైనవి. యవ - శాలిజ - తిల - ముద్గగోధూమ - శ్వేతసర్షప - కులత్థ - మాష - నిష్పావములు కడిగి చల్లవలెను.

దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాదిదిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులకు పూర్వాదిదిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించు వారికి అడుగడుగునకు అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును, కొంచెమైనను సందేహము లేదు. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో - ''దేవశ్రేష్ఠా! రేపు నీ తీర్థ యాత్ర జరుపవలసి యున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చుటకై నీవు సర్వదా సమర్ధుడవు అని నివేదించి ఉత్సవకార్యము ప్రారంభింపవలెను. నాలుగు స్తంభములు గలదియు అంకురములున్న ఘటముతో కూడినదియు అలంకరింపబడినదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్య భాగమున స్వస్తికము ప్రతిమనుంచి, తన కోరికను వ్రాసి చిత్రములపై స్థాపించి అధివాసము చేయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 229 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 68

🌻Mode of taking out a procession and celebration of festivals -1 🌻

The Lord said:

1. I shall describe the celebration of festival after the image has been installed. It shall be for a night, or three or five nights.

2-3. Without the festival the installation would become fruitless. The festival for the deity [i.e., utsava] should be celebrated when the sun enters the solstitial or the equinoctial points in the bedchamber or garden or it may be done in favour of the person at whose instance the ceremony is performed with the sowing of auspicious seeds and the notes of sacred music.

4-5. An earthen vessel, a small water pot or an embankment are suitable for the sowing of seeds. Grains of barley, uncultivated rice, sesamum, green gram, wheat, white mustard, horsegram, and black gram should be winnowed, washed and sown. Offerings should be made in the east and other directions. Lighted lamps should be carried round the edifice in the night.

6. (Offering should be made) to Indra, Kumuda and other -deities and spirits. They visit the place assuming shapes of men.

7. (One who carries such lamps) certainly gets the merit of (doing) aśvamedha (horse sacrifice) for every step he places. The priest should submit to the lord (as follows) after his return.

8. “O Lord! best among the Gods! you have to be taken in a procession tomorrow [i.e., tīrtha-yātrā]. By all means you deserve to permit us O Lord! to commence the same.

9. Having informed the lord in this way the festivities should be undertaken. The platform should be decorated with young shoots of plants and small water-jar.

10-11. Four pillars (should be erected). The image should be placed in a svastika (figure) (drawn) in their midst. Or desired objects should be painted and placed there and the act of making the deity present in the image should be done with the vaiṣṇava mantra. (The image) should be anointed with ghee with (the recitation of) the principal (mantra). Or the wise man should arrange an incessant flow of ghee over the image the whole night.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 382: 10వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 382: Chap. 10, Ver. 10

 

🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 10 🌴

10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||


🌷. తాత్పర్యం :

ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును.

🌷. భాష్యము :

“బుద్ధియోగమ్” అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచు తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లుయు పలికియున్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసికొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగమనగా కృష్ణభక్తిరసభావనలో కర్మనొనర్చుట యనియే భావము. అదియే అత్యుత్తమబుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి యనగా తెలివి మరియు యోగమనగా యోగకర్మలు. భగవద్దామమునకు చేరగోరి మనుజుడు కృష్ణభక్తిభావనలో భక్తియుక్తసేవయందు నిలిచినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతికజగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి యనుదాని చరమప్రయోజనము శ్రీకృష్ణుడే. కాని జనసామాన్యము ఈ విషయము నెరుగరు. కనుకనే గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై యున్నది. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమగమ్యమని తెలిసికొనవలసియున్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి, నెమ్మదిగా అయినప్పటికిని క్రమముగా ప్రయాణించినచో అంతిమలక్ష్యము ప్రాప్తించగలదు.

మానవుడు జీవితలక్ష్యము నెరిగియు తన కర్మ ఫలముల యెడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించినవాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడే గమ్యమని తెలిసియు, కృష్ణుని అవగతము చేసికొనుటకు మానసికకల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించినవాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినపుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించినవాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై యున్నది. ఇదియే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణస్థితి. మనుజుడు ఆధ్యాత్మిక గురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మికసంఘముతో సంబంధమును కలిగయున్నను ఒకవేళ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా అతడు అంత్యమున తనను చేరురీతిలో శ్రీకృష్ణుడే అతనికి అంతర్యమున ఉపదేశములొసగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 382 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 10 🌴

10. teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam
dadāmi buddhi-yogaṁ taṁ yena mām upayānti te


🌷 Translation :

To those who are constantly devoted to serving Me with love, I give the understanding by which they can come to Me.

🌹 Purport :

In this verse the word buddhi-yogam is very significant. We may remember that in the Second Chapter the Lord, instructing Arjuna, said that He had spoken to him of many things and that He would instruct him in the way of buddhi-yoga. Now buddhi-yoga is explained. Buddhi-yoga itself is action in Kṛṣṇa consciousness; that is the highest intelligence. Buddhi means intelligence, and yoga means mystic activities or mystic elevation. When one tries to go back home, back to Godhead, and takes fully to Kṛṣṇa consciousness in devotional service, his action is called buddhi-yoga. In other words, buddhi-yoga is the process by which one gets out of the entanglement of this material world. The ultimate goal of progress is Kṛṣṇa. People do not know this; therefore the association of devotees and a bona fide spiritual master are important.

One should know that the goal is Kṛṣṇa, and when the goal is assigned, then the path is slowly but progressively traversed, and the ultimate goal is achieved. When a person knows the goal of life but is addicted to the fruits of activities, he is acting in karma-yoga. When he knows that the goal is Kṛṣṇa but he takes pleasure in mental speculations to understand Kṛṣṇa, he is acting in jñāna-yoga. And when he knows the goal and seeks Kṛṣṇa completely in Kṛṣṇa consciousness and devotional service, he is acting in bhakti-yoga, or buddhi-yoga, which is the complete yoga. This complete yoga is the highest perfectional stage of life.

🌹 🌹 🌹 🌹 🌹


09 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 09, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 48 🍀

48. మఙ్గలం కరుణాపూర్ణే మఙ్గలం భాగ్యదాయిని ।
మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : భగవదభివ్యక్తిని గ్రహించే మార్గాలు - భగనదభివ్యక్తిని సాధకుడు తన చక్షురాది ఇంద్రియములలో ఏ ఒక దాని చేతనైననూ గ్రహించవచ్చును. లేక, తన ఆత్మ యందలి ఎరుకలో నైనను గ్రహించవచ్చును. సంపూర్ణాభివ్యక్తి యందు మాత్రం, దర్శనం, శ్రవణం, స్పర్శనం మొదలైనవి అన్నీ ఉంటాయి. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ షష్టి 16:22:06 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: ధనిష్ట 17:10:04 వరకు

తదుపరి శతభిషం

యోగం: వైధృతి 15:46:17 వరకు

తదుపరి వషకుంభ

కరణం: వణిజ 16:24:06 వరకు

వర్జ్యం: 23:55:00 - 25:25:00

దుర్ముహూర్తం: 08:18:40 - 09:11:15

మరియు 12:41:33 - 13:34:07

రాహు కాలం: 10:36:41 - 12:15:16

గుళిక కాలం: 07:19:31 - 08:58:06

యమ గండం: 15:32:25 - 17:11:00

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41

అమృత కాలం: 07:33:14 - 09:01:58

సూర్యోదయం: 05:40:57

సూర్యాస్తమయం: 18:49:35

చంద్రోదయం: 23:56:20

చంద్రాస్తమయం: 10:48:02

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: ధాత్రి యోగం - కార్య

జయం 17:10:00 వరకు తదుపరి

సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹