శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 345-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 345 -1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 345-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 345 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 345-1. 'క్షేత్రపాల సమర్చితా'🌻

క్షేత్ర పాలకులచే ఆరాధింపబడునది శ్రీమాత అని అర్థము. పాలనము క్షాత్రధర్మము. పాలించుటకు పాలనా జ్ఞానము అవసరము. అట్టి జ్ఞానము కలుగవలెనన్నచో శ్రీమాతను ఆరాధించ వలెను. మానవ శరీరముల నుండి దివ్య శరీరముల వరకు గల రూపము లన్నింటినీ పోషించు కొనుటకు, రక్షించు కొనుటకు ఆయా జీవులయందే పాలక ప్రజ్ఞగా శ్రీమాత వసించు చున్నది. ఆమె నారాధన చేసినవారికి ఆ ప్రజ్ఞ మేల్కాంచి రక్షణ పోషణాదులు జరుగుచుండును. పశు రూపములలో నున్న జీవులు కూడ తమను తామిట్లే పోషించుకొనుచు రక్షించుకొను చున్నారు. ఆహారమునకై తిరుగాడు పీత సహితము అలికిడవగానే కన్నములో దూరును. అట్లే ఇతర జీవులును.

మానవులు జీవిత మంతయూ శరీర పోషణము, రక్షణము కొరకు పాటు పడుచుందురు. అది వారి కర్తవ్యమై నిలచినది. ఈ కర్తవ్య నిర్వహణము సరిగ జరుగవలెనన్నచో శ్రీమాత రక్షింపవలెను. అపుడు శ్రీమాత తదనుగుణమగు సంకల్పమును, జ్ఞానమును, క్రియా శక్తిని ప్రసాదించును. అట్టివారే వారి వారి శరీరములందు సుఖ పడుదురు. తమ శరీరములనే కాక ఇతరులను కూడ రక్షించుట, పోషించుట, ఒక దేశమునకు, ఒక లోకమునకు రక్షణ పోషణ కల్పించుట కూడ పాలక శక్తియే. ఇట్టి వారిలో శ్రేష్ఠులు దిక్పాలకులు, లోకపాలకులు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 345-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻

🌻 345-1. Kṣetra-pāla-samarcitā क्षेत्र-पाल-समर्चिता (345) 🌻

She is worshipped by Kṣetra-pāla-s. Kṣetra, as discussed in nāma 341 is the body. Pāla means the Protector. This body is protected by pañcabhūta (the five elements viz. akash, air, fire, water and earth). Each of these elements is represented by a demigod. She is worshipped by them. This appears to be the appropriate interpretation.

There is an interesting story associated with this nāma. Goddess Kālī was created by Śiva to slain a demon called Dāruka. Even after killing him, the ferocity of Her anger could not be controlled. The entire universe was rattled by Her anger. To appease Her anger Śiva Himself assumed the form of an infant. After all She is the Supreme Mother. She started feeding the child (Śiva). While suckling, Śiva also sucked Her anger. This child is called Kṣetrapāla, because He protected this universe from a catastrophe. She was worshipped by this Kṣetrapāla.

The place where major yajña rituals take place is also called kṣetra and the god who protects it is called Kṣetrapāla and She is worshipped by him.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Feb 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జీవుని - నారాయణుని - నిద్ర - 2 🌻

నదిలో బిందె మునిగి పోయినపుడు బిందెలోని నీరు మాత్రమే బిందె ఆకారమునకు బద్ధము. నదిలోని నీరు బిందె కతీతము. అది బిందెలోనికి వచ్చుచు పోవుచున్నను ... వచ్చినపుడు బద్ధముగను, వెలువడి నపుడు అతీతముగను వర్తించు చుండును . బిందెయే ప్రవాహమున కధీనము.

అట్లే నారాయణుడు జీవస్థితిగా బద్ధుడై అంతర్యామిగా అతీతుడై క్రీడించుచుండును. జీవులు అతని సృష్టి, స్థితి, లయముల కాల ప్రవాహమున పరాధీనులై వర్తింతురు....

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

05 Feb 2022

శ్రీ శివ మహా పురాణము - 515

🌹 . శ్రీ శివ మహా పురాణము - 515 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

తరువాత హిమవంతుని ప్రియురాలు, సాధ్వియగు మేన సంజ్ఞను పొంది మిక్కిలి సంక్షోభమును పొందినదై రోదించి ఆ వివాహమును తిరస్కరించెను (1). ఆమె మిక్కిలి దుఃఖమును పొందినదై ముందుగా తన కుమారులను అనేక పర్యాయములు నిందించి, తరువాత తన కుమార్తెతో పరుష వచనములను పలికెను (2).

మేన ఇట్లు పలికెను-

ఓ మునీ! శివాదేవి శివుని వరించగలదు అని పూర్వము నీవు చెప్పితివి. తరువాత హిమవంతునకు కర్తవ్యమును బోధించి, ఆయనను పూజ కొరకు కూర్చుండ బెట్టితివి (3). దాని వలన విపరీతము, ఆనర్థకరము అగు ఫలము లభించినది. ఇది వాస్తవము. ఓ మునీ! దుష్ట బుద్ధీ! అభాగ్యురాలనగు నేను నీచీ అన్ని విధములుగా మోసగింప బడితిని (4).

తరువాత ఆమె మునులకు కూడా చేయ శక్యము కాని తపస్సును చేసినది. దానికి ఈ దుఃఖమును కలిగించు ఫలము లభించినది. చూడుము (5). నేనేమి చేయుదును? ఎచటకు వెళ్లెదను? నా దుఃఖమును ఎవరు పోగెట్టెదరు? నాకులము, జీవితము, సర్వము నాశమును పొందినవి (6).

ఆ దివ్యర్షులు ఎక్కడకు వెళ్లిరి? నేను వారి గెడ్డములను ఊడపెరికెదను. తపస్సు చేసుకొనే ఆ వసిష్ఠపత్ని దుష్టురాలు గనుకనే స్వయముగా వచ్చి వివాహమును నిశ్చయించినది (7). కొందరి ఆపరాధము చేత నేనీనాడు సర్వమును పోగొట్టుకొంటిని. ఇట్లు పలికి ఆమె కుమార్తెను చూచి పరుషవాక్యములను పలికెను (8).

ఓ అమ్మాయీ! దుష్టురాలా! నీవు నాకు దుఃఖమును కలిగించు పనిని ఏల చేసితివి? నీవు స్వయముగా బంగారము నిచ్చి ఇత్తడిని తెచ్చితివి (9). నీవు చందనమును పారద్రోసి బురదను పూసుకుంటివి. హంసను విడిచి పెట్టి చేతి యందలి పంజరములో కాకిని భద్రము చేసితివి (10).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

05 Feb 2022

గీతోపనిషత్తు -317

🌹. గీతోపనిషత్తు -317 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -6 📚

🍀 22-6. అభియుక్తుడు - చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు. ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. ఈ విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : పూజలు చేయువారు కొంత తడవు దైవముతో కూడి యుండుట జరుగవచ్చును. అట్లే హోమము చేయువారు, స్తోత్రము చేయువారు, ధ్యానము చేయువారు, స్మరణ చేయువారు, కీర్తన చేయువారు ఆయా సమయము లందు దైవముతో కూడి యుండవచ్చును. ఇతర సమయములలో అట్టి కూడిక యుండదు.

ఎప్పుడునూ కూడి యుండు వానికి, అపుడపుడు కూడి యుండు వానికి వ్యత్యాసము ఏనుగునకు దోమకు గల వ్యత్యాసము వలె యుండును. ఈ శ్లోకమున సాధన అనుక్షణమై యున్నది. అనునిత్యమై యున్నది. నిరంతరమై యున్నది. ఇట్టి నిరంతర అభియుక్తి వలన జీవుడు దైవము నందిమిడి పోవును. దైవము జీవుని యందు పరిపూర్ణముగ నిండిపోవును. అట్టి యోగము పూర్ణమగు క్షేమము నిచ్చును. వశిష్ఠాది బ్రహ్మరులు ఇట్టి యోగము నందే శాశ్వతముగ నిలచి యున్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

05 Feb 2022

వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి విశిష్టత Significance of Vasanth Panchmi, Sri Panchmi, & Madan Panchmi

🌹. వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు

జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి.

యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.

యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.

శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:

మాఘ శుక్ల పంచమ్యాం
విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా
తత్రాహ్న సంయుతః రుచిః ॥

వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.

పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

సరస్వతీ కటాక్షం:

బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.

గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు.

సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.

వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి.

తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

05 Feb 2022

శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం Sri Saraswati Sadhna Stotram

🌹. శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

ఓం అస్య శ్రీసరస్వతీ స్తోత్ర మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః |

ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం
వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా |
సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః
క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా 1

శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా |
అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా |
ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః 2

శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ 3

యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా 4

హ్రీం హ్రీం హృద్యైకబీజే శశిరుచికమలే కల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదవే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసమ్పాదయిత్రి
ప్రోత్ఫుల్లజ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే 5

ఐం ఐం ఐం దృష్టమంత్రే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే నాపి విజ్ఞానతత్వే
విశ్వే విశ్వాంతరాత్మే సురవరనమితే నిష్కలే నిత్యశుద్ధే 6

హ్రీం హ్రీం హ్రీం జాప్యతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తామ్ |
విద్యే వేదాంతవేద్యే పరిణతపఠితే మోక్షదే ముక్తిమార్గే |
మార్గాతీతస్వరూపే భవ మమ వరదా శారదే శుభ్రహారే 7

ధీం ధీం ధీం ధారణాఖ్యే ధృతిమతినతిభిర్నామభిః కీర్తనీయే
నిత్యేఽనిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రవాహే హరిహరనమితే నిత్యశుద్ధే సువర్ణే
మాతర్మాత్రార్ధతత్వే మతిమతి మతిదే మాధవప్రీతిమోదే 8

హ్రూం హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాకారచిత్తే స్మితముఖి సుభగే జృంభిణి స్తంభవిద్యే |
మోహే ముగ్ధప్రవాహే కురు మమ విమతిధ్వాంతవిధ్వంసమీడే
గీర్గౌర్వాగ్భారతి త్వం కవివరరసనాసిద్ధిదే సిద్ధిసాధ్యే 9

స్తౌమి త్వాం త్వాం చ వందే మమ ఖలు రసనాం నో కదాచిత్త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే యాతు పాపమ్ |
మా మే దుఃఖం కదాచిత్క్వచిదపి విషయేఽప్యస్తు మే నాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధీర్మాస్తు కుంఠా కదాపి 10

ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రో
వాణీ వాచస్పతేరప్యవిదితవిభవో వాక్పటుర్మృష్టకంఠః |
సః స్యాదిష్టాద్యర్థలాభైః సుతమివ సతతం పాతితం సా చ దేవీ
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితా విఘ్నమస్తం వ్రయాతి 11

నిర్విఘ్నం తస్య విద్యా ప్రభవతి సతతం చాశ్రుతగ్రంథబోధః
కీర్తిస్రైలోక్యమధ్యే నివసతి వదనే శారదా తస్య సాక్షాత్ |
దీర్ఘాయుర్లోకపూజ్యః సకలగుణనిధిః సంతతం రాజమాన్యో
వాగ్దేవ్యాః సమ్ప్రసాదాత్త్రిజగతి విజయీ జాయతే సత్సభాసు 12

బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో జనః పాఠాత్సకృదిష్టార్థలాభవాన్ 13
పక్షద్వయే త్రయోదశ్యామేకవింశతిసంఖ్యయా |
అవిచ్ఛిన్నః పఠేద్ధీమాంధ్యాత్వా దేవీం సరస్వతీమ్ 14

సర్వపాపవినిర్ముక్తః సుభగో లోకవిశ్రుతః |
వాంఛితం ఫలమాప్నోతి లోకేఽస్మిన్నాత్ర సంశయః 5
బ్రహ్మణేతి స్వయం ప్రోక్తం సరస్వత్యాః స్తవం శుభమ్ |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వాయ కల్పతే 16

ఇతి శ్రీసరస్వతీ స్తోత్రమ్ |

🌹 🌹 🌹 🌹 🌹

05 Feb 2022

05 - FEBRUARY - 2022 శనివారం MESSAGES వసంత పంచమి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, శనివారం, ఫిబ్రవరి 2022 స్థిర వాసరే 🌹 
🌹. వసంత పంచమి శుభాకాంక్షలు 🌹
🌹. శ్రీ సరస్వతీ సాధన స్తోత్రము 🌹
🌹. వసంత పంచమి విశిష్టత 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 22-6 - 317 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 515🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -145🌹  
5) 🌹 Osho Daily Meditations - 134🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 345-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 345-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వసంత పంచమి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 05, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సరస్వతీ స్తోత్రం 🍀*

*నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |*
*విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||*

*శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |*
*శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*
*వసంత పంచమి, Vasant Panchami*

*🍀. నేటి సూక్తి : ముక్తి మార్గంలో అత్యుత్తమైనది జ్ఞాన మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవడం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల పంచమి 27:48:59 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 16:10:17
వరకు తదుపరి రేవతి
యోగం: సిధ్ధ 17:41:24 వరకు
తదుపరి సద్య
కరణం: బవ 15:46:53 వరకు
వర్జ్యం: 01:38:24 - 03:15:08
మరియు 29:26:00 - 42:24:16
దుర్ముహూర్తం: 08:18:22 - 09:04:08
రాహు కాలం: 09:38:28 - 11:04:16 
గుళిక కాలం: 06:46:51 - 08:12:39
యమ గండం: 13:55:53 - 15:21:41
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 11:18:48 - 12:55:32
సూర్యోదయం: 06:46:51
సూర్యాస్తమయం: 18:13:18
వైదిక సూర్యోదయం: 06:50:33
వైదిక సూర్యాస్తమయం: 18:09:36
చంద్రోదయం: 09:49:25
చంద్రాస్తమయం: 22:12:36
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 16:10:17 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

ఓం అస్య శ్రీసరస్వతీ స్తోత్ర మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః |

ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం
వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా |
సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః
క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా 1 

శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా |
అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా |
ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః 2 

శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ 3 

యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా 4  

హ్రీం హ్రీం హృద్యైకబీజే శశిరుచికమలే కల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదవే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసమ్పాదయిత్రి
ప్రోత్ఫుల్లజ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే 5 

ఐం ఐం ఐం దృష్టమంత్రే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే నాపి విజ్ఞానతత్వే
విశ్వే విశ్వాంతరాత్మే సురవరనమితే నిష్కలే నిత్యశుద్ధే 6  

హ్రీం హ్రీం హ్రీం జాప్యతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తామ్ |
విద్యే వేదాంతవేద్యే పరిణతపఠితే మోక్షదే ముక్తిమార్గే |
మార్గాతీతస్వరూపే భవ మమ వరదా శారదే శుభ్రహారే 7  

ధీం ధీం ధీం ధారణాఖ్యే ధృతిమతినతిభిర్నామభిః కీర్తనీయే
నిత్యేఽనిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రవాహే హరిహరనమితే నిత్యశుద్ధే సువర్ణే
మాతర్మాత్రార్ధతత్వే మతిమతి మతిదే మాధవప్రీతిమోదే 8  

హ్రూం హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాకారచిత్తే స్మితముఖి సుభగే జృంభిణి స్తంభవిద్యే |
మోహే ముగ్ధప్రవాహే కురు మమ విమతిధ్వాంతవిధ్వంసమీడే
గీర్గౌర్వాగ్భారతి త్వం కవివరరసనాసిద్ధిదే సిద్ధిసాధ్యే 9  

స్తౌమి త్వాం త్వాం చ వందే మమ ఖలు రసనాం నో కదాచిత్త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే యాతు పాపమ్ |
మా మే దుఃఖం కదాచిత్క్వచిదపి విషయేఽప్యస్తు మే నాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధీర్మాస్తు కుంఠా కదాపి 10  

ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రో
వాణీ వాచస్పతేరప్యవిదితవిభవో వాక్పటుర్మృష్టకంఠః |
సః స్యాదిష్టాద్యర్థలాభైః సుతమివ సతతం పాతితం సా చ దేవీ
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితా విఘ్నమస్తం వ్రయాతి 11  

నిర్విఘ్నం తస్య విద్యా ప్రభవతి సతతం చాశ్రుతగ్రంథబోధః
కీర్తిస్రైలోక్యమధ్యే నివసతి వదనే శారదా తస్య సాక్షాత్ |
దీర్ఘాయుర్లోకపూజ్యః సకలగుణనిధిః సంతతం రాజమాన్యో
వాగ్దేవ్యాః సమ్ప్రసాదాత్త్రిజగతి విజయీ జాయతే సత్సభాసు 12  

బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో జనః పాఠాత్సకృదిష్టార్థలాభవాన్ 13  

పక్షద్వయే త్రయోదశ్యామేకవింశతిసంఖ్యయా |
అవిచ్ఛిన్నః పఠేద్ధీమాంధ్యాత్వా దేవీం సరస్వతీమ్ 14  

సర్వపాపవినిర్ముక్తః సుభగో లోకవిశ్రుతః |
వాంఛితం ఫలమాప్నోతి లోకేఽస్మిన్నాత్ర సంశయః 5  

బ్రహ్మణేతి స్వయం ప్రోక్తం సరస్వత్యాః స్తవం శుభమ్ |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వాయ కల్పతే 16  

ఇతి శ్రీసరస్వతీ స్తోత్రమ్ |
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి విశిష్టత 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు*

           *జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*.

 *యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*.

                   *యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*.

        *శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*

*మాఘ శుక్ల పంచమ్యాం*
 *విద్యారంభే దినేపి చ*
*పూర్వేహ్ని సమయం కృత్యా*
*తత్రాహ్న సంయుతః రుచిః ॥*

                   *వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి*.

             *చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం*.

    *పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది*.

*సరస్వతీ కటాక్షం:*

 *బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు*.

*గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు*.

     *సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు*.

 *వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి*.

  *అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి*.

  *తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు*.

🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -317 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -6 📚*
 
*🍀 22-6. అభియుక్తుడు - చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు. ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. ఈ విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. 🍀*

*22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||*

*తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.*

*వివరణము : పూజలు చేయువారు కొంత తడవు దైవముతో కూడి యుండుట జరుగవచ్చును. అట్లే హోమము చేయువారు, స్తోత్రము చేయువారు, ధ్యానము చేయువారు, స్మరణ చేయువారు, కీర్తన చేయువారు ఆయా సమయము లందు దైవముతో కూడి యుండవచ్చును. ఇతర సమయములలో అట్టి కూడిక యుండదు.*

*ఎప్పుడునూ కూడి యుండు వానికి, అపుడపుడు కూడి యుండు వానికి వ్యత్యాసము ఏనుగునకు దోమకు గల వ్యత్యాసము వలె యుండును. ఈ శ్లోకమున సాధన అనుక్షణమై యున్నది. అనునిత్యమై యున్నది. నిరంతరమై యున్నది. ఇట్టి నిరంతర అభియుక్తి వలన జీవుడు దైవము నందిమిడి పోవును. దైవము జీవుని యందు పరిపూర్ణముగ నిండిపోవును. అట్టి యోగము పూర్ణమగు క్షేమము నిచ్చును. వశిష్ఠాది బ్రహ్మరులు ఇట్టి యోగము నందే శాశ్వతముగ నిలచి యున్నారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 515 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 44

*🌻. మేన యొక్క మంకు పట్టు - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

తరువాత హిమవంతుని ప్రియురాలు, సాధ్వియగు మేన సంజ్ఞను పొంది మిక్కిలి సంక్షోభమును పొందినదై రోదించి ఆ వివాహమును తిరస్కరించెను (1). ఆమె మిక్కిలి దుఃఖమును పొందినదై ముందుగా తన కుమారులను అనేక పర్యాయములు నిందించి, తరువాత తన కుమార్తెతో పరుష వచనములను పలికెను (2).

మేన ఇట్లు పలికెను-

ఓ మునీ! శివాదేవి శివుని వరించగలదు అని పూర్వము నీవు చెప్పితివి. తరువాత హిమవంతునకు కర్తవ్యమును బోధించి, ఆయనను పూజ కొరకు కూర్చుండ బెట్టితివి (3). దాని వలన విపరీతము, ఆనర్థకరము అగు ఫలము లభించినది. ఇది వాస్తవము. ఓ మునీ! దుష్ట బుద్ధీ! అభాగ్యురాలనగు నేను నీచీ అన్ని విధములుగా మోసగింప బడితిని (4). 

తరువాత ఆమె మునులకు కూడా చేయ శక్యము కాని తపస్సును చేసినది. దానికి ఈ దుఃఖమును కలిగించు ఫలము లభించినది. చూడుము (5). నేనేమి చేయుదును? ఎచటకు వెళ్లెదను? నా దుఃఖమును ఎవరు పోగెట్టెదరు? నాకులము, జీవితము, సర్వము నాశమును పొందినవి (6).

ఆ దివ్యర్షులు ఎక్కడకు వెళ్లిరి? నేను వారి గెడ్డములను ఊడపెరికెదను. తపస్సు చేసుకొనే ఆ వసిష్ఠపత్ని దుష్టురాలు గనుకనే స్వయముగా వచ్చి వివాహమును నిశ్చయించినది (7). కొందరి ఆపరాధము చేత నేనీనాడు సర్వమును పోగొట్టుకొంటిని. ఇట్లు పలికి ఆమె కుమార్తెను చూచి పరుషవాక్యములను పలికెను (8). 

ఓ అమ్మాయీ! దుష్టురాలా! నీవు నాకు దుఃఖమును కలిగించు పనిని ఏల చేసితివి? నీవు స్వయముగా బంగారము నిచ్చి ఇత్తడిని తెచ్చితివి (9). నీవు చందనమును పారద్రోసి బురదను పూసుకుంటివి. హంసను విడిచి పెట్టి చేతి యందలి పంజరములో కాకిని భద్రము చేసితివి (10).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. జీవుని - నారాయణుని - నిద్ర - 2 🌻* 

*నదిలో బిందె మునిగి పోయినపుడు బిందెలోని నీరు మాత్రమే బిందె ఆకారమునకు బద్ధము. నదిలోని నీరు బిందె కతీతము. అది బిందెలోనికి వచ్చుచు పోవుచున్నను ... వచ్చినపుడు బద్ధముగను, వెలువడి నపుడు అతీతముగను వర్తించు చుండును . బిందెయే ప్రవాహమున కధీనము.*

*అట్లే నారాయణుడు జీవస్థితిగా బద్ధుడై అంతర్యామిగా అతీతుడై క్రీడించుచుండును. జీవులు అతని సృష్టి, స్థితి, లయముల కాల ప్రవాహమున పరాధీనులై వర్తింతురు....*

...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 134 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 134. BELIEVE IN THE EYES 🍀*

*🕉 Never believe anything unless you have experienced it. Never form any prejudice, even if the whole world is saying that something is so, unless you have encountered it yourself. 🕉*
 
*The great Indian mystic Kabir said, "Never believe in the ears-just believe in the eyes. All that you have heard is false. All that you have seen is true." This saying should be carried as a constant remembrance, because we are human beings and we tend to speak fallacies. We are part of this whole mad world, and that madness is inside every human being. Don't let it overpower you. One has to remember continuously.*

*It is arduous, because prejudices are very comfortable and easy; you don't have to pay for them, Truth is costly, precious; you have to pay much. In fact, you have to put your whole life at stake; then you arrive at it. But only truth liberates. So looking at other people and the functioning of their mind, always remember that the same type of mind is hidden in you also. So never listen to it. It will persuade you; it will argue, it will try to convince you. Just tell it, "I will see for myself. I am still alive. I can encounter whatever is needed."*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 345-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 345 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 345-1. 'క్షేత్రపాల సమర్చితా'🌻* 

*క్షేత్ర పాలకులచే ఆరాధింపబడునది శ్రీమాత అని అర్థము. పాలనము క్షాత్రధర్మము. పాలించుటకు పాలనా జ్ఞానము అవసరము. అట్టి జ్ఞానము కలుగవలెనన్నచో శ్రీమాతను ఆరాధించ వలెను. మానవ శరీరముల నుండి దివ్య శరీరముల వరకు గల రూపము లన్నింటినీ పోషించు కొనుటకు, రక్షించు కొనుటకు ఆయా జీవులయందే పాలక ప్రజ్ఞగా శ్రీమాత వసించు చున్నది. ఆమె నారాధన చేసినవారికి ఆ ప్రజ్ఞ మేల్కాంచి రక్షణ పోషణాదులు జరుగుచుండును. పశు రూపములలో నున్న జీవులు కూడ తమను తామిట్లే పోషించుకొనుచు రక్షించుకొను చున్నారు. ఆహారమునకై తిరుగాడు పీత సహితము అలికిడవగానే కన్నములో దూరును. అట్లే ఇతర జీవులును.*

*మానవులు జీవిత మంతయూ శరీర పోషణము, రక్షణము కొరకు పాటు పడుచుందురు. అది వారి కర్తవ్యమై నిలచినది. ఈ కర్తవ్య నిర్వహణము సరిగ జరుగవలెనన్నచో శ్రీమాత రక్షింపవలెను. అపుడు శ్రీమాత తదనుగుణమగు సంకల్పమును, జ్ఞానమును, క్రియా శక్తిని ప్రసాదించును. అట్టివారే వారి వారి శరీరములందు సుఖ పడుదురు. తమ శరీరములనే కాక ఇతరులను కూడ రక్షించుట, పోషించుట, ఒక దేశమునకు, ఒక లోకమునకు రక్షణ పోషణ కల్పించుట కూడ పాలక శక్తియే. ఇట్టి వారిలో శ్రేష్ఠులు దిక్పాలకులు, లోకపాలకులు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 345-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 345-1. Kṣetra-pāla-samarcitā क्षेत्र-पाल-समर्चिता (345) 🌻*

*She is worshipped by Kṣetra-pāla-s. Kṣetra, as discussed in nāma 341 is the body. Pāla means the Protector. This body is protected by pañcabhūta (the five elements viz. akash, air, fire, water and earth). Each of these elements is represented by a demigod. She is worshipped by them. This appears to be the appropriate interpretation.*

*There is an interesting story associated with this nāma. Goddess Kālī was created by Śiva to slain a demon called Dāruka. Even after killing him, the ferocity of Her anger could not be controlled. The entire universe was rattled by Her anger. To appease Her anger Śiva Himself assumed the form of an infant. After all She is the Supreme Mother. She started feeding the child (Śiva). While suckling, Śiva also sucked Her anger. This child is called Kṣetrapāla, because He protected this universe from a catastrophe. She was worshipped by this Kṣetrapāla.*

*The place where major yajña rituals take place is also called kṣetra and the god who protects it is called Kṣetrapāla and She is worshipped by him.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹