1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 01, సోమ వారం, నవంబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 269 🌹
3) 🌹. శివ మహా పురాణము - 468🌹
4) 🌹 వివేక చూడామణి - 145 / Viveka Chudamani - 145🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -97🌹
6) 🌹 Osho Daily Meditations - 86 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 145 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 145🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*01, నవంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. దారిద్య్ర దహన శివస్తోత్రం-5 🍀*
*ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ*
*గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |*
*మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ*
*దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 8 ||*
*వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ |*
*సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ || 9*
*త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ |*
*ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన స్తోత్రమ్ |*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 13:23:46 వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 12:53:48 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: ఇంద్ర 21:04:44 వరకు తదుపరి వైధృతి
కరణం: బాలవ 13:16:47 వరకు
వర్జ్యం: 19:44:36 - 21:16:04
దుర్ముహూర్తం: 12:22:30 - 13:08:31 మరియు
14:40:32 - 15:26:32
రాహు కాలం: 07:40:42 - 09:06:58
గుళిక కాలం: 13:25:46 - 14:52:02
యమ గండం: 10:33:14 - 11:59:30
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 06:35:40 - 08:10:00
మరియు 28:53:24 - 30:24:52 ?
పండుగలు : రమా ఏకాదశి, గోవష్ట ద్వాదశి
సూర్యోదయం: 06:14:27, సూర్యాస్తమయం: 17:44:34
వైదిక సూర్యోదయం: 06:18:07
వైదిక సూర్యాస్తమయం: 17:40:54
చంద్రోదయం: 02:34:08, చంద్రాస్తమయం: 15:20:46
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: సింహం
ఆనందాదియోగం: ధ్వజ యోగం - కార్య సిధ్ధి 12:53:48
వరకు తదుపరి శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -269 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 9-2
*🍀 9. సాక్షీభూతుడు -2 - ఈశ్వరుడు త్రిమూర్తులకు కూడ అతీతమగు తత్త్వము. త్రిమూర్తులకు కర్మ మున్నది. జ్ఞానముతో నిర్వర్తింప బడనపుడు వానిని కూడ కర్మలు బంధించును. వారు మూడు గుణములకు అధిపతులే అయినను, కాలమును దేశమును ఎరిగి, కర్తవ్య మెరిగి యథార్థముగ కర్మలు నిర్వర్తించుటచే మోక్షస్థితిలో నుందురు. అట్లే బ్రహ్మర్షులు, మహర్షులు, నారదాది యోగులును కూడ. ఈశ్వరుడు తప్ప ఇతరులందరును జ్ఞానము నాశ్రయింప వలసినదే. లేనిచో బంధము తప్పదు. ఈశ్వరుడే జ్ఞానము, జ్ఞాని. “జాని యనగా నేనే" అని ఈశ్వరుడే కృష్ణ భగవానుడిగ పలికినాడు. కనుక జీవులకు తమ యందలి ఈశ్వరుని ఆశ్రయించుటయే ఉపాయము. 🍀*
నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు II 9
*తాత్పర్యము : ప్రకృతి కారణముగ జీవులాచరించు కర్మల యందు నేను తగులుకొనను. తటస్థునివలె యుందును. జీవుల కర్మలు నన్ను బంధింపవు, బంధింపలేవు.*
వివరణము : సూర్యుడు సాక్షీభూతుడుగనే, తటస్థుడుగనే జీవుల కార్యములను చూచుచు నుండును. ఏ కార్యము నందు అతని ప్రమేయము లేదు. అతని ప్రభావము వలన మేల్కొనిన జీవులు తమదైన చట్రములలో తమ జీవితములను బిగించుకొను చుందురు. సత్కార్యములకుగాని, దుష్కార్య ములకుగాని ప్రేరణ సూర్యుడు కాదు. జీవుల గుణ సముదాయము ప్రేరణకు కారణము.
ఒకనికి సూర్యోదయమున తినుటయందు గాని, త్రాగుట యందు గాని ఆసక్తి కలుగవచ్చును. మరియొకనికి శరీర వ్యాయామమున ఆసక్తి కలుగవచ్చును. ఇంకొకనికి తూర్పు వెలుగునకు నమస్కరింపవలె ననిపించును. ఇంకొకరికి మరల నిద్రింపవలె ననిపించును. ఇట్లెవరికేమనిపించినను అది వారి ప్రకృతికి సంబంధించినదేగాని సూర్యునికి సంబంధించినది కాదు గదా! అట్లే ఈశ్వరుడు కూడ.
మరియొక ఉదాహరణము : రాత్రి సమయమందు విద్యుత్ దీపపు కాంతితో కొందరు కూడి ముచ్చటలాడుకొన వచ్చును. లేదా గ్రంథపఠనము చేయవచ్చును. లేదా చీట్ల పేక ఆడుకొన వచ్చును. లేదా పోట్లాడుకొనవచ్చును. లేదా టెలివిజను చూడ వచ్చును. విద్యుత్ దీపమే లేనిచో కొన్ని కార్యము లుండక పోవచ్చును. దీపమున్నపుడు జరుగు వైవిధ్యమగు కార్యక్రమములతో దీపమునకు సంబంధము లేదు. అట్లే ఈశ్వరుడు. ఈశ్వరుడు త్రిమూర్తులకు కూడ అతీతమగు తత్త్వము. త్రిమూర్తులకు కర్మ మున్నది.
జ్ఞానముతో నిర్వర్తింప బడనపుడు వానిని కూడ కర్మలు బంధించును. వారు మూడు గుణములకు అధిపతులే అయినను, కాలమును దేశమును ఎరిగి, కర్తవ్య మెరిగి యథార్థముగ కర్మలు నిర్వర్తించుటచే మోక్షస్థితిలో నుందురు. అట్లే బ్రహ్మర్షులు, మహర్షులు, నారదాది యోగులును కూడ. ఈశ్వరుడు తప్ప ఇతరులందరును జ్ఞానము నాశ్రయింపవలసినదే. లేనిచో బంధము తప్పదు. ఈశ్వరుడే జ్ఞానము, జ్ఞాని. “జాని యనగా నేనే" అని ఈశ్వరుడే కృష్ణ భగవానుడిగ పలికినాడు. కనుక జీవులకు తమయందలి ఈశ్వరుని ఆశ్రయించుటయే ఉపాయము. "
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 468 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 33
*🌻. సప్తర్షుల ఉపదేశము - 5 🌻*
మేము నీకు ఉపదేశించుచున్నాము. నీవు రుద్రునకు పార్వతిని ఇమ్ము. ఓ శైలరాజా! అట్లు చేసినచో నీకు మహానందము కలుగ గలదు (53). పర్వతరాజా ! నీవు పార్వతిని ప్రీతి పూర్వకముగా శివునకు ఈయని పక్షములో, వారి వివాహము ఈ కాలములో విధిబలముచేతనే సంపన్నము కాగలదు (54).
వత్సా! శంకరుడు శివాదేవికి తపస్సు చేయుచుండగా వరమునిచ్చెను. ఈశ్వరుని ప్రతిజ్ఞ వమ్ముకాదు గదా! (55) ఈశ్వరభక్తులగు సాధువుల ప్రతిజ్ఞయై ననూ ముల్లోకములలో ఉల్లంఘింప శక్యము కానిదిగా నున్నది. ఓ పర్వతరాజా! ఈశ్వరుని ప్రతిజ్ఞ గురించి చెప్పునదేమున్నది? (56) ఇంద్రడొక్కడే అవలీలగా పర్వతముల రెక్కలను నరికెను. పార్వతి కూడ అవలీలగా మేరవునకు శృంగభంగము చేసెను (57).
ఓ పర్వతరాజా! ఒక్క వ్యక్తి కొరకై సంపదల నన్నిటినీ నాశనము చేయరాదు. కులము కొరకై ఒక వ్యక్తిని విడువవలెనని సనాతనమగు వేదము చెప్పు చున్నది (58). అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తమైన భయము గలవాడై తన కుమార్తెను ఆ బ్రాహ్మణునకు ఇచ్చి తన సంపదను రక్షించుకొనెను (59). నీతి శాస్త్రజ్ఞులగు జనులు, గురువులు, శ్రేష్టులగు జ్ఞాతులు బ్రాహ్మణుని శాపము వలన మిక్కిలి భయపడినవారై ఆ రాజునకు బోధించిరి (60). ఓ శైలరాజా! ఇదే విధముగా నీవు కూడా నీ కుమార్తెను శివునకు ఇచ్చి బంధువులనందరినీ రక్షించుకొనుము. మరియు దేవతలను వశము చేసుకొనుము (61).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వసిష్ఠుని ఈ మాటను విని ఆయన నవ్వి దుఃఖముతో నిండిన హృదయముతో అనరణ్యుని వృత్తాంతమును గూర్చి ప్రశ్నించెను (62).
హిమవంతుడిట్లు పలికెను-
హే బ్రహ్మన్ ! ఆ అనరణ్య మహారాజు జన్మించిన వంశ##మేది? ఆయన కుమార్తెను ఇచ్చి సంపదలనన్నిటినీ రక్షించుకున్న తీరు ఎట్టిది? (63)
బ్రహ్మ ఇట్లు పలికెను -
ప్రసన్నమగు మనస్సు గల వసిష్ఠుడు పర్వతుని ఆ మాటను విని సుఖదాయకము అగు అనరణ్య చరితమును ఆ పర్వతరాజేనకు చెప్పెను (64).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో హిమవంతునకు సప్తర్షుల ఉపదేశమును వర్ణించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 145 / Viveka Chudamani - 145🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 30. బ్రహ్మమును పొందాలంటే -3 🍀*
477. స్వయముగా తానే తన ఆత్మను తెలుసుకొని తాను పూర్తి అవగాహన పొందిన అట్టి వ్యక్తి ముఖాముఖి ఆత్మను తన మనస్సులో గ్రహించి ద్వంద్వ స్థితులకు దూరమవుతాడు.
478. వేదాంతమును గూర్చిన అన్ని చర్యల ఫలితముగా జీవము మరియు ప్రపంచము, బ్రహ్మము కంటే వేరు కాదని తెలుస్తుంది. అలాంటి విముక్తి ద్వంద్వాతీతముగా బ్రహ్మములో ఏకత్వము సాధించినట్లవుతుంది. అందుకు సృతులే ప్రమాణము. బ్రహ్మము ఒక్కటే రెండవది లేనిది.
479. భగవంతుని దయ వలన ఒకానొక క్షణములో బ్రహ్మమును తెలుసుకొన్న తరువాత అందుకు గురు బోధనలు, సృతులు ఆధారము మరియు తన యొక్క ఆత్మ విచారణ ద్వారా, శిష్యుడు తన మనస్సును ఏ మాత్రము చలనము లేకుండా బ్రహ్మము పై కేంద్రీకరించవలెను.
480. కొంత సమయము శిష్యుడు తన మనస్సును బ్రహ్మముపై కేంద్రీకరించిన తరువాత బయటకు వచ్చి ఈ విధముగా పలుకుతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 145 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 30. To Achieve Brahmam - 3 🌻*
477. Himself knowing his indivisible Self through his own realisation and thus becoming perfect, a man should stand face to face with the Atman, with his mind free from dualistic ideas.
478. The verdict of all discussions on the Vedanta is that the Jiva and the whole universe are nothing but Brahman, and that liberation means abiding in Brahman, the indivisible Entity. While the Shrutis themselves are authority (for the statement) that Brahman is One without a second.
479. Realising, at a blessed moment, the Supreme Truth through the above instructions of the Guru, the authority of the Scriptures and his own reasoning, with his senses quieted and the mind concentrated, (the disciple) became immovable in form and perfectly established in the Atman.
480. Concentrating the mind for some time on the Supreme Brahman, he rose, and out of supreme bliss spoke as follows.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 145 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 30. To Achieve Brahmam - 3 🌻*
477. Himself knowing his indivisible Self through his own realisation and thus becoming perfect, a man should stand face to face with the Atman, with his mind free from dualistic ideas.
478. The verdict of all discussions on the Vedanta is that the Jiva and the whole universe are nothing but Brahman, and that liberation means abiding in Brahman, the indivisible Entity. While the Shrutis themselves are authority (for the statement) that Brahman is One without a second.
479. Realising, at a blessed moment, the Supreme Truth through the above instructions of the Guru, the authority of the Scriptures and his own reasoning, with his senses quieted and the mind concentrated, (the disciple) became immovable in form and perfectly established in the Atman.
480. Concentrating the mind for some time on the Supreme Brahman, he rose, and out of supreme bliss spoke as follows.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 97 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. చేయవలసినది- చేయదలచినది - 13 🌻*
*వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా?" అని అడిగాడు. "లాభం లేదురా అప్పా మోక్షం రాదు. పోవలసినది బంధం తప్ప రావలసినది మోక్షం కాదు."*
*మనం ఏ దరిద్రాలనయితే కొని తెచ్చిపెట్టుకున్నామో, అవి తొలగించుకొనుటే కావాలి కానీ, కొత్తగా వచ్చేదేమీ లేదు. ఇంతకు ముందున్న స్థితినే మోక్షం అని పిలుస్తున్నావు. దుఃఖం నీవు తెచ్చుకొని అంతకుముందున్న సవ్యస్థితిని సుఖమని పిలుస్తున్నావు. సుఖం రావాలి. సుఖం రావాలి అని కోరితే వచ్చేదేముంది? (దుఃఖం తప్ప) చోటులో ఇల్లు కట్టుకుని ఇంటిలో చోటు కోసం వెతుక్కుంటుంటే చోటు పరిమితంగానే ఉంటుంది. అంతకు ముందున్నది చోటు. మధ్యన మనం కట్టుకున్నది ఇల్లు.*
*మోక్షం వచ్ఛేదేమీ లేదు బంధము పోవటమే కావలసిన స్థితి. మనం సాధన చేస్తున్నప్పుడు ప్రశాంత స్థితికొచ్చిన కొద్దీ వాతావరణము నందు మనస్సు వంగుతుంది. (వాతావరణమునకు మనస్సు లొంగుతుంది.) వాతావరణములోని విఘ్నములు తొలగుతాయి. మనకు ఎదుటివాడి వలన ఏం ప్రయోజనముందని అనుకొనిన (కోరిన) కొద్ధీ వాతావరణమునకు (పరిసరములకు) దాస్యం చేయుట సంభవించును.*
*ఈ రెండూ ప్రస్తుతం ఉన్న భారతీయుడు తెలిసికొనవలెను. భారతదేశంలో ఉన్న ఎక్కువమందిమి విషాదయోగంలోనే ఉన్నాము. సాంఖ్య యోగం నుండి ప్రారంభించి మోక్ష సన్న్యాసయోగం దాకా రావాలి.*
...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 86 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 86. DECISIONS 🍀*
*🕉 Respond to this moment. That's what responsibility is. Someone would like to marry you. Now you are puzzled as to whether to say yes or no, So you go to the I Ching. 🕉*
It is your life--why leave it for someone who has written a book five thousand years ago to decide for you? It is better to decide on your own. Even if you err and go astray, it is still better to decide on your own. And even if you don't go astray and you have a more successful life through the I Chinn, it is still not good, because you are avoiding responsibility.
Through responsibility, one grows. Take responsibility into your hands. These are ways of avoiding. Some people give responsibility to God, others to karma, others to destiny, others to the I Ching. But we become spiritual when we take the whole responsibility on our own shoulders. The responsibility is tremendous, and your shoulders are weak, that I know. But when you take on the responsibility, they will become stronger. There is no other way for them to grow and become stronger.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 145 / Sri Lalita Sahasranamavali - Meaning - 145 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 145. మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాఽశనా ।*
*అపర్ణా, చండికా, చండముండాఽసుర నిషూదినీ ॥ 145 ॥ 🍀*
🍀 749. మహేశ్వరీ :
మహేశ్వరుని ప్రియురాలు
🍀 750. మహాకాళీ :
కాళికా దేవి రూపము దాల్చినది
🍀 751. మహాగ్రాసా :
అధికమైన ఆహారమును కోరునది
🍀 752. మహాశనా :
లయకారిణి
🍀 753. అపర్ణా :
పార్వతీ దేవి
🍀 754. చండికా :
చండికాస్వరూపిణి
🍀 755. చండముండాసుర నిషూదిని :
చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 145 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 145. Mahishvari mahakali mahagrasa hamashani*
*Aparna chanidika chandamundasura nishudini ॥ 145 ॥ 🌻*
🌻 749 ) Maheswaree -
She who is the greatest goddess
🌻 750 ) Maha kali -
She who is the great Kalee
🌻 751 ) Maha grasa -
She who is like a great drinking bowl
🌻 752 ) Mahasana -
She who is the great eater
🌻 753 ) Aparna -
She who did meditation without even eating a leaf
🌻 754 ) Chandika -
She who is supremely angry
🌻 755 ) Chanda mundasura nishoodhini -
She who killed the asuras called Chanda and Munda
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹