వివేక చూడామణి - 145 / Viveka Chudamani - 145
🌹. వివేక చూడామణి - 145 / Viveka Chudamani - 145🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 30. బ్రహ్మమును పొందాలంటే -3 🍀
477. స్వయముగా తానే తన ఆత్మను తెలుసుకొని తాను పూర్తి అవగాహన పొందిన అట్టి వ్యక్తి ముఖాముఖి ఆత్మను తన మనస్సులో గ్రహించి ద్వంద్వ స్థితులకు దూరమవుతాడు.
478. వేదాంతమును గూర్చిన అన్ని చర్యల ఫలితముగా జీవము మరియు ప్రపంచము, బ్రహ్మము కంటే వేరు కాదని తెలుస్తుంది. అలాంటి విముక్తి ద్వంద్వాతీతముగా బ్రహ్మములో ఏకత్వము సాధించినట్లవుతుంది. అందుకు సృతులే ప్రమాణము. బ్రహ్మము ఒక్కటే రెండవది లేనిది.
479. భగవంతుని దయ వలన ఒకానొక క్షణములో బ్రహ్మమును తెలుసుకొన్న తరువాత అందుకు గురు బోధనలు, సృతులు ఆధారము మరియు తన యొక్క ఆత్మ విచారణ ద్వారా, శిష్యుడు తన మనస్సును ఏ మాత్రము చలనము లేకుండా బ్రహ్మము పై కేంద్రీకరించవలెను.
480. కొంత సమయము శిష్యుడు తన మనస్సును బ్రహ్మముపై కేంద్రీకరించిన తరువాత బయటకు వచ్చి ఈ విధముగా పలుకుతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 145 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 30. To Achieve Brahmam - 3 🌻
477. Himself knowing his indivisible Self through his own realisation and thus becoming perfect, a man should stand face to face with the Atman, with his mind free from dualistic ideas.
478. The verdict of all discussions on the Vedanta is that the Jiva and the whole universe are nothing but Brahman, and that liberation means abiding in Brahman, the indivisible Entity. While the Shrutis themselves are authority (for the statement) that Brahman is One without a second.
479. Realising, at a blessed moment, the Supreme Truth through the above instructions of the Guru, the authority of the Scriptures and his own reasoning, with his senses quieted and the mind concentrated, (the disciple) became immovable in form and perfectly established in the Atman.
480. Concentrating the mind for some time on the Supreme Brahman, he rose, and out of supreme bliss spoke as follows.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
01 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment