మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 97


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 97 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 13 🌻


వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా?" అని అడిగాడు. "లాభం లేదురా అప్పా మోక్షం రాదు. పోవలసినది బంధం తప్ప రావలసినది మోక్షం కాదు."

మనం ఏ దరిద్రాలనయితే కొని తెచ్చిపెట్టుకున్నామో, అవి తొలగించుకొనుటే కావాలి కానీ, కొత్తగా వచ్చేదేమీ లేదు. ఇంతకు ముందున్న స్థితినే మోక్షం అని పిలుస్తున్నావు. దుఃఖం నీవు తెచ్చుకొని అంతకుముందున్న సవ్యస్థితిని సుఖమని పిలుస్తున్నావు. సుఖం రావాలి. సుఖం రావాలి అని కోరితే వచ్చేదేముంది? (దుఃఖం తప్ప) చోటులో ఇల్లు కట్టుకుని ఇంటిలో చోటు కోసం వెతుక్కుంటుంటే చోటు పరిమితంగానే ఉంటుంది. అంతకు ముందున్నది చోటు. మధ్యన మనం కట్టుకున్నది ఇల్లు.

మోక్షం వచ్ఛేదేమీ లేదు బంధము పోవటమే కావలసిన స్థితి. మనం సాధన చేస్తున్నప్పుడు ప్రశాంత స్థితికొచ్చిన కొద్దీ వాతావరణము నందు మనస్సు వంగుతుంది. (వాతావరణమునకు మనస్సు లొంగుతుంది.) వాతావరణములోని విఘ్నములు తొలగుతాయి. మనకు ఎదుటివాడి వలన ఏం ప్రయోజనముందని అనుకొనిన (కోరిన) కొద్ధీ వాతావరణమునకు (పరిసరములకు) దాస్యం చేయుట సంభవించును.

ఈ రెండూ ప్రస్తుతం ఉన్న భారతీయుడు తెలిసికొనవలెను. భారతదేశంలో ఉన్న ఎక్కువమందిమి విషాదయోగంలోనే ఉన్నాము. సాంఖ్య యోగం నుండి ప్రారంభించి మోక్ష సన్న్యాసయోగం దాకా రావాలి.

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


01 Nov 2021

No comments:

Post a Comment