1) 🌹 శ్రీమద్భగవద్గీత - 462 / Bhagavad-Gita - 462🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 250 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 152 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 66 / Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 69 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 38🌹
8) 🌹. శివగీత - 35 / The Shiva-Gita - 35🌹
9) 🌹. సౌందర్య లహరి - 77 / Soundarya Lahari - 77 🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 17 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 376 / Bhagavad-Gita - 376🌹
12) 🌹. శివ మహా పురాణము - 200🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 76 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 71 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 87 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 18 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 36🌹
18) 🌹. అద్భుత సృష్టి - 8 🌹
19) 🌹 Seeds Of Consciousness - 152🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 30🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 7 📚
22)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 462 / Bhagavad-Gita - 462 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 01 - 02 🌴*
01. అర్జున ఉవాచ
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |
ఏతద్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||
02. శ్రీ భగవానువాచ
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిదీయతే |
ఏతద్ యో వేత్తి తం ప్రాహు: క్షేత్రజ్ఞ ఇతి తద్విద: ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! ప్రకృతి మరియు పురుషుని (భోక్త) గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞానలక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను.
శ్రీకృష్ణభగవానుడు పలికెను; ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును.
🌷. భాష్యము :
ప్రకృతి, పురుషుడు(భోక్త), క్షేత్రము, క్షేత్రజ్ఞుడు (క్షేత్రము నెరిగినవాడు), జ్ఞానము, జ్ఞానలక్ష్యముల యెడ అర్జునుడు మిగుల జిజ్ఞాసువై యున్నాడు.
అర్జునుడు ఈ విషయములను గూర్చి విచారణ కావింపగా ఈ దేహము క్షేత్రముగా పిలివబడుననియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞునిగా పిలువబడుననియు శ్రీకృష్ణభగవానుడు పలికెను. ఈ దేహము బద్ధజీవునకు కర్మక్షేత్రము. అతడు భౌతికస్థితిలో చిక్కుకొని ప్రకృతిపై అధిపత్యమును చెలాయించవలెనని యత్నించును.
ఆ విధముగా ప్రకృతిపై అధిపత్యము వహింపగలిగిన తన సామర్థ్యము ననుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. ఆ కర్మక్షేత్రమే దేహము. ఇక దేహమనగా ఇంద్రియములను కూడినట్టిది. బద్ధజీవుడు ఇంద్రియసుఖమును అనుభవింపగోరును.
ఆ ఇంద్రియసుఖము అనుభవించుటకు గల సామర్థ్యము ననుసరించి అతనికి ఒక దేహము(కర్మ క్షేత్రము) ఒసగబడును. కనుకనే దేహము బద్ధజీవుని కర్మక్షేత్రమని పిలువబడును.
అట్టి దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును, అనగా దేహమునకు మరియు దేహము నెరిగినవానికి నడుమ భేదమును అవగాహన చేసికొనుట కష్టమైన విషయము కాదు.
ఉదాహరణమునకు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు అనేక మార్పులు జరుగుచున్నను దేహధారి మాత్రము మార్పులేకయుండును. అనగా క్షేత్రమునకు మరియు క్షేత్రము నెరిగినవానికి భేదము కలదు. ఈ విధముగా బద్ధజీవుడు తాను దేహము కన్నను అన్యమైనవాడిని తెలియగలడు.
జీవుడు దేహమునందు స్థితిని కలిగియుండుననియు, ఆ దేహము శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి వృద్ధాప్యమునకు మార్పుచెందుననియు మరియు దేహధారి (దేహయజమాని) తన దేహము అట్లు మార్పుచెందునని తెలియుననియు ఆదిలో “దేహినోస్మిన్” అను శ్లోకము ద్వారా తెలుపబడినది.
అనగా దేహమునకు యజమాని “క్షేత్రజ్ఞుడు”. నేను సుఖిని, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను శునకమును, నేను మార్జాలమును అను భావనల ఆ క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే. కాని వాస్తవమునకు క్షేత్రజ్ఞుడు దేహమునకు అన్యుడు.
దేహమునకు వస్త్రమువంటి పెక్కింటిని మనము ఉపయోగించినను వాటికన్నను మనము అన్యులమని స్పష్టముగా నెరుగగలము. అనగా దేహమునకు యజమాని (నేను లేదా నీవు లేదా ఎవరైనను) క్షేత్రజ్ఞుడనియు (కర్మక్షేత్రము నెరిగినవాడు) మరియు దేహము క్షేత్రమనియు(కర్మ క్షేత్రమని) పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 462 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 01 - 02 🌴*
01. arjuna uvāca
prakṛtiṁ puruṣaṁ caiva
kṣetraṁ kṣetra-jñam eva ca
etad veditum icchāmi
jñānaṁ jñeyaṁ ca keśava
02. śrī-bhagavān uvāca
idaṁ śarīraṁ kaunteya
kṣetram ity abhidhīyate
etad yo vetti taṁ prāhuḥ
kṣetra-jña iti tad-vidaḥ
🌷 Translation :
Arjuna said: O my dear Kṛṣṇa, I wish to know about prakṛti [nature], puruṣa [the enjoyer], and the field and the knower of the field, and of knowledge and the object of knowledge. The Supreme Personality of Godhead said: This body, O son of Kuntī, is called the field, and one who knows this body is called the knower of the field.
🌹 Purport :
Arjuna was inquisitive about prakṛti (nature), puruṣa (the enjoyer), kṣetra (the field), kṣetra-jña (its knower), and knowledge and the object of knowledge. When he inquired about all these, Kṛṣṇa said that this body is called the field and that one who knows this body is called the knower of the field. This body is the field of activity for the conditioned soul.
The conditioned soul is entrapped in material existence, and he attempts to lord it over material nature. And so, according to his capacity to dominate material nature, he gets a field of activity. That field of activity is the body. And what is the body?
The body is made of senses. The conditioned soul wants to enjoy sense gratification, and, according to his capacity to enjoy sense gratification, he is offered a body, or field of activity. Therefore the body is called kṣetra, or the field of activity for the conditioned soul.
Now, the person, who should not identify himself with the body, is called kṣetra-jña, the knower of the field. It is not very difficult to understand the difference between the field and its knower, the body and the knower of the body.
Any person can consider that from childhood to old age he undergoes so many changes of body and yet is still one person, remaining. Thus there is a difference between the knower of the field of activities and the actual field of activities. A living conditioned soul can thus understand that he is different from the body.
It is described in the beginning – dehino ’smin – that the living entity is within the body and that the body is changing from childhood to boyhood and from boyhood to youth and from youth to old age, and the person who owns the body knows that the body is changing. The owner is distinctly kṣetra-jña.
Sometimes we think, “I am happy,” “I am a man,” “I am a woman,” “I am a dog,” “I am a cat.” These are the bodily designations of the knower. But the knower is different from the body.
Although we may use many articles – our clothes, etc. – we know that we are different from the things used. Similarly, we also understand by a little contemplation that we are different from the body.
I or you or anyone else who owns the body is called kṣetra-jña, the knower of the field of activities, and the body is called kṣetra, the field of activities itself.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 250 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 28
*🌻 Sripada Himself is Sri Venkateswara - 5 🌻*
Srinivasa asked for suggestions from vysya elders. All of them supported in one voice what Ganapathi had said.
With great pleasure, engagement ceremony was done for performing marriage between Vasavee Devi born in ‘Prabhata gothram’ and Nagareswara born in Labhada gothram. In the night, arrangements were made for a big feast. It was all a festive occasion with dances and music of ‘apsara’ girls.
Sri Vasavee Matha said, ‘The count of 102 gothras is exactly 102 gothras only. It is a mistake to think that there is no Labhadi Maharshi gothram.
The main reason for ending of 102nd gothram is that it should belong to Sri Nagareswara Maha prabhu. The gothram in which I am born should be considered as Prabhata gothram and Sri Nagareswar Maha Deva’s should be considered Labhadi gothram.
All vysyas will remember Labhadi gothram. Similarly they all will worship Sri Nagareswara Maha prabhu. Even though I am in Kanyaka form, you should recognize that my swami is there in every atom of mine. Moreover, In every atom of Sri Nagareswar, I am there.
If I am worshipped and He is not worshipped or He is worshipped and I am not worshipped, there will not be any result. My Kanyaka form is only for 18 years. Before that I was Parameswari only. After that also I will be Parameswari.
If you think of me as Kanyaka, I will give you the feeling of Kanyaka. If you think of me as Parameswari, I will give you darshan as ‘Soubhagya Mangala Rupini’.
The Murthi in Tirupathi was worshipped as Bala Tripura Sundari Balajee and Eswar
People used to worship the Murthi in Tirumala as Bala Tripura Sundari. Later it was worshipped as Eswar.
Still later, it is being worshipped as Maha Vishnu form. The Bala Tripura Sundari in the Murthi of Tirumala is Myself. The one as Eswar is Sri Nagareswar only. The one with Maha Vishnu form is my brother Datta Prabhu.
“This oneness should be understood as related to chaitanyam but not to the physical world.” Srinivasa Prabhu said, ‘Sister! I am now present as Sripada Srivallabha in Peethikapuram.
You should be there in my samsthan as my ‘ada padhuchu’ (sister).’ Ambika said, ‘Brother! This is agreeable to me. Before this, you should come in Sri Venkateswara form to Kanyaka Parameswari Maha samsthan in Brihat Sila Nagaram.’
The player of world drama smiled. The birth day of Sri Vasavee Devi was performed grandly. It remained as ordinary ‘goshala’ on the next day. We finished early morning chores and started towards Kurungadda.
End of Chapter 28
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సదవగాహన - 1 🌻*
ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞానశాస్ర్త పరముగాను, నాగరికత పరముగాను సాధించుచున్నాడు.
ప్రాచీనులకన్న మిక్కిలి తెలివిగలవాడనని కూడ విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు, ఈ శ్రమకు ప్రయోజనమయిన ఆనందమును మాత్రము పొందలేకున్నాడు.
తన స్వరూపమయిన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనస్సునందు, వికారములు రేకెత్తి, అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటముల వలె ఊపుచున్నవి.
నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు తనలోనే నెలకొనియున్నవి. ఉదాహరణకు, ఒరుల యందు జుగుప్స. ఇతరుల లోపముల యందే చూపు నిలిపి, వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును.
విచిత్రమేమనగా, ఇతరుల యందు, తాను తెలివిగలవాడననుకొను మానవుడు ఏ దోషమును గమనించుచుండునో, ఆ దోషము తన యందే దృఢముగా దాగియుండును.
జుగుప్స వలన, మానవుడు వివేకమను చూపును కోల్పోయి, గ్రుడ్డివాడగును. తనకు, ఒరులకు అడ్డుగోడలను కట్టుకొని వారితో సంఘర్షణకు తలపడును. దానితో భయభ్రాంతుడై, వినాశమును గొని తెచ్చుకొనువాడగును.
ఒకసారి మనస్సునందు ఇతరులపై దోషారోపణ చేయు తలంపు జనింపగనే, దానిని కొనసాగనీయక, వారిపై ప్రేమ, దయలను అనుభవించి, వారిని సదవగాహన చేసికొనుటకు యత్నింపవలెను. దానితో జుగుప్స క్రమముగా అదృశ్యమగును.
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 150 🌹*
*🌴 The Wisdom of Waiting - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Patience - 3 🌻*
Prayers are like a conversation with the deity, but then we should become silent and remain silent in order to be able to receive the answer to our prayers.
The ability of receiving is related to the ability of waiting. People who cannot wait also cannot receive. Waiting is a pause giving us balance. Many initiates accomplish very much by their strength of patience and ability to wait.
When we invoke the names of the masters, the idea behind is that we ask for their help, so that we become receptive for the energy of the soul, and we wait for its arrival.
We never can establish the relation ourselves, but it is HE who opens the doors and closes them again. We can only wait for His grace, through correct actions and through right prayer.
Through waiting we open up to the grace. We cannot demand grace, we can only pray that it might come to us and wait, while we fulfill our daily duties.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 66 / Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 125
622. క్లీంకారీ -
' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
623. కేవలా -
ఒకే ఒక తత్వమును సూచించునది.
624. గుహ్యా -
రహస్యాతి రహస్యమైనది.
625. కైవల్యపదదాయినీ -
మోక్షస్థితిని ఇచ్చునది.
626. త్రిపురా -
మూడు పురములను కలిగి ఉంది.
627. త్రిజగద్వంద్యా -
మూడు లోకములచే పూజింపబడునది.
628. త్రిమూర్తిః -
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
629. త్రిదశేశ్వరీ -
దేవతలకు ఈశ్వరి.
🌻. శ్లోకం 126
630. త్ర్యక్షరీ -
మూడు అక్షరముల స్వరూపిణి.
631. దివ్యగంధాడ్యా -
దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
632. సిందూర తిలకాంచితా -
పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
633. ఉమా -
ఉమా నామాన్వితురాలు. మూడు లోకములచే పూజింపబడునది.
634. శైలేంద్రతనయా -
హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
635. గౌరీ -
గౌర వర్ణములో ఉండునది.
636. గంధర్వసేవితా -
గంధర్వులచేత పూజింపబడునది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 66 🌻*
622 ) Klim karee -
She who is the shape of “Klim”
623 ) Kevalaa -
She who is she herself
624 ) Guhya -
She who is secret
625 ) Kaivalya Padha dhayini -
She who gives redemption as well as position
626 ) Tripura -
She who lives everything in three aspects
627 ) Trijagat vandhya -
She who is worshipped by all in three worlds
628 ) Trimurthi -
She who is the trinity
629 ) Tri daseswari -
She who is the goddess for all gods
630 ) Tryakshya -
She who is of the form of three letters
631 ) Divya Gandhadya -
She who has godly smell
632 ) Sindhura thila kanchidha -
She who wears the sindhoora dot in her forehead
633 ) Uma -
She who is in “om”
634 ) Sailendra Thanaya -
She who is the daughter of the king of mountains
635 ) Gowri -
She who is white coloured
636 ) Gandharwa Sevitha -
She who is worshipped by gandharwas
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 69 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 40
🌻 40. . లభ్యతే౬పి తత్కృపయైవ ॥ 🌻
మహాత్ముల సందర్శనం ఎంత దుర్లభమైనా గాని, భగవదను గ్రహానికి పాత్రులైన భక్తులకది అప్రయత్నంగానె లభిస్తుంది.
పరిపక్వమైన శుద్ధ మనస్కుల చెంతకు భగవానుడు స్వయంగా మహాత్ములను నడిపిస్తాడు. మహాత్ములు వారంతట వారు ఏమీ చేయరు.
భగవంతుని ప్రేరణతోనె వారు చేస్తారు. భగవంతుని ప్రేరణ ఎలా ఉంటుందంటే అంతర్యామి శక్తి మహాత్ములలో పనిచేయడం ద్వారా భక్తునికి మహాత్ముని యొక్క సాంగత్యం లభిస్తుంది.
భక్తుడి సుకృతం వల్ల, భక్తిలో పరిపక్వత వల్ల, అంతర్యామి శక్తివల్ల ఈ అద్భుతం జరుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 38 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj
Soota uvacha:
Verse: Kailasa …
Upon hearing the request of the sages, Sage Suta felt happy that he now has an opportunity to share the knowledge of Guru Gita with sages who have earned the eligibility to hear it. He spoke thus:
“O Sages, one day upon the beautiful peak of Mount Kailas, Parvati offered reverential obeisance and posed a question to her husband, with the intention of helping devotees.”
We may wonder why Sage Suta is engaging in this preamble, instead of directly broaching the subject matter. Prior to initiating the sages into the Guru Maha Mantra, he is first contemplating on the lineage of Guru. In this manner Guru is meditated upon.
By mentioning the prominence of the location where this highest of all mantras was delivered, the immense power of the mantra is indicated. Earlier, Parvati had taught Hayagreeva the procedure for Sri Vidya. Similarly now, Lord Siva is teaching Parvati the Guru principle.
Parvatyuvacha –
Verse: Namaste …
Mother of the Universe Parvati prayed, “O God of gods, Lord, the higher than the highest, the Universal Master, Supreme Siva, I offer my prostrations. Please initiate me into the worship of Guru. I surrender my mind to you with complete devotion.”
Verse: Bhagavan …
“O Lord, you are knowledgeable in all aspects of Dharma. You grant happiness to all, O Master.
Therefore, you are addressed as Sambhu. Please teach me the greatest amongst all austerities.
Out of immeasurable compassion, please teach me the Guru principle,” requested Mother Goddess. Mother is asking for that which excels everything else in greatness and power.
She is suggesting that she is seeking that over which nothing higher exists. The question may arise whether energies are of different levels.
The channels through which energy travels may have varying capacities, but are there greater and lesser energies? Let us wait for the Lord’s teaching.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 35 / The Siva-Gita - 35 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము
*🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 5 🌻*
రాజస్త్రీ లంఘ నాసక్తం -రావణం నిహ నిష్యసి,
పానా సక్తో రిపుర్జే తుం - సుకర సమరాం గణే. 31
అధర్మ నిరత శ్శత్రు - ర్భాగే నైవ హాయ్ లభ్యతే,
అధి తవేద శాస్త్రోపి - సదా ధర్మ రతో పినా 32
వినాశ కాలే సంప్రాప్తే - ధర్మ మార్గా చ్చ్యుతో భవేత్,
రాజు భార్యను లేవ నెత్తుకొని పోయిన రావణుని నీవు
యుద్ద భూమి యందు వధింప గలవు. మధ్యము త్రాగిన వాడిని అనాయాసముగా జయింప వచ్చును కదా!
అధర్మ నిరతుడగు శత్రువు తన యదృష్టము చేతనే లభించును . బాగుగా వేదాగమ శాస్త్రముల నద్యయనము చేసిన వాడైతే నేమి, ధర్మ మార్గామి యైతే నేమి, "వినాశకాలే విపరీత బుద్ది: " అను సూక్తి మేరకు పోగాలము సమీపించి నప్పుడు అధర్మ మార్గములో ప్రవర్తించును.
పీడ్యంతేదేవతా స్సర్వా - స్సతతం యేన పాపినా 33
బ్రాహ్మణా ఋషయశ్వైవ - తస్య నాశ స్స్వయం స్థితః,
కిష్కిందా నగరే రామ ! - దేవానా మంశ సంభవా: 34
వానరా బహవో జాతా - దుర్జయా బలవత్త రాః,
సాహయ్యంతే కరిష్యంతి - తైర్భ ధానా పయోనిధిమ్ 35
ఓ రామా! కిష్కిందా పురంబున అమరుల యంశము వలన
అనేకమంది వనచరులు ఉద్భవించియున్నారు. వారందరు మిగుల శక్తి సంపన్నులై యితరులతో జయింపరాని వారై సాగరమును బంధించి నీకవసరమైనం తగా సహాయ పడగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 35 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 05 :
*🌻 Ramaya Varapradanam - 5 🌻
That Ravana who has abducted the wife of a King, to such a demon you would be able to slay in battle.
The way it is easy to vanquish a drunken man. Unrighteous enemy comes our way only due to good
fortune.
What if Ravana is a master in Vedas and Agama scriptures? What if he was a righteous person
anytime? When the time to decline arises, one becomes the enemy of his own intellect and acts against righteousness and becomes a wicked one.
O Rama! in the city called Kishkindha, many forest dwelling Vanara (monkey men) exist who are born from the portion of the Gods. They all are skilled and possessor of strength. They would help you cross the ocean and would assist in every way you want them to support you.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 27 / Sri Gajanan Maharaj Life History - 27 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 6వ అధ్యాయము - 3 🌻*
భక్తితో శ్రీవిళల భగవానునికి ప్రియుడయిన ఇతను జాతిప్రకారం మరాఠుడు. ఈయన విపులమయిన జీవితం గురించి భక్తిలీలమృతి అనే పుస్తకంలో చెప్పబడింది కావున ఇక్కడ పునః వర్నించడంలేదు. షేగాంకు ఈశాణ్యంగా 36 మైళ్ళ దూరంలో ఈ అకోట్ ఉంది, అక్కడికి శ్రీమహారాజు వాయువేగంతో వెళ్ళారు.
శ్రీనరసింహజి అకోట్ దగ్గరి ఆచిక్కటి అడవిలో ముక్తికోసం బసచేసారు. ఏవిధమయిన మానవసంచారం లేక, పెద్ద వృక్షాలు, తీగపొదలు, గడ్డి మరియు అనేక మయిన పాములతో ఈ అడవి దిట్టంగా ఉంది.
ఇటువంటి అడవిలో శ్రీనంశింహజి ఒంటరిగా నివసిస్తున్నారు. శ్రీగజానన్ ఆయన్ని కలిసేందుకు వెళ్ళారు. నీళ్ళు నీళ్ళలో కలిసినట్టు, ఒకేజాతి వస్తువులు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఒకజాతివికానివి ఎప్పటికీ ఒకదానితో ఒకటి కలవవు.
శ్రీగజానన్ను చూసిన శ్రీనరసింహజీ ఆనందం వర్ణించలేనిది. ఒకరు హరి అయితే ఇంకొకరు హర, ఒకరు రాముడు అయితే ఇంకొకరు వాసుదేవ్ - దేవకి కుమారుడు, ఒకరు ముని వశిష్టుడయితే ఇంకొకరు గోదావరి, ఒకరు కోహినూర్ అయితే ఇంకొకరు కౌస్థుభం, ఒకరు వైనతేవ్ అయితే ఇంకొకరు అంజని పుత్రుడు.
వీరు ఇద్దరూ ఒకరిని ఒకరు కలుసుకొని చాలా ఆనందించారు. దగ్గరగా కూర్చుని ఒకరి అనుభవాలను ఇంకొకరికి చెప్పుకున్నారు. నంరసింహా నువ్వు సంసారిక జీవితం చేసి మంచిపనిచేససావు. నేను దానిని త్యజించి అసలయిన సత్యంఅయిన బ్రహ్మను తెలుసుకునేందుకు యోగ మార్గాన్ని పాటించాను.
ఈ యోగమార్గంలో, సాధారణ మానవునికి అవగాహన కాని విషయాలు జరుగుతూ ఉంటాయి, వాటిని కప్పి ఉంచేందుకు అనేక మార్లు నేను పిచ్చివాడిగా ప్రవర్తిస్తాను. పరమాత్మను తెలుసుకునేందుకు కర్మ, భక్తి మరియు యోగ అనే మూడు మార్గాలు ఉన్నాయి. ఈమూడు మార్గాలూ వేరువేరుగా కనిపించినా నిజానికి ఇవి చేరేది ఒకే లక్ష్యానికి.
యోగి తన మార్గంగూర్చి గొప్పపడితే పరమాత్మనుండి దూరంగా ఉండిపోతాడు. తామరాకులా, తన యోగక్రియ ఫలితం నుండి దూరంగా ఉండాలి. అప్పుడే అతను పరమాత్మను తెలుసుకోగలడు. సంసారిక జీవనంలో కూడా అంతే. కుటుంబంతో నీకు సంబంధం ఉండకూడదు. గుళకరాళ్ళు నీళ్ళలో ఉన్నా నీళ్ళను తనలోనికి రానివ్వవు.
సంసారిక జీవితంలో నీ ప్రవర్తన కూడా అలానే ఏవిధమయిన కోరికలులేక పూర్తిగా బ్రహ్మాండునిమీద మనసు కేంద్రీకరించి ఉండాలి. ఇలా ఉంటే అసాధ్యమయినది ఇంక ఏమీ ఉండదు. నువ్వు, నేను, భగవంతుడూ ఒకరిమే, మిగిలిన ప్రజలు కూడా ఆయననుండి వేరు కాదు అని శ్రీగజానన్ అన్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 27 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 6 - part 3 🌻*
Akot is 36 miles to the north-east of Shegaon and Shri Gajanan Maharaj went there with the speed of wind. Shri Narsinghji was staying in the dense forest near Akot to get solitude. This forest, without any habitants, was very dense with big trees, creepers, wild grass and many snakes.
In such a dreadful forest Shri Narsinghji was living all alone. Shri Gajanan went there to meet him. Water mixes with water and like things always merge with each other. Unlike things never mix with each other. So looking at Shri Gajanan, Shri Narsinghji was happy beyond description.
One was Hari and the other Har, one was Rama, while other, the son of Vasudeo-Devaki. One was Ganga and the other Godavari. One was the Kohinoor, and the other Kaustubha. One was the Vashistha and the other, son of Anjani.
Both of them met each other and were very happy. They sat near each other and exchanged their experiences. Shri Gajanan said, Narsingha, you have done well by leading a family life. I renounced that and followed the path of Yoga, to know the ultimate reality, the Brahma.
In this path of yoga, many strange things, incomprehensible to the common man, happen, and to hide them I, many times, behave like a mad man. To know the ultimate Truth there are three paths - Karma, Bhakti and Yoga. Apparently they look like three different paths, but in reality they reach the same goal.
If a yogi feels proud of his path, he will remain away from the ultimate Truth. He should keep himself clean from the effect of Yogakriya, like a lotus leaf. Then only he can know the ultimate Truth. Same is the case with family life. You should not have attachment with your family.
A pebble remains in water, but does not allow the water to enter it. Such should be your behaviour in family life - free from any expectations and with full concentration in Almighty. Then nothing is impossible. You, I and God are one, and the people too are not different from Him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 17 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 17 🌻*
59. "నేను ఎవడను?" అని భగవంతుడు పలికిని మూలశబ్దమునే సర్వకారణత్వము అందురు.
నేను ఎవడను? - కారణం
సృష్టి - కార్యము.
60.భగవంతుని ఆది విలాసమే ఆతని తొలిపలుకు.
61. "నేనేవడను ?" అన్నదే భగవంతుని తొలిపలుకు.
62. ఆది విలాసము అభావమును సృష్టించెను.
63. "నేను ఎవడను ?" అన్నదే - భగవంతుని ఆదిమూలమైన అంతర్నిహిత ప్రథమ సంస్కారము
64. ఆదిమూలమైన ప్రథమసంస్కారమే అంతర్నిహితమైయున్న ఈ మిథ్యాజగత్తును సృష్టించినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 77 / Soundarya Lahari - 77 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
77 వ శ్లోకము
*🌴. సూక్ష్మ దృష్టి, అందరిని ఆకర్షించే శక్తి కొరకు 🌴*
శ్లో: 77. యదేతత్కాళిన్దీ తనుతరతరజ్గౌ కృతి శివే కృశే మధ్యే కిఞ్చత్తవ జ్జనని యద్భాతి సుధియాం
విమర్దాదన్యోన్యం కుచకలశయో రన్తరగతం
తనూభూతం వ్యోమ ప్రవశిదివ నాభిం కుహరిణీమ్ll
🌻. తాత్పర్యం :
అమ్మా! భవానీ! నీ యొక్క నడుము నందు ముందుగా కనపడుచున్నది సన్నదియు అగు యమునా నది యొక్క సన్నని కెరటము యొక్క రూపము గలదిగా నల్లని అయిన చిన్న వస్తువును నీ కుచకుంభములు ఒకదానికి ఒకటి ఒరిపిడి వలన వాటి మధ్యన ఉన్న ఆకాశము చిన్నదయి క్రింద నాభి వరకు జారినదిగా కనబడుచున్నది . కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, తేనె, అరటి పండ్లు, పెరుగున్నము నివేదించినచో సూక్ష్మ దృష్టి, అందరిని ఆకర్షించే శక్తి లభించును అని చెప్పబడింది
🌹 🌹 🌹 🌹 🌹
*🌹Soundarya Lahari - 77 🌹*
📚. Prasad Bharadwaj
SLOKA - 77
*🌴 Gaining Micro Sight, Attracting Everyone 🌴*
77. Yadhethath kalindhi thanu thara ngaa kruthi shive Krushe mahye kinchid janani thawa yadbhathi sudheeyam Vimardha -dhanyonyam kuchakalasayo -ranthara gatham Thanu bhootham vyoma pravishadhiva nabhim kuharinim
🌻 Translation :
The mother of universe who is shiva and shakthi,in the narrow part of the middle of your body.the learned men seem to see a line,which is in the shape of a small wave of the river yamuna,and which shines and glitters, and appears like the sky,made very thin by thine dense colliding breasts,entering your cave like navel.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 2000 times a day for 15 days, offering honey and fruits as prasadam, it is believed that they Gain Micro Sight and will have the capacity to attract everyone.
🌻 BENEFICIAL RESULTS:
Dominance over others, deep insight.
🌻 Literal Results:
Activation of manipooraka chakram. Ability to gain access to the most impossible situation or entity. Power, authority and influence.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 378 / Bhagavad-Gita - 378 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 27 🌴
27. ఉచ్చై:శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేన్ద్రాణాం నారాణాం చ నరాధిపమ్ ||
🌷. తాత్పర్యం :
అశ్వములలో అమృతము కొరకై సాగరమంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయి యున్నాను.
🌷. భాష్యము :
ఒకమారు దేవదానవులు సముద్రమంథనము నందు పాల్గొనగా ఆ కార్యము వలన అమృతము మరియు హాలాహలము రెండును ఉద్భవించినవి. అట్లు ఉద్భవించిన హాలాహలమును పరమశివుడు త్రాగెను. అమృతము నుండి ఉద్భవించిన అనేకములలో ఉచ్చైశ్రవనామము గల అశ్వమొకటి. అమృతము నుండి ఉద్భవించిన వేరొక జంతువు ఐరావతమను గజము. అమృతము నుండి ఉద్భవించినందున ఈ రెండు జంతువుల ప్రత్యేకతను సంతరించుకొని, శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి.
నరులలో నరాధిపుడైన రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఏలయన శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు కాగా, రాజులు (దైవగుణములు కలిగియున్నందున రాజులుగా నియమింపబడినవారు) తమ రాజ్యమును పాలించువారై యున్నారు.ధర్మరాజు, పరీక్షిత్తు, శ్రీరాముడు వంటి ధర్మాత్ములైన రాజులు సదా తమ ప్రజల క్షేమమును గూర్చియే తలచియుండిరి. కనుకనే వేదములందు రాజు భగవానుని ప్రతినిధిగా పరిగణింపబడినాడు. కాని నేటి కాలమున ధర్మము నశించిన కారణముగా రాజవంశములు క్షీణించి చివరకు పూర్తిగా నశించిపోయినవి. అయినను పూర్వకాలమున ధర్మాత్ములైన రాజులు సంరక్షణలో జనులు ఆనందముతో జీవించిరని మనము అవగాహన చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 378 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 27 🌴
27. uccaiḥśravasam aśvānāṁ
viddhi mām amṛtodbhavam
airāvataṁ gajendrāṇāṁ
narāṇāṁ ca narādhipam
🌷 Translation :
Of horses know Me to be Uccaiḥśravā, produced during the churning of the ocean for nectar. Of lordly elephants I am Airāvata, and among men I am the monarch.
🌹 Purport :
The devotee demigods and the demons (asuras) once took part in churning the sea. From this churning, nectar and poison were produced, and Lord Śiva drank the poison. From the nectar were produced many entities, of which there was a horse named Uccaiḥśravā. Another animal produced from the nectar was an elephant named Airāvata. Because these two animals were produced from nectar, they have special significance, and they are representatives of Kṛṣṇa.
Amongst the human beings, the king is the representative of Kṛṣṇa because Kṛṣṇa is the maintainer of the universe, and the kings, who are appointed on account of their godly qualifications, are maintainers of their kingdoms. Kings like Mahārāja Yudhiṣṭhira, Mahārāja Parīkṣit and Lord Rāma were all highly righteous kings who always thought of the citizens’ welfare. In Vedic literature, the king is considered to be the representative of God. In this age, however, with the corruption of the principles of religion, monarchy decayed and is now finally abolished. It is to be understood that in the past, however, people were more happy under righteous kings.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 200 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
44. అధ్యాయము - 19
*🌻. శివునితో కుబేరుని మైత్రి - 2 🌻*
ఆయమేవ వరో నాథ యత్త్వం సాక్షాన్నిరీక్ష్యసే | కిమన్యేన వరేణశ నమస్తే శశిశేఖర ||
ఇతి తద్వచనం శ్రుత్వా దేవదేవ ఉమాపతిః | దదౌ దర్శన సామర్ధ్యం సృష్ట్వా పాణితలేన తమ్ || 15
ప్రసార్య నయనే పూర్వముమామేవ వ్యలోకయత్ | తతోSసౌ యాజ్ఞదత్తిస్తు తత్సామర్థ్య మవాప్య చ || 16
నాథా! నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుటయే నేను కోరే వరము. ఈశా! ఇతర వరములతో పనియేమి? ఓ చంద్రశేఖరా! నీకు నమస్కారమగు గాక! (14).
దేవదేవుడగు పార్వతీపతి ఈ మాటను విని, ఆతనిని అరచేతితో స్పృశించి, చూడగలిగే శక్తిని ఇచ్చెను (15).
యజ్ఞదత్త కుమారుడగు ఆ కుబేరుడు చూడగలిగే శక్తిని పొంది, కన్నులను తెరచి, ముందుగా పార్వతీ దేవిని చూచెను (16).
శంభోస్సమీపే కా యోషిదేషా సర్వాంగ సుందరీ | ఆనయా కిం తపస్తప్తం మమాపి తపసోsధికమ్ || 17
అహో రూపమహో ప్రేమ సౌభాగ్యం శ్రీ రహో భృశమ్ | ఇత్యావాదీదసౌ పుత్రో ముహుర్మహురతీవ హి || 18
క్రూరదృగ్వీక్షతే యావత్పునః పునరిదం వదన్ | తావత్పుస్ఫోట తన్నేత్రం వామం వామావిలోకనాత్ || 19
అథ దేవ్య బ్రవీద్దేవ కిమసౌ దుష్టతాపనః | అసకృద్వీక్ష్య మాం వక్తి కురు త్వం మే తపః ప్రభామ్ || 20
అసకృద్వీక్షణనాక్‌ష్ణా పునర్మామేవ పశ్యతి | అసూయ మానో మే రూపప్రేమ సౌభాగ్య సంపదా || 21
శంభుని సమీపములో సర్వాంగ సుందరియగు ఈ యువతి ఎవరు? ఈమె ఎట్టి తపస్సును చేసినదో? నా కంటె అధికమైన తపస్సును చేసినది (17).
అహో!ఏమి రూపము! అహో! ఏమి ప్రేమ! ఏమి సౌభాగ్యము! ఏమి శోభ! ఇట్లు కుబేరుడు మరల మరల పలుకుచు అతిగా ప్రవర్తించెను (18).
ఇట్లు పలుకుచూ క్రూరమగు చూపులతో ఆమెను చూచుటచే, అతని ఎడమ నేత్రము పగిలిపోయెను (19).
అపుడా దేవి దేవునితో నిట్లనెను. ఏమి ఇది? ఈ దుష్టతాపసుడు అదే పనిగా నన్ను చూచి మాటలాడుచున్నాడు. నాతపశ్శక్తిని వీనికి తెలుపుడు జేయుము (20).
మరల మరల నన్నే చూచుచున్నాడు. నా రూపమును, ప్రేమను, సౌభాగ్యమును, సంపదను చూచి అసూయపడుచున్నాడు (21).
ఇతి దేవీగిరం శ్రుత్వా ప్రహస్య ప్రాహ తాం ప్రభుః | ఉమే త్వదీయః పుత్రోసౌ న చ క్రూరేణ చక్షుషా|| 22
సంపశ్యతి తపోలక్ష్మీం తవ కిం త్వధి వర్ణయేత్ | ఇతి దేవీం సమాభాష్య తమీశః పునరబ్రవీత్ || 23
వరాన్ దదామి తే వత్స తపాసానేన తోషితః | నిధీనామథ నాథస్త్వం గుహ్యకానాం భవేశ్వరః || 24
యక్షాణాం కిన్నరాణాం చ రాజ్ఞాం రాజా చ సువ్రతః | పతిః పుణ్యజనానాం చ సర్వేషాం ధనదో భవ || 25
దేవి యొక్క ఈ మాటలను విని శివప్రభువు చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను. ఉమా! ఈతడు నీ కుమారుడు. ఈతడు నిన్ను క్రూరదృష్టితో చూచుటలేదు (22).
పైగా నీతపస్సంపదను వర్ణించుచున్నాడు. ఇట్లు దేవితో పలికి ఈశుడు మరల కుబేరునితో నిట్లనెను (23).
వత్సా! నీ తపస్సును నేను మెచ్చితిని. నీకు వరములనిచ్చెదను. నీవు నిధులకు నాథుడవు అగుము. గుహ్యకులకు ప్రభువ అగుదువు (24).
యక్షులకు, కిన్నరులకు, రాజలకు రాజువై వ్రతములననుష్ఠించుము. పుణ్యాత్ములకు ప్రభువు అగుదవు. అందరికీ నీవే ధనమును ఇచ్చెదవు (25).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 76 🌹*
Chapter 22
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 How Mreciful He Is - 2 🌻*
When a man becomes God and works for humanity, God acting as man plays the role of God in the world. This is the role of the Perfect Masters.
When Sai Baba acts the role of a beggar, or when Narayan Maharaj acts the role of a king, or when Tajuddin Baba acts the role of a mad lunatic, they do not have to pass through all that a real beggar, or king, or lunatic passes through in real life. The Perfect Masters create the impression upon their audience of being a beggar, or king, or lunatic, through their
perfect acting.
But they are really God playing out various roles as beggar, or king, or lunatic. Though the Perfect Masters seemingly pass through all that a beggar, or king, or lunatic passes through, in actuality these Perfect Masters do not pass through what beggars, kings, or lunatics do.
The Perfect Masters are only acting, and because their acting is perfect, people take them
to be a beggar, or king, or lunatic, but actually they are acting a role.
However, God as the Avatar does not act, he becomes. God through the Avatar's
becoming, becomes beggars, kings, lunatics and every other type of person.
Therefore, he has to bear all the experiences of beggars, kings, lunatics and every other type of person, and he bears their experiences by passing through all that beggars, kings, lunatics, and every other type of person passes through.
So the Avatar is never acting while he is working, because he has become that.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సర్వతో భద్ర మండల విధి - 4 🌻*
చత్వార్యన్తర్బహిర్ద్వే తు శోభార్థం పరిమృజ్య తు | ఉపద్వారప్రసిద్ధ్యర్థం త్రీణ్యన్తః పఞ్చ బాహ్యతః. 37
పరిమృజ్య తథా శోభాం పూర్వవత్పరికల్పయేత్ | వహ్నికోణషు సప్తాన్తస్త్రీణి కోష్ఠాని మార్జయేత్. 38
పఞ్చవింశతికవ్యూహే పరం బ్రహ్మ యజేచ్ఛుభీ | మధ్యే పూర్వాదితః పద్మే వాసుదేవాదయః క్రమాత్. 39
వరాహం పూజయిత్వా చ పూర్వపద్మే తతః క్రమాత్ |
వ్యూహాన్ సంపూజయేత్తావద్యావత్ షట్త్రింశగో భవేత్. 40
యథోక్తం వ్యూహ మఖిలమేకస్మన్ పఙ్కజే క్రమాత్ | యష్టవ్యమితి యత్నేన ప్రచేతా మన్యతే7ధ్వరమ్. 41
సత్యస్తు మూర్తిభేదేన విభక్తం మన్యతే 7చ్యుతమ్ |
చత్వారింశత్కరం క్షేత్రం హ్యుత్తరం విభజేత్ర్కమాత్. 42
ఏకైకం సప్తధా భూయస్తథైకైకం ద్విధా పునః | చతుష్షష్ట్యుత్తరం సప్తశతాన్యేకసహస్రకమ్. 43
కోష్ఠకానాం భద్రకం చ మధ్యే షోడశకోష్ఠకైః | పార్శ్వే వీథీం తతశ్చాభద్రాణ్యథ చ వీథికామ్. 44
షోడశాబ్జాన్యథో వీథీ చతుర్వింశతిపఙ్కజమ్ | వీథీపద్మాని ద్వాత్రింశత్ పఙ్త్కివీథిజకాన్యథ. 45
చత్వారింశత్తతో వీథీశేషపఙ్త్కిత్రయేణ చ | ద్వారశోభోపశోభాః స్యుర్దిక్షు మధ్యే విలోప్య చ. 46
ద్విచతుష్షడ్ద్వారసిద్ధ్యై చతుర్దిక్షు విలోపయేత్ | పఞ్చత్రీణ్యకకం బాహ్యే శోభోపద్వారసిద్ధయే. 47
ద్వారాణాం పార్శ్వయోరన్తః షడ్వా చత్వారి మధ్యతః | ద్వే ద్వే లుప్యే దేవమేవ షడ్ భవన్త్యుపశోభికాః. 48
ఏకస్యాం దిశి సఙ్ఖ్యాః స్యుశ్చతస్రః పరిసంఖ్యయా | ఏకైకస్యాం దిశి త్రీణి ద్వారాణ్యపి భవన్త్యుత. 49
పఞ్చ పఞ్చ చ కోణషు పఙ్త్కౌ పఙ్త్కౌ క్రమాత్సృజేత్ | కోష్ఠకాని భవేదేవం మర్త్యేష్టం మణ్డలం శుభమ్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వతోభద్రమణ్డలాది విధిర్నామోనత్రింశోధ్యాయః.
మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచి వేయవలెను. పిమ్మట ఉపద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపలనున్న ఐదు కోష్ఠములను తుడిచివేయవలెను.
పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహమండలము లోపల నున్న కమలకర్ణికపై పరమాత్మను పూజింపవలెను.
మరల తూర్పు మొదలైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలముపై భగవంతుడగు వారహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను.
ఇరువదియారవ తత్త్వమైన పరమాత్మునిపూజ సంపన్నమగువరకును ఈ క్రమముజరుగవలెను. ఒకేమండలముపై అన్ని వ్యూహముల పూజనుక్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను.
నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను.
ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను.
పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను.
సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను.
ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును.
ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున.
అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 87 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. పరాశర మహర్షి - 6 🌻*
28. ఏది మేలు? పరంగతి అంటే ఏమిటి? నాశనం లేనటువంటి కృత్యమెట్టిది? దానిని చెప్పమని” జనకుడు అడిగాడు.
29. “అన్నిటికంటేమేలు అసంగమే! సంగబుద్ధి దేనిలోనూ లేకపోవటమే! అంటే, నిస్సంగత్వం. జ్ఞానమే పరమగతి. దానిని మించిన పరమగతి ఎవరికీ లేదు. బ్రహ్మదేవుడికికూడా పూజ్యమైన వస్తువు, నమస్కరించబడే వస్తువు జ్ఞానమే! నాశనంలేని కర్మ ఏమిటంటే, తపస్సే” అను బోధించాడు పరాశరుడు.
3౦. తపస్సనే మాటను నిత్యమూ వాడుతుంటాము. రుద్రుడినిగురించి రాక్షసులు తపస్సుచేసారు. తీక్షణమైన తపస్సుచేసారు. దానికి పర్యవసానంగా ఈశ్వరుడిని వరాలు అడగటంవల్ల, వాళ్ళ తపస్సు నశిస్తుంది. నిరంతరమై, ఏ వరమూ అడగని తపస్సు నాశనరహితమై కర్మ అనబడుతుంది.
31. పర్యవసానంలేని తపస్సు చిరకాలం అలా చేస్తూనేఉంటే అది నాశనం చెందదు. ఈ విషయం తెలుసుకోవటమే సర్వవేదసారం తెలుసుకోవటమంటే. ఇలా ఈ ప్రకారంగా సర్వవేదసారములను తెలుసుకున్నవాడు తపోయోగములందు ఉందవచ్చు అనికూడా వివరించాడూ పరాశరుడు.
32. విషయములందు ఉనికి కలిగితే, వాటిలో తానుంటాడు. విషయములనేవి యథార్థంగా ఉన్నాయి అనే గుర్తింపుకూడా అతనికి ఉంటుంది. ఇంద్రియములున్నాయి, సుఖదుఃఖాలున్నాయి, అన్నీ ఉన్నాయనే గుర్తింపు కలిగినవాడైనా, తనకూండే విజ్ఞానంవలన తామరాకుమీద నీటివలే దానివలన అతడు దూషితుడుకాడు.
33. అట్లాంటి విజ్ఞానానికి ఈ సంసారము ఎలాంటి దోషమునూ ఇవ్వదు. ఉదాహరణకు, కమలం ఉంది. పంకజం అని దానికి పేరు. పంకం అంటే బురద. కాని పంకజానికి ఆ పెఋఐతే ఉందికాని, దానికి ఏమయినా పంకం అంటిఉంటుందా! దాని నాళం, వేరు, మూలము బురదలో ఉంటాయి కాని ఆ కమలంమాత్రం ఎంత నిర్మలంగా ఉంటుంది.
34. అలాగే తన ఉనికియొక్క మూలం సంసారంలో ఉన్నాప్పటికీ, జ్ఞానంచేత – జలంలో ఉన్న పరిశుద్ధమైన ఈ కమలంవలెనే – మనుష్యుడు పరిశుద్ధుడుగా ఉంటాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 18 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*
STANZA IV
*🌻 The Gift of Mind - 6 🌻*
33. A gong struck. The Third Round of the battle was over. Balance had won.
Man understood that he should not rush about and fret, thereby weakening his precious life forces. His two poles, like two scale-pans, he resolved to keep in balance, not letting evil outweigh his divine heritage.
The pan of Light was feathery and weightless. He must no longer add dark deeds to the opposing pan of darkness; at the same time he would sort through its contents for worthiness, so as to burn whatever he didn’t need as superfluous rubbish. The work progressed quickly. Man glanced sometimes into one of the pans, and sometimes into the other.
Keeping constant watch over new additions to the pan of Light was difficult, for it was so weightless and invisible that it was a challenge to perceive just when the pan of evil started to outweigh it...
A high degree of alertness was required. And the Gods decided to set a New Period for the Round of Earthly Time, so that mankind would be armed with this priceless Gift of Heaven.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 36 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. మహిమలు పరీక్ష 🌻*
వీరబ్రహ్మేంద్రస్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు, నవాబును ఉద్దేశించి "ఆ గుఱ్ఱము గర్భములో వున్నశిశివును చూడటమే నీ ఉద్దేశ్యం అని నాకు అర్థమయింది. అది చూసేవరకూ కూడా నాపై నీక్కలిగిన సందేహం తొలిగిపోదు... అవునా!” అని నవ్వుతూ అడిగారు స్వామి.
నవాబు అవునని జవాబిచ్చాడు.
వీరబ్రహ్మంగారు నాలుగువేపులా డేరా కట్టించి, గుఱ్ఱం గర్భంలో వున్నపిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు. నవాబు దాన్ని తన చేతులతో అందుకుని, తెర బయటకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు.అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి వుంది. అందురూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసి, ఆశ్చర్యపోయారు.
తిరిగి బ్రహ్మేంద్రస్వామి ఆ గుఱ్ఱపు పిల్లని గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి, గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు. ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మంగారిమీద నమ్మకం పెరిగింది. తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు.
🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట 🌻
నేను శ్రీ వీర భోజుండనయి ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణ, శిష్టరక్షణకై వస్తాను.ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను...
ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటంవల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం.
నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.
దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి, మాడిపోతారు.
5972సంవత్సరం ధాత నామ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి.
కోటిదూపాటిలోనూ, కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.
జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.
కోమటి కులంలో 25గోత్రముల వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమభేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే 'మహాత్మ' అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశ విదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మ' పేరు మీదే సంభోదిస్తారు.
మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి, నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
దక్షిణ ప్రాంతంలో అయిదు తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది.
ఇలాంటి వింతలూ ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం, ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం.
బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీది వేపచెట్టుకు జాజిపూలు పూస్తాయి.
గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.
గోలకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలతారు.
మహానంది మరుగున మహిమలు పుడతాయి.
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించినవారిని నేను కాపాడుతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీర భోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు. మూఢులుమాత్రం నమ్ముతారు.
మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్న మంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 8 🌹*
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌟 2. భూమి - మానవ సృష్టి - 3 🌟*
🌟. ఈ భూమిని ఆక్రమించిన వారు గొప్ప జన్యుశాస్త్ర నిపుణులు! వారు ప్రాణప్రతిష్ట చేయడంలో నిష్ణాతులు. దురాక్రమణకు ముందు ఉన్న మానవుడు సాక్షాత్తు దైవమే! ఈ దైవంలో ఎన్నో అద్భుతశక్తులు దాగి ఉన్నాయి. పరిపూర్ణజ్ఞానం, పరిపూర్ణప్రేమ, పరిపూర్ణచైతన్యం అనే దివ్యశక్తులు కలిగిన *"స్త్రీ శక్తి (ఫెమినైన్ఎనర్జీ)"* ని కలిగి ఉన్న దివ్యమానవుడు.
💫. ఈ పరిపూర్ణ శక్తులన్నింటినీ గ్రహిస్తూ, వినియోగిస్తూ, ఆనందవిహారిగా ఉన్న ఈ దైవమానవుడు దురాక్రమణ తరువాత తన సర్వశక్తులూ కోల్పోయి.. సామాన్య మానవునిగా మారిపోయాడు.
💫. దైవం మానవ చైతన్యమైన తన జన్యువులను (12 ప్రోగులు నుండి144 ప్రోగుల వరకు ఉన్న జ్ఞానం)ఎన్నో ప్రయోగాలు చేసి వాటిలో ఉన్న పరిపూర్ణ శక్తులను, జ్ఞానాన్ని తొలగించి రెండు ప్రోగుల అల్పమైన మానవునిగా... ఇతరులపై ఆధారపడే వ్యక్తిగా మార్చారు.
వీరి యొక్క లక్ష్యం కేవలం భౌతికతే. ఈ *"రెండు ప్రోగుల మానవుడు"* అజ్ఞానిగా, అరిషడ్వర్గాలకు లోబడి ఉండే వ్యక్తిగా ఉంటూ, మూలాధారస్థితి కన్నా తక్కువ స్థాయిలో జీవిస్తున్నారు.
💫. మానవుల యొక్క ఈ అజ్ఞానం కారణంగా స్వేచ్ఛా సీమగా ఉండవలసిన భూమి ఆక్రమణ భూమిగా మారిపోయింది.
ఎన్నో విశ్వాలకు జ్ఞానం అందించవలసిన ఈ భూమి, ఇక్కడ ఉన్న చీకటిని (అజ్ఞానం) ఇతరులకు పంచే స్థితికి తయారయింది. ఈ భూమిని ఆక్రమించుకున్న వారి లక్ష్యం కూడా అదే. ఈ భూమి ద్వారా అనంత విశ్వాలను జయించవచ్చు అన్న కోరిక.
ఈ భూమిని మొదటగా సృష్టించిన చైతన్య స్వరూపులు అయిన సృష్టికర్తలకు ఈ భూమిని వదులుకోవడం ఇష్టంలేదు. ఉన్నత కాంతిలోకాలలోని ... ఉన్నత శరీరధారులతో సంప్రదించి ఈ భూమినీ, ఈ భూమిపై ఉన్న జీవరాశినీ పునర్నిర్మించే పనిని చేపట్టారు.
తిరిగి భూమిని వెలుగులతో నింపటానికి భూమి చుట్టూ ఉన్న గ్రిడ్ లను సరిచేసి.. కాంతి వచ్చే మార్గాలైన కాంతి ద్వారాలనూ మరి సమయ ద్వారాలనూ తెరవడానికి వారు ప్రయత్నించారు.
ఈ కార్యక్రమానికి ముందే వారు *"మానవ జన్యువులను తిరిగి 12 ప్రోగులకు సరిచేయాలి"* అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ 12 లోకాల వారు స్వీకరించి పూర్తి చేయడం జరిగింది. ఇది అంతా లక్ష సంవత్సరాల పూర్వమే ప్రారంభం అయింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 152 🌹*
✍️ Nisargadatta Maharaj
📚. Prasad Bharadwaj
*🌻 PEACE , POWER , HAPPINESS - theses are UNIVERSAL. Not personal states. 🌻*
It is just like your tape-recorder. It records, it reproduces - all by itself. You only listen.
Similarly, I watch all that happens, including my talking to you. It is not me who talks, the words appear in my mind and then I hear them said.
How can a person limited in time and space, a mere body-mind, a gasp of pain between birth and death, be happy? The very conditions of its arising make happiness impossible.
Peace, power, happiness - theses are never personal states; nobody can say ‘my peace,’ ‘my power’ - because ‘mine’ implies exclusivity, which is fragile and insecure.
It is in the nature of truth or love, cosmic consciousness, to express itself, to affirm itself, to overcome difficulties.
Once you've understood that the world is love in action, consciousness or love in action, you will look at it quite differently. But first your attitude to suffering must change. Suffering is primarily a call for attention, which itself is a movement of love.
More than happiness, love wants growth, the widening and deepening of awareness and consciousness and being. Whatever prevents that becomes a cause of pain, and love does not shirk from pain.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 30 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 19 🌻*
బ్రహ్మచర్యం అన్నదాంట్లో ప్రతి ఒక్కరికీ సందేహం కలగవచ్చు. బ్రహ్మచర్యము అంటే అర్ధము ఏమిటంటే బ్రహ్మమునందు చరించుట.
అనగా అర్ధం ఏమిటంటే ఇంద్రియములను ఇంద్రియార్ధములందు పని చేస్తున్నప్పటికి నేను బ్రహ్మమును, నేను సాక్షిని అని ఎవరైతే విలక్షణంగా వుంటారో, ఆ ఇంద్రియ సుఖమును తాననుభవించడు. శారీరిక చర్య, ఉపచర్యలలో ప్రవర్తించినటువంటి సందర్భాలు ఏర్పడినప్పటికీ కూడా సంయమేంద్రియుడై ఇంద్రియజయాన్ని కలిగియుండి నామమాత్రమై నిమిత్తమాత్రమై ఉంటాడు. అప్పుడేమయ్యాడు? అంటే ఆయా చర్య ఉపచర్యలలో, ప్రతిచర్యలలో పాలుపంచుకున్నట్లుగా చూచేవారికి కనబడుతున్నాడు.
జగత్తుకి చూస్తే మాత్రం అలాగే వున్నట్లుగానే కనబడుతున్నాడు. కాని వాస్తవికంగా తాను అలా లేడు. ఈ రకముగా శరీరమునందే ఉన్నటువంటివాడై వుండి, అశరీరిగా వున్నాడు. దేహమునందే ఉన్నవాడుగా వుండి, దేహిగా వున్నాడు. క్షేత్రమునందే ఉన్నవాడుగా వుండి, క్షేత్రజ్ఞుడుగా వున్నాడు.
ఈ రకమైనటువంటి విభాగన్యాయమును మన అంతరంగమునందు ఏర్పరచుకుని బుద్ధిని గనక చైతన్యమునందు సంయమించేటటువంటి సాధనని, ఉపశమించేటటువంటి సాధనని గనక మనం చేసినట్లయితే నీవు ఆత్మోపదేశమును పొందినవాడవై ఆత్మవిచారణ ద్వారా ఆత్మోన్నతిని సాధించి ఆత్మానుభూతిని, ఆత్మనిష్ఠని పొందగలుగుతావు అనేటటువంటి దృఢమైనటువంటి సరియైనటువంటి మార్గనిర్దేశం చేస్తున్నారు.
శ్రేయోమార్గము ననుసరించువారు అరుదుగా నుందురు. లోకములో నూటికి కోటికి ఎవరో ఒకరే నీవంటివారు ఆత్మజిజ్ఞాస కలవారుందురు. మానవులలో అనేకులు ఆత్మనుగురించి వినుటకు నోచుకొనరు. ఆత్మ జ్ఞానమును ప్రబోధించి ఉపదేశములను వినుటకు అవకాశము కల్పించుకొనరు. ఒకవేళ అట్టి ఉపదేశములను వినుచుండినను వారిలో ఎక్కువమందికి ఆత్మయననేమో తెలియదు. ఆత్మ తత్వమును చెప్పగలవారు కూడా అరుదుగా వుందురు. ఆత్మను గురించి విని, వినిన దానిని మనన నిధి ధ్యాసలచే ఆత్మ నెరుంగువారు కుశలురు.
ఆత్మ తత్వమును బోధించువారు కూడా అతి కుశలురై యుండవలెను. అట్టి నిపుణుడైన ఆచార్యునిచేత బోధింపబడి ఆత్మ నెరుగు వ్యక్తిని అద్భుతమైన వ్యక్తి యనక తప్పదు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 7. ఓర్పు - వచ్చి పోవునవి - ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును. ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 14 📚*
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః |
ఆగమాపాయినో-నిత్యా స్తాం స్తితిక్షస్వ భారత || 14
వెండితెరపై పాత్రధారులు వచ్చిపోవుచుందురు. వివిధములైన సంభాషణములు వారి నడుమ జరుగుచుండును. సన్నివేశములు నిరంతరము సాగుచుండును. సమస్య లేర్పడుచుండును.
మరియు పరిష్కరింప బడుచుండును. సుఖ పూరితములు, దుఃఖ పూరితములు, ఉద్రేక పూరితములు, రాగద్వేష పూరితములు మరెన్నెన్నియో సమస్యలు వచ్చిపోవు చుండును. అనంతముగా పాత్రధారులు వచ్చిపోవుచుందురు. దృశ్యములు వచ్చిపోవు చుండును. సన్నివేశములు వచ్చిపోవు చుందురు.
వెండితెరపై వచ్చిపోవుచున్న సమస్త దృశ్యములకు వెండి తెరయే ఆధారము. ఎన్ని విషయములు వచ్చిపోవుచున్నను వెండి తెర వెండితెరగానే యుండునుగాని, స్థితి మార్పు చెందదు.
పళిలిరాణికము, సాంఫిుకము, జానపదము అగు ఎన్ని చిత్రములు తెరపై ప్రదర్శింపబడినను, వాని వాసన లేక ప్రభావము వెండితెర కుండదు. సినిమాహాలులోని వెండితెర విందే సృష్టిలోని చైతన్యము.
చైతన్యము ఆధారముగా లోకములు, లోకులు ఏర్పడుదురు. వారి నడుమ సన్నివేశములు కాలము రూపమున ఏర్పడుచుండును. ఇందేదియు చైతన్యము నంటదు. సృష్టిలోని ఈ చైతన్యమునే దైవమందురు.
దాని నాశ్రయించుటచేత జీవులు
కూడ సమస్యల కతీతముగ ప్రశాంతముగ జీవించనగును. దాని
నాశ్రయించుటకే వివిధ మార్గములు.
సృష్టియందలి ఈ చైతన్యము త్రిగుణాత్మకముగ ఏర్పడినపుడు లోకములు, లోకులు, సన్నివేశ ములు ఏర్పడును. అనగా సినిమా యుండును.
శుద్ధచైతన్యముగా నున్నపుడు సినిమా లేక వెండితెర యుండును. సినిమా వేయబడు నపుడు కూడ వెండితెర ఉన్నప్పటికీ అందలి సన్నివేశములను, సమస్యలను చూచువారికి వెండితెర మరపునకు వచ్చును. వెండి తెర గుర్తున్నవారికి సన్నివేశములన్నియు వచ్చిపోవునవి వలె కనుపించును.
సుఖము - దుఃఖము; సళిలికర్యము- అసళిలికర్యము; లాభము-నష్టము; ధనము-పేదరికము; జననము-మరణము; రాత్రి-పగలు మొదలగునవన్నియు వచ్చిపోవునవియే.
శ్రీకృష్ణుడు అట్టి చైతన్య స్వరూపుడు
కనుక ఈ సృష్టి యందలి సమస్తము వచ్చిపోవునవియే అనియు, '' నేను'' అను చైతన్యము శాశ్వత మనియు, అట్టి శాశ్వత ప్రజ్ఞయందు నిలబడిన వానికి మొత్తము సృష్టి అంతయు ఒక సినిమా కథనం వలె ఆనందము నందించు ననియు బోధించెను. అనిత్యములు మరియు వచ్చిపోవు విషయముల యందు ఓర్పు వహించమని బోధించెను.
ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును.
సృష్టి యందలి సమస్త విజయములకును ఓర్పు ప్రధానమని భగవానుడు బోధించెను. ''తితిక్షస్వ భారత'' - ఓ భారతీయుడ! ఓర్పు వహించుము! అని గీత నిర్దేశించుచున్నది.
ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను. అట్లు గుర్తు తెచ్చుకొనుట వలన జీవితము నందలి సమస్తమైన సన్నివేశములు వచ్చిపోవునవియే అని తెలియగలదు. ఈ అభ్యాసము వలననే ఎవనికైనను తెలియుట యుండును గాని, చదువుట, వినుట వలన మాత్రము కాదు.
ఓర్పును మించిన గుణము లేదని, దానిని ముందు పొందుమని గీతోపనిషత్తు ప్రప్రథంమముగా బోధించుచున్నది.
ఓర్పు వలననే శ్రీరాముడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, నలుడు ఇత్యాది దివ్యాంశ సంభూతులు లోకము లన్నిటిని జయించగల్గిరి.
ఓర్పు మనిషిని మహాత్మునిగ మార్పు ఉత్ప్రేరకము. ఎన్ని సద్గుణము లున్నప్పటికిని ఓర్పు లేనిచో అవి రాణించవు.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹