భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 87

Image may contain: 2 people, people standing

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 87 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 6 🌻

28. ఏది మేలు? పరంగతి అంటే ఏమిటి? నాశనం లేనటువంటి కృత్యమెట్టిది? దానిని చెప్పమని” జనకుడు అడిగాడు.

29. “అన్నిటికంటేమేలు అసంగమే! సంగబుద్ధి దేనిలోనూ లేకపోవటమే! అంటే, నిస్సంగత్వం. జ్ఞానమే పరమగతి. దానిని మించిన పరమగతి ఎవరికీ లేదు. బ్రహ్మదేవుడికికూడా పూజ్యమైన వస్తువు, నమస్కరించబడే వస్తువు జ్ఞానమే! నాశనంలేని కర్మ ఏమిటంటే, తపస్సే” అను బోధించాడు పరాశరుడు.

3౦. తపస్సనే మాటను నిత్యమూ వాడుతుంటాము. రుద్రుడిని గురించి రాక్షసులు తపస్సుచేసారు. తీక్షణమైన తపస్సుచేసారు. దానికి పర్యవసానంగా ఈశ్వరుడిని వరాలు అడగటంవల్ల, వాళ్ళ తపస్సు నశిస్తుంది. నిరంతరమై, ఏ వరమూ అడగని తపస్సు నాశనరహితమై కర్మ అనబడుతుంది.

31. పర్యవసానంలేని తపస్సు చిరకాలం అలా చేస్తూనేఉంటే అది నాశనం చెందదు. ఈ విషయం తెలుసుకోవటమే సర్వవేదసారం తెలుసుకోవటమంటే. ఇలా ఈ ప్రకారంగా సర్వవేదసారములను తెలుసుకున్నవాడు తపోయోగములందు ఉందవచ్చు అనికూడా వివరించాడూ పరాశరుడు.

32. విషయములందు ఉనికి కలిగితే, వాటిలో తానుంటాడు. విషయములనేవి యథార్థంగా ఉన్నాయి అనే గుర్తింపుకూడా అతనికి ఉంటుంది. ఇంద్రియములున్నాయి, సుఖదుఃఖాలున్నాయి, అన్నీ ఉన్నాయనే గుర్తింపు కలిగినవాడైనా, తనకూండే విజ్ఞానంవలన తామరాకుమీద నీటివలే దానివలన అతడు దూషితుడుకాడు.

33. అట్లాంటి విజ్ఞానానికి ఈ సంసారము ఎలాంటి దోషమునూ ఇవ్వదు. ఉదాహరణకు, కమలం ఉంది. పంకజం అని దానికి పేరు. పంకం అంటే బురద. కాని పంకజానికి ఆ పెఋఐతే ఉందికాని, దానికి ఏమయినా పంకం అంటిఉంటుందా! దాని నాళం, వేరు, మూలము బురదలో ఉంటాయి కాని ఆ కమలంమాత్రం ఎంత నిర్మలంగా ఉంటుంది.

34. అలాగే తన ఉనికియొక్క మూలం సంసారంలో ఉన్నాప్పటికీ, జ్ఞానంచేత – జలంలో ఉన్న పరిశుద్ధమైన ఈ కమలంవలెనే – మనుష్యుడు పరిశుద్ధుడుగా ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment