🌹. శివగీత - 𝟛𝟝 / 𝕋𝕙𝕖 𝕊𝕚𝕧𝕒-𝔾𝕚𝕥𝕒 - 𝟛𝟝 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము
🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 5 🌻
రాజస్త్రీ లంఘ నాసక్తం -రావణం నిహ నిష్యసి,
పానా సక్తో రిపుర్జే తుం - సుకర సమరాం గణే. 31
అధర్మ నిరత శ్శత్రు - ర్భాగే నైవ హాయ్ లభ్యతే,
అధి తవేద శాస్త్రోపి - సదా ధర్మ రతో పినా 32
వినాశ కాలే సంప్రాప్తే - ధర్మ మార్గా చ్చ్యుతో భవేత్,
రాజు భార్యను లేవ నెత్తుకొని పోయిన రావణుని నీవు
యుద్ద భూమి యందు వధింప గలవు. మధ్యము త్రాగిన వాడిని అనాయాసముగా జయింప వచ్చును కదా!
అధర్మ నిరతుడగు శత్రువు తన యదృష్టము చేతనే లభించును . బాగుగా వేదాగమ శాస్త్రముల నద్యయనము చేసిన వాడైతే నేమి, ధర్మ మార్గామి యైతే నేమి, "వినాశకాలే విపరీత బుద్ది: " అను సూక్తి మేరకు పోగాలము సమీపించి నప్పుడు అధర్మ మార్గములో ప్రవర్తించును.
పీడ్యంతేదేవతా స్సర్వా - స్సతతం యేన పాపినా 33
బ్రాహ్మణా ఋషయశ్వైవ - తస్య నాశ స్స్వయం స్థితః,
కిష్కిందా నగరే రామ ! - దేవానా మంశ సంభవా: 34
వానరా బహవో జాతా - దుర్జయా బలవత్త రాః,
సాహయ్యంతే కరిష్యంతి - తైర్భ ధానా పయోనిధిమ్ 35
ఓ రామా! కిష్కిందా పురంబున అమరుల యంశము వలన
అనేకమంది వనచరులు ఉద్భవించియున్నారు. వారందరు మిగుల శక్తి సంపన్నులై యితరులతో జయింపరాని వారై సాగరమును బంధించి నీకవసరమైనం తగా సహాయ పడగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝕋𝕙𝕖 𝕊𝕚𝕧𝕒-𝔾𝕚𝕥𝕒 - 𝟛𝟝 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 05 :
🌻 Ramaya Varapradanam - 5 🌻
That Ravana who has abducted the wife of a King, to such a demon you would be able to slay in battle.
The way it is easy to vanquish a drunken man. Unrighteous enemy comes our way only due to good fortune.
What if Ravana is a master in Vedas and Agama scriptures? What if he was a righteous person anytime? When the time to decline arises, one becomes the enemy of his own intellect and acts against righteousness and becomes a wicked one.
O Rama! in the city called Kishkindha, many forest dwelling Vanara (monkey men) exist who are born from the portion of the Gods. They all are skilled and possessor of strength. They would help you cross the ocean and would assist in every way you want them to support you.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment