శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 310-1. 'రమణీ' 🌻

భక్తులను రమింపజేయునది శ్రీమాత అని అర్థము. ధర్మము నాచరించు వారిని రమింపజేయుట శ్రీమాత లక్షణము. ధర్మమును అతి విస్తారముగ వివరించిన వేదవ్యాస మహర్షి అత్యంత క్లుప్తముగ కూడ నిర్వచించెను. “ఇతరులు తనకేమి ఒనర్చిన బాధ కలుగకుండునో అది ఇతరుల కొనర్చకుండుట ధర్మము” అని ఒక వాక్యములో ధర్మమును తెలియబరచినాడు. మన మితరులతో ప్రవర్తించు రీతిని ఇతరులు మనపై చూపిన మన కెట్లుండును?

హింసించుట, దూషించుట, దుర్భాషలాడుట, భేదములు కలిగించుట, విరోధములను ప్రోత్సహించుట, ఈర్ష్యపడుట, కూటనీతి నాచరించుట, కించపరచుట, దొంగిలించుట, మాట త్రిప్పుట, మడతలు పెట్టుట, త్రికరణముల యందు శుద్ధి లేకపోవుట, ఇతరుల సంపదల కాశపడుట, ఇత్యాదివి ఇతరులు మనపై నిర్వర్తించినచో మనకు దుఃఖము కలుగుట సహజము. కావున ఇట్టి ప్రవర్తనము మన మితరుల యందు చూపరాదు.

పై విధమగు ధర్మము నాచరించిన వారికి జీవితము భార మగును. హృదయమునందు కల్మషములు నిండి యుండుటచే రమించు గుణము కోల్పోవుదురు. వారికి సహజమగు ఆనందము అదృశ్యమగును. తీవ్ర మనస్కులై చింతించుచు నుందురు. ఇట్టి వారికి ఆటల యందాసక్తి యుండదు. పాటల యందాసక్తి యుండదు. ఎవరైనను ఆనందముగ నున్నచో ఈర్ష్యపడి వారి ఆనందమును హరింప చూతురు. ఇట్లు జరుగుటకు కారణము వారియందు రమణి అను శ్రీదేవి కల్యాణ గుణము అదృశ్య మగుటయే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 310-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 310-1. Ramaṇī रमणी (310) 🌻

She plays around. She plays with Her devotees. Devotees are everything for Her. She gives happiness to them and She plays with them too. Providing happiness to one’s children and playing with them is one of the motherly qualities. Her motherly attribute is highlighted here. But devotees always keep a distance from Her out of fear and respect. This is the biggest setback in God realization. Fear and respect should pave way for love and affection. Unfortunately, She is being considered as a different entity from one’s own self. When we say that She is omnipresent, why should we consider Her as a different person?

This is what Chāndogya Upaniṣad VIII.12.3 says “In the same way, the joyful self arises from the body and attaining the light of the Cosmic Self, appears in his own form. This is the Paramātman, the Cosmic Self. He then freely moves about eating, playing, or enjoying himself with women, carriages or relatives, not remembering at all, the body in which he was born. Just as horses or bullocks are harnessed to carriages, similarly life remains harnessed to the body due to karma”.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 73

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 73 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం చేసే వ్యక్తి సున్నితంగా స్పందించాలి. తెలివిగా, చురుగ్గా వుండాలి. సృజనాత్మకంగా వుండాలి. నువ్వు మనసును ఆపడం అభ్యసించాలి. ఒకసారి నువ్వు మనసును ఆపడం నేర్చుకుంటే నువ్వు అధికారివి. 🍀

నా సందేశ సారాంశం, భయం గుండా జీవించ వద్దు - నువ్వు శిక్షింపబడతావని భయపడకు - నిర్భయంగా జీవించు. అప్పుడు సంపూర్ణంగా జీవిస్తావు. భయం సహజంగా నువ్వు ముడుచుకునేలా చేస్తుంది. అది నిన్ను తెరుచుకోనివ్వదు. ఒక పని చెయ్యాలంటే వెయ్యిసార్లు ఆలోచించేలా చేస్తుంది. అది తప్పో, ఒప్పో నైతికమో అనైతికమో, చర్చికి అనుగుణమో కాదో, పవిత్ర గ్రంథాలకు అనుకూలమో వ్యతిరేకమో! దాని వల్ల నువ్వు మరింత గందరగోళానికి లోనవుతావు. విషయాల్ని పాపాలుగా పరివర్తింపచేసే మార్గంలో అడుగు పెడితే నీకు అంతా గందరగోళమే.

విషయాల్ని నేను సమీపించే విధం వేరు, తప్పులుంటాయి. కానీ పాపం అన్నది లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి. చేసిన తప్పు మళ్ళీ చెయ్యడం బుద్ధిహీనత. జీవితాన్ని విస్ఫోటించాలి. కొన్నిసార్లు నిష్ఫలం కావచ్చు. ఫలితం రాదని అనుకుంటే ప్రయత్నమే చెయ్యలేవు. నా ప్రయత్నం మీకు ఆనందాన్ని ఇవ్వడం, జీవితాన్ని వెలిగించడం, అద్భుతాల వేపు సాహసించడం, నిర్భయంగా సాగడం, జీవితావకాశాల్ని విస్ఫోటించడం, ఎందుకుంటే దేవుడే న్యాయనిర్ణేత, భయపడాల్సిన పన్లేదు. తీర్మానం చేసే రోజు, నిర్ణయం చేసే రోజు నువ్వు దేవుణ్ణి చూసి 'అవును స్వామీ, నేను తాగాను, నన్ను క్షమించు, యింకా కొన్ని తప్పులు చేశాను మన్నించు' అను. నా వుద్దేశంలో దేవుడు, అర్థం చేసుకుంటాడు. బాధపడాల్సిన పన్లేదు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

18 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 6

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 6 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 4. సృజనాత్మకత 🌻

ఒక కుటుంబము, సంఘము, దేశము మరియు దేశముల కూటమి తమకై చేయు ప్రయత్నమునకు గల గమ్యము ఒకటే. జీవన పరిస్థితులను మెరుగుపరచుకొనుట మరియు ప్రశాంతతను అనుభవించుట, జీవితమును మెరుగుపరుచు కొనుటకు పరిమితులు లేవు. కుటుంబపరముగా కాని సంఘపరముగ కాని ప్రతి విషయమ నందు, ప్రతి రోజు మెరుగుపరుచుకొనుటకు ప్రయత్నము చేయుచుండ వలెను. సంకల్పములయందు పరిణామమునకు ఉన్నత భావములను శోధించుచుండవలెను. భాషా పరిణామమునకు ఉన్నత గ్రంథములను చదువుచుండవలెను. క్రియా రూపమున ఉన్న తత్వమునకు తోటి జీవులతో సహకరించుట నేర్చుకొను చుండవలెను. ఈ విధముగ ప్రయత్నముచేయు సాధకుడు సృజనాత్మక శక్తిని పొందును.

సృజనాత్మకశక్తి కారణముగ క్రమశః నవజీవనము సాధ్యపడును. గానుగెద్దు జీవితమునుండి చైతన్యము ఊర్ధ్వగతి పొందుచు చక్రభ్రమణమున ఆరోహణము చేయగలుగును. నవజీవనము సంఘమున ప్రారంభములో కొంత క్రొత్తగనున్నను కాలక్రమమున అది ఇతరజీవులకు కూడ దారి నేర్పరచును. సృజనాత్మక జీవనము కష్టతరమని భయపడవలదు. వెనుకంజ వేయవలదు. కొత్తదారి మొదటిలో కొంత ఇబ్బందిగనున్నను వాడుకచే సౌమ్యమగును. దారి- సంఘ శ్రేయస్సు, అభివృద్ధి గమ్యములుగ గలది కావున ఈ దారిన నడుచువారు పరిణితి చెందుట తధ్యము. నశించుట జరుగదు. నవజీవనమునకు సృజనాత్మకశక్తి ఎంత అవసరమో, శాస్త్రీయముగ సృజించిన భావములను వివేకముతో, పట్టుదలతో, ధైర్యముతో, మౌనముతో, ఓర్పుతో నిర్వర్తించుట కూడ అంతే ముఖ్యము. ఈ గుణములతో కూడని సంకల్పములు అవతరణ చెందవు. ఇట్లు సృజనాత్మక శక్తిని పై గుణములతో అవతరింప చేయుట వలన సాధకుడు అంతర్ముఖ ఆనందమును పొందుచు ముందుకు సాగిపోగలడు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

18 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 489 / Vishnu Sahasranama Contemplation - 489

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 489 / Vishnu Sahasranama Contemplation - 489🌹

🌻 489. భూతమహేశ్వరః, भूतमहेश्वरः, Bhūtamaheśvaraḥ 🌻

ఓం భూతమహేశ్వరాయ నమః | ॐ भूतमहेश्वराय नमः | OM Bhūtamaheśvarāya namaḥ

భూతానామ్మహానీశ్వర ఇతి భూతమహేశ్వరః

సకల భూతములకును గొప్ప ఈశ్వరుడు. లేదా భూతేన సత్యేన స ఏవ మహాన్ పరమః ఈశ్వరః సత్యముగా ఆతడే గొప్ప ఈశ్వరుడూ, ప్రభువు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 489 🌹

🌻 489. Bhūtamaheśvaraḥ 🌻

OM Bhūtamaheśvarāya namaḥ

भूतानाम्महानीश्वर इति भूतमहेश्वरः / Bhūtānāmmahānīśvara iti bhūtamaheśvaraḥ

The great Lord of all beings. Or भूतेन सत्येन स एव महान् परमः ईश्वरः / Bhūtena satyena sa eva mahān paramaḥ īśvaraḥ He is Lord of all beings; and this is the supreme truth.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

18 Sep 2021

కల్కి ద్వాదశి శుభాకాంక్షలు - Kalki Dwadashi Greetings

🌹. కల్కి ద్వాదశి శుభాకాంక్షలు 🌹

కల్కి ద్వాదశి ఇంకా రాబోతున్న విష్ణువు యొక్క కల్కి అవతారానికి అంకితం చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం, కల్కి విష్ణువు యొక్క పదవ మరియు చివరి అవతారం. ఈ ప్రపంచం నుండి అంతరాయం మరియు చెడును అంతం చేయడానికి అతను భూమిపైకి వస్తాడని నమ్ముతారు. కల్కి ద్వాదశి భాద్రపద మాసంలో శుక్ల పక్ష పన్నెండవ రోజున వస్తుంది. కల్కి అనే పేరు 'కల్' లేదా సమయం అనే పదం నుండి వచ్చింది. ఇది ఒక దుష్ట యుగం లేదా కలియుగం యొక్క ముగింపును సూచిస్తుంది మరియు మంచి యుగం లేదా సత్య యుగాన్ని ప్రారంభిస్తుంది. పురాణాలు మరియు హిందూ మత గ్రంథాల ప్రకారం, కల్కి చేతిలో గీసిన కత్తితో తెల్ల గుర్రంపై వెళ్తాడు.

🍀. కల్కి ద్వాదశి యొక్క ప్రాముఖ్యత: 🍀

కల్కి విష్ణువు యొక్క పదవ మరియు చివరి అవతారం. కలియుగాన్ని అంతం చేసి సత్య యుగాన్ని తీసుకువచ్చేవాడు అతనేనని నమ్ముతారు. అందువల్ల, భక్తులు ఆయన ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు మరియు వారి పాపాలకు క్షమాపణ కోరుకుంటారు. వారు ప్రశాంతమైన జీవితం కోసం ప్రార్థిస్తారు. ముగింపు ఎప్పుడు వస్తుందో తెలియక భక్తులు ఆయన ఆశీర్వాదం కోరుకుంటారు. కల్కి విష్ణువు యొక్క భయంకరమైన అవతారం, అతను మానవ జాతి ముగింపును సూచిస్తాడు. ప్రజలు ఈ రోజు ఉపవాసం పాటిస్తారు మరియు వారి ముగింపును శాంతియుతంగా మరియు నొప్పిలేకుండా చేయమని ప్రార్థిస్తారు. భక్తులు క్షమించమని ప్రార్థిస్తారు. మరియు మోక్షాన్ని కోరుకుంటారు. కల్కి ఎప్పుడు, ఏ రూపంలో కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. భక్తులు ముగింపు దగ్గరలో ఉన్నారని మరియు అపోకలిప్స్ ముందు వారి చెడు పనులకు దయ కోరడం మంచిది.

🍀. పురాణం: 🍀

విష్ణువు పరమ దేవుళ్ళు మరియు హిందూ త్రిమూర్తులలో ఒక భాగం. హిందూ గ్రంథాల ప్రకారం, ఒక యుగాన్ని నాలుగు యుగాలుగా విభజించారు, మరియు ప్రతి యుగంలో దాని లక్షణాలు మరియు స్వభావం ఉన్నాయి. కల్కి పౌరాణిక శంభాలలో విష్ణువు వ్యాస కుమారుడిగా జన్మించనున్నారు. అతను తన ఆధ్యాత్మిక గురువుగా యజ్ఞవల్క్యను కలిగి ఉంటాడు. విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు అమరుడు. అతను సజీవంగా ఉన్నాడని మరియు కల్కి తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాడని నమ్ముతారు. పరాశురాముడు కల్కి యొక్క యుద్ధ గురువుగా ఉంటాడు, అతను అతనికి సైనిక శాస్త్రం, యుద్ధ కళలు నేర్పుతాడు మరియు ఖగోళ ఆయుధాలను స్వీకరించడానికి తీవ్రమైన తపస్సు చేయమని సూచించాడు. విష్ణువు స్వర్గానికి తిరిగి రాకముందే కల్కి అవతారాన్ని వదులుకుంటాడు మరియు సత్య యుగంలో తిరిగి వస్తాడు అని పురాణం వివరిస్తుంది.

🍀. వేడుకలు మరియు ఆచారాలు: 🍀

భక్తులు కల్కి ద్వాదాశి ప్రారంభంలో మేల్కొని సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేస్తారు. వారు విష్ణువు ఆలయాన్ని సందర్శించి, విష్ణు స్తోత్రం జపిస్తూ, భగవంతుని ఆశీర్వాదం కోరుతూ, క్షమించమని అడుగుతారు. ఇంట్లో, మట్టి మరియు పసుపుతో చేసిన కల్కి విగ్రహాన్ని నీటితో నిండిన మట్టి కుండపై ఉంచారు. విగ్రహాన్ని నెయ్యితో అర్పిస్తారు లేదా వెన్న, పువ్వులు, తాజా పండ్లు, ధూపం కర్రలు మరియు దీపం స్పష్టం చేస్తారు. ముందు రోజు నుండి ప్రారంభమయ్యే రోజున ప్రజలు, అంటే పరివర్తిన ఏకాదశి. ఆచారాలు చేసిన తరువాత, విగ్రహాన్ని ఒకరికి దానం చేస్తారు లేదా నీటిలో ఓదులుతారు.

🌹 🌹 🌹 🌹 🌹

18 Sep 2021

18-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18 సెప్టెంబర్ 2021 కల్కి ద్వాదశి శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 92 / Bhagavad-Gita - 92 - 2-45🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 660 / Bhagavad-Gita - 660 -18-71🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 489 / Vishnu Sahasranama Contemplation - 489🌹
5) 🌹 DAILY WISDOM - 167🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 6 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 73 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ కల్కి ద్వాదశి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కల్కి ద్వాదశి - శ్రీ కల్కి స్తోత్రం-1 🍀*

*కల్కి ద్వాదశి భాద్రపద మాసంలో శుక్ల పక్ష పన్నెండవ రోజున వస్తుంది. కల్కి అనే పేరు 'కల్' లేదా సమయం అనే పదం నుండి వచ్చింది. ఇది ఒక దుష్ట యుగం లేదా కలియుగం యొక్క ముగింపును సూచిస్తుంది మరియు మంచి యుగం లేదా సత్య యుగాన్ని ప్రారంభిస్తుంది.* 

జయ హరేఽమరాధీశసేవితం
తవ పదాంబుజం భూరిభూషణమ్ |
కురు మమాగ్రతః సాధుసత్కృతం
త్యజ మహామతే మోహమాత్మనః || ౧ ||
🌻 🌻 🌻 🌻 🌻

18 శనివారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
 తిథి: శుక్ల ద్వాదశి 06:55:10 వరకు తదుపరి శుక్ల త్రయోదశి
 పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: ధనిష్ట 27:21:57 వరకు తదుపరి శతభిషం ?
యోగం: సుకర్మ 18:23:51 వరకు తదుపరి ధృతి
కరణం: బాలవ 06:55:10 వరకు
వర్జ్యం: 07:33:30 - 09:08:30
దుర్ముహూర్తం: 07:41:55 - 08:30:40
రాహు కాలం: 09:07:13 - 10:38:38
గుళిక కాలం: 06:04:24 - 07:35:49
యమ గండం: 13:41:27 - 15:12:51
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34
అమృత కాలం: 17:03:30 - 18:38:30
సూర్యోదయం: 06:04:24
సూర్యాస్తమయం: 18:15:40
వైదిక సూర్యోదయం: 06:07:56
వైదిక సూర్యాస్తమయం: 18:12:09
చంద్రోదయం: 16:45:08, చంద్రాస్తమయం: 03:26:28
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: మకరం
ఆనందాదియోగం: వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 27:21:57 
వరకు తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి 
పండుగలు : కల్కి ద్వాదశి, వామన జయంతి, శని త్రయోదశి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కల్కి ద్వాదశి శుభాకాంక్షలు 🌹*
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

కల్కి ద్వాదశి ఇంకా రాబోతున్న విష్ణువు యొక్క కల్కి అవతారానికి అంకితం చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం, కల్కి విష్ణువు యొక్క పదవ మరియు చివరి అవతారం. ఈ ప్రపంచం నుండి అంతరాయం మరియు చెడును అంతం చేయడానికి అతను భూమిపైకి వస్తాడని నమ్ముతారు. కల్కి ద్వాదశి భాద్రపద మాసంలో శుక్ల పక్ష పన్నెండవ రోజున వస్తుంది. కల్కి అనే పేరు 'కల్' లేదా సమయం అనే పదం నుండి వచ్చింది. ఇది ఒక దుష్ట యుగం లేదా కలియుగం యొక్క ముగింపును సూచిస్తుంది మరియు మంచి యుగం లేదా సత్య యుగాన్ని ప్రారంభిస్తుంది. పురాణాలు మరియు హిందూ మత గ్రంథాల ప్రకారం, కల్కి చేతిలో గీసిన కత్తితో తెల్ల గుర్రంపై వెళ్తాడు.

*🍀. కల్కి ద్వాదశి యొక్క ప్రాముఖ్యత: 🍀*

కల్కి విష్ణువు యొక్క పదవ మరియు చివరి అవతారం. కలియుగాన్ని అంతం చేసి సత్య యుగాన్ని తీసుకువచ్చేవాడు అతనేనని నమ్ముతారు. అందువల్ల, భక్తులు ఆయన ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు మరియు వారి పాపాలకు క్షమాపణ కోరుకుంటారు. వారు ప్రశాంతమైన జీవితం కోసం ప్రార్థిస్తారు. ముగింపు ఎప్పుడు వస్తుందో తెలియక భక్తులు ఆయన ఆశీర్వాదం కోరుకుంటారు. కల్కి విష్ణువు యొక్క భయంకరమైన అవతారం, అతను మానవ జాతి ముగింపును సూచిస్తాడు. ప్రజలు ఈ రోజు ఉపవాసం పాటిస్తారు మరియు వారి ముగింపును శాంతియుతంగా మరియు నొప్పిలేకుండా చేయమని ప్రార్థిస్తారు. భక్తులు క్షమించమని ప్రార్థిస్తారు. మరియు మోక్షాన్ని కోరుకుంటారు. కల్కి ఎప్పుడు, ఏ రూపంలో కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. భక్తులు ముగింపు దగ్గరలో ఉన్నారని మరియు అపోకలిప్స్ ముందు వారి చెడు పనులకు దయ కోరడం మంచిది.

*🍀. పురాణం: 🍀*

విష్ణువు పరమ దేవుళ్ళు మరియు హిందూ త్రిమూర్తులలో ఒక భాగం. హిందూ గ్రంథాల ప్రకారం, ఒక యుగాన్ని నాలుగు యుగాలుగా విభజించారు, మరియు ప్రతి యుగంలో దాని లక్షణాలు మరియు స్వభావం ఉన్నాయి. కల్కి పౌరాణిక శంభాలలో విష్ణువు వ్యాస కుమారుడిగా జన్మించనున్నారు. అతను తన ఆధ్యాత్మిక గురువుగా యజ్ఞవల్క్యను కలిగి ఉంటాడు. విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు అమరుడు. అతను సజీవంగా ఉన్నాడని మరియు కల్కి తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాడని నమ్ముతారు. పరాశురాముడు కల్కి యొక్క యుద్ధ గురువుగా ఉంటాడు, అతను అతనికి సైనిక శాస్త్రం, యుద్ధ కళలు నేర్పుతాడు మరియు ఖగోళ ఆయుధాలను స్వీకరించడానికి తీవ్రమైన తపస్సు చేయమని సూచించాడు. విష్ణువు స్వర్గానికి తిరిగి రాకముందే కల్కి అవతారాన్ని వదులుకుంటాడు మరియు సత్య యుగంలో తిరిగి వస్తాడు అని పురాణం వివరిస్తుంది.

*🍀. వేడుకలు మరియు ఆచారాలు: 🍀*

భక్తులు కల్కి ద్వాదాశి ప్రారంభంలో మేల్కొని సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేస్తారు. వారు విష్ణువు ఆలయాన్ని సందర్శించి, విష్ణు స్తోత్రం జపిస్తూ, భగవంతుని ఆశీర్వాదం కోరుతూ, క్షమించమని అడుగుతారు. ఇంట్లో, మట్టి మరియు పసుపుతో చేసిన కల్కి విగ్రహాన్ని నీటితో నిండిన మట్టి కుండపై ఉంచారు. విగ్రహాన్ని నెయ్యితో అర్పిస్తారు లేదా వెన్న, పువ్వులు, తాజా పండ్లు, ధూపం కర్రలు మరియు దీపం స్పష్టం చేస్తారు. ముందు రోజు నుండి ప్రారంభమయ్యే రోజున ప్రజలు, అంటే పరివర్తిన ఏకాదశి. ఆచారాలు చేసిన తరువాత, విగ్రహాన్ని ఒకరికి దానం చేస్తారు లేదా నీటిలో ఓదులుతారు.
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 92 / Bhagavad-Gita - 92 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 45 🌴

45. త్రైగుణ్యవిషయా వేదా 
నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో 
నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||

తాత్పర్యం :
వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగ క్షేమములనెడి చింతల నుండియు విడివడిన వాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.

భాష్యము :
భౌతిక కార్యములు అన్నియును త్రిగుణములను కూడిన కర్మలను మరియు ఫలములను కూడి యుండును. భౌతిక జగమున బంధము కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. జనులను ఇంద్రియ భోగానుభవము నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమముగా గొనిపోవు నిమిత్తమే వేదములు అట్టి సకామకర్మలను ఉపదేశించును. 

శ్రీకృష్ణభగవానుని స్నేహితునిగా మరియు శిష్యునిగా అర్జునుడు ఇచ్చట వేదాంత తత్త్వము యొక్క దివ్యస్థాయికి ఎదుగవలసినదిగా ఉపదేశింపబడినాడు. బ్రహ్మజిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గుర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్త్వము యొక్క ఆరంభాములోని అంశము. భౌతికజగము నందు గల జీవులందరును తీవ్ర జీవన సంఘర్షణకు లోనై యుందురు. 

ఏ విధముగా మనుగడను సాగించి పిదప భౌతికబంధము నుండి ముక్తినొందగగలరో ఉపదేశించుటకే భౌతికజగత్తును సృష్టించిన పిమ్మట భగవానుడు వారికి వేదంజ్ఞానము నొసగెను. భోగవాంఛను కూడిన కర్మలు(కర్మకాండ) ముగిసినంతనే ఆధ్యాత్మికానుభవమునకు అతడు ఉపనిషత్తుల రూపున అవకాశము నొసగెను. భగవద్గీత పంచమవేదమైన మహాభారతము యొక్క భాగమైనట్లు, ఉపనిషత్తులు వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మికజీవనపు ఆరంభము సూచించును.

భౌతికదేహము నిలిచియున్నంత కాలము త్రిగుణ పూర్ణములైన కర్మలు మరియు ఫలితములు తప్పవు. కనుక ప్రతియొక్కరు సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ద్వంద్వములను సహించుట నేర్చుకొని ఆ ద్వంద్వ సహనము ద్వారా లాభనష్టముల యెడ గల చింత నుండి దూరులు కావలెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని కృపా కటాక్షములపై మనుజుడు సంపూర్ణముగా ఆధారపడినప్పుడు అట్టి దివ్యస్థితి (సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు) సిద్ధింపగలదు.
🌹 🌹 🌹 🌹 🌹 
🙏.ప్రసాద్ భరద్వాజ

🌹 Bhagavad-Gita as It is - 92 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 45 🌴

45. trai-guṇya-viṣayā vedā nistrai-guṇyo bhavārjuna
nirdvandvo nitya-sattva-stho niryoga-kṣema ātmavān

🌻 Translation :
The Vedas deal mainly with the subject of the three modes of material nature. O Arjuna, become transcendental to these three modes. Be free from all dualities and from all anxieties for gain and safety, and be established in the self.

🌻 Purport :
All material activities involve actions and reactions in the three modes of material nature. They are meant for fruitive results, which cause bondage in the material world. The Vedas deal mostly with fruitive activities to gradually elevate the general public from the field of sense gratification to a position on the transcendental plane. 

Arjuna, as a student and friend of Lord Kṛṣṇa, is advised to raise himself to the transcendental position of Vedānta philosophy where, in the beginning, there is brahma-jijñāsā, or questions on the supreme transcendence. All the living entities who are in the material world are struggling very hard for existence. For them the Lord, after creation of the material world, gave the Vedic wisdom advising how to live and get rid of the material entanglement. 

When the activities for sense gratification, namely the karma-kāṇḍa chapter, are finished, then the chance for spiritual realization is offered in the form of the Upaniṣads, which are part of different Vedas, as the Bhagavad-gītā is a part of the fifth Veda, namely the Mahābhārata. The Upaniṣads mark the beginning of transcendental life.

As long as the material body exists, there are actions and reactions in the material modes. One has to learn tolerance in the face of dualities such as happiness and distress, or cold and warmth, and by tolerating such dualities become free from anxieties regarding gain and loss. This transcendental position is achieved in full Kṛṣṇa consciousness when one is fully dependent on the good will of Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 489 / Vishnu Sahasranama Contemplation - 489🌹*

*🌻 489. భూతమహేశ్వరః, भूतमहेश्वरः, Bhūtamaheśvaraḥ 🌻*

*ఓం భూతమహేశ్వరాయ నమః | ॐ भूतमहेश्वराय नमः | OM Bhūtamaheśvarāya namaḥ*

భూతానామ్మహానీశ్వర ఇతి భూతమహేశ్వరః 

సకల భూతములకును గొప్ప ఈశ్వరుడు. లేదా భూతేన సత్యేన స ఏవ మహాన్ పరమః ఈశ్వరః సత్యముగా ఆతడే గొప్ప ఈశ్వరుడూ, ప్రభువు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 489 🌹*

*🌻 489. Bhūtamaheśvaraḥ 🌻*

*OM Bhūtamaheśvarāya namaḥ*

भूतानाम्महानीश्वर इति भूतमहेश्वरः / Bhūtānāmmahānīśvara iti bhūtamaheśvaraḥ 

The great Lord of all beings. Or भूतेन सत्येन स एव महान् परमः ईश्वरः / Bhūtena satyena sa eva mahān paramaḥ īśvaraḥ He is Lord of all beings; and this is the supreme truth.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 167 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 15. Layers and Layers of Self are Covering the True Self 🌻*

Sometimes we belong to a community and we begin to associate ourselves with that. We talk about it again and again, and we cannot so easily extricate ourselves from the idea that we ourselves are a part of that community. “I am a Hindu, a Maharashtrian, I am this, I am that.” These are the communal selves, but then we have the family selves. We have got family names which are called ‘surnames’, and to each person a surname is attached. It is a family heritage. Then come the personal associations of “I am a judge, a teacher, a businessman, a professor”. 

These are also selves we have created, but they are false selves. Socially also we have created these false selves. As if the inner problems are not sufficient, we have created additional problems by adding all these from outside. Inwardly there are also many layers, and I shall touch upon these inner layers a little later on. Layers and layers of self are covering the true self. Like layers of clouds can make the sun dark, layers of the false self have made our true selves a mass of darkness, confusion and therefore unhappiness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 6 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 4. సృజనాత్మకత 🌻*

ఒక కుటుంబము, సంఘము, దేశము మరియు దేశముల కూటమి తమకై చేయు ప్రయత్నమునకు గల గమ్యము ఒకటే. జీవన పరిస్థితులను మెరుగుపరచుకొనుట మరియు ప్రశాంతతను అనుభవించుట, జీవితమును మెరుగుపరుచు కొనుటకు పరిమితులు లేవు. కుటుంబపరముగా కాని సంఘపరముగ కాని ప్రతి విషయమ నందు, ప్రతి రోజు మెరుగుపరుచుకొనుటకు ప్రయత్నము చేయుచుండ వలెను. సంకల్పములయందు పరిణామమునకు ఉన్నత భావములను శోధించుచుండవలెను. భాషా పరిణామమునకు ఉన్నత గ్రంథములను చదువుచుండవలెను. క్రియా రూపమున ఉన్న తత్వమునకు తోటి జీవులతో సహకరించుట నేర్చుకొను చుండవలెను. ఈ విధముగ ప్రయత్నముచేయు సాధకుడు సృజనాత్మక శక్తిని పొందును. 

సృజనాత్మకశక్తి కారణముగ క్రమశః నవజీవనము సాధ్యపడును. గానుగెద్దు జీవితమునుండి చైతన్యము ఊర్ధ్వగతి పొందుచు చక్రభ్రమణమున ఆరోహణము చేయగలుగును. నవజీవనము సంఘమున ప్రారంభములో కొంత క్రొత్తగనున్నను కాలక్రమమున అది ఇతరజీవులకు కూడ దారి నేర్పరచును. సృజనాత్మక జీవనము కష్టతరమని భయపడవలదు. వెనుకంజ వేయవలదు. కొత్తదారి మొదటిలో కొంత ఇబ్బందిగనున్నను వాడుకచే సౌమ్యమగును. దారి- సంఘ శ్రేయస్సు, అభివృద్ధి గమ్యములుగ గలది కావున ఈ దారిన నడుచువారు పరిణితి చెందుట తధ్యము. నశించుట జరుగదు. నవజీవనమునకు సృజనాత్మకశక్తి ఎంత అవసరమో, శాస్త్రీయముగ సృజించిన భావములను వివేకముతో, పట్టుదలతో, ధైర్యముతో, మౌనముతో, ఓర్పుతో నిర్వర్తించుట కూడ అంతే ముఖ్యము. ఈ గుణములతో కూడని సంకల్పములు అవతరణ చెందవు. ఇట్లు సృజనాత్మక శక్తిని పై గుణములతో అవతరింప చేయుట వలన సాధకుడు అంతర్ముఖ ఆనందమును పొందుచు ముందుకు సాగిపోగలడు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 73 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ధ్యానం చేసే వ్యక్తి సున్నితంగా స్పందించాలి. తెలివిగా, చురుగ్గా వుండాలి. సృజనాత్మకంగా వుండాలి. నువ్వు మనసును ఆపడం అభ్యసించాలి. ఒకసారి నువ్వు మనసును ఆపడం నేర్చుకుంటే నువ్వు అధికారివి. 🍀*

నా సందేశ సారాంశం, భయం గుండా జీవించ వద్దు - నువ్వు శిక్షింపబడతావని భయపడకు - నిర్భయంగా జీవించు. అప్పుడు సంపూర్ణంగా జీవిస్తావు. భయం సహజంగా నువ్వు ముడుచుకునేలా చేస్తుంది. అది నిన్ను తెరుచుకోనివ్వదు. ఒక పని చెయ్యాలంటే వెయ్యిసార్లు ఆలోచించేలా చేస్తుంది. అది తప్పో, ఒప్పో నైతికమో అనైతికమో, చర్చికి అనుగుణమో కాదో, పవిత్ర గ్రంథాలకు అనుకూలమో వ్యతిరేకమో! దాని వల్ల నువ్వు మరింత గందరగోళానికి లోనవుతావు. విషయాల్ని పాపాలుగా పరివర్తింపచేసే మార్గంలో అడుగు పెడితే నీకు అంతా గందరగోళమే. 

విషయాల్ని నేను సమీపించే విధం వేరు, తప్పులుంటాయి. కానీ పాపం అన్నది లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి. చేసిన తప్పు మళ్ళీ చెయ్యడం బుద్ధిహీనత. జీవితాన్ని విస్ఫోటించాలి. కొన్నిసార్లు నిష్ఫలం కావచ్చు. ఫలితం రాదని అనుకుంటే ప్రయత్నమే చెయ్యలేవు. నా ప్రయత్నం మీకు ఆనందాన్ని ఇవ్వడం, జీవితాన్ని వెలిగించడం, అద్భుతాల వేపు సాహసించడం, నిర్భయంగా సాగడం, జీవితావకాశాల్ని విస్ఫోటించడం, ఎందుకుంటే దేవుడే న్యాయనిర్ణేత, భయపడాల్సిన పన్లేదు. తీర్మానం చేసే రోజు, నిర్ణయం చేసే రోజు నువ్వు దేవుణ్ణి చూసి 'అవును స్వామీ, నేను తాగాను, నన్ను క్షమించు, యింకా కొన్ని తప్పులు చేశాను మన్నించు' అను. నా వుద్దేశంలో దేవుడు, అర్థం చేసుకుంటాడు. బాధపడాల్సిన పన్లేదు. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 310-1. 'రమణీ' 🌻* 

భక్తులను రమింపజేయునది శ్రీమాత అని అర్థము. ధర్మము నాచరించు వారిని రమింపజేయుట శ్రీమాత లక్షణము. ధర్మమును అతి విస్తారముగ వివరించిన వేదవ్యాస మహర్షి అత్యంత క్లుప్తముగ కూడ నిర్వచించెను. “ఇతరులు తనకేమి ఒనర్చిన బాధ కలుగకుండునో అది ఇతరుల కొనర్చకుండుట ధర్మము” అని ఒక వాక్యములో ధర్మమును తెలియబరచినాడు. మన మితరులతో ప్రవర్తించు రీతిని ఇతరులు మనపై చూపిన మన కెట్లుండును? 

హింసించుట, దూషించుట, దుర్భాషలాడుట, భేదములు కలిగించుట, విరోధములను ప్రోత్సహించుట, ఈర్ష్యపడుట, కూటనీతి నాచరించుట, కించపరచుట, దొంగిలించుట, మాట త్రిప్పుట, మడతలు పెట్టుట, త్రికరణముల యందు శుద్ధి లేకపోవుట, ఇతరుల సంపదల కాశపడుట, ఇత్యాదివి ఇతరులు మనపై నిర్వర్తించినచో మనకు దుఃఖము కలుగుట సహజము. కావున ఇట్టి ప్రవర్తనము మన మితరుల యందు చూపరాదు. 

పై విధమగు ధర్మము నాచరించిన వారికి జీవితము భార మగును. హృదయమునందు కల్మషములు నిండి యుండుటచే రమించు గుణము కోల్పోవుదురు. వారికి సహజమగు ఆనందము అదృశ్యమగును. తీవ్ర మనస్కులై చింతించుచు నుందురు. ఇట్టి వారికి ఆటల యందాసక్తి యుండదు. పాటల యందాసక్తి యుండదు. ఎవరైనను ఆనందముగ నున్నచో ఈర్ష్యపడి వారి ఆనందమును హరింప చూతురు. ఇట్లు జరుగుటకు కారణము వారియందు రమణి అను శ్రీదేవి కల్యాణ గుణము అదృశ్య మగుటయే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 310-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 310-1. Ramaṇī रमणी (310) 🌻*

She plays around. She plays with Her devotees. Devotees are everything for Her. She gives happiness to them and She plays with them too. Providing happiness to one’s children and playing with them is one of the motherly qualities. Her motherly attribute is highlighted here. But devotees always keep a distance from Her out of fear and respect. This is the biggest setback in God realization. Fear and respect should pave way for love and affection. Unfortunately, She is being considered as a different entity from one’s own self. When we say that She is omnipresent, why should we consider Her as a different person? 

This is what Chāndogya Upaniṣad VIII.12.3 says “In the same way, the joyful self arises from the body and attaining the light of the Cosmic Self, appears in his own form. This is the Paramātman, the Cosmic Self. He then freely moves about eating, playing, or enjoying himself with women, carriages or relatives, not remembering at all, the body in which he was born. Just as horses or bullocks are harnessed to carriages, similarly life remains harnessed to the body due to karma”. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹