నిర్మల ధ్యానాలు - ఓషో - 73


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 73 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం చేసే వ్యక్తి సున్నితంగా స్పందించాలి. తెలివిగా, చురుగ్గా వుండాలి. సృజనాత్మకంగా వుండాలి. నువ్వు మనసును ఆపడం అభ్యసించాలి. ఒకసారి నువ్వు మనసును ఆపడం నేర్చుకుంటే నువ్వు అధికారివి. 🍀


నా సందేశ సారాంశం, భయం గుండా జీవించ వద్దు - నువ్వు శిక్షింపబడతావని భయపడకు - నిర్భయంగా జీవించు. అప్పుడు సంపూర్ణంగా జీవిస్తావు. భయం సహజంగా నువ్వు ముడుచుకునేలా చేస్తుంది. అది నిన్ను తెరుచుకోనివ్వదు. ఒక పని చెయ్యాలంటే వెయ్యిసార్లు ఆలోచించేలా చేస్తుంది. అది తప్పో, ఒప్పో నైతికమో అనైతికమో, చర్చికి అనుగుణమో కాదో, పవిత్ర గ్రంథాలకు అనుకూలమో వ్యతిరేకమో! దాని వల్ల నువ్వు మరింత గందరగోళానికి లోనవుతావు. విషయాల్ని పాపాలుగా పరివర్తింపచేసే మార్గంలో అడుగు పెడితే నీకు అంతా గందరగోళమే.

విషయాల్ని నేను సమీపించే విధం వేరు, తప్పులుంటాయి. కానీ పాపం అన్నది లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి. చేసిన తప్పు మళ్ళీ చెయ్యడం బుద్ధిహీనత. జీవితాన్ని విస్ఫోటించాలి. కొన్నిసార్లు నిష్ఫలం కావచ్చు. ఫలితం రాదని అనుకుంటే ప్రయత్నమే చెయ్యలేవు. నా ప్రయత్నం మీకు ఆనందాన్ని ఇవ్వడం, జీవితాన్ని వెలిగించడం, అద్భుతాల వేపు సాహసించడం, నిర్భయంగా సాగడం, జీవితావకాశాల్ని విస్ఫోటించడం, ఎందుకుంటే దేవుడే న్యాయనిర్ణేత, భయపడాల్సిన పన్లేదు. తీర్మానం చేసే రోజు, నిర్ణయం చేసే రోజు నువ్వు దేవుణ్ణి చూసి 'అవును స్వామీ, నేను తాగాను, నన్ను క్షమించు, యింకా కొన్ని తప్పులు చేశాను మన్నించు' అను. నా వుద్దేశంలో దేవుడు, అర్థం చేసుకుంటాడు. బాధపడాల్సిన పన్లేదు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Sep 2021

No comments:

Post a Comment