శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-1🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🌻 310-1. 'రమణీ' 🌻
భక్తులను రమింపజేయునది శ్రీమాత అని అర్థము. ధర్మము నాచరించు వారిని రమింపజేయుట శ్రీమాత లక్షణము. ధర్మమును అతి విస్తారముగ వివరించిన వేదవ్యాస మహర్షి అత్యంత క్లుప్తముగ కూడ నిర్వచించెను. “ఇతరులు తనకేమి ఒనర్చిన బాధ కలుగకుండునో అది ఇతరుల కొనర్చకుండుట ధర్మము” అని ఒక వాక్యములో ధర్మమును తెలియబరచినాడు. మన మితరులతో ప్రవర్తించు రీతిని ఇతరులు మనపై చూపిన మన కెట్లుండును?
హింసించుట, దూషించుట, దుర్భాషలాడుట, భేదములు కలిగించుట, విరోధములను ప్రోత్సహించుట, ఈర్ష్యపడుట, కూటనీతి నాచరించుట, కించపరచుట, దొంగిలించుట, మాట త్రిప్పుట, మడతలు పెట్టుట, త్రికరణముల యందు శుద్ధి లేకపోవుట, ఇతరుల సంపదల కాశపడుట, ఇత్యాదివి ఇతరులు మనపై నిర్వర్తించినచో మనకు దుఃఖము కలుగుట సహజము. కావున ఇట్టి ప్రవర్తనము మన మితరుల యందు చూపరాదు.
పై విధమగు ధర్మము నాచరించిన వారికి జీవితము భార మగును. హృదయమునందు కల్మషములు నిండి యుండుటచే రమించు గుణము కోల్పోవుదురు. వారికి సహజమగు ఆనందము అదృశ్యమగును. తీవ్ర మనస్కులై చింతించుచు నుందురు. ఇట్టి వారికి ఆటల యందాసక్తి యుండదు. పాటల యందాసక్తి యుండదు. ఎవరైనను ఆనందముగ నున్నచో ఈర్ష్యపడి వారి ఆనందమును హరింప చూతురు. ఇట్లు జరుగుటకు కారణము వారియందు రమణి అను శ్రీదేవి కల్యాణ గుణము అదృశ్య మగుటయే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 310-1 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀
🌻 310-1. Ramaṇī रमणी (310) 🌻
She plays around. She plays with Her devotees. Devotees are everything for Her. She gives happiness to them and She plays with them too. Providing happiness to one’s children and playing with them is one of the motherly qualities. Her motherly attribute is highlighted here. But devotees always keep a distance from Her out of fear and respect. This is the biggest setback in God realization. Fear and respect should pave way for love and affection. Unfortunately, She is being considered as a different entity from one’s own self. When we say that She is omnipresent, why should we consider Her as a different person?
This is what Chāndogya Upaniṣad VIII.12.3 says “In the same way, the joyful self arises from the body and attaining the light of the Cosmic Self, appears in his own form. This is the Paramātman, the Cosmic Self. He then freely moves about eating, playing, or enjoying himself with women, carriages or relatives, not remembering at all, the body in which he was born. Just as horses or bullocks are harnessed to carriages, similarly life remains harnessed to the body due to karma”.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment