🌹 22, MARCH 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 22, MARCH 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, MARCH 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀. 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🍀
2) 🌹 కపిల గీత - 151 / Kapila Gita - 151 🌹 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 05 / 4. Features of Bhakti Yoga and Practices - 05 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 743 / Vishnu Sahasranama Contemplation - 743 🌹 
🌻743. శూన్యః, शून्यः, Śūnyaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 704 / Sri Siva Maha Purana - 704 🌹 🌻. త్రిపుర మోహనము - 2 / The Tripuras are fascinated - 2 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 441 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 1 🌹 🌻 441. 'తుష్టిః' - 1 / 441. 'Tushtih' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 22, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు, Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 14 🍀*

*15. మాతాపితాఽయం జగతాం పరేషాం*
*తస్యాపి మాతాజనకాదికం న |*
*శ్రేష్ఠం వదంతి నిగమాః పరేశం*
*తం జ్యేష్ఠరాజం ప్రణమామి నిత్యమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అలసట రానివ్వరాదు - చైతన్యాన్ని ఏకత్ర కేంద్రీకృతం చెయ్యడమనే అభ్యాసం ప్రారంభ దశలో దీర్ఘకాలం చెయ్యరాదు. అలా చేస్తే అలసట వలన సాధన నిష్ప్రయోజనమై పోతుంది. అలసట కలిగేటట్లు ఉన్నప్పుడు చైతన్య కేంద్రీకరణాభ్యాసం విరమించి దానికి బదులు మామూలు ధ్యానం చెయ్యవచ్చు. 🍀*

🪷 🪷 🪷 🪷 🪷

*🌻. 'శోభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం. భగవంతుడు తన ప్రేమపూర్వక సృష్టిలో ఈ ప్రపంచాన్ని యుగాది నాడు సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలి ఆకాంక్షిస్తూ, ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. 🌻*

*🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹*
*సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |*
*శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్ *

🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :
1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు" 

*🌴. ఉగాది విశిష్టత : 🌴*
‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.*

*ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.*

🌷🌷🌷🌷🌷

శోభకృత్‌, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల పాడ్యమి 20:22:58
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: ఉత్తరాభద్రపద 15:33:16
వరకు తదుపరి రేవతి
యోగం: శుక్ల 09:17:35 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కింస్తుఘ్న 09:35:57 వరకు
వర్జ్యం: 02:16:48 - 03:45:16
దుర్ముహూర్తం: 11:58:52 - 12:47:26
రాహు కాలం: 12:23:09 - 13:54:11
గుళిక కాలం: 10:52:07 - 12:23:09
యమ గండం: 07:50:03 - 09:21:05
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 11:07:36 - 12:36:04
సూర్యోదయం: 06:19:00
సూర్యాస్తమయం: 18:27:17
చంద్రోదయం: 06:44:01
చంద్రాస్తమయం: 19:11:21
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 15:33:16 వరకు తదుపరి 
ఉత్పాద యోగం - కష్టములు, 
ద్రవ్య నాశనం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🍀🌹. 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🌹🍀*

*🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹*
*సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |*
*శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్ ||*

*🌻. 'శోభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం. భగవంతుడు తన ప్రేమపూర్వక సృష్టిలో ఈ ప్రపంచాన్ని యుగాది నాడు సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలి ఆకాంక్షిస్తూ, ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. 🌻*

*🌴. ఉగాది విశిష్టత : 🌴*
‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.*
*ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.*

*🪷. ఉగస్య ఆది ఉగాది : 🪷*
*ఉగమంతా, నక్షత్ర గమనం. నక్షత్రముల నడవడిక ఆరంభమైన కాలమే అనగా సృష్టి మొదలైన కాలము యొక్క ఆది - ఉగాది. వేదములను తస్కరించిన సోమకాసురుని చెంత నుడి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి మత్స్యావతారాన్ని దాల్చిన రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది రోజు అని, పురాణములు పేర్కొన్నాయి.*

*🪷. ఉగాది నాడు పాటించే ప్రధానాంశములు 🪷*
*ఉగాది పండుగ నాడు ప్రధానంగా ఆచరించే విషయములు: అభ్యంగన స్నానము, ఇష్ట దేవతారాధన, సంవత్సర దేవతారాధన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.*

*🪷. పంచాంగ శ్రవణం - చేకూరు లాభములు🪷*
*తిథి వార నక్షత్రయోగ కరణములతో కూడినది - పంచాంగం.*
*‘‘తిథేశ్చ, శ్రీయమాప్నోతి వారాదాయుష్య వర్థనమ్*
*నక్షత్రాత్థరతాపాపం, యోగార్రోగ నివారణమ్*
*కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్*
*కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రహం లభౌత్’’*

*తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాపపరిహారం, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కార్యానుకూలత, పంచాంగ శ్రవణము వలన నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి.*

*🪷 🍯🥭🥣. ఉగాది పచ్చడి 🪷🍯🥭🥣*
*ఇది షడ్రుచులతో కూడిన భక్షణం. వేపపువ్వు (చేదు), మామిడి పిందె (వగరు), క్రొత్త చింతపండు (పులుపు), మిరియాల పొడి (కారం) ఇప్పుడు పచ్చి మిర్చి ముక్కలు వేస్తున్నారు. కొద్దిగా సైంధవ లవణం (ఉప్పు). మానవజీవిత వైవిధ్యం అంతా, ఉగాది పచ్చడిలో ప్రతిబింబిస్తుంది. జీవితంలో అంతా మాధుర్యము- సుఖమే ఉండదు. చేదు, పులుపు, వగరు లాంటి కష్టనష్టములతో, ఒడుదుడుకులతో కూడికొని ఉంటుంది. ఉప్పు ఉంటుంది, బెల్లము ఉంటుంది. జీవితంలోనూ సుఖదుఃఖాలుంటాయి. అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్థైర్యం ఉండాలన్నది, ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.*

🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :
1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు" 

ఉగాదినాడు ఈ శ్లోకములను చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 151 / Kapila Gita - 151 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 05 🌴*

*05. మౌనం సదాసనజయః స్థైర్యం ప్రాణజయః శనైః|*
*ప్రత్యాహారశ్చేంద్రియాణాం విషయాన్మనసా హృది॥*

*తాత్పర్యము : మాట్లాడునప్పుడు సంయమనమును కలిగియుండవలెను. పరిశుభ్రమైన ప్రదేశమున స్థిరమైన ఆసనముపై కూర్చుండవలెను. ఆ ఆసనముపై క్రమముగా దర్భలను, జింకచర్మమును, వస్త్రమును ఏర్పరచు కొనవలెను. అది అంత ఎక్కువగా గానీ, తక్కువగాగాని గాక సమస్ఠాయిలో ఉండవలెను. ప్రాణాయామసాధన ద్వారా మెల్ల మెల్లగా శ్వాసను అదుపులో ఉంచుకొనవలెను. చంచలమైస మనస్సును భగవంతునిపై ఏకాగ్ర మొనర్పవలెశు.*

*వ్యాఖ్య : సాధారణంగా యోగ అభ్యాసాలు మరియు ప్రత్యేకించి హఠ-యోగం స్థిరత్వాన్ని సాధించడానికి సాధనాలు. యోగ సాధన కోసం ముందుగా ఒకరు సరిగ్గా కూర్చోగలగాలి, ఆపై మనస్సు మరియు శ్రద్ధ తగినంత స్థిరంగా ఉంటాయి. క్రమంగా, శ్వాస ప్రసరణను నియంత్రించాలి మరియు అటువంటి నియంత్రణతో అతను ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకోగలడు. పూర్వం శ్లోకంలో బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలని చెప్పబడింది. ఇంద్రియ నియంత్రణలో అత్యంత ముఖ్యమైన అంశం లైంగిక జీవితాన్ని నియంత్రించడం. దానినే బ్రహ్మచర్యం అంటారు. వివిధ కూర్చున్న భంగిమలను అభ్యసించడం ద్వారా మరియు ప్రాణాధారమైన శ్వాసను నియంత్రించడం ద్వారా, ఇంద్రియాలను అనియంత్రిత ఇంద్రియ ఆనందం నుండి నియంత్రించవచ్చు మరియు నిరోధించవచ్చు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 151 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 05 🌴*

*05. maunaṁ sad-āsana-jayaḥ sthairyaṁ prāṇa-jayaḥ śanaiḥ*
*pratyāhāraś cendriyāṇāṁ viṣayān manasā hṛdi*

*MEANING : One must observe silence, acquire steadiness by practicing different yogic postures, control the breathing of the vital air, withdraw the senses from sense objects and thus concentrate the mind on the heart.*

*PURPORT : The yogic practices in general and haṭha-yoga in particular are not ends in themselves; they are means to the end of attaining steadiness. First one must be able to sit properly, and then the mind and attention will become steady enough for practicing yoga. Gradually, one must control the circulation of vital air, and with such control he will be able to withdraw the senses from sense objects. In the previous verse it is stated that one must observe celibacy. The most important aspect of sense control is controlling sex life. That is called brahmacarya. By practicing the different sitting postures and controlling the vital air, one can control and restrain the senses from unrestricted sense enjoyment.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 743 / Vishnu Sahasranama Contemplation - 743🌹*

*🌻743. శూన్యః, शून्यः, Śūnyaḥ🌻*

*ఓం శూన్యాయ నమః | ॐ शून्याय नमः | OM Śūnyāya namaḥ*

*సర్వ విశేష రహితః శూన్యవత్ శూన్య ఉచ్యతే* 

*శూన్యము వంటివాడు. ఏలయన - పరమాత్ముడు సర్వ విశేష రహితుడు. అతనిని గుర్తించుటకు సహకారులగు ఏ విశేషములును లేదా ఇతర వస్తువులనుండి వేరు పరచు భేదక లక్షణములును లేవు. ఇతని కంటె ఇతరులు మరి ఎవ్వరును లేరు కదా!*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 743🌹*

*🌻743. Śūnyaḥ🌻*

*OM Śūnyāya namaḥ*

*सर्व विशेष रहितः शून्यवत् शून्य उच्यते / Sarva viśeṣa rahitaḥ śūnyavat śūnya ucyate*

*As He is devoid of all qualities, He is Śūnyaḥ, as it were. There are no attributes to uniquely identify Him. There are no qualities that make Him indifferent to any other thing; hence He is Śūnyaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥
సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥
Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,Vīrahā viṣamaśśūnyo ghr‌tāśīracalaścalaḥ ॥ 79 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 704 / Sri Siva Maha Purana - 704 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴*
*🌻. త్రిపుర మోహనము - 2 🌻*

*సౌందర్యలావణ్యములకు నిధానమనదగిన స్త్రీలు వేలాది మంది ఉండవచ్చును. కాని వివాహమాడి గృహస్థ జీవనమునకు అంకితమయ్యేది ఒక స్త్రీతో మాత్రమే గదా! (11). కొన్ని వందల గుర్రములు ఉపలభ్యము గానున్ననూ, అధిరోహించు కాలమునందు ఉపకరించునది ఒక గుర్రమే గాని, రెండు కాదు (12). హంస తూలికాతల్పముపై పరున్న వానికి ఏ నిద్రా సుఖము కలుగునో, భూమిపై శయనించువానికి కూడా అదియే నిద్రాసుఖము లభించును (13). మనవంటి దేహధారులకు ఎట్టి మరణభయము గలదో, అదే మరణ భయము బ్రహ్మ మొదలు కీటకము వరకు గల ప్రాణులన్నింటికీ గలదు (14).*

*బుద్ధితో విచారణ చేసినచో, దేహధారులందరు సమానమే. ఈ సత్యమును దృఢముగా ఎరింగి ఎవ్వరైననూ ఎక్కడైననూ ఇతర ప్రాణులను హింసించరాదు (15). భూమండలమునందు భూతదయతో సమానమైన ధర్మము ఎచ్చటనూ లేదు. కావున మానవులు సర్వప్రయత్నములను చేసి భూతదయను పాలించవలెను (16). ఒక్క ప్రాణిని రక్షించినచో, ముల్లోకములను రక్షించునట్లు అగును. ఒక్క ప్రాణిని హింసించినచో, ముల్లోకములను హింసించినట్లు అగును. కావున ప్రాణులను రక్షించవలెనే గాని, హింసించరాదు (17). అహింస సర్వోత్తమ మగు ధర్మము. దేహమునకు హింసను కలిగించుట పాపము. పరాధీనుడు కాకుండటయే మోక్షము. కోరిన సుఖముల ననుభవించుటయే స్వర్గము (18).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 704🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴*

*🌻 The Tripuras are fascinated - 2 🌻*

11. There may be a thousand damsels of exquisite beauty and comely features. But only one of them can be used at a time for the sexual intercourse.

12. Let there be hundreds of horses, of different varieties. But for the purpose of riding only one can be used on one occasion.

13. The pleasure that one derives in that sleep on a cushioned couch is the same that one derives by sleeping on the bare ground.

14. Just as we, the embodied beings, are afraid of death so also the bodies from Brahmā to the worm are afraid of death.

15. If we analyse with a keen intellect, all the embodied being are equal. After coming to this conclusion it does not behove anyone to injure anyone else.

16. There is no other virtue equal to the mercy shown to living beings. Hence all men shall strenuously practise acts of mercy to living beings.

17. If a single living being is protected it amounts to the protection of the three worlds. If that is killed it amounts to the killing of all others. Hence it is our duty to protect and abstain from killing others.

18. Non-violence is the greatest virtue. Affliction of others is a great sin. Salvation is defined as non-dependence on others. Eating the food of our choice is heavenly bliss.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 441 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।*
*శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀*

*🌻 441. 'తుష్టిః' - 1 🌻* 

*సకల ప్రాణులకు తుష్టి నిచ్చునది శ్రీమాత అని అర్థము. కోరికలు తీరినపుడు ప్రాణులకు తృప్తి కలుగును. సంతోషము కలుగును. తృప్తి, సంతోషము కలిగియున్న జీవుడు నిండుదనముతో ప్రకాశించును. అదియే తుష్టి. దప్పిక కొన్నవారికి నీరు, ఆకలి గొన్న వారికి అన్నము యేర్పరచుచు ప్రాణులను తృప్తి పరచి తుష్టి కలిగించుట, శ్రీమాత కార్యములలో నొకటి. కోరికలను తీర్చునది తల్లియే కదా! శ్రీమాత కొన్ని కోరికలను తీర్చి తృప్తి పరచును. కొన్ని కోర్కెలను తీర్చక శిక్షణ నిచ్చి ఆ కోరికల నుండి ఉత్తీర్ణులను చేయును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih*
*Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻*

*🌻 441. 'Tushtih' - 1 🌻*

*It means that Srimata satisfies the thirst to all beings. When the desires are fulfilled, the beings are satisfied. There will be happiness. A contented and happy being shines with fullness. That is Tushti. One of the works of Sri Mata is to provide water for those who are thirsty and food for those who are hungry and satisfy the living beings. It is the mother who fulfills the wishes! Srimata fulfills certain desires and gives satisfaction. She trains the disciple to overcome the rest of the desires.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

Siva Sutras - 057 - 1.18. lokānandaḥ samādhisukham - 3 / శివ సూత్రములు - 057 - 1.18 లోకానన్దః సమాధిసుఖమ్ - 3


🌹. శివ సూత్రములు - 057 / Siva Sutras - 057 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 1.18 లోకానన్దః సమాధిసుఖమ్ - 3 🌻

🌴. అతని అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి (సమాధి) యొక్క ఆనందం మొత్తం విశ్వానికి ఆనందం.🌴


ఈ సూత్రం సమాధి దశలోకి ప్రవేశించేటప్పుడు యోగి ఇంకా మెలకువగా ఉన్న దశ గురించి మాట్లాడుతుంది. శివుని దృష్టితో విశ్వాన్ని చూడవలసి ఉంటుంది కాబట్టి అతడు ఆత్మసాక్షాత్కార యోగి అయి ఉండాలి. యోగి తానే శివుడని భావిస్తేనే ఇది జరుగుతుంది. శివునిగా రూపాంతరం చెందడానికి, అతను బలమైన దృఢ నిశ్చయంతో తానే శివుడని నమ్మాలి. మరియు ద్వంద్వత్వ భావనలన్నీ త్యజించాలి. నిజంగా శివునితో తనను తాను గుర్తించుకోవడం కేవలం నిర్వాణ దశలో మాత్రమే జరుగుతుంది. నిర్వాణం అనేది అహంకారం పూర్తిగా లేని దశ. ఇక్కడ జీవి కాక కేవలం అస్తిత్వం ఉంటుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 057 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 1.18. lokānandaḥ samādhisukham - 3 🌻

🌴. The joy of his mystical trance (samādhi) is bliss for the whole universe.🌴


But this sūtra talks about the stage where the yogi is still awake while entering into the stage of samādhi. This means that he has to be a Self-realised yogi as he has to look at the universe through the eyes of Śiva. This can happen only if the yogi feels that he is Śiva Himself. To transform as Śiva, he has to repeatedly affirm with strong conviction and total dissolution of duality. Truly identifying oneself with Śiva happens only in the stage of nirvāṇa. Nirvāṇa is the stage where one’s ego is totally blown off. It is the cessation of existential being.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 320


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 320 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది. 🍀


మరింత మరింత చైతన్యంగా వుండడం నేర్చుకో. నీ శరీరం పట్ల స్పృహతో వుండు. మనను పట్ల స్పృహతో వుండు. హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది. ఈ మూడింటి పట్ల స్పృహతో వుంటే నాలుగోది వస్తుంది. అది చైతన్యమే. అది రూపాంతరం. అది దైవత్వానికి దారి తీస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 55 - 24. Science becomes Philosophy / నిత్య ప్రజ్ఞా సందేశములు - 55 - 24. శాస్త్రం తత్వం అవుతుంది


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 55 / DAILY WISDOM - 55 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 24. శాస్త్రం తత్వం అవుతుంది 🌻


'నేను జీవిస్తున్నాను, ఎందుకంటే నాకు జీవించడానికి ఒక కారణం ఉంది. కేవలం లక్ష్యం లేని చలనం కాదు' అని ఎవరైనా చెప్పినప్పుడు, కారణం అంటే ఏమిటో వివరించాలి. ఇలా చెప్పడం ద్వారా పెద్ద కష్టాల్లోకి మనం అడుగులు వేస్తామన్నది ఆసక్తికరం. జీవించడానికి కారణం అంటే ఏమిటి? దీని అర్థం తన ముందు ఒక లక్ష్యం ఉంది అనే విషయం యొక్క స్పృహ. ఇప్పుడు, మళ్ళీ, మనం ప్రమాదపు అంచుల్లో నడుస్తున్నామని అర్థం చేసుకోవాలి. శాస్త్రం నుండి, మనం ఎక్కడికి వచ్చాము? మన ముందు ఒక లక్ష్యం ఉందని స్పృహలో ఉండటమంటే జీవించే కారణం ఉన్నట్లే.

జీవితం, చైతన్య స్థితి నుండి విడదీయరానిది. చివరికి, జీవశాస్త్రం కూడా మనల్ని భౌతికశాస్త్రం ఏ విషయానికి చేర్చిందో అదే విషయానికి తీసుకువెళుతుంది. చైతన్యం అనే సూత్రం లేకుండా, మనం ఏమి చేసినా, ఏ దిశలో కదిలినా అది అసాధ్యమే అనే విషయం నుండి మనం తప్పించుకోలేము. ప్రాథమిక శాస్త్రాలైన ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం- చివరగా చెప్పడానికి ఒక విషయం ఉంది. అది ఏమిటంటే అవి చెప్పదలచుకున్న విషయం చివరికి వాటి శాస్త్ర పరిమితిని దాటిపోతుంది అని. చివరికి శాస్త్రం తత్వం అవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 55 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 24. Science becomes Philosophy 🌻

When I say, “I am living, because I have a purposive existence, and not merely an aimless motion,” I have to explain what I mean by purposiveness. It is interesting to see how we go from step to step into greater difficulties. What do we mean by a purposive existence? It would mean, at least in outline, the consciousness of an aim in front of oneself. Now, again, we see where we are moving, dangerously. From science, where have we come? To be conscious that there is an aim before us is to be purposive.

Life is, again, inseparable from a state of consciousness. And in the end, biology, also, takes us to the same thing on which physics landed us. Somehow we cannot escape the dilemma of it being impossible for us to be without the principle of consciousness, in whatever we do, in whatever direction we move. The basic sciences—astronomy, physics, chemistry and biology—have a common thing to say, finally. In the end they tell us the same thing and by this proclamation of a truth, which is beyond their own jurisdiction, they, as sciences, are exceeding their limits. Science becomes philosophy.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 190 / Agni Maha Purana - 190


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 190 / Agni Maha Purana - 190 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 58

🌻. స్నపనాది విధానము - 2 🌻

శల్పికి ద్రవ్యమునిచ్చి సంతోషపరచవలెను. గురువునకు గోదానమీయవలెను. "చిత్రందేవానామ్‌" ఇత్యాది మంత్రము పఠించుచు ప్రతిమనేత్రములను తెరవవలెను. "అగ్నిర్జ్యోతిః" ఇత్యాది మంత్రముచే దృష్టిసంచారము చేయవలెను. ప్రతిమను భద్రపీఠముపై నుంచి ఆచార్యుడు తెల్లని పుష్పములు, నెయ్యి, ఆవాలు, దూర్వలు, కుశలు దేవత శిరస్సుపై ఉంచవలెను.

"మధువాతా" ఇత్యాది మంత్రముచే నేత్రములందు అంజనము ఉంచివలెను. ఆ సమయమున "హిరణ్యగర్భః" "ఇమంమేవరుణః" ఇత్యాది మంత్రములు పఠింపవలెను. ఘృతవతీ ఇత్యాది ఋక్క పఠించుచు ఘృతము శరీరమునకు పూయవలెను. శనగపిండితో నలిచి "అతోదేవాః" ఇత్యాది మంత్రము పఠింపవలెను. "సప్తతే అగ్నే" ఇత్యాది మంత్రము పఠించి గర్భజలముతో ప్రతిమను కడగవలెను. "ద్రువదాదివ" ఇత్యాది మంత్రముచే అను లేపనము, ఆపోహిష్ఠామ" ఇత్యాది మంత్రముచే అభిషేకము చేయవలెను. అభిషేకానంతరము నదీ-తీర్థజలములచే స్నానము చేయించి, 'పావమానీ' ఋక్కు పఠించుచు రత్నస్పర్శగల ఉదకముతో స్నానము చేయింపవలెను.

"సముద్రం గచ్ఛస్వాహా" ఇత్యాది మంత్రము చదువుచు తీర్థ మృత్తికచేత, కలశజలము చేతనుస్నానము చేయించవలెను. "శంనోదేవీః" ఇత్యాది మంత్రముగాయత్రీమంత్రము పఠించుచు వేడినీళ్ళతో స్నానము చేయించవలెను. "హిరణ్యగర్భః" ఇత్యాది మంత్రములచే పంచవిధ మృత్తికలతో స్నానము చేయించవలెను. పిమ్మట "ఇమంమేగంగేయమునే" ఇత్యాది మంత్రముచే ఇసుక కలిపిన జలముచేతను, "తద్విష్ణోః పరమంపదమ్‌" అను మంత్రముతో పుట్టమట్టి కలిపిన ఉదకము చేతను, పూర్ణ ఘటముతో స్నానము చేయించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 190 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 58

🌻Consecration of the idol (snāna) - 2 🌻


7. The sculptor should be satisfied by offering articles (of present). A cow should be given as gift to the priest. Then the eyes of the idol should be made open with (the recitation of) the syllable citraṃ deva.[3]

8. The sight should be endowed with (the recitation of the syllable) agnir jyoti.[4] Then white flowers, ghee and mustard seeds should be placed on the pedestal.

9. The priest should place dūrvā grass and tips of kuśa grass on the head of the deity. Then the priest should anoint the eyes (of the deity) with the syllables madhu vātā.[5]

10. The syllables hiraṇyagarbha and imam me should be recited. Then the idol should be anointed with ghee reciting (the hymn) ghṛtavatā.[6]

11. The flour paste of masūra (a variety of grain) should be rubbed on the deity reciting (the hymn) ato devā.[7] Then the priest should wash (the deity) with hot water with the recitation of) sapta te agne[8].

12. It should be anointed with (the syllables) Urupadādiva. (The image) should be bathed [i.e., snāna] with (the waters of) the rivers and sacred places with (the syllables) āpo hi ṣṭḥā[9] and with the (waters containing) gems (with the) pāvamāna.

13. (The image) (should be bathed) with the waters of an earthern pot with (the syllable) samudraṃ gaccha[10]. It should be consecrated with śanno devī[11] and bathed with hot water (consecrated) by gāyatrī.

14. The supreme god should be bathed with five (kinds of) earth with (the syllable) hiraṇya. With pot made of earth of an anthill and sand waters and (the syllable) imam me[12] (it should be bathed).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 343: 09వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 343: Chap. 09, Ver. 05

 

🌹. శ్రీమద్భగవద్గీత - 343 / Bhagavad-Gita - 343 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 05 🌴

05. న చ మత్థ్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావన: ||


🌷. తాత్పర్యం :

అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగవైభమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమానజగత్తు నందలి భాగమును కాను.

🌷. భాష్యము :

సమస్తము తన యందే స్థితిని కలిగియున్నదని (మత్థ్సాని సర్వభూతాని) శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పలుకగా దానిని వేరు విధముగా అర్థము చేసికొనరాదు. వాస్తవమునకు విశ్వము యొక్క భరణ, పోషణములతో ప్రత్యక్షముగా ఆ భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కొన్నిమార్లు “అట్లాస్” తన భుజములపై భూగోళమును మోయుచు, అట్టి కార్యములో అలసినట్లుగా మనము చిత్రములలో గాంతుము. ఇదే భావనను శ్రీకృష్ణభగవానుడు విశ్వమును భరించుచున్నాడనెడి విషయమును మనము ఊహింపరాదు. ఏలయన తన యందే సర్వము స్థితిని కలిగియున్నను తాను మాత్రము వాటికి పరుడని యున్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. గ్రహమండలము అంతరిక్షమున నిలిచియున్నది. ఆ అంతరిక్షము భగవానుని శక్తియైనను, అతడు అంతరిక్షమునకు భిన్నుడు. అతడు భిన్నముగా స్థితుడై యున్నాడు. కనుకనే “జీవులందరు నా అచింత్యశక్తి యందు నిలిచియున్నను, దేవదేవుడైన నేను వారికి పరుడనై యున్నాను” అని శ్రీకృష్ణభగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచింత్యమైన యోగవైభవము.

“భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలలను గావించుచున్నాడు” అని వేదనిఘంటువైన నిరుక్తి యందు తెలుపబడినది (యుజ్యతేఽనేన దుర్ఘటేషు కార్యేషు). శ్రీకృష్ణభగవానుడు దివ్యములైన వివిధశక్తులను కలిగియున్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనెడి భావనలో మనమాతనిని అవగాహన చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 343 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 03 🌴

05 . na ca mat-sthāni bhūtāni paśya me yogam aiśvaram
bhūta-bhṛn na ca bhūta-stho mamātmā bhūta-bhāvanaḥ


🌷 Translation :

And yet everything that is created does not rest in Me. Behold My mystic opulence! Although I am the maintainer of all living entities and although I am everywhere, I am not a part of this cosmic manifestation, for My Self is the very source of creation.

🌹 Purport :

The Lord says that everything is resting on Him (mat-sthāni sarva-bhūtāni). This should not be misunderstood. The Lord is not directly concerned with the maintenance and sustenance of this material manifestation. Sometimes we see a picture of Atlas holding the globe on his shoulders; he seems to be very tired, holding this great earthly planet. Such an image should not be entertained in connection with Kṛṣṇa’s upholding this created universe. He says that although everything is resting on Him, He is aloof. The planetary systems are floating in space, and this space is the energy of the Supreme Lord.

But He is different from space. He is differently situated. Therefore the Lord says, “Although they are situated on My inconceivable energy, as the Supreme Personality of Godhead I am aloof from them.” This is the inconceivable opulence of the Lord. In the Nirukti Vedic dictionary it is said, yujyate ’nena durghaṭeṣu kāryeṣu: “The Supreme Lord is performing inconceivably wonderful pastimes, displaying His energy.” His person is full of different potent energies, and His determination is itself actual fact. In this way the Personality of Godhead is to be understood.

🌹 🌹 🌹 🌹 🌹

21 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 21, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఫాల్గుణ అమావాస్య, వసంత విషువత్తు (వసంతకాలం మొదటి రోజు లేదా మేషపు తొలి బిందువు), Chaitra Amavasya

Vernal Equinox🌻

🍀. అపరాజితా స్తోత్రం - 10 🍀


21. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

22. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి :

ధ్యానసాధనలో చైతన్య ప్రవృత్తి - ధ్యానసాధనలో చైతన్యం ఒక స్థానమందు కేంద్రీకృత మైనప్పుడు, ఇతర స్థానములందలి చైతన్యం మూగవోయి వుంటుంది. లేక, ఆలోచనలు మొదలైనవి బయట ఎక్కడనో కదలాడినట్లుండి కేంద్రీకృతమైన భాగం దానిని గుర్తించని స్థితిలో ఉంటుంది. ధ్యానం విజయవంతమైనట్లు చెప్పు కోదగినప్పటి పరిస్థితి అది. 🍀

🪷 🪷 🪷 🪷 🪷

🌴. వసంత విషువత్తు (వెర్నల్ ఈక్వినాక్స్) అంటే : 🌴

భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్ష్య తలానికి లంబంగా కాక 23.4° కోణంలో వాలుగా ఉంటుంది. అంటే భూమి కక్ష్యా తలం, జ్యోతిశ్చక్ర (ఎక్లిప్టిక్) తలానికి 23.4° కోణంలో ఉంటుంది. భూమధ్య రేఖను ఖగోళానికి పొడిగిస్తే ఆ ఖగోళ మధ్య రేఖ జ్యోతిశ్చక్రాన్ని రెండు స్థానాల వద్ద ఖండిస్తుంది. వీటినే విషువత్తులు అంటారు. ఇంగ్లీషులో ఈక్వినాక్స్ అంటారు. జ్యోతిశ్చక్రం వెంట ప్రయాణిస్తున్నట్లుగా కనిపించే సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖను ఈ విషువత్తుల వద్దనే దాటుతాడు. సంవత్సరంలో ఇది రెండు సార్లు జరుగుతుంది. దక్షిణం నుండి ఉత్తర దిశగా దాటే బిందువును వసంత విషువత్తు (వెర్నల్ ఈక్వినాక్స్) అని అంటారు. ఉత్తరం నుండి దక్షిణానికి దాటే బిందువును శరద్ విషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) అనీ అంటారు. వసంత విషువత్తును జ్యోతిశ్చక్రపు ఎసెండింగ్ నోడ్ అని, మేషపు తొలి బిందువు అనీ కూడా అంటారు. అలాగే శరద్ విషువత్తును డిసెండింగ్ నోడ్ అని అంటారు. సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజుల్లో (మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రీ, పగళ్ళ నిడివి సమానంగా ఉంటుంది. ఇవి రెండు రకాలు వసంత విషువత్తు (మార్చిలో), శరత్ విషువత్తు (సెప్టెంబరులో).

🪷. ఆయనము : విషువత్తుల మధ్య కాలాన్ని ఆయనము అంటారు. ఇవి ఉత్తరాయనము, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి.


🌷🌷🌷🌷🌷



శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: అమావాశ్య 22:54:02 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పూర్వాభద్రపద 17:27:37

వరకు తదుపరి ఉత్తరాభద్రపద

యోగం: శుభ 12:40:58 వరకు

తదుపరి శుక్ల

కరణం: చతుష్పద 12:20:33 వరకు

వర్జ్యం: 01:28:16 - 02:55:20

మరియు 26:16:48 - 27:45:16

దుర్ముహూర్తం: 08:45:16 - 09:33:45

రాహు కాలం: 15:25:16 - 16:56:11

గుళిక కాలం: 12:23:27 - 13:54:22

యమ గండం: 09:21:38 - 10:52:32

అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47

అమృత కాలం: 10:10:40 - 11:37:44

సూర్యోదయం: 06:19:49

సూర్యాస్తమయం: 18:27:05

చంద్రోదయం: 06:03:28

చంద్రాస్తమయం: 18:13:18

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: కాల యోగం - అవమానం

17:27:37 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹