శ్రీమద్భగవద్గీత - 343: 09వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 343: Chap. 09, Ver. 05

 

🌹. శ్రీమద్భగవద్గీత - 343 / Bhagavad-Gita - 343 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 05 🌴

05. న చ మత్థ్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావన: ||


🌷. తాత్పర్యం :

అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగవైభమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమానజగత్తు నందలి భాగమును కాను.

🌷. భాష్యము :

సమస్తము తన యందే స్థితిని కలిగియున్నదని (మత్థ్సాని సర్వభూతాని) శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పలుకగా దానిని వేరు విధముగా అర్థము చేసికొనరాదు. వాస్తవమునకు విశ్వము యొక్క భరణ, పోషణములతో ప్రత్యక్షముగా ఆ భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కొన్నిమార్లు “అట్లాస్” తన భుజములపై భూగోళమును మోయుచు, అట్టి కార్యములో అలసినట్లుగా మనము చిత్రములలో గాంతుము. ఇదే భావనను శ్రీకృష్ణభగవానుడు విశ్వమును భరించుచున్నాడనెడి విషయమును మనము ఊహింపరాదు. ఏలయన తన యందే సర్వము స్థితిని కలిగియున్నను తాను మాత్రము వాటికి పరుడని యున్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. గ్రహమండలము అంతరిక్షమున నిలిచియున్నది. ఆ అంతరిక్షము భగవానుని శక్తియైనను, అతడు అంతరిక్షమునకు భిన్నుడు. అతడు భిన్నముగా స్థితుడై యున్నాడు. కనుకనే “జీవులందరు నా అచింత్యశక్తి యందు నిలిచియున్నను, దేవదేవుడైన నేను వారికి పరుడనై యున్నాను” అని శ్రీకృష్ణభగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచింత్యమైన యోగవైభవము.

“భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలలను గావించుచున్నాడు” అని వేదనిఘంటువైన నిరుక్తి యందు తెలుపబడినది (యుజ్యతేఽనేన దుర్ఘటేషు కార్యేషు). శ్రీకృష్ణభగవానుడు దివ్యములైన వివిధశక్తులను కలిగియున్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనెడి భావనలో మనమాతనిని అవగాహన చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 343 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 03 🌴

05 . na ca mat-sthāni bhūtāni paśya me yogam aiśvaram
bhūta-bhṛn na ca bhūta-stho mamātmā bhūta-bhāvanaḥ


🌷 Translation :

And yet everything that is created does not rest in Me. Behold My mystic opulence! Although I am the maintainer of all living entities and although I am everywhere, I am not a part of this cosmic manifestation, for My Self is the very source of creation.

🌹 Purport :

The Lord says that everything is resting on Him (mat-sthāni sarva-bhūtāni). This should not be misunderstood. The Lord is not directly concerned with the maintenance and sustenance of this material manifestation. Sometimes we see a picture of Atlas holding the globe on his shoulders; he seems to be very tired, holding this great earthly planet. Such an image should not be entertained in connection with Kṛṣṇa’s upholding this created universe. He says that although everything is resting on Him, He is aloof. The planetary systems are floating in space, and this space is the energy of the Supreme Lord.

But He is different from space. He is differently situated. Therefore the Lord says, “Although they are situated on My inconceivable energy, as the Supreme Personality of Godhead I am aloof from them.” This is the inconceivable opulence of the Lord. In the Nirukti Vedic dictionary it is said, yujyate ’nena durghaṭeṣu kāryeṣu: “The Supreme Lord is performing inconceivably wonderful pastimes, displaying His energy.” His person is full of different potent energies, and His determination is itself actual fact. In this way the Personality of Godhead is to be understood.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment