Showing posts with label evolution. Show all posts
Showing posts with label evolution. Show all posts

మనిషిని మహనీయుడిగా మార్చే 10 సూత్రాలు / 10 Principles That Make a Man Great


Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2074275383358932/

🌹 మనిషిని మహనీయుడిగా మార్చే 10 సూత్రాలు - మనిషి మహనీయుడవడం ఒక గమ్యం కాదు - అది ఒక సాధన. మహనీయత్వం మనలోనే ఉంది - దాన్ని వెలికితీయడానికి ఈ 10 సూత్రాలు మార్గదర్శకాలు. 🌹
✍️ ప్రసాద్ భరద్వాజ


🌹 10 Principles That Make a Man Great - Becoming a man great is not a destination - it is a process. Greatness is within us - these 10 principles are the guidelines to uncover it. 🌹
✍️ Prasad Bharadwaj



మహనీయుడు అనగా కేవలం విజయవంతుడు కాదు; విలువలతో, నియమాలతో, ఆత్మశుద్ధితో జీవించే వాడు. మనిషి లోపలి దివ్యత్వాన్ని వెలికితీసే మార్గదర్శకాలు ఈ పది సూత్రాలు. ఇవి జీవితం యొక్క ఆధ్యాత్మిక–నైతిక పునాది.



1️⃣ ఈశ్వర ప్రణిదానము - ప్రతి కార్యాన్ని దేవునికి అర్పణగా భావించడం ఈశ్వర ప్రణిధానం. “నేనే చేస్తున్నాను” అనే అహంకారాన్ని విడిచి, ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం మనసుకు శాంతిని ఇస్తుంది. ఇది వినయాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

2️⃣ స్వాధ్యాయము - స్వాధ్యాయం అంటే శాస్త్రాధ్యయనం మాత్రమే కాదు; మన ఆలోచనలు, ప్రవర్తనలను పరిశీలించడం కూడా. ఇది మనలో జ్ఞానాన్ని, వివేకాన్ని పెంచి జీవన దిశను సరిచేస్తుంది.

3️⃣ తపస్సు - నియమం, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం కలిగిన జీవనం తపస్సు. కష్టాలను సహించి లక్ష్యాన్ని చేరే శక్తిని ఇది ఇస్తుంది. తపస్సు మనసును దృఢంగా చేస్తుంది.

4️⃣ సంతోషము - బాహ్య పరిస్థితులపై ఆధారపడని అంతరానందమే నిజమైన సంతోషం. సంతోషంగా ఉండే వ్యక్తి చుట్టూ ఉన్నవారికి కూడా సానుకూలతను పంచుతాడు.

5️⃣ శౌచము - శరీర శుభ్రతతో పాటు మనస్సు పవిత్రత కూడా అవసరం. అసూయ, ద్వేషం, లోభం వంటి మలినాలను తొలగించడం నిజమైన శౌచము.

6️⃣ అహింస - మనసులో, మాటలో, చేతల్లో హింస లేకపోవడం అహింస. దయ, కరుణ, సహనాన్ని పెంపొందించే మహత్తర సూత్రం ఇది.

7️⃣ సత్యము - సత్యం జీవనానికి మూల స్తంభం. సత్యవంతుడు ఎప్పుడూ భయపడడు. సత్యం విశ్వాసాన్ని నిర్మిస్తుంది, గౌరవాన్ని తెస్తుంది.

8️⃣ బ్రహ్మచర్యము - ఇంద్రియ నియంత్రణ, శక్తిని ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించడం బ్రహ్మచర్యం. ఇది ఆత్మశక్తిని పెంచి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చేస్తుంది.

9️⃣ అపరిగ్రహము - అవసరానికి మించి సొమ్ము, వస్తువులపై ఆసక్తి పెట్టకపోవడం అపరిగ్రహం. ఇది మనసుకు స్వేచ్ఛను, తృప్తిని ఇస్తుంది.

🔟 ఈశ్వర ప్రార్థన - ప్రార్థన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కృతజ్ఞత, వినయం, భక్తి భావాన్ని పెంచుతుంది. రోజువారీ ప్రార్థన మనలో దైవస్మరణను స్థిరపరుస్తుంది.


ఈ పది సూత్రాలు జీవితం యొక్క ఆధ్యాత్మిక నడకలో మార్గదర్శక దీపాల వంటివి. వీటిని ఆచరణలో పెట్టినప్పుడు మనిషి లోపలి చైతన్యం వికసిస్తుంది.

మహనీయత్వం బయట సంపాదించేది కాదు — లోపల పెంచుకోవాల్సిన గుణాల సమాహారం.

ప్రతిరోజూ ఈ సూత్రాలలో ఒక్కదానినైనా ఆచరించేందుకు ప్రయత్నిస్తే, మన జీవితం ధర్మమయంగా, శాంతిమయంగా, మహోన్నతంగా మారుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹

Evolution is spirallic process and not a cyclic process


🌹Evolution is Spirallic process and not a cyclic process. 🌹

Prasad Bharadwaj


There are many people who believe that everything is predetermined. To some extent, yes, but if everything is predetermined, there is no evolution, then we are just making circular rounds! But evolution is a process where we move in a circular fashion and with each cycle we move upward. It is a spirallic process and not a cyclic process. In a cyclic process we are just moving like the rodent around the mill. But in the process of evolution, each time we take to a cycle we are moving upward, getting liberated, reaching towards the Spirit and in the process of involution we are moving downward, reaching towards the matter. Evolution depends on time and it move according to the need of time. Time is Flexible.

🌹🌹🌹🌹🌹


🌹 *సత్యాన్వేషణం -- సత్యదర్శనం* 🌹

🌹  *సత్యాన్వేషణం -- సత్యదర్శనం*
🌹

సృష్టి మొత్తం అనంతమైన చైతన్యంతో నిండి వుంది. చైతన్య శక్తికి సజీవ ఉదాహరణ ‘మనిషి’. మనిషి శరీరాన్ని మన ‘భూమాత’తో పోల్చవచ్చు. భూమి ఒక ప్లానెట్. ప్రతి మనిషినీ ఒక ప్లానెట్‌గా భావిస్తే మనిషి శరీర నిర్మాణాన్ని ‘‘విధాత’’ ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది.

సృష్టికర్తకు ఇలా మనిషిని తీర్చిదిద్దడానికి ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టి వుండవచ్చుననిపిస్తుంది. మానవ శరీర నిర్మాణం- అందులోని గొప్పతనం- ప్రతి బాహ్యాంతర అవయవంలోని అద్భుతం జాగ్రత్తగా పరికించి స్టడీ చేస్తే!

మానవుని శరీరం- భూమి! చీము, నెత్తురు,నీరు- జలం! చైతన్యశక్తి- అగ్ని! ప్రాణశక్తి- వాయువు! వాక్కు- ఆకాశం!ఇక భూమధ్యం- సుషుమ్నానాడి; చంద్రుడు! శిరంపైన సుడి- బ్రహ్మరంధం; సూర్యుడు!

మనిషి శరీరంలోని ఈ సప్త్ధాతువులను (పంచ భూతాలు, చంద్రుడు, సూర్యుడు) విశ్వంలోని పంచభూతాలు, చంద్రుడు మరి సూర్యునితో అనుసంధానం చేయడమే ఆధ్యాత్మికత! అదే ‘‘భిన్నత్వం నుండి ఏకత్వం’’ (దైవత్వం నుండి అద్వైతం)- ‘‘ఏకత్వం నుండి అసంతత్వం! దీనినే ‘విశ్వంతో అనుసంధానం’ అని చెప్పకోవచ్చు!
Duality, to individuality! Individuality to Infinity!
CONNECTIVITY WITH COSMOS

భౌతిక శాస్త్రం (Physical Science)పదార్థ జ్ఞానం గురించి మాత్రమే చెపుతుంది. అదే ఆధ్యాత్మిక శాస్త్రం (Spiritual Science) ఆత్మస్థితి గురించి ఆత్మజ్ఞానం గురించి చెపుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఎంతగా స్టడీ చేస్తే సాధనవల్ల బోధనవల్ల అంత గొప్పగా (Evolution) ఆత్మ ఎదుగుదల ఉంటుంది.

ఆత్మానంద శాశ్వతానంద సుఖమస్తు ’ అన్నారు కదా వీరబ్రహ్మేంద్రస్వామి! ఎంత అద్భుతంగా వారు చెప్పారో క్రింద తెలుసుకుందాం!

‘ ధ్యానం’లో శ్వాస మీద దృష్టి నిలిపినట్లయితే, ఆలోచనా రహిత స్థితి క్రమంగా సిద్ధించి దృష్టి ఏకాగ్రమవుతుంది.

‘దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు- దృష్టి నిలపడేని నష్టపడును; దృష్టిలోన సర్వసృష్టి స్పష్టమౌను- కాళికాంబ! హంస! కాళికాంబ!’’ అన్నారు వారు.

చైతన్యశక్తి వల్ల- మనలో కుండలినీ ప్రయాణం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అంతరంలో! ఆ బ్రహ్మానందం అనుభవించవలసినదే కాని మాటలలో చెప్పడానికి వీలుకానిదది- అమృతం ఎలా వుంటుందో చెప్పడానికి ఏ భాషలో ఏ పదాలు సరిపోతాయి?

శబ్ద రూపాత్మకమైన ‘ఆకాశం’నుండి స్పర్శ కలిగిన వాయువు జనించింది. స్పర్శ కలిగిన ‘వాయువు’నుండి ‘రూపం’ కలిగిన ‘అగ్ని’ ఉద్భవించింది. రూపం కలిగిన ‘అగ్ని’ నుండి ‘రసం’ కలిగిన ‘జలం’ పుట్టింది.రసం కలిగిన ‘జలం’ నుండి ‘గంధం’ కలిగిన ‘భూమి’ సృష్టింపబడింది. ‘భూమి నుండి అన్నం- అన్నం నుండి బీజాలు, ఔషధాలు వచ్చాయి.’’ ఇది విశ్వవిస్తృతి- సృష్టి విలాసం- విధాత చమత్కారం- దానినుండి జీవరాసుల ఉత్పత్తి!

విశ్వాన్ని, సృష్టిని మూల ప్రకృతి అని, సృష్టిలోని 24 తత్త్వాలను ప్రకృతి అని చెప్పుకోవాలి! మానవ శరీరం 'భూమి’ అని చెప్పుకున్నాం.‘ఇది మూలాధారం’. దేహధర్మం! భూతత్త్వం! తాను, తన కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, రక్తస్పర్శ, అనుబంధాలు ఇలా!

‘మనస్సు స్వాధిష్ఠానం’. కోరికలు- కామం- మితృత్త్వం- శత్రుత్వం- ఆలోచన- పగ- ద్వేషం- ఇష్టం- సుఖం- దుఃఖం! జలతత్త్వం!

‘మణిపూరకం’ అంటే తేజం! పాండిత్యం- కళలు- గౌరవం- కీర్తి ప్రతిష్ఠం శాస్తజ్ఞ్రానం- శక్తి! ఎనర్జీ! విభూది! ‘అగ్నితత్వం’! అంటే చైతన్యం!

‘అనాహతం’ అంటే మౌనం- ప్రశాంతత- సంతృప్తి- ప్రేమ ప్రాణం! వాయుతత్వం!

‘విశుద్ధం’’ అంటే శుద్ధి- కర్మలు శుద్ధి అయేస్థితి- శుద్ధవాక్కు- సుశబ్దం- జ్ఞానం- వినయం- విశేషవాక్సుద్ధి! ఆకాశతత్వం!

ఈ అయిదు చక్రాలనూ పంచభూతస్థితులు అని చెప్పుకోవచ్చు! ఈ యొక్క పంచభూత స్థితిని దాటిన తర్వాత ‘ఆజ్ఞాచక్రం’! సుషుమ్నానాడి! చంద్రుడు! ఆత్మజ్ఞానం!

ఆజ్ఞాస్థితి- అంటే ‘‘ఆజ్ఞ! ఆర్డర్! దివ్యచక్షువు యొక్క పూర్ణత! అష్టసిద్ధులు! నవనిధులు! ‘అహం’కారం- అంటే ఆత్మస్థితి! ఆత్మతో ప్రవర్తించడం! దేహంతో ఉంటూ దేహభావన లేకపోవడం! దివ్యదృష్టి, దివ్యశ్రవణం! దివ్యయానం! దివ్య జీవనం!

🌹🌹🌹🌹🌹
సేకరణ 🙏 ప్రసాద్