నిర్మల ధ్యానాలు - ఓషో - 208


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 208 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. దాన్ని కనిపెట్టాలి. కారణం అది అప్పటికే మన దగ్గరుంది. కానీ ఆ విషయం గురించి మనకు స్పష్టత లేదు. మనం మరింత చురుగ్గా, మరింత చైతన్యవంతంగా మారాలి. 🍀

ప్రతి మనిషీ తన అస్తిత్వంతో బాటు సత్యాన్ని వెంట తెచ్చుకుంటాడు. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. దాన్ని కనిపెట్టాలి. లేదా తిరిగి కనిపెట్టాలి. కారణం అది అప్పటికే మన దగ్గరుంది. మనలో వుంది. కానీ ఆ విషయం గురించి మనకు స్పష్టత లేదు. మనం నిద్రలోకి జారుకుని ఆ విషయమే మరిచిపోయాం. మనం దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవాలి. మనం మరింత చురుగ్గా, మరింత చైతన్యవంతంగా మారాలి. ఏదీ కోల్పోలేదు. నువ్వు నిద్రలో వున్నావు. అంటే నువ్వు బిచ్చగాడినని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బిచ్చగాడివి కావు.

ఒకసారి నువ్వు నిద్రలేస్తే, మత్తు వదిలించుకుంటే నువ్వెంత పనికిమాలిన కలగన్నావో తెలుసుకుని ఆశ్చర్యపోతావు. నీలో గొప్ప నిధులున్నాయి. నీది శాశ్వతమయిన జీవితం. దేవుని రాజ్యం నీలో వుంది. అంతిమ సత్యం నీదే. అది మనతో బాటు మనం వెంట తెచ్చుకున్నది. మనమే అది! కాబట్టి యిది ఎక్కడో అన్వేషించాల్సింది, వెతకాల్సింది కాదు. నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించి నువ్వు మేలుకోవాలి. అంతే!


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jul 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 308 - 3. స్వయం ఒక వ్యక్తి కాదు, అది ఉన్నత జీవి / DAILY WISDOM - 308 - 3. The Self is not a Person, It is a Super-person


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 308 / DAILY WISDOM - 308 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 3. స్వయం ఒక వ్యక్తి కాదు, అది ఉన్నత జీవి 🌻


అత్యున్నత ఉనికిలో, అతను, ఆమె, అది, నేను మరియు మీరు లేవు. 'నా స్వయం, నీ స్వయం అని ఎవరూ అనరు. ఈ ఆలోచనలు అనుభావికమైనవి, తాత్కాలికమైనవి, సాపేక్షమైనవి, వ్యక్తిత్వ చైతన్యంతో అనుసంధానించబడినవి. స్వయం ఒక వ్యక్తి కాదు, అది ఉన్నత జీవి - సూపర్-పర్సన్. ఈ విశ్లేషణ ద్వారా మీరు ఇప్పుడు చేరుకున్న స్థాయి కంటే మీరు తెలుసు కోవలసినది ఇంకా ఉందని నేను చెప్తున్నాను. ఈ గొప్ప విషయం ఏమిటో అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. మీ లోతైన ఆత్మను తెలుసుకోవడం అనేది భగవంతుని గురించి తెలుసుకోవడంతో సమానంగా ఉంటుంది.

అది వినడానికి భయానకంగా ఉంటుంది! నా ఉనికి యొక్క లోతైన స్థాయిని తెలుసుకోవడం భగవంతుడిని తెలుసుకోవడం ఎలా అవుతుంది? మీకు భగవంతుడు సమగ్ర సర్వశక్తిమంతుడు, విశ్వవ్యాప్తమైన సర్వవ్యాపి అనే ఆలోచన ఉంది. నా ఉనికి యొక్క లోతైన స్థాయిలో అతను నా స్వంత హృదయంలో నిలబడి ఉన్నాడా? అలాంటప్పుడు దేవుడితో నా సంబంధం ఏమిటి? ఆ లోతైన స్థాయిలో మీరు పరిపూర్ణత యొక్క భావాన్ని కలిగి ఉంటారని తెలిసిన తర్వాత, మీకు మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్న ఇప్పటికి కొనసాగుతుంది. అది తదుపరి దశ. ఇప్పటి వరకు మనం ఏదైతే చర్చిస్తున్నామో అది మొదటి అడుగు మాత్రమే. మనమింకా రెండవ స్థాయిని తాకలేదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 308 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 3. The Self is not a Person, It is a Super-person 🌻


In the ultimate existence, there is no he, she, it, I and you. Nobody will say “my Self, your Self,” etc. These ideas are empirical, tentative, relative, connected with personality-consciousness, and the Self is not a person, it is a Super-Person. I am giving a hint that there is something more for you to know than the level you have reached now by this analysis. It will take some time even to understand what this great thing is. Knowing your deepest Self is identical with knowing God Himself.

That will be a terrifying thing to hear! How will knowing the deepest level of my being be the same thing as knowing God? You have an idea of God as the comprehensive Almighty, the universal omnipresent Being. Is He planted in my own heart at the deepest level of my being? Then what is my relationship with God? After having known that in that deepest level you will have a sense of completeness, the question still persists as to what the relationship is between yourself and God. That is the next step. Whatever we have been discussing up to this time is the first step only. We have not touched the second level.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jul 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 629 / Vishnu Sahasranama Contemplation - 629


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 629 / Vishnu Sahasranama Contemplation - 629 🌹

🌻629. భూషణః, भूषणः, Bhūṣaṇaḥ🌻

ఓం భూషణాయ నమః | ॐ भूषणाय नमः | OM Bhūṣaṇāya namaḥ

భూషణః, भूषणः, Bhūṣaṇaḥ


స్వేచ్ఛావతారైర్బహుభిర్భూమిం భూషయతీతి సః ।
విష్ణుర్భూషణ ఇత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥

అనేకములగు స్వేచ్ఛావతారములతో అవతరించి భూమిని అలంకరించుచున్నాడుగనుక ఆ విష్ణుదేవుడు భూషణః అని వేదవిద్యా విశారదులచే నుతింపబడుచున్నాడు.


:: పోతన భాగవతము తృతీయ్స్ స్కంధము ::

సీ. మానవైక వికాసమానమై తనకును విస్మయజనకమై వెలయునట్టి
యాత్మీయ యోగమాయాశక్తిఁ జేపట్టి చూపుచు నత్యంత సుభగ మగుచు
భూషణంబులకును భూషణంబై వివేకముల కెల్లను బరాకాష్ఠ యగుచు
సకల కల్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి
తే. తాన తానమూర్తి నిజశక్తిఁ దగ ధరింప, యమతనూభవు రాజసూయాధ్వరంబు
నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ, నిండు వేడుకఁజూచి వర్ణించి రెలమి. (89)

మానవులకు మహాభ్యుదయానికి అవధియై, తనకు కూడ ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగ మాయా బలమును స్వీకరించి ప్రకటించుచు మిక్కిలి సుందరమైన అలంకారములకే అలంకారమై, జ్ఞానానికి పెన్నిధానమై, సకల శుభాలకూ సన్నిధానమై, సత్యమై, నిత్యమై దీపించే ఆ దివ్యమంగళమూర్తి తన ఆకారాన్ని తన శక్తివల్ల తానే ధరించాడు. ధర్మరాజుని రాజసూయ యాగంలో మూర్తీభవించిన ఆనందనందనుని సౌందర్యమును మిక్కిలి ఆనందముతో అందరూ సందర్శించారు. మిక్కిలి సంతోషముతో అభివర్ణించారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 629🌹

🌻629. Bhūṣaṇaḥ🌻

OM Bhūṣaṇāya namaḥ

स्वेच्छावतारैर्बहुभिर्भूमिं भूषयतीति सः ।
विष्णुर्भूषण इत्युक्तो वेदविद्या विशारदैः ॥


Svecchāvatārairbahubhirbhūmiṃ bhūṣayatīti saḥ,
Viṣṇurbhūṣaṇa ityukto vedavidyā viśāradaiḥ.

With various incarnations that He took of His free will, He adorned the earth and hence Lord Viṣṇu is praised by the name Bhūṣaṇaḥ.


:: श्रीमद्भागवते तृतीयस्कन्धे द्वितीयोऽध्यायः ::

यन्मर्त्यलीलौपयिकं स्वयोगमायाबलं दर्शयता गृहीतम् ।
विस्मापनं स्वस्य च सौभगर्द्धेह् परं पदं भूषनभूषणाङ्गम् ॥ १२ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 2

Yanmartyalīlaupayikaṃ svayogamāyābalaṃ darśayatā gr‌hītam,
Vismāpanaṃ svasya ca saubhagarddheh paraṃ padaṃ bhūṣanabhūṣaṇāṃgam. 12.


The Lord appeared in the mortal world by His internal potency, yoga-māya. He came in His eternal form, which is just suitable for His pastimes. These pastimes were wonderful for everyone, even for those proud of their own opulence, including the Lord Himself in His form as the Lord of Vaikuṇṭha. Thus His transcendental body is the ornament of all ornaments.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


11 Jul 2022

11 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹11, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోషవ్రతం, జయపార్వతి వ్రతం, Pradosh Vrat, Jayaparvati Vrat Begins 🌻

🍀. రుద్రనమక స్తోత్రం - 32 🍀


61. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!

కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!

62. నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!

సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఈ ప్రపంచం ఈశ్వరుని నాటకశాల. ఈశ్వరుడే నటుడు. నీ వాయన ధరించిన వేషం. ఇది నీవూ గుర్తించి, నీద్వారా అయననే నటించనీ. జనులు నిన్ను మెచ్చినా గేలిచేసినా, వారుకూడా వేషాలే అని తెలుసుకో. నీలోని ఈశ్వరునే నీ విమర్శకునిగా, ప్రేక్షకునిగా గ్రహించు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల ద్వాదశి 11:15:10 వరకు

తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: అనూరాధ 07:50:33 వరకు

తదుపరి జ్యేష్ఠ

యోగం: శుక్ల 21:02:49 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: బాలవ 11:11:10 వరకు

వర్జ్యం: 12:50:04 - 14:15:48

దుర్ముహూర్తం: 12:47:43 - 13:40:08

మరియు 15:24:57 - 16:17:21

రాహు కాలం: 07:26:43 - 09:04:59

గుళిక కాలం: 13:59:47 - 15:38:03

యమ గండం: 10:43:15 - 12:21:31

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 21:24:28 - 22:50:12

సూర్యోదయం: 05:48:28

సూర్యాస్తమయం: 18:54:34

చంద్రోదయం: 16:32:05

చంద్రాస్తమయం: 02:52:34

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: వృశ్చికం

మానస యోగం - కార్య లాభం

07:50:33 వరకు తదుపరి పద్మ యోగం

- ఐశ్వర్య ప్రాప్తి


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


11 - JULY - 2022 MONDAY MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 11, జూలై 2022 సోమవారం, ఇందు వాసరే Monday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 230 / Bhagavad-Gita - 230 - 5- 26 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 629 / Vishnu Sahasranama Contemplation - 629 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 308 / DAILY WISDOM - 308 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 208 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹11, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోషవ్రతం, జయపార్వతి వ్రతం, Pradosh Vrat, Jayaparvati Vrat Begins 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 32 🍀*

*61. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!*
*కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!*
*62. నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!*
*సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈ ప్రపంచం ఈశ్వరుని నాటకశాల. ఈశ్వరుడే నటుడు. నీ వాయన ధరించిన వేషం. ఇది నీవూ గుర్తించి, నీద్వారా అయననే నటించనీ. జనులు నిన్ను మెచ్చినా గేలిచేసినా, వారుకూడా వేషాలే అని తెలుసుకో. నీలోని ఈశ్వరునే నీ విమర్శకునిగా, ప్రేక్షకునిగా గ్రహించు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల ద్వాదశి 11:15:10 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: అనూరాధ 07:50:33 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: శుక్ల 21:02:49 వరకు
తదుపరి బ్రహ్మ
 కరణం: బాలవ 11:11:10 వరకు
వర్జ్యం: 12:50:04 - 14:15:48
దుర్ముహూర్తం: 12:47:43 - 13:40:08
మరియు 15:24:57 - 16:17:21
రాహు కాలం: 07:26:43 - 09:04:59
గుళిక కాలం: 13:59:47 - 15:38:03
యమ గండం: 10:43:15 - 12:21:31
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 21:24:28 - 22:50:12
సూర్యోదయం: 05:48:28
సూర్యాస్తమయం: 18:54:34
చంద్రోదయం: 16:32:05
చంద్రాస్తమయం: 02:52:34
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృశ్చికం
మానస యోగం - కార్య లాభం
07:50:33 వరకు తదుపరి పద్మ యోగం
- ఐశ్వర్య ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 230 / Bhagavad-Gita as It is - 230 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 26 🌴*

*26. కామక్రోక్రోధవిముక్తానాం యతీనాం యతచేతసామ్ |*
*అభితో బ్రహ్మనిర్వాణాం వర్తతే విదితాత్మనామ్*

🌷. తాత్పర్యం :
*కామక్రోధము నుండి విడివడినవారును, ఆత్మదర్శులును, ఆత్మసంయమనము కలిగినవారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మాహాత్ములు అచిరకాలములోనే బ్రహ్మనిర్వాణము నిశ్చయముగా బడయుదురు.*

🌷. భాష్యము :
ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధుపురుషులలో కృష్ణభక్తిరసభావన యందున్నవాడు అత్యంత శ్రేష్టుడు. శ్రీమద్భాగవతము (4.22.39) ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుచున్నది.

యత్పాదపంకజపలాశవిలాసభక్త్యా కర్మాశయం గ్రథితముద్గృథయన్తి సంత: |
 తద్వన్న రిక్తమతయో యతయో(పి రుద్ధస్రోతోగణాస్తమరణం భజ వాసుదేవమ్ 

“దేవదేవుడైన వాసుదేవుని భక్తియోగముతో అర్చించుటకు యత్నింపుము. తీవ్రముగా నాటుకొని యుండెడి కామ్యకర్మల కోరికను నశింపజేసికొనుచు ఆ భగవానుని చరణకమల సేవ యందు నిమగ్నులై దివ్యానందము ననుభవించు భక్తులు తమ ఇంద్రియవేగమును అణచినరీతిగా మహామునులు సైతము ఇంద్రియవేగమును అణచలేకున్నారు.”

కామ్యకర్మల ఫలమును అనుభవింపవలెనను కోరిక బద్ధజీవుని యందు అతి గట్టిగా నాటుకొనియుండును. తీవ్రముగా యత్నించుచున్నను మాహామునులైనవారు సైతము అట్టి కోరికలను అదుపు చేసికొనలేరు. కాని కృష్ణభక్తిరసభావన యందు శ్రీకృష్ణభగవానుని సేవలో సర్వదా నియుక్తుడైయుండు భక్తుడు ఆత్మజ్ఞానపూర్ణుడై శీఘ్రమే బ్రహ్మనిర్వాణస్థితిని బడయును. తనకుగల ఆత్మజ్ఞానముచే అతడు సదా ధ్యానమగ్నుడై యుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 230 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 26 🌴*

*26. kāma-krodha-vimuktānāṁ yatīnāṁ yata-cetasām*
*abhito brahma-nirvāṇaṁ vartate viditātmanām*

🌷 Translation : 
*Those who are free from anger and all material desires, who are self-realized, self-disciplined and constantly endeavoring for perfection, are assured of liberation in the Supreme in the very near future.*

🌹 Purport :
Of the saintly persons who are constantly engaged in striving toward salvation, one who is in Kṛṣṇa consciousness is the best of all. The Bhāgavatam (4.22.39) confirms this fact as follows:

yat-pāda-paṅkaja-palāśa-vilāsa-bhaktyā
karmāśayaṁ grathitam udgrathayanti santaḥ
tadvan na rikta-matayo yatayo ’pi ruddha-
sroto-gaṇās tam araṇaṁ bhaja vāsudevam

“Just try to worship, in devotional service, Vāsudeva, the Supreme Personality of Godhead. Even great sages are not able to control the forces of the senses as effectively as those who are engaged in transcendental bliss by serving the lotus feet of the Lord, uprooting the deep-grown desire for fruitive activities.”

In the conditioned soul the desire to enjoy the fruitive results of work is so deep-rooted that it is very difficult even for the great sages to control such desires, despite great endeavors. A devotee of the Lord, constantly engaged in devotional service in Kṛṣṇa consciousness, perfect in self-realization, very quickly attains liberation in the Supreme. Owing to his complete knowledge in self-realization, he always remains in trance.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 629 / Vishnu Sahasranama Contemplation - 629 🌹*

*🌻629. భూషణః, भूषणः, Bhūṣaṇaḥ🌻*

*ఓం భూషణాయ నమః | ॐ भूषणाय नमः | OM Bhūṣaṇāya namaḥ*

భూషణః, भूषणः, Bhūṣaṇaḥ

స్వేచ్ఛావతారైర్బహుభిర్భూమిం భూషయతీతి సః ।
విష్ణుర్భూషణ ఇత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥

అనేకములగు స్వేచ్ఛావతారములతో అవతరించి భూమిని అలంకరించుచున్నాడుగనుక ఆ విష్ణుదేవుడు భూషణః అని వేదవిద్యా విశారదులచే నుతింపబడుచున్నాడు.

:: పోతన భాగవతము తృతీయ్స్ స్కంధము ::
సీ. మానవైక వికాసమానమై తనకును విస్మయజనకమై వెలయునట్టి
     యాత్మీయ యోగమాయాశక్తిఁ జేపట్టి చూపుచు నత్యంత సుభగ మగుచు
     భూషణంబులకును భూషణంబై వివేకముల కెల్లను బరాకాష్ఠ యగుచు
     సకల కల్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి
తే. తాన తానమూర్తి నిజశక్తిఁ దగ ధరింప, యమతనూభవు రాజసూయాధ్వరంబు
     నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ, నిండు వేడుకఁజూచి వర్ణించి రెలమి. (89)

మానవులకు మహాభ్యుదయానికి అవధియై, తనకు కూడ ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగ మాయా బలమును స్వీకరించి ప్రకటించుచు మిక్కిలి సుందరమైన అలంకారములకే అలంకారమై, జ్ఞానానికి పెన్నిధానమై, సకల శుభాలకూ సన్నిధానమై, సత్యమై, నిత్యమై దీపించే ఆ దివ్యమంగళమూర్తి తన ఆకారాన్ని తన శక్తివల్ల తానే ధరించాడు. ధర్మరాజుని రాజసూయ యాగంలో మూర్తీభవించిన ఆనందనందనుని సౌందర్యమును మిక్కిలి ఆనందముతో అందరూ సందర్శించారు. మిక్కిలి సంతోషముతో అభివర్ణించారు.

 సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 629🌹*

*🌻629. Bhūṣaṇaḥ🌻*

*OM Bhūṣaṇāya namaḥ*

स्वेच्छावतारैर्बहुभिर्भूमिं भूषयतीति सः ।
विष्णुर्भूषण इत्युक्तो वेदविद्या विशारदैः ॥

Svecchāvatārairbahubhirbhūmiṃ bhūṣayatīti saḥ,
Viṣṇurbhūṣaṇa ityukto vedavidyā viśāradaiḥ.

With various incarnations that He took of His free will, He adorned the earth and hence Lord Viṣṇu is praised by the name Bhūṣaṇaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे द्वितीयोऽध्यायः ::
यन्मर्त्यलीलौपयिकं स्वयोगमायाबलं दर्शयता गृहीतम् ।
विस्मापनं स्वस्य च सौभगर्द्धेह् परं पदं भूषनभूषणाङ्गम् ॥ १२ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 2
Yanmartyalīlaupayikaṃ svayogamāyābalaṃ darśayatā gr‌hītam,
Vismāpanaṃ svasya ca saubhagarddheh paraṃ padaṃ bhūṣanabhūṣaṇāṃgam. 12.

The Lord appeared in the mortal world by His internal potency, yoga-māya. He came in His eternal form, which is just suitable for His pastimes. These pastimes were wonderful for everyone, even for those proud of their own opulence, including the Lord Himself in His form as the Lord of Vaikuṇṭha. Thus His transcendental body is the ornament of all ornaments.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 308 / DAILY WISDOM - 308 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. స్వయం ఒక వ్యక్తి కాదు, అది ఉన్నత జీవి 🌻*

*అత్యున్నత ఉనికిలో, అతను, ఆమె, అది, నేను మరియు మీరు లేవు. 'నా స్వయం, నీ స్వయం అని ఎవరూ అనరు. ఈ ఆలోచనలు అనుభావికమైనవి, తాత్కాలికమైనవి, సాపేక్షమైనవి, వ్యక్తిత్వ చైతన్యంతో అనుసంధానించబడినవి. స్వయం ఒక వ్యక్తి కాదు, అది ఉన్నత జీవి - సూపర్-పర్సన్. ఈ విశ్లేషణ ద్వారా మీరు ఇప్పుడు చేరుకున్న స్థాయి కంటే మీరు తెలుసు కోవలసినది ఇంకా ఉందని నేను చెప్తున్నాను. ఈ గొప్ప విషయం ఏమిటో అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. మీ లోతైన ఆత్మను తెలుసుకోవడం అనేది భగవంతుని గురించి తెలుసుకోవడంతో సమానంగా ఉంటుంది.*

*అది వినడానికి భయానకంగా ఉంటుంది! నా ఉనికి యొక్క లోతైన స్థాయిని తెలుసుకోవడం భగవంతుడిని తెలుసుకోవడం ఎలా అవుతుంది? మీకు భగవంతుడు సమగ్ర సర్వశక్తిమంతుడు, విశ్వవ్యాప్తమైన సర్వవ్యాపి అనే ఆలోచన ఉంది. నా ఉనికి యొక్క లోతైన స్థాయిలో అతను నా స్వంత హృదయంలో నిలబడి ఉన్నాడా? అలాంటప్పుడు దేవుడితో నా సంబంధం ఏమిటి? ఆ లోతైన స్థాయిలో మీరు పరిపూర్ణత యొక్క భావాన్ని కలిగి ఉంటారని తెలిసిన తర్వాత, మీకు మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్న ఇప్పటికి కొనసాగుతుంది. అది తదుపరి దశ. ఇప్పటి వరకు మనం ఏదైతే చర్చిస్తున్నామో అది మొదటి అడుగు మాత్రమే. మనమింకా రెండవ స్థాయిని తాకలేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 308 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 3. The Self is not a Person, It is a Super-person 🌻*

*In the ultimate existence, there is no he, she, it, I and you. Nobody will say “my Self, your Self,” etc. These ideas are empirical, tentative, relative, connected with personality-consciousness, and the Self is not a person, it is a Super-Person. I am giving a hint that there is something more for you to know than the level you have reached now by this analysis. It will take some time even to understand what this great thing is. Knowing your deepest Self is identical with knowing God Himself.*

*That will be a terrifying thing to hear! How will knowing the deepest level of my being be the same thing as knowing God? You have an idea of God as the comprehensive Almighty, the universal omnipresent Being. Is He planted in my own heart at the deepest level of my being? Then what is my relationship with God? After having known that in that deepest level you will have a sense of completeness, the question still persists as to what the relationship is between yourself and God. That is the next step. Whatever we have been discussing up to this time is the first step only. We have not touched the second level.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 208 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. దాన్ని కనిపెట్టాలి. కారణం అది అప్పటికే మన దగ్గరుంది. కానీ ఆ విషయం గురించి మనకు స్పష్టత లేదు. మనం మరింత చురుగ్గా, మరింత చైతన్యవంతంగా మారాలి. 🍀*

*ప్రతి మనిషీ తన అస్తిత్వంతో బాటు సత్యాన్ని వెంట తెచ్చుకుంటాడు. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. దాన్ని కనిపెట్టాలి. లేదా తిరిగి కనిపెట్టాలి. కారణం అది అప్పటికే మన దగ్గరుంది. మనలో వుంది. కానీ ఆ విషయం గురించి మనకు స్పష్టత లేదు. మనం నిద్రలోకి జారుకుని ఆ విషయమే మరిచిపోయాం. మనం దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవాలి. మనం మరింత చురుగ్గా, మరింత చైతన్యవంతంగా మారాలి. ఏదీ కోల్పోలేదు. నువ్వు నిద్రలో వున్నావు. అంటే నువ్వు బిచ్చగాడినని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బిచ్చగాడివి కావు.*

*ఒకసారి నువ్వు నిద్రలేస్తే, మత్తు వదిలించుకుంటే నువ్వెంత పనికిమాలిన కలగన్నావో తెలుసుకుని ఆశ్చర్యపోతావు. నీలో గొప్ప నిధులున్నాయి. నీది శాశ్వతమయిన జీవితం. దేవుని రాజ్యం నీలో వుంది. అంతిమ సత్యం నీదే. అది మనతో బాటు మనం వెంట తెచ్చుకున్నది. మనమే అది! కాబట్టి యిది ఎక్కడో అన్వేషించాల్సింది, వెతకాల్సింది కాదు. నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించి నువ్వు మేలుకోవాలి. అంతే!*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹