శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 404 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 404 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 404 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 404 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀

🌻 404. 'భక్తహార్ద తమోభేద భానుమత్ భానుసంతతిః' - 1 🌻


భక్తుల హృదయములందుండు తమస్సును భేదించుటలో సూర్యుని వలెనూ, సూర్యకిరణముల పరంపరవలెనూ నుండునది శ్రీమాత అని అర్ధము. సత్త్వ రజస్తమో గుణములలో తమస్సు నీచమైనది. అనగా అథమ గుణము. తమస్సు అనగా అజ్ఞానమను చీకటి. అది జీవులలో బద్దకముగను, మొద్దు నిద్రగను, మరుపుగను, అశ్రద్దగను, నిర్లక్ష్యముగను, తిండిపోతు తనముగను గోచరించును. ఈ అలవాట్లకు లొంగినవారు అజ్ఞానమను చీకటి యందు పెనగులాడు చుందురు. కుంభకర్ణుడు దీనికి ఉదాహరణము.

తమోగుణము ప్రధానముగ నున్నప్పుడు దివ్య విషయముల యందు అనాసక్తియే కాక నిరాదరణ కూడ యుండును. హేళన భావ ముండును. ఇట్టివారు వెలుగును కూడ నిరాకరింతురు. వీరికి సూర్యుని వెలుగు సరిపడదు. సూర్య కాంతిలో తిరుగాడునప్పుడు త్వరితముగ అలసిపోవుదురు. ఉదయించు సూర్యుని కాంతికి వీరెన్నడునూ ఉన్ముఖులు కాలేరు. ఆ సమయమున వీరిని నిద్రాదేవి ఆవరించి యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 404 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻

🌻 404. 'Bhaktaharda Tamobheda Bhanumat Bhanusantatih' - 1 🌻


It means that Sri Mata is like the Sun and the sunrays which will break the tamas in the hearts of disciples. Tamas is the lowest among the trigunas namely sattva rajas and tamas qualities. That means it is the worst. Tamas means ignorance and darkness. It expresses itself as laziness, the dull, sleepy, forgetful, heedless, negligent, the gluttonous among living beings. Those who succumb to these habits wallow in the darkness of ignorance. Kumbhakarna is an example of this.

When tamas is dominant, there is not only apathy but also disdain for divine things. There shall be a sense of sarcasm towards things. These people deny also the light. They cannot tolerate the Sun light. They get tired quickly when walking in the sunlight. They might never have seen the sunrise or the morning sunrays. At that time sleep would be covering them.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 244. ధర్మం / Osho Daily Meditations - 244. VIRTUE


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 244 / Osho Daily Meditations - 244 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 244. ధర్మం 🍀

🕉. ప్రజలు మేలు చేసే వారుగా ఉంటారు. అది నిజమైన ధర్మం కాదు -- మభ్యపెట్టుకోవడం. 🕉


మంచి పనులు చేయడం గౌరవాన్ని తెస్తుంది, అది మీకు మంచి అహంభావాన్ని ఇస్తుంది. ఇది మీరు ముఖ్యమైన వ్యక్తి అని మీకు అనిపించేలా చేస్తుంది:, ప్రపంచంలోని దృష్టిలో మాత్రమే కాకుండా దేవుని దృష్టిలో కూడా అనుకుంటారు. మీరు చేసిన అన్ని మంచి పనులను మీరు చూపించి, భగవంతుడిని కూడా మీరు నిటారుగా నిలబడి ఎదుర్కొంటారు. ఇది మనం చూపించే అహంకారం, కానీ భక్తి తత్వం, మతతత్వం అహంకారమైనది కాదు.

మతపరమైన వ్యక్తి అనైతికమని కాదు, కానీ అతను నైతికత లేని వాడుగా ఉంటాడు. అతనికి స్థిరమైన పాత్ర అంటూ వుండదు. అతని పాత్ర ప్రవహించేదిగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది, క్షణం క్షణం మారిపోతూ ఉంటుంది. అతను స్థిరమైన వైఖరి, ఆలోచన లేదా భావజాలం ప్రకారం కాకుండా పరిస్థితులకు ప్రతిస్పందిస్తాడు; అతను కేవలం తన స్పృహ నుండి స్పందిస్తాడు. అతని స్పృహ మాత్రమే అతని పాత్ర. ఇతర పాత్రలు ఏవీ అతనికి ఉండవు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 244 🌹

📚. Prasad Bharadwaj

🍀 244. VIRTUE 🍀

🕉. People become do-gooders. That is not true virtue-- is a camouflage. 🕉

Doing good things brings respectability, it gives you a good ego feeling. It makes you feel that you are somebody important:, significant-not only in the eyes of the world but also in the eyes of God-that you can stand upright, even encountering God; you can show all the good deeds that you have done.

It is egoistic, and religiousness cannot be egoistic. Not that a religious person is immoral, but he is not moral--he is amoral. He has no fixed character. His character is liquid, alive, moving moment to moment. He responds to situations not according to a fixed attitude, idea, or ideology; he simply responds out of his consciousness. His consciousness is his only character, there is no

other character.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 109 / Agni Maha Purana - 109


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 109 / Agni Maha Purana - 109 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 34

🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 3🌻


వర్ధనిలో కూడ బంగారు ముక్క ఉంచవలెను. దానిపై అస్త్రపూజ చేసి, దాని ఎడమ భాగమున, సమీపమునందే వాస్తులక్ష్మీ-భూవినాయకులను పూజింపవలెను. సంక్రాంత్యాదికాలములందు ఈ విధముగనే శ్రీమహావిష్ణువు స్నానాభిషేకముల ఏర్పాటు చేయవలెను.

మండపము యొక్క కోణములందును, దిక్కులందును ఎనిమిది కలశములను, మధ్యయందు ఒక కలశమును- మొత్తము భద్రములు లేని తొమ్మిది కలశములు-ఉంచి, వాటిలో పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పంచగవ్యములు వేయవలెను. పూర్వాదికలశములలో పైన చెప్పిన పస్తువులను, అగ్నికోణాదులందలి కలశములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృతయుక్తజలమును వేయవలెను. పెరుగు, పాలు, తేనె, వేడినీళ్ళు- ఇవి పాద్యాంగములు.

కమలములు, శ్యామాకము, దూర్వాదలములు, విష్ణుక్రాన్తోషధి అను నాలుగు వస్తులతో కూడిన జలము పాద్య మని చెప్పబడును, అర్ఘ్యమునకు కూడ ఎనిమిది అంగములు చెప్పబడినవి. అర్ఘముకొరకు యవలు, గంధము, ఫలములు, అక్షతలు, కుశలు, ఆవాలు, పుష్పములు, తిలలు సమకూర్చుకొనవలెను. జాతీ-లవంగ-కంకోలములతో కూడిన జలమును ఆచమనీయముగా ఇవ్వవలెను.

ఇష్టదేవతకు, మూలమంత్రము చదువుచు, పంచామృతస్నానము చేయించవలెన. మధ్య నున్న కలశమునుండి శుద్ధోదకమును గ్రహించి దేవుని శిరముపై చల్లవలెను. కలశనుండి వచ్చు జలమును, కూర్చాగ్రమును స్పృశింపవలెను. పిమ్మట శుద్ధోదకముతో పాద్య-అర్ఘ్య-ఆచమనీయములు సమర్పింపవలెను. వస్త్రముచే దేవతామూర్తిని తుడిచి, వస్త్రధారణము చేయించి, సవస్త్రకముగ మండలముమీదికి దీసికొని వెళ్ళవలెను.

అచట బాగుగా పూజచేసి, ప్రాణాయామపూర్వకముగ కుండాదులలో హోమము చేయవలెను. (హవనవిధానము) : రెండు చేతులు కడిగికొని, అగ్నికుండమునందు గాని, చేదిపై గాని మూడు పూర్వాగ్రరేఖలు గీయవలెను. వాటిని దక్షిణమునుండి ప్రారంభించి, ఉత్తరము వైపు గీయవలెను. మరల వాటిపై మూడు ఉత్తరాగ్రరేఖలు గీయవలెను. (వీటిని కూడ కుడినుండి ప్రారంభించి ఎడమకు గీయవలెను).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 109 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 34

🌻 Mode of performing oblation - 3 🌻


17. One should worship the goddess of the building and the presiding deity of obstacles near it. In the same way, one should arrange for the consecration of Viṣṇu on the days of movement (of the sun from one stellar place to another), and other days (of importance).

18. Nine dentless jars full of water should be placed in the nine corners. One should offer water for washing the feet, arghya for rinsing the mouth and the pañcagavya.

19. The five sweet things, water etc. (are placed) in the east, north-east etc. The curd, milk, honey and hot water are the four constituents for the worship of the feet.

20. The lotus, śyāmāka (a kind of grain), dūrvā (grass) and the consort of Viṣṇu are for the worship of the feet. Together with barley seeds, perfumes, fruits and unbroken rice, this is spoken as constituting the eight articles for the worship of the feet.

21. The kuśa (grass), flowers of white mustard, sesamum (are) the articles (used) for adoration. One should offer waters for rinsing the mouth together with cloves and kaṅkola (berries).

22. One should bathe the deity with the five sweet materials along with (the recitation of) the principal mystic syllable. One should pour pure water on the head of the deity from the central pot.

23. The worshipper should touch water poured from the pitcher and the tip of the kūrcha (bunch of kuśa grass). One should offer pure water for washing the feet and arghya for sipping.

24. After having wiped the body with a cloth, the deity (adorned) with a cloth should be taken to the altar. Having worshipped him there, one should offer oblations in the sacrificial pit after having controlled breath.

25. Having washed hands, three lines running towards the east from the south to the north and three running towards the north are drawn.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


కపిల గీత - 70 / Kapila Gita - 70


🌹. కపిల గీత - 70 / Kapila Gita - 70🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 26 🌴


26. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణమ్
శాన్తఘోరవిమూఢత్వమితి వా స్యాదహఙ్కృతేః

ఈ అహంకారానికే కర్తృత్వం (నేను చేస్తున్నాను), కరణత్వం (నా ఇంద్రియములతో చేస్తున్నాను), కార్యత్వం (నేను చేస్తే పని అవుతుంది). దీనికే మరో మూడు పేర్లు శాంతం (ప్రకాశకత్వం- ఒక వస్తువును చూపుట), ఘోరత్వము (చిత్త విక్షేపము, ఒకే సారి ఎన్నో ఆలోచనలు రావడం), మూఢత్వం (ఇది ఫలానా అని తెలియకపోవడం). ఈ మూడూ అహంకారానికి ఉంటాయి.

సత్త్వగుణ సంబంధము చేత శాంతత్వము, రాజస గుణ సంబంధము వలన ఘోరత్వము, తామస గుణ సంబంధము వలన మూఢత్వము, అనునవియును దీని లక్షణములే.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 70 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 26 🌴


26. kartṛtvaṁ karaṇatvaṁ ca kāryatvaṁ ceti lakṣaṇam
śānta-ghora-vimūḍhatvam iti vā syād ahaṅkṛteḥ

kartṛtvam—being the doer; karaṇatvam—being the instrument; and kāryatvam—being the effect.

This false ego is characterized as the doer, as an instrument and as an effect. It is further characterized as serene, active or dull according to how it is influenced by the modes of goodness, passion and ignorance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹14, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : మహా భరణి, పంచమి శ్రద్ధ, Maha Bharani, Panchami Shraddha 🌺

🍀. నారాయణ కవచం - 18 🍀


26. త్వం తిగ్మధారాసివరారిసైన్య మీశప్రయుక్తో మమ ఛింధి ఛింధి |
చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మంచివాడు మరణించడం, అపజయం పొందడం - చెడ్డవాడు జీవించడం, విజయం పొందడం… వీటిని బట్టి ఈశ్వరతత్వం చెడ్డదన వలసినదేనా ? అవి మన పరమ శ్రేయస్సు కొరకే సంప్రాప్తం అయ్యాయి. మన చిత్తవృత్తులు మనలను వివేక భ్రష్టులను చెయ్యడం వలన, వాటి కిష్టం కాని ప్రతిదీ చెడ్డదని భావించడం మనకు పరిపాటి అయిపోయింది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: కృష్ణ చవితి 10:27:14 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: అశ్విని 06:58:07 వరకు

తదుపరి భరణి

యోగం: ధృవ 06:17:45 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: బాలవ 10:29:14 వరకు

వర్జ్యం: 02:54:20 - 04:31:48

మరియు 17:00:48 - 18:41:16

దుర్ముహూర్తం: 11:47:03 - 12:36:05

రాహు కాలం: 12:11:34 - 13:43:29

గుళిక కాలం: 10:39:39 - 12:11:34

యమ గండం: 07:35:48 - 09:07:43

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35

అమృత కాలం: 27:03:36 - 28:44:04

సూర్యోదయం: 06:03:52

సూర్యాస్తమయం: 18:19:16

చంద్రోదయం: 21:11:28

చంద్రాస్తమయం: 09:27:29

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మేషం

మృత్యు యోగం - మృత్యు భయం

06:58:07 వరకు తదుపరి కాల యోగం

- అవమానం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹