1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం 19-సెప్టెంబర్-2021 శ్రీ అనంత చతుర్థశి శుభాకాంక్షలు, శుభ ఆదివారం 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 255 🌹
3) 🌹. శివ మహా పురాణము - 454🌹
4) 🌹 వివేక చూడామణి - 131 / Viveka Chudamani - 131🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -83🌹
6) 🌹 Osho Daily Meditations - 73🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 131 / Sri Lalita Sahasranamavali - Meaning - 131🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ అనంత చతుర్థశి శుభాకాంక్షలు మరియు శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ బాల గణపతి ధ్యానం 🍀*
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ ||
*🍀. శ్రీ తరుణ గణపతి ధ్యానం 🍀*
పాశాంకుశాపూపకపిద్థజంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః ||
🌻 🌻 🌻 🌻 🌻
19 ఆదివారం, సెప్టెంబర్ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
తిథి: శుక్ల చతుర్దశి 29:29:59 వరకు తదుపరి పూర్ణిమ
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: శతభిషం 27:29:19 వరకు తదుపరి పూర్వాభద్రపద
యోగం: ధృతి 16:43:55 వరకు తదుపరి శూల
కరణం: గార 17:44:35 వరకు
వర్జ్యం: 10:35:24 - 12:11:56
దుర్ముహూర్తం: 16:37:27 - 17:26:08
రాహు కాలం: 16:43:32 - 18:14:50
గుళిక కాలం: 15:12:15 - 16:43:32
యమ గండం: 12:09:41 - 13:40:58
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 20:14:36 - 21:51:08
సూర్యోదయం: 06:04:32
సూర్యాస్తమయం: 18:14:50
వైదిక సూర్యోదయం: 06:08:05
వైదిక సూర్యాస్తమయం: 18:11:19
చంద్రోదయం: 17:27:26
చంద్రాస్తమయం: 04:24:15
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: కుంభం
ఆనందాదియోగం: రాక్షస యోగం - మిత్ర కలహం 27:29:19
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
పండుగలు : అనంత చతుర్ధశి, గణేష నిమజ్జనం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -255 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 2-2
*🍀 2-2. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀*
రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2
తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది.
వివరణము : నిజమగు రాజ రహస్యము ఎన్నిమార్లు తెలిపినను మరల రహస్యమై పోవుచుండును. అదెట్లనిన “నీవు చూచు జీవియందు, ప్రకృతి యందు ఈశ్వరుడున్నాడు. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. చూచుట మరతురు. "అన్నము బ్రహ్మ"మని తెలిపినను అన్నమునే చూతురు. బ్రహ్మమును చూడరు. “అంతయు బ్రహ్మమే" అని తెలిపినను బ్రహ్మము తప్ప ఇతరము చూతురు.
“నేను కాని దేమియు లేదు” అని ఎన్నిమార్లు తెలిపినను అన్యమును చూతురు గాని అనన్యత్వమును దర్శింపరు. విచిత్ర మేమనగ ఎన్నిమార్లు జ్ఞప్తి చేసినను మరుక్షణమే రహస్యమై పోవును. తెలుపకుండుట వలన రహస్యమునకు తావున్నది. తెలిపినను రహస్యమై పోవుట అత్యాశ్చర్యము కదా! కనుక భగవానుడు దీనిని నిజమగు రాజరహస్య మనిరి.
విచిత్రమేమనగ సత్యమును ప్రత్యక్షముగ తెలియవచ్చును. చూచునది, వినునది, రుచి చూచినది, వాసన చూచినది జీవుడు తాను అనుకొనును. కాని తనయందలి ఈశ్వరు డాధారముగ చూచుట, వినుట, రుచిచూచుట ఇత్యాదివి అనుభవించు చున్నాడు. తన యందలి సత్యమాధారముగనే ప్రత్యక్షానుభవము కలుగుచుండును. జీవునిలో శివుడున్నప్పుడే జీవుని కన్ని అనుభవములు. శివుడే లేనిచో శవమే మిగులును. శవమున కెట్టి అనుభూతియు లేదు. అట్లే చూడబడు సమస్త జీవులయందు, ప్రకృతి యందు సత్యముండును. సత్యమే శివము, సుందరము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 454🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 31
*🌻. శివ మాయ - 3 🌻*
వత్సలారా! సంహిప శక్యము కానిది, సంపదలను నశింపజేయునది, ఆపదలకు బీజభూతమైనది అగు శివనిందను నేను చేయజాలను (21). దేవతలారా! కైలాసమునకు పోయి, శంకరుని ప్రసన్నునిగా చేసుకొని, ఆయనను వెనువెంటనే హిమవంతుని గృహమునకు ప్రయాణము కట్టించుడు (22).
ఆయన పర్వతరాజు వద్దకు వెళ్లి ఆత్మనిందను చేయుగాక! పరనింద వినాశమును, ఆత్మనింద కీర్తిని కలిగించునని పెద్దలు చెప్పదరు (23). దేవతలు నా ఈ మాటను విని ఆనందముతో నాకు ప్రణమిల్లి పర్వత శ్రేష్ఠమగు కైలాసమునకు వెనువెంటనే పయనమైరి (24). ఆ దేవతలు అచటకు వెళ్లి శివుని చూచిరి. వారందరు తలలు వంచి, చేతులు జోడించి నమస్కరించి శివుని స్తుతించిరి (25).
దేవతలిట్లు పలికిరి -
ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! మేము నిన్ను శరణుజొచ్చితిమి. దయను చూపుము. నీకు నమస్కారమగుగాక! (26) ఓ స్వామీ! నీవు భక్తవత్సలుడవు. ఎల్ల వేళలా భక్తుల కార్యములను సిద్ధింపజేసెదవు. దీనుల నుద్ధరించు దయానిధివి నీవే. నీవు భక్తుల ఆపదలను తొలగించెదవు (27).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇంద్రాది దేవతలందరు మహేశ్వరుని ఇట్లు స్తుతించి, తరువాత జరిగిన వృత్తాంతమునంతనూ సాదరముగా నివేదించిరి (28). దేవతల ఆ మాటలను విని ఆ మహేశ్వరుడు అంగీకరించెను. ఆయన నవ్వి, దేవతలనోదార్చి వారిని పంపివేసెను (29). దేవతందరు ఆనందించి తమ కార్యము సిద్ధించినదని ఎరింగిన వారై, సదాశివుని కొనియాడుతూ తమ గృహములకు వెళ్లిరి (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 131 / Viveka Chudamani - 131🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 27. విముక్తి - 4 🍀*
431. ఇపుడు ఈ శరీరములో ఉన్నప్పటికి ఎవరు ‘నేను’ ‘నాది’ ఉన్న భావనలు కలిగిఉన్నప్పటికి అవి కేవలము నిడలు మాత్రమే. అవి విముక్తి పొందిన వ్యక్తి యొక్క గుణాలు.
432. గతములో అనుభవించిన సుఖాలలో మనస్సు లేకుండా, భవిష్యత్తు గూర్చి ఏ ఆలోచన లేకుండా, వర్తమానము గూర్చి కూడా ప్రత్యేక శ్రద్ద లేకుండా ఎవరైతే ఉంటారో అతడే విముక్తి పొందినవాడు.
433. ఈ ప్రపంచమును సమత్వ స్థితిలో ఎల్లపుడు ప్రతి చోటా గమనించగలరో, ఈ ప్రపంచము పూర్తిగా పంచభూతములతో ఏర్పడి, మంచి చెడులతో నిండి, ప్రకృతి కంటే వేరుగా ఒకదానికొకటి సంబంధము లేకుండా ఉన్నప్పటికి, వాటిని గమనిస్తూ ఉండే సాక్షిగా ఉండుట విముక్తి పొందిన వాని లక్షణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 131 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 27. Redemption - 4 🌻*
431. The absence of the ideas of "I" and "mine" even in this existing body which follows as a shadow, is a characteristic of one liberated-in-life.
432. Not dwelling on enjoyments of the past, taking no thought for the future and looking with indifference upon the present, are characteristics of one liberated-in-life.
433. Looking everywhere with an eye of equality in this world, full of elements possessing merits and demerits, and distinct by nature from one another, is a characteristic of one liberated-in-life.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 83 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 *సాధన- సమిష్టి జీవనము - 4* 🌻
సాధకులు ఆత్మవంచనకు పాల్పడరాదు. తాము తప్పు చేస్తే, ఎవరు చెప్పినా సర్దుకోవడానికి సిద్ధమయితే తమకే మంచిది. ఎవరు చెప్పారని కాదు, ఏమి చెప్పారనేది ముఖ్యము. అంతేకాని, తమ తప్పు తెలిసి కూడ, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఇతరులపై తప్పురుద్దటం మానుకోవాలి.
అసలు సంగతేమిటంటే, ఒక వ్యవహారంలో ఏంచేయాలి అనే అంశం ఎన్నివేల మంది సాధకులు కూర్చుండి గురువును ప్రార్థించినా ఒకటే సమాధానం తట్టుతుంది, సమర్పణ ఉంటే, సమిష్టి జీవన ప్రాధాన్యాన్ని గూర్చి కేకలు వేస్తూ, నినాదాలు ఇచ్చేవారు గూడ తద్భిన్నంగా వర్తిస్తుంటారు.
తోటి సాధకులతో గలసి పనిచేయాలంటే, ఒక్కోసారి అనేక మనోవికారాలు అడ్డు వస్తుంటాయి. తోటివారు ఎంతటి గుణసంపన్నులు, సేవానిమగ్నులు, పరిశుద్ధలయినాసరే, తమ కన్న పాండిత్యంలో, విజ్ఞానంలో లేదా సమాజంలో, ప్రసిద్ధిలో, వయస్సులో, కులములో తక్కువవారనే భావంతో వారితో కలిసి పనిచేయాడానికి అతిశయం అడ్డువస్తూ ఉంటుంది. తమ అతిశయాన్ని వెల్లడించలేక, అవతలివారి యందు దోషాలను ఎన్నడమూ జరుగుతూ ఉంటుంది.
ఇంకా కొందరు తమ ఇంట్లో పూజలు, కార్యక్రమాలు జరిగినపుడు ఉత్సాహంగా, చురుకుగా పాల్గొంటారు. తోటి సాధకుల ఇండ్లలో అవి ఏర్పాటయితే నీరుగారి పోతారు, యాంత్రికంగా పాల్గొంటారు లేదా అసలు పాల్గొనరు.
తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే దివ్యానంద స్పర్శ అందుతుంది..
....✍️ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 72 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 72. START AGAIN 🍀*
*🕉 Just look around: Whatever you have been doing, that is not the end. Open it up again, let the journey start again. Bring in new things sometimes bizarre, eccentric, sometimes almost crazy; they all help. 🕉*
All inventors are thought to be crazy people, eccentric. They are, because they go beyond the limit. They find their own path ways. They never walk on the superhighway, that is not for them; they move into the forest. There is danger: They may be lost, they may not be able to come back again to the crowd, they are losing contact with the herd .... Sometimes you may fail. I am not saying that you may not fail with the new there is always danger-but then there will be thrill. And that thrill is worth the risk—at any price it is worth it.
So either bring something new into the old work so that it becomes new and growing, is not mechanical but becomes organic, or change: Change the whole thing arid start doing something absolutely new. Go back to the ABCs and become a potter or a musician or a dancer or a vagabond- anything will do!
Ordinarily the mind will say that this is wrong-you are now established, you have a certain name, a certain fame, and so many people know you, your work is going well and is paying you well, things are settled, why bother? Your mind will say this. Never listen to the mind; the mind is in the service of death.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 131 / Sri Lalita Sahasranamavali - Meaning - 131 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 131. అష్టమూర్తి, రజాజైత్రీ, లోకయాత్రా విధాయినీ ।*
*ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా ॥ 131 ॥ 🍀*
🍀 662. అష్టమూర్తి :
8 రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
🍀 663. అజా :
పుట్టుకలేనిది
🍀 664. జైత్రీ :
సర్వమును జయించినది
🍀 665. లోకయాత్రావిధాయినీ :
లోకములను నియమించునది
🍀 666. ఏకాకినీ :
ఏకస్వరూపిణీ
🍀 667. భూమరూపా :
భూదేవిరూపము ధరించునది
🍀 668. నిర్ద్వైతా :
అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
🍀 669. ద్వైత వర్జితా :
ద్వైతభావము లేనిది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 131 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 131. Ashtamurtirajajaitri lokayatra vidhaeini*
*Ekakini bhumarupa nirvaita dvaitavarjita ॥ 131 ॥ 🌻*
🌻 662 ) Ashta moorthy -
She who has eight forms
🌻 663 ) Aja -
She who has not have birth
🌻 664) jethree -
She who has won over ignorance
🌻 665 ) Loka yathra vidahyini -
She who makes the world rotate(travel)
🌻 666 ) Ekakini -
She who is only herself and alone
🌻 667 ) Bhooma roopa -
She who is what we see , hear and understand
🌻 668 ) Nirdwaitha -
She who makes everything as one
🌻 669 ) Dwaitha varjitha -
She who is away from “more than one”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹