శ్రీ శివ మహా పురాణము - 454


🌹 . శ్రీ శివ మహా పురాణము - 454🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 31

🌻. శివ మాయ - 3 🌻


వత్సలారా! సంహిప శక్యము కానిది, సంపదలను నశింపజేయునది, ఆపదలకు బీజభూతమైనది అగు శివనిందను నేను చేయజాలను (21). దేవతలారా! కైలాసమునకు పోయి, శంకరుని ప్రసన్నునిగా చేసుకొని, ఆయనను వెనువెంటనే హిమవంతుని గృహమునకు ప్రయాణము కట్టించుడు (22).

ఆయన పర్వతరాజు వద్దకు వెళ్లి ఆత్మనిందను చేయుగాక! పరనింద వినాశమును, ఆత్మనింద కీర్తిని కలిగించునని పెద్దలు చెప్పదరు (23). దేవతలు నా ఈ మాటను విని ఆనందముతో నాకు ప్రణమిల్లి పర్వత శ్రేష్ఠమగు కైలాసమునకు వెనువెంటనే పయనమైరి (24). ఆ దేవతలు అచటకు వెళ్లి శివుని చూచిరి. వారందరు తలలు వంచి, చేతులు జోడించి నమస్కరించి శివుని స్తుతించిరి (25).

దేవతలిట్లు పలికిరి -

ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! మేము నిన్ను శరణుజొచ్చితిమి. దయను చూపుము. నీకు నమస్కారమగుగాక! (26) ఓ స్వామీ! నీవు భక్తవత్సలుడవు. ఎల్ల వేళలా భక్తుల కార్యములను సిద్ధింపజేసెదవు. దీనుల నుద్ధరించు దయానిధివి నీవే. నీవు భక్తుల ఆపదలను తొలగించెదవు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రాది దేవతలందరు మహేశ్వరుని ఇట్లు స్తుతించి, తరువాత జరిగిన వృత్తాంతమునంతనూ సాదరముగా నివేదించిరి (28). దేవతల ఆ మాటలను విని ఆ మహేశ్వరుడు అంగీకరించెను. ఆయన నవ్వి, దేవతలనోదార్చి వారిని పంపివేసెను (29). దేవతందరు ఆనందించి తమ కార్యము సిద్ధించినదని ఎరింగిన వారై, సదాశివుని కొనియాడుతూ తమ గృహములకు వెళ్లిరి (30).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 Sep 2021

No comments:

Post a Comment