శ్రీ లలితా సహస్ర నామములు - 151 / Sri Lalita Sahasranamavali - Meaning - 151

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 151 / Sri Lalita Sahasranamavali - Meaning - 151🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 151. సత్యజ్ఞానాఽనందరూపా, సామరస్య పరాయణా ।
కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ ॥ 151 ॥ 🍀

🍀 791. సత్యఙ్ఞానానందరూపా :
సచ్చిదానందరూపిణీ

🍀 792. సామరస్యాపరాయణా :
జీవుల యెడల సమరస భావముతో ఉండునది

🍀 793. కపర్ధినీ :
జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)

🍀 794. కళామాలా :
కళల యొక్క సమూహము

🍀 795. కామధుక్ :
కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది

🍀 796. కామరూపిణీ :
కోరిన రూపము ధరించునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 151 🌹

📚. Prasad Bharadwaj

🌻 151. Satyagynananandarupa samarsya parayana
Kapardini kalamala kamadhukamarupini ॥ 151 ॥ 🌻

🌻 791 ) Satya gnananda roopa -
She who is personification of truth, knowledge and happiness

🌻 792 ) Samarasya parayana -
She who stands in peace

🌻 793 ) Kapardhini -
She who is the wife of Kapardhi (Siva with hair)

🌻 794 ) Kalamala -
She who wears arts as garlands

🌻 795 ) Kamadhukh -
She who fulfills desires

🌻 796 ) Kama roopini -
She who can take any form.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 3 🌻

🌻 "సోహం భావేన పూజయెత్తి" (జీవయేత్) సోహం అనగా వాడే నేను దీనిని వీలైనన్ని ఎక్కువ మార్లు ధ్యానం చేయవలెను‌ ఇట్లు చేస్తుండగా చేయకూడని పనులు క్రమంగా మానేయటం జరుగుతుంది. తరువాత దేవుడు అనే అయస్కాంతం నీవు అనే ఇనుపముక్కను స్పృశిస్తుంది. చాలా తొందరలో నీవు కూడా అయస్కాంతంగా మారిపోతావు.

ఇది కాక పుస్తకాలు మాత్రమే చదివితే ఈ మార్పు రాదు. Magnetism అనే లావాటి పుస్తకాన్ని పుచ్చుకొని బల్ల మీద పెట్టి తాళం చెవితో ఆ పుస్తకాన్ని రుద్దినంత మాత్రన తాళం చెవి Magnet అవ్వదు కాని, Transformation రావాలి.

ఇలాంటి ఆపదల నుండి రక్షించటం కోసం సోహం అని ధ్యానం చేయటం కొసం శివ శబ్దాన్ని, రుద్రాభిషేకాన్ని కూడా మనకు పెద్దలు ఇచ్చారు. అనేక మార్గాలు ఇచ్చారు అందులో ఇదొకటి. దీని వలన జరిగే మార్పు దీనిని ఆచరించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది.

మనం రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు "నమకం" అనే మంత్రాన్ని ఇచ్చారు. ఈ నమకం అనే పేరు చాలా దిక్కుమాలిన పాడు పేరు. దాని పేరు అది కాదు. మనం సరియైన పేరు తెలుసుకోవాలి. ఇందులో నమః నమః అని ఉంటుంది కనుక ఎవడో పిచ్చివాడు దీనికి "నమకం" అని పేరు పెట్టేశాడు, అలాగే చమే చమే అని ఉన్నది కనుక "చమకం" అని పెట్టేశాడు. దీని అసలు పేరు రుద్రము లేక రుద్రసూక్తము. ఇది పరమ పవిత్రమైన పేరు.

ఈ రుద్రసూక్తము యజుర్వేదము అనే పరమ పవిత్ర గ్రంథములో ఉన్న మహామంత్రం.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2021

వివేక చూడామణి - 151 / Viveka Chudamani - 151

🌹. వివేక చూడామణి - 151 / Viveka Chudamani - 151🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -6 🍀

496. నాలో అనంతానంద స్థితి మహా సముద్రము వలె ఉన్నది. విశ్వము యొక్క అలలను సృష్టించుట, నాశనం చేయుట అనే మాయ యొక్క ఆటలకు నేనే కారకుడను.

497. స్థూల, సూక్ష్మ భావనలు తప్పుగా నాలో ఊహించబడినవి. ప్రజల వివిధ వస్తు భావనలకు ఆధారము నేనే. ఈ కనిపించని అనంత సమయము, విశ్వములో సంవత్సరాలు, ఋతువులు, నెలలు అన్నియూ కేవలము ఊహలు మాత్రమే.

498. ఈ స్థూల ప్రపంచమును అతిగా భావించిన తెలివి తక్కువ జనాలు, పదార్థమునకు కళంకము తేలేరు. ఎండమావులలోని అనంత జల రాశులు ఎడారులను తడపలేవు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 151 🌹

✍️ Sri Adi Shankaracharya

Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 6 🌻

496. In me, the ocean of Infinite Bliss, the waves of the universe are created and destroyed by the playing of the wind of Maya.

497. Such ideas as gross (or subtle) are erroneously imagined in me by people through the manifestation of things superimposed – just as in the indivisible and absolute time, cycles, years, half-years, seasons, etc., are imagined.

498. That which is superimposed by the grossly ignorant fools can never taint the substratum: The great rush of waters observed in a mirage never wets the desert tracts.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 474

🌹 . శ్రీ శివ మహా పురాణము - 474 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 35

🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 2 🌻

దర్ముడిట్లు పలికెను -

ఓ సుందరీ! నీ సౌందర్యము మనోహరము, రాజులకు తగినది. నీ ¸°వనము నూతన ప్రాయములో స్థిరమై యున్నది. ఓ సుందరీ! (11) ముసలి దనముచే వంగియున్న పిప్పలాద మహర్షి యొక్క ప్రక్కన నీవు ప్రకాశించుట లేదు సుమా! ఓ కృశాంగీ! నేను సత్యమునే పలుకు చున్నాను (12). సర్వదా తపస్సుల యందు నిమగ్నమై ఉండువాడు, జాలి లేనివాడు, మరణించుటకు సిద్ధముగ నున్నవాడు అగు ఆ విప్రుని వీడి నన్ను చూడుము. నేను రాజశ్రేష్ఠుడును. కామాకేళి యందు శూరుడను. మన్మథ పీడితుడను (13). స్త్రీకి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము యొక్క ఫలమే ఈ జన్మలో సౌందర్య రూపములో లభించును. ఆ సౌందర్యమంతయూ రసికుని కౌగిలించు కున్నచో సార్థక మగును (14).

ఓ సుందరీ! వేయి స్త్రీలకు భర్తను నేను. కామ శాస్త్రమునందు దిట్టను. ఆ భర్తను వీడి నన్ను నీ సేవకునిగా చేసుకొనుము (15). నిర్జనమగు అరణ్యములో, సుందరములగు పర్వతములలో, నదీ తీరముల యందు నాతో గూడి విహరించుము. ఈ జన్మను సఫలము చేసికొనుము (16).

వసిష్ఠుడిట్లు పలికెను-

ఇట్లు పలికి తన రథమునుండి క్రిందకు దిగి ఆమెను చేతితో పట్టు కొనుటకు తొందర పడుచున్న ఆ ధర్మునితో ఆ పతివ్రత ఇట్లనెను (17).

పద్మ ఇట్లు పలికెను -

దూరముగా పొమ్ము. మానవాధమా! దూరముగా పొమ్ము. నీవు పాపాత్ముడవు. నన్ను కామ దృష్టితో చూచినచో నీవు వెంటనే నశించెదవు (18). మునిశ్రేష్ఠుడు, తపస్సుచే పవిత్రమైన దేహము గలవాడు అగు పిప్పలాద మహర్షిని విడిచి పెట్టి, స్త్రీలచే జయింపబడి మన్మథకేళి యను లంపటమునందు తగుల్కొని యున్న నిన్ను ఎట్లు సేవించెదను? (19)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2021

గీతోపనిషత్తు -275

🌹. గీతోపనిషత్తు -275 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 12-2

🍀 12-2. కర్తవ్య కర్మ - భగవద్గీత యందు "ఉపదేక్షంతితే జ్ఞానం", "ఉపదేక్షంతితే అజ్ఞానం" అను ద్వివిధములగు అవగాహన తెలుప బడినది. జ్ఞానము తెలిసినచో అజ్ఞాన మేమో తెలుయును. అట్లే అజ్ఞానమేమో తెలిసినచో జ్ఞానమేమో తెలుయును. మోహము చేతను, ఆశ చేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు. కానీ మానవునకు విచక్షణ ప్రధానముగ ఈయబడినది. దానిని వినియోగించుచు కర్తవ్యమునే ఆశ్రయించవలెను. కోరికల నాశ్రయించ రాదు. 🍀

మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12

తాత్పర్యము : మోహము చేతను, ఆశ చేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.

వివరణము : మానవునకు విచక్షణ ప్రధానముగ ఈయబడినది. దానిని వినియోగించుచు కర్తవ్యమునే ఆశ్రయించవలెను. కోరికల నాశ్రయించ రాదు. ఈ ప్రధానమగు సూత్రము ప్రాథమిక అధ్యాయములలోనే తెలుపబడినది. ఆ సూత్రమును త్యజించినచో కలుగు పతనము కూడ తెలుపబడినది. అదే విషయమును 'గీత' మధ్యమున మరియొక మారు గుర్తుచేయుట జరిగినది. ఈ శ్లోకము భగవద్గీతయందలి నడిమి శ్లోకమై యున్నది. ఏడువందల (700) శ్లోకములతో విరాజిల్లుచున్న భగవద్గీతయందు ఇది (350) మూడువందల యాబదియవ శ్లోకం. విచిత్రమేమనగ జ్ఞానమునకు పరాకాష్ఠగ విరాజిల్లుచున్న భగవద్గీతయందు, ఈ శ్లోకమున అజ్ఞాన స్వరూప స్వభావములు తెలుపబడినవి.

నిజమునకు అజ్ఞానమేమో తెలిసినచో అపుడు జ్ఞానము కూడ తెలుయును. “ఇది చేయరాని పని" అని తెలిసినపుడు దానిని చేయకుండుట వలన కూడ మనిషి చేయవలసిన పనియందే యుండును. అజ్ఞాన స్వరూపము తెలిసినచో ఇక మిగులునది జ్ఞానమే గదా! భగవద్గీత యందే "ఉపదేక్షంతితే జ్ఞానం", "ఉపదేక్షంతితే అజ్ఞానం" అను ద్వివిధములగు అవగాహన తెలుప బడినది. జ్ఞానము తెలిసినచో అజ్ఞాన మేమో తెలుయును. అట్లే అజ్ఞానమేమో తెలిసినచో జ్ఞానమేమో తెలుయును. బియ్యపు గింజల యందు బిడ్డలు కలిసి యుండును. అందు బియ్య మేరుకొన్న బిడ్డలు మిగిలిపోవును. లేదా, బెడ్డ లేరుకొన్నచో బియ్యము మిగులును. అట్లే సృష్టి యందు జ్ఞానా జ్ఞానములు బియ్యము బిడ్డలుగ కలిసి యుండును. అందేది తెలిసినను రెండవది కూడ స్పష్టముగ తెలుయును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2021

13-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, శని వారం, నవంబర్ 2021  స్థిర వారము 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 274 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 474 🌹 
4) 🌹 వివేక చూడామణి - 151 / Viveka Chudamani - 151🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -103🌹  
6) 🌹 Osho Daily Meditations - 92🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 151 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 151🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*13, నవంబర్‌ 2021, స్థిరవారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 9వ రోజు 🍀*

*నిషిద్ధములు: నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి*
*దానములు: మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు*
*పూజించాల్సిన దైవము: అష్టవసువులు - పితృ దేవతలు*
*జపించాల్సిన మంత్రము: ఓం అమృతాయ స్వాహా -పితృదేవతాభ్యో నమః*
*ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: శుక్ల-దశమి 29:49:55 వరకు 
తదుపరి శుక్ల-ఏకాదశి 
నక్షత్రం: శతభిషం 15:26:31 వరకు 
తదుపరి పూర్వాభద్రపద
యోగం: వ్యాఘత 26:15:51 వరకు 
తదుపరి హర్షణ
కరణం: తైతిల 17:39:56 వరకు
వర్జ్యం: 22:06:52 - 23:47:20
దుర్ముహూర్తం: 07:50:37 - 08:36:00
రాహు కాలం: 09:10:03 - 10:35:08
గుళిక కాలం: 06:19:51 - 07:44:57
యమ గండం: 13:25:19 - 14:50:25
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 08:03:42 - 09:41:46
సూర్యోదయం: 06:19:51
సూర్యాస్తమయం: 17:40:36
వైదిక సూర్యోదయం: 06:23:36
వైదిక సూర్యాస్తమయం: 17:36:51
చంద్రోదయం: 14:07:14
చంద్రాస్తమయం: 01:09:49
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 15:26:31 
వరకు తదుపరి కాలదండ యోగం - 
మృత్యు భయం 
*పండుగలు : కంస వధ, Kansa Vadh*
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -275 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 12-2
 
*🍀 12-2. కర్తవ్య కర్మ - భగవద్గీత యందు "ఉపదేక్షంతితే జ్ఞానం", "ఉపదేక్షంతితే అజ్ఞానం" అను ద్వివిధములగు అవగాహన తెలుప బడినది. జ్ఞానము తెలిసినచో అజ్ఞాన మేమో తెలుయును. అట్లే అజ్ఞానమేమో తెలిసినచో జ్ఞానమేమో తెలుయును. మోహము చేతను, ఆశ చేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు. కానీ మానవునకు విచక్షణ ప్రధానముగ ఈయబడినది. దానిని వినియోగించుచు కర్తవ్యమునే ఆశ్రయించవలెను. కోరికల నాశ్రయించ రాదు. 🍀*

*మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |*
*రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12*

*తాత్పర్యము : మోహము చేతను, ఆశ చేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.* 

వివరణము : మానవునకు విచక్షణ ప్రధానముగ ఈయబడినది. దానిని వినియోగించుచు కర్తవ్యమునే ఆశ్రయించవలెను. కోరికల నాశ్రయించ రాదు. ఈ ప్రధానమగు సూత్రము ప్రాథమిక అధ్యాయములలోనే తెలుపబడినది. ఆ సూత్రమును త్యజించినచో కలుగు పతనము కూడ తెలుపబడినది. అదే విషయమును 'గీత' మధ్యమున మరియొక మారు గుర్తుచేయుట జరిగినది. ఈ శ్లోకము భగవద్గీతయందలి నడిమి శ్లోకమై యున్నది. ఏడువందల (700) శ్లోకములతో విరాజిల్లుచున్న భగవద్గీతయందు ఇది (350) మూడువందల యాబదియవ శ్లోకం. విచిత్రమేమనగ జ్ఞానమునకు పరాకాష్ఠగ విరాజిల్లుచున్న భగవద్గీతయందు, ఈ శ్లోకమున అజ్ఞాన స్వరూప స్వభావములు తెలుపబడినవి. 

నిజమునకు అజ్ఞానమేమో తెలిసినచో అపుడు జ్ఞానము కూడ తెలుయును. “ఇది చేయరాని పని" అని తెలిసినపుడు దానిని చేయకుండుట వలన కూడ మనిషి చేయవలసిన పనియందే యుండును. అజ్ఞాన స్వరూపము తెలిసినచో ఇక మిగులునది జ్ఞానమే గదా! భగవద్గీత యందే "ఉపదేక్షంతితే జ్ఞానం", "ఉపదేక్షంతితే అజ్ఞానం" అను ద్వివిధములగు అవగాహన తెలుప బడినది. జ్ఞానము తెలిసినచో అజ్ఞాన మేమో తెలుయును. అట్లే అజ్ఞానమేమో తెలిసినచో జ్ఞానమేమో తెలుయును. బియ్యపు గింజల యందు బిడ్డలు కలిసి యుండును. అందు బియ్య మేరుకొన్న బిడ్డలు మిగిలిపోవును. లేదా, బెడ్డ లేరుకొన్నచో బియ్యము మిగులును. అట్లే సృష్టి యందు జ్ఞానా జ్ఞానములు బియ్యము బిడ్డలుగ కలిసి యుండును. అందేది తెలిసినను రెండవది కూడ స్పష్టముగ తెలుయును. 

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 474 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 35

*🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 2 🌻*

దర్ముడిట్లు పలికెను -

ఓ సుందరీ! నీ సౌందర్యము మనోహరము, రాజులకు తగినది. నీ ¸°వనము నూతన ప్రాయములో స్థిరమై యున్నది. ఓ సుందరీ! (11) ముసలి దనముచే వంగియున్న పిప్పలాద మహర్షి యొక్క ప్రక్కన నీవు ప్రకాశించుట లేదు సుమా! ఓ కృశాంగీ! నేను సత్యమునే పలుకు చున్నాను (12). సర్వదా తపస్సుల యందు నిమగ్నమై ఉండువాడు, జాలి లేనివాడు, మరణించుటకు సిద్ధముగ నున్నవాడు అగు ఆ విప్రుని వీడి నన్ను చూడుము. నేను రాజశ్రేష్ఠుడును. కామాకేళి యందు శూరుడను. మన్మథ పీడితుడను (13). స్త్రీకి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము యొక్క ఫలమే ఈ జన్మలో సౌందర్య రూపములో లభించును. ఆ సౌందర్యమంతయూ రసికుని కౌగిలించు కున్నచో సార్థక మగును (14).

ఓ సుందరీ! వేయి స్త్రీలకు భర్తను నేను. కామ శాస్త్రమునందు దిట్టను. ఆ భర్తను వీడి నన్ను నీ సేవకునిగా చేసుకొనుము (15). నిర్జనమగు అరణ్యములో, సుందరములగు పర్వతములలో, నదీ తీరముల యందు నాతో గూడి విహరించుము. ఈ జన్మను సఫలము చేసికొనుము (16).

వసిష్ఠుడిట్లు పలికెను-

ఇట్లు పలికి తన రథమునుండి క్రిందకు దిగి ఆమెను చేతితో పట్టు కొనుటకు తొందర పడుచున్న ఆ ధర్మునితో ఆ పతివ్రత ఇట్లనెను (17).

పద్మ ఇట్లు పలికెను -

దూరముగా పొమ్ము. మానవాధమా! దూరముగా పొమ్ము. నీవు పాపాత్ముడవు. నన్ను కామ దృష్టితో చూచినచో నీవు వెంటనే నశించెదవు (18). మునిశ్రేష్ఠుడు, తపస్సుచే పవిత్రమైన దేహము గలవాడు అగు పిప్పలాద మహర్షిని విడిచి పెట్టి, స్త్రీలచే జయింపబడి మన్మథకేళి యను లంపటమునందు తగుల్కొని యున్న నిన్ను ఎట్లు సేవించెదను? (19)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 151 / Viveka Chudamani - 151🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 31. ఆత్మ దర్శనం -6 🍀*

496. నాలో అనంతానంద స్థితి మహా సముద్రము వలె ఉన్నది. విశ్వము యొక్క అలలను సృష్టించుట, నాశనం చేయుట అనే మాయ యొక్క ఆటలకు నేనే కారకుడను. 

497. స్థూల, సూక్ష్మ భావనలు తప్పుగా నాలో ఊహించబడినవి. ప్రజల వివిధ వస్తు భావనలకు ఆధారము నేనే. ఈ కనిపించని అనంత సమయము, విశ్వములో సంవత్సరాలు, ఋతువులు, నెలలు అన్నియూ కేవలము ఊహలు మాత్రమే. 

498. ఈ స్థూల ప్రపంచమును అతిగా భావించిన తెలివి తక్కువ జనాలు, పదార్థమునకు కళంకము తేలేరు. ఎండమావులలోని అనంత జల రాశులు ఎడారులను తడపలేవు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 151 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 6 🌻*

496. In me, the ocean of Infinite Bliss, the waves of the universe are created and destroyed by the playing of the wind of Maya.

497. Such ideas as gross (or subtle) are erroneously imagined in me by people through the manifestation of things superimposed – just as in the indivisible and absolute time, cycles, years, half-years, seasons, etc., are imagined.

498. That which is superimposed by the grossly ignorant fools can never taint the substratum: The great rush of waters observed in a mirage never wets the desert tracts.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 3 🌻*

*🌻 "సోహం భావేన పూజయెత్తి" (జీవయేత్) సోహం అనగా వాడే నేను దీనిని వీలైనన్ని ఎక్కువ మార్లు ధ్యానం చేయవలెను‌ ఇట్లు చేస్తుండగా చేయకూడని పనులు క్రమంగా మానేయటం జరుగుతుంది. తరువాత దేవుడు అనే అయస్కాంతం నీవు అనే ఇనుపముక్కను స్పృశిస్తుంది. చాలా తొందరలో నీవు కూడా అయస్కాంతంగా మారిపోతావు.* 

*ఇది కాక పుస్తకాలు మాత్రమే చదివితే ఈ మార్పు రాదు. Magnetism అనే లావాటి పుస్తకాన్ని పుచ్చుకొని బల్ల మీద పెట్టి తాళం చెవితో ఆ పుస్తకాన్ని రుద్దినంత మాత్రన తాళం చెవి Magnet అవ్వదు కాని, Transformation రావాలి.* 

*ఇలాంటి ఆపదల నుండి రక్షించటం కోసం సోహం అని ధ్యానం చేయటం కొసం శివ శబ్దాన్ని, రుద్రాభిషేకాన్ని కూడా మనకు పెద్దలు ఇచ్చారు. అనేక మార్గాలు ఇచ్చారు అందులో ఇదొకటి. దీని వలన జరిగే మార్పు దీనిని ఆచరించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది.* 

*మనం రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు "నమకం" అనే మంత్రాన్ని ఇచ్చారు. ఈ నమకం అనే పేరు చాలా దిక్కుమాలిన పాడు పేరు. దాని పేరు అది కాదు. మనం సరియైన పేరు తెలుసుకోవాలి. ఇందులో నమః నమః అని ఉంటుంది కనుక ఎవడో పిచ్చివాడు దీనికి "నమకం" అని పేరు పెట్టేశాడు, అలాగే చమే చమే అని ఉన్నది కనుక "చమకం" అని పెట్టేశాడు. దీని అసలు పేరు రుద్రము లేక రుద్రసూక్తము. ఇది పరమ పవిత్రమైన పేరు.* 

*ఈ రుద్రసూక్తము యజుర్వేదము అనే పరమ పవిత్ర గ్రంథములో ఉన్న మహామంత్రం.*

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 92 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 92. SIMPLE HEART 🍀*

*🕉 To be simple means shifting from the head to the heart. 🕉*

Mind is very cunning; it is never simple. The heart is never cunning, it is always simple. To be simple means shifting from the head to the heart. We live through the head. That's why our life becomes more and more complicated, more and more like a jigsaw puzzle: Nothing seems to fit. And the more we try to be clever, the more in a mess we are. That has been our history: We have gone more and more insane. Now the whole earth is almost like a madhouse. The time has come, if humanity is to survive at all, for a great shift to happen: 

We have to move from the head to the heart. Otherwise, the head is ready to commit suicide. It has created so much misery and so much boredom and so many problems that suicide seems the only way out. The whole earth is preparing for suicide. It is going to be a global suicide, unless a miracle happens. And this is going to be the miracle-if it happens, this is the miraclethere will be a great shift, a radical change, in our very outlook: We will start living from the heart. We will drop the whole universe of the mind, and we will start afresh like small children. Live from the heart. Feel more, think less, be more sensitive and less logical. Be more and more heartful, and your life will become a sheer joy

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 151 / Sri Lalita Sahasranamavali - Meaning - 15 1🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 151. సత్యజ్ఞానాఽనందరూపా, సామరస్య పరాయణా ।*
*కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ ॥ 151 ॥ 🍀*

🍀 791. సత్యఙ్ఞానానందరూపా :
 సచ్చిదానందరూపిణీ 

🍀 792. సామరస్యాపరాయణా : 
జీవుల యెడల సమరస భావముతో ఉండునది 

🍀 793. కపర్ధినీ : 
జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు) 

🍀 794. కళామాలా : 
కళల యొక్క సమూహము 

🍀 795. కామధుక్ : 
కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
 
🍀 796. కామరూపిణీ : 
కోరిన రూపము ధరించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 151 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 151. Satyagynananandarupa samarsya parayana*
*Kapardini kalamala kamadhukamarupini ॥ 151 ॥ 🌻*

🌻 791 ) Satya gnananda roopa -   
She who is personification of truth, knowledge and happiness

🌻 792 ) Samarasya parayana -   
She who stands in peace

🌻 793 ) Kapardhini -   
She who is the wife of Kapardhi (Siva with hair)

🌻 794 ) Kalamala -  
 She who wears arts as garlands

🌻 795 ) Kamadhukh -   
She who fulfills desires

🌻 796 ) Kama roopini -   
She who can take any form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹