మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 103 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 3 🌻

🌻 "సోహం భావేన పూజయెత్తి" (జీవయేత్) సోహం అనగా వాడే నేను దీనిని వీలైనన్ని ఎక్కువ మార్లు ధ్యానం చేయవలెను‌ ఇట్లు చేస్తుండగా చేయకూడని పనులు క్రమంగా మానేయటం జరుగుతుంది. తరువాత దేవుడు అనే అయస్కాంతం నీవు అనే ఇనుపముక్కను స్పృశిస్తుంది. చాలా తొందరలో నీవు కూడా అయస్కాంతంగా మారిపోతావు.

ఇది కాక పుస్తకాలు మాత్రమే చదివితే ఈ మార్పు రాదు. Magnetism అనే లావాటి పుస్తకాన్ని పుచ్చుకొని బల్ల మీద పెట్టి తాళం చెవితో ఆ పుస్తకాన్ని రుద్దినంత మాత్రన తాళం చెవి Magnet అవ్వదు కాని, Transformation రావాలి.

ఇలాంటి ఆపదల నుండి రక్షించటం కోసం సోహం అని ధ్యానం చేయటం కొసం శివ శబ్దాన్ని, రుద్రాభిషేకాన్ని కూడా మనకు పెద్దలు ఇచ్చారు. అనేక మార్గాలు ఇచ్చారు అందులో ఇదొకటి. దీని వలన జరిగే మార్పు దీనిని ఆచరించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది.

మనం రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు "నమకం" అనే మంత్రాన్ని ఇచ్చారు. ఈ నమకం అనే పేరు చాలా దిక్కుమాలిన పాడు పేరు. దాని పేరు అది కాదు. మనం సరియైన పేరు తెలుసుకోవాలి. ఇందులో నమః నమః అని ఉంటుంది కనుక ఎవడో పిచ్చివాడు దీనికి "నమకం" అని పేరు పెట్టేశాడు, అలాగే చమే చమే అని ఉన్నది కనుక "చమకం" అని పెట్టేశాడు. దీని అసలు పేరు రుద్రము లేక రుద్రసూక్తము. ఇది పరమ పవిత్రమైన పేరు.

ఈ రుద్రసూక్తము యజుర్వేదము అనే పరమ పవిత్ర గ్రంథములో ఉన్న మహామంత్రం.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


13 Nov 2021

No comments:

Post a Comment