విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 2 (Sankalpam)

🌹. విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 2 🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సంకల్పం - సామూహిక సాధన 🌻

Audio file: Download / Listen 

పూర్వన్యాసః
అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ‖
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజం |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శారంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం |
త్రిసామాసామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ‖
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం |
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణే వినియోగః |

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

16 Sep 2020

శ్రీ శివ మహా పురాణము - 225

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 225   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

50. అధ్యాయము - 5

🌻. సంధ్య యొక్క చరిత్ర - 1 🌻

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః | స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః || 1

సూతుడిట్లు పలికెను -

మునిశ్రేష్ఠుడగు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని, సంతసించిన మనస్సు గలవాడై, శంకరుని స్మరించి ఆనందముతో నిట్లనెను (1).

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే | అద్భుతా కథితా లీలా త్వయా చ శశిమౌలినః || 2

గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే | దక్షే చ స్వగృహం యాతే తథా హి త్వయి కర్తరి || 3

మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు | సంధ్యా కుత్ర గతా సా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః || 4

కిం చకార చ కేనైవ పురుషేణ వివాహితా | ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద || 5

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! విధీ! మహాత్మా! విష్ణుశిష్యా! మహాప్రాజ్ఞా! నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి (2).

మన్మథుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్లగా, దక్షుడు తన గృహమును చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడ గృహమును పొందగా (3),

మానసపుత్రులు కూడ తమ తమ ధామములకు చేరుకొనగా, బ్రహ్మ పుత్రి, పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచటకు వెళ్లెను ? (4)

ఆమె ఏమి చేసెను? ఏ పురుషుని వివాహమాడెను? నీవు సంధ్య యొక్క చరిత్ర నంతనూ విస్తారముగా చెప్పుము (5).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మ పుత్రస్య ధీమతః | సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్త్వవిత్‌ || 6

సూతుడిట్లు పలికెను -

బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడునగు ఆ నారదుని మాటను విని, తత్త్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను (6)

బ్రహ్మో వాచ |

శృణు త్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభమ్‌ | యచ్ఛృత్వా సర్వకామిన్య స్సాధ్వ్యస్స్యు స్సర్వదా మునే || 7

సా చ సంధ్యా సుతా మే హి మనో జాతా పురాs భవత్‌ | తపస్తప్త్వా తనుం త్యక్త్వా సైవ జాతా త్వరుంధతీ || 8

మేధాతి థేస్సుతా భూత్వా మునిశ్రేష్ఠస్య ధీమతీ | బ్రహ్మ విష్ణు మహేశాన వచనా చ్చరితవ్రతా || 9

వవ్రే పతిం మహాత్మానం వసిష్ఠం శంసితవ్రతమ్‌ | పతివ్రతా చ ముఖ్యా భూద్వంద్యా పూజ్యా త్వభీషణా || 10

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ మునీ! దీనిని ఎల్లవేళలా వినే స్త్రీ లందరు సాధ్వీమణులగుదురు (7).

ఆ సంధ్య ముందుగా నాకు కుమారైయై పుట్టెను. ఆమె తపస్సును చేసి, శరీరమును వీడి అరుంధతియై జన్మించెను (8).

బుద్ధి మంతురాలగు ఆమె గొప్ప ముని యగు మేథా తిథికి కుమారైయై జన్మించెను. గొప్ప నిష్ఠ గల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే (9)

మహాత్ముడు, ప్రశంసింపదగిన తపోనిష్ఠుడునగు వసిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కిరింపదగిన పూజ్యురాలు అయెను (10).

నారద ఉవాచ |

కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా | కథం శరీరం సా త్యక్త్వాsభవన్మేధాతిథే స్సుతా || 11

కథం వా విహితం దేవైర్బ్రహ్మ విష్ణు శివైః పతిమ్‌ | వసిష్ఠం తు మహాత్మానం సంవవ్రే శంసిత వ్రతమ్‌ || 12

ఏతన్మే శ్రోష్యమాణాయ విస్తరేణ పితామహ | కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్త్వతః || 13

నారదుడిట్లు పలికెను -

ఆ సంధ్య తపస్సును ఎచట, ఎందుకొరకు, ఎట్లు చేసెను? ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెను? (11)

బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు, ప్రశంసింపదగిన తపో నిష్ఠ గలవాడు, మహాత్ముడు అగు వసిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను? (12)

ఓ పితామహా! నేను ఈ అరుంధతీ చరిత్రను విన గోరుచున్నాను ఉత్కంఠ గల నాకు ఈ చరిత్రసారమును విస్తరముగా చెప్పుము (13).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 55

🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 55   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 19 🌻

ఈ ఆత్మతత్వాన్ని ఇప్పుడు తెలియబరిచేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. నీవు తెలుసుకొన దలుచు కొనునటువంటి ఆత్మతత్త్వం ఎంతటి విశేషమైనటువంటిదో, ఎలా పొందాలో ఈ రెండింటి లక్షణాలని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట.

‘ఆత్మ’ ఎక్కడ వున్నది? అని అందరి ప్రశ్న. ‘ఆత్మ’ ఎక్కడో ఉన్నది - అనటానికి వీలుకాదు. అంటే ఆకాశం అవతల. పాతాళానికి ఇవతల. ఇలా చెప్పటం కుదరదు. అంటే, “నకర్మణా, నప్రజయా, యద్ధనేనైక, త్యాగేనైక అమృతత్వమానసుః” - అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆత్మ ఉన్నది.

అంటే, ఒకటి చేయడం ద్వారా కానీ, నకర్మణా, నప్రజయా - అనేక జనబాహూళ్యం చేత కానీ, యద్ధనేనైక - ధనబలం చేత కానీ, త్యాగేనైక అమృతత్వమానసుః - ఒక్క త్యాగం చేత మాత్రమే, త్యాగబుద్ధి చేత మాత్రమే ఆత్మ తెలియబడుతుంది. ఎట్లాగు? కారణమేమిటంటే, బుద్ధి గుహయందు వుందట.

అసలు బుద్ధి అనేది ఎక్కడుంది అంటే స్థానం చెప్పడానికి చాలా కష్టమైనటువంటింది. నీ హృదయస్థానంలో నీకు ఆత్మతత్వం నిశ్చలంగా ప్రకాశిస్తూ వున్నది. అట్టి హృదయస్థానాన్ని తెలుసుకోవాలి అనంటే, బుద్ధిపూర్వకంగానే తెలుసుకోవాలి.

బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి అంటే, నీ ప్రాణమనస్సుల యొక్క చలనం ఎక్కడి నుంచైతే పుడుతోందో, ఆ పుట్టుక స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలి. సాధనలన్నీ ఈ హృదయస్థానమును తెలుసుకొనటం కొరకే చెప్పబడ్డాయి.

కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సూక్ష్మమైనటువంటి, బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి, చిత్తము కంటే సూక్ష్మమైనటువంటి, అహంకారమునకంటే సూక్ష్మమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞాతగా, తెలుసుకునేవాడుగా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కూటస్థుడుగా, కదలనివాడుగా, స్థిరముగా, స్థాణువుగా, ఉన్నటువంటి స్థానము, స్థితి ఏదైతే ఉన్నదో, దానిని ‘దుర్ధర్శుడు’ అని పేరుపెట్టారు దీనికి. అంటే అర్థం ఏమిటి?

కష్టసాధ్యమైన వాటిళ్ళోకెల్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటి దర్శనం ఏదైనా వుంది అనంటే అది ఆత్మసాక్షాత్కారం. ఈ ప్రపంచంలో హిమాలయాల మీద, ఎవరెస్ట్‌ పర్వతం మీద ఆత్మ ఉన్నది. అన్నారనుకో మీరందరూ టకటకా టకటకా దానికి తగినట్లు ప్రయాణం పూర్తిచేసుకుని, ట్రైనింగ్‌ పొంది, ఎవరెస్ట్‌ పర్వతం ఎక్కి చూస్తారు కానీ, అంత కష్టసాధ్యమైనటువంటి పని కూడా సులభమే కానీ, ‘ఆత్మసాక్షాత్కారజ్ఞానం’ - సులభం కాదు.

అయ్యా! రాకెట్‌ వేసుకుని చంద్రమండలం మీదకు వెళ్తే, నేను చంద్రమండలం మీద నడిస్తే, ఆత్మ నాకు తెలియబడుతుందా? తెలియబడదు. నువ్వు ఎంతకష్టపడైనా అంతరిక్ష ప్రయాణం పూర్తిచేసినప్పటికీ, ఆత్మానుభూతిని పొందలేవు. అందుకని దీనికి ‘దుర్దర్శుడు’ - అని పేరుపెట్టారు.

ఈ ‘దుర్దర్శుడు’ అన్న పదం చేత మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏంటంటే, ఇంద్రియముల ద్వారా నువ్వు దీనిని అనుభవించలేవు. అందుకని ఏమంటున్నాడు? ఎట్లా పొందవచ్చటా? ఒకటే మార్గం వుంది. వేరే మార్గం లేదు. ఏమిటి? శబ్దాది విషయముల చేత అది మరుగపరచబడి యున్నది.

‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ - అనే స్థితికి బుద్ధి పరిణామం చెందితే తప్ప, వేరే మార్గం లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 46

🌹.    భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 46   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 13 🌻

ఆత్మ, ఒకసారి చైతన్యమును పొందిన తరువాత, ఆచైతన్యము అంత కంతకు వికాసమొందునేకాని, తరిగిపోదు.

178. మానవరూపము:

యుగయుగాంతరము, చైతన్యపరిణామముతో పాటు పరిణామమొందిన,
పూర్ణరూపము
అత్యుత్తమరూపము
విశిష్టరూపము
దివ్యరూపము
ఈ మానవరూపమే, ఈ మానవరూములోనే చైతన్యము పుష్కలముగా, పూర్ణముగా, అభివృద్ధి చెందినది.

ఇప్పుడు ఆత్మ,యీ పూర్ణరూపమును ఉపయోగించుకొని,యీ రూపము ద్వారా సంస్కారములను రద్దు పరచు కొనెను.

179. మానవుడు }

లేక .}

జీవాత్మ. }=శరీరము+ప్రాణము+మనసు+

లేక } చైతన్యము+ఆత్మ.

ఇన్సాన్. }

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

అద్భుత సృష్టి - 32

🌹.   అద్భుత సృష్టి - 32   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. 7.సహస్రార స్థితి:- 🌻

వైలెట్ కలర్, పిట్యూటరీ గ్రంధితో కనెక్ట్ అయి ఉంటుంది. దీని క్వాలిటీ - హయ్యర్ విల్ పవర్ కలిగి ఉండడం, జ్ఞానశక్తి కలిగి ఉంటుంది.

ఈ చక్రం శరీరంలో బ్రెయిన్ తోనూ, శరీరంలో సమస్తనాడులతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఎక్కడ శక్తి నిరోధకాలు ఉన్నా వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ చక్రాన్ని "కిరీట చక్రం" అంటారు.

ఇందులో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనంతమైన (సహస్రం అంటే వేయి) పాజిబులిటీస్ (అవకాశాలు) ఉంటాయి. ఇది అనంతలోకాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రం "అహంకారం" అనే శక్తితో బ్లాక్ చేయబడి ఉంటుంది.

🌟. లాభాలు:-

ఈ చక్రంలో ఉన్న శక్తి "కృష్ణ చైతన్యం" మనల్ని ఈ చక్రం గ్రేట్ క్రియేటర్ గా మార్చుతుంది. విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. అంతా తానే ఉన్నానన్న స్థితిని కలిగిస్తుంది. న్యాయబద్ధంగా జీవిస్తాం. న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాం మరి ఏకత్వంలో జీవిస్తాం.

🌀. ఈ చక్రం అండర్ యాక్టివ్ లో ఉంటే: ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటాం.

🔹. ఈ చక్రం ఓవర్ యాక్టివ్ లో ఉంటే: కాంతి, శక్తి ఎక్కువ అయినదన్న భావన కలుగుతుంది. భూమితో కనెక్షన్ (భౌతికతలో కనెక్షన్) ఉండదు. అహంకారపూరితంగా (అహంకారిగా) ఉంటాం.

💠. ఈ చక్రం సమతుల్యంగా ఉండడం వలన: ఉన్నత చైతన్యంతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటాం. హయ్యర్ కాన్షియస్ కి ఒక వారధిని ఏర్పరుచుతుంది. ఆధ్యాత్మిక అనుసంధానాన్ని ఇస్తుంది. పరిపూర్ణ భగవత్ స్థితిని పొందుతాం.

ఈ చక్రం సత్యలోకంతో కనెక్ట్ అయి మనల్ని "దేవర్షి" గా పరిపూర్ణ చైతన్యాలుగా మార్చుతుంది. ఈ చక్రం DNA లో 7 ప్రోగులతో కనెక్ట్ అయి యూనివర్స్ (విశ్వం) నుంచి చైతన్యాన్ని పొందుతుంది. ఇది పిట్యూటరీ హైపోథాలమస్ గ్రంధులతో అనుసంధానం అయి ఉంటుంది.

"నీ విశ్వం నుండి నేను దేనినైతే పొందుతానో (అర్థనారీశ్వర తత్వం) దానినే అనుభవిస్తున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, పంచుతున్నాను, సృష్టిస్తున్నాను మరి సాధిస్తున్నాను."

🌼. సాధన ధ్యాన సంకల్పం 1:-

"నా సహస్రార చక్రంలో ఉన్న సరికాని శక్తులన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. నాలో అహంకారం ద్వారా నేను ఏ ఆత్మ స్వరూపానికి అయినా కష్టాన్ని, నష్టాన్ని కలిగించి ఉంటే వాళ్ళు నన్ను మనఃస్పూర్తిగా క్షమించాలి. వీటికి సంబంధించిన కర్మలు, కర్మముద్రలు, గుర్తులు ఏమి ఉన్నా సెల్యులార్ స్థాయి నుంచి పూర్తిగా తొలగించబడాలి."

🌻. సంకల్పం -2 :

"నా సహస్రారచక్రం అత్యంత శక్తివంతంగా మారాలి. దీనిలోని అనంత అవకాశాలు ఓపెన్ అవ్వాలి మరి నేను ఏకత్వంలో జీవించాలి. ఐ యాం ప్రజెన్స్ (అహం బ్రహ్మాస్మి) గా మారిపోవాలి. జ్ఞాన శక్తి నాలో పరిపూర్ణంగా మేల్కొనాలి."

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 54 / Sri Gajanan Maharaj Life History - 54

🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 54 / Sri Gajanan Maharaj Life History - 54   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 11వ అధ్యాయము - 2 🌻

నేను మీయొక్క అవివేకమయిన పిల్లవాడిని. నాకు ఏది మంచిదో అది మీరే చెయ్యండి. తన పిల్లలకు ఏది మంచిదో తల్లి మాత్రమే అర్ధం చేసు కుంటుందని శ్రీతుకారాం తన కధనంలో అన్నారు.

నేను మీ పిల్లవాడిని మరి నేను మిమ్మల్ని అర్ధించడం ఎందుకు ? మీరు జ్ఞానంఅనే మహాసముద్రం, అన్ని విషయాలు తెలిసినవారు అని భాస్కరు అన్నాడు. ఇదివిన్న శ్రీమహారాజు చాలా సఇతోషించారు. స్వయానా నిజాయితీ పరులైనవారికి, ఇతరుల నిజాయితీ సంతృప్తిని కలిగిస్తుంది.

భాస్కరు తమ అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు కావున భాస్కరును రక్షించమని కొంతమంది భక్తులు శ్రీమహారాజును అర్ధించారు.

సజ్జనులారా మీయొక్క తెలివి తక్కువ తనం వల్లనే మీకు ఈవిధంగా అనిపిస్తోంది. జీవన్మరణం అనేది అసత్యం అని తెలుసుకోండి. ఎవరూ జన్మించలేదు, మరణించలేదు. ఈమధ్యను గూర్చి అవగాహన చేసుకుందుకు అత్యంత గొప్పదయిన, ఆత్మగురించిన జ్ఞానం అవసరం అని మేధావులు సలహా ఇచ్చారు.

పూర్వజన్మ కర్మఫలితాన్ని అనుభవించకుండా మీకు ఈజన్మనుండి విముక్తి లేదు. క్రిందటి జన్మలో మీరు ఏదో చేస్తారు, దానిఫలితాన్ని అనుభవించేందుకు మరల జన్మ ఎత్తుతారు, మరలా ఈజన్మలో చేసిన పనుల ఫలితాన్ని అనుభవించేందుకు మరలా జన్మఎత్తుతారు, ఇలా ఈచక్రం ముందుకు కొనసాగుతుంది. ఎంతకాలం ఈగొలుసును కొనసాగించడం ?

భాస్కరు తన పూర్వజన్మ ఫలితాలను అనుభవించడం పూర్తిచేసాడు, ఇక మోక్షం పొందడం కోసం విముక్తుడయ్యాడు. కావున దయచేసి అతనిదారిలోకి రాక అతనిని వెళ్ళనివ్వండి. భాస్కరులాంటి భక్తుడు దొరకడం కష్టమే.

ఈ కుక్క క్రితం జన్మలో భాస్కరుకు శత్రువు, కనుక అది ఈజన్మలో బాలాపూరులో ఇతనిని కరిచింది అని తెలుసుకోండి. ప్రతీకారం పూర్తి అయింది, కానీ ఈ సంఘటన వలన భాస్కరు మనసులో ఏమాత్రమయినా చేదు మిగిలితే, ఆకాటుకు ప్రతీకారం తీర్చుకోడంకోసం మరోజన్మ ఎత్తడానికి కారణం అవుతుంది.

కావున ఈ రోజుతో క్రితం జన్మల శతృత్వాలన్నీ పూర్తి అయి, భాస్కరు ఆజన్మలన్నిటి నుండి పరిశుద్దుడయ్యాడు అని అర్ధంచేసుకోండి.

ఇక ఇతనికి రెండు నెలలు ఆయుర్దాయం ఉంది, నేను ఇతనిని ఈ రెండు నెలలూ ఈ కుక్క కాటు పరిణామాలనుండి రక్షిస్తాను, అలా నేను చెయ్యకపోతే తిరిగి ఇతను రెండి నెలలు జీవించడం కోసం జన్మించాలి అని శ్రీమహారాజు అన్నారు.

శ్రీమహారాజు చెప్పిన ఈబ్రహ్మజ్ఞానం గురించి చాలామంది అర్ధంచేసుకోలేక పోయారు, కానీ బాలాభవ్ చేసుకోగలిగి చాలా సంతోషించాడు. అతను భాస్కరు యొక్క నిష్కలమైన భక్తికీ, దానివల్ల జీవన మరణ చక్రంనుండి ముక్తి పొందడాన్ని పదేపదే పొగిడాడు. అప్పుడు అందరూ షేగాం తిరిగి వచ్చారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Gajanan Maharaj Life History - 54   🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 11 - part 2 🌻

Bhaskar said, I am an ignorant child of Yours. You do whatever is good for me. Shri Tukaram, in his Abhang, has said that only a mother understands everything that is good for her child; I am your child, so why should I request You? You are the ocean of all knowledge!

Hearing this, Shri Gajanan Maharaj felt very happy, as truth always satisfies people who are themselves truthful. Some devotees requested Shri Gajanan Maharaj to save Bhaskar as he was one of the most dedicated disciples.

Shri Gajanan Maharaj said, Gentlemen, it is your ignorance that makes you say so. Know that, this life and death themselves are unreal. Nobody is born and nobody dies.

The intellectuals have advised the knowledge of the Supreme self to understand this illusion. You cannot be liberated from the present life, without suffering the effects of the deeds of your previous life.

You do something in your past life and take birth to suffer the effects of those deeds and then you again take birth for the deeds of the present life and so on the cycle goes on. How long will you continue this chain?

Bhaskar has finished suffering the effects of the deeds of his past life and now is liberated to attain Moksha (to merge with the Brahma). So please do not come in his way; let him go. It is difficult to get a devotee like Bhaskar.

Know that, this dog was his enemy in the previous life and so it has bitten him in this life at Balapur. The revenge is now over. However, if this incident leaves any bitterness in the mind of Bhaskar, it will cause him to take another birth to avenge the bite.

So understand that, as of today, the enmity of Bhaskar’s previous life is over and he is cleansed of all effects of that life. He is left with two more months of life, and I will save him from the effects of that dog bite for two months.

If I do not do that, he will have to take birth again and live for two months. Many people were unable to understand this supreme knowledge given out by Shri Gajanan Maharaj , but Balabhau could comprehend and so was happy.

He praised Bhaskar again and again for his sincere devotion to the saint and thereby againing the ultimate liberation from the cycle of life and death. Then all of them returned to Shegaon.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 14 / Sri Vishnu Sahasra Namavali - 14

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 14 / Sri Vishnu Sahasra Namavali - 14 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మేషరాశి - రోహిణి నక్షత్ర 2వ పాద శ్లోకం

14. సర్వగ స్సర్వవిద్భానుః విశ్వక్షేనో జనార్దనః|

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||

123) సర్వగః -
అన్నిచోట్లా ప్రవేశించువాడు, ఎక్కడికైనా వెళ్లగలిగేవాడు.

124) సర్వవిద్భానుః -
సర్వము తెలిసిన జ్ఞానముతో ప్రకాశించేవాడు.

125) విష్వక్సేనః -
విశ్వాన్ని రక్షించేందుకు సైన్యాధిపతిగా వ్యవహరించేవాడు.

126) జనార్దనః -
దుష్టశక్తుల నుండీ సజ్జనులను రక్షించువాడు.

127) వేదః -
సమస్త జ్ఞానముకలిగినవాడు, వేదమూర్తి.

128) వేదవిత్ -
వేదములను సంపూర్ణముగా నెరిగినవాడు.

129) అవ్యఞ్గః -
గుణ, జ్ఞానములందు ఎట్టి లోపములు లేనివాడు.

130) వేదాఞ్గః -
వేదములే శరీర అంగములుగా గలవాడు, వేదమూర్తి.

131) వేదవిత్ -
వేదసారమైన ధర్మమునెరిగినవాడు.

132) కవిః -
సూక్ష్మ దృష్టి కలిగినవాడు,అన్నింటినీ చూచువాడు.

🌹 🌹 🌹 🌹 🌹

🌹   Vishnu Sahasra Namavali - 14   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

14. sarvagaḥ sarva vidbhānur viṣvaksenō janārdanaḥ |

vedō vedavidavyaṅgō vedāṅgō vedavit kaviḥ || 14 ||

123) Sarvagaḥ:
One who pervades everything, being of the nature of their material cause.

124) Sarvavid-bhānuḥ:
One who is omniscient and illumines everything.

125) Viṣvakśenaḥ:
He before whom all Asura armies get scattered.

126) Janārdanaḥ:
One who inflicts suffering on evil men.

127) Vedaḥ:
He who is of the form of the Veda.

128) Vedavid:
One who knows the Veda and its meaning.

129) Avyaṅgaḥ:
One who is self-fulfilled by knowledge and other great attributes and is free from every defect.

130) Vedāṅgaḥ:
He to whom the Vedas stand as organs.

Vedavit: One who knows all the Vedas.

132) Kaviḥ:
One who sees everything.

Contnues...
🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 12 / Vishnu Sahasranama Contemplation - 12

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 12 / Vishnu Sahasranama Contemplation - 12 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

12. ముక్తానాం పరమా గతిః, मुक्तानां परमा गतिः, Muktānāṃ paramā gatiḥ

ఓం ముక్తానాం పరమాయై గతయే నమః | ॐ मुक्तानां परमायै गतये नमः | OM Muktānāṃ Paramāyai Gataye Namaḥ

ముక్తి నందిన వారలకు ఉత్తమమగు గమ్యము (అగుదేవత); అతనిని చేరిన వారికి పునరావృత్తి లేదు కదా! భగవద్గీత సాంఙ్ఖ్య యోగాధ్యాయమునందు ఈ దివ్య నామము యొక్క వివరణ పలు శ్లోకాలలో కనబడుతుంది.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।

జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్ ॥ 2.51 ॥

సమత్వబుద్ధితో గూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వాని ఫలమును త్యజించివైచి జననమరణరూపమను బంధమునుండి విడుదలను బొందినవారై దుఃఖరహితమగు మోక్షపదవిని బొందుచున్నారు.

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శ్చరతి నిస్స్పృహః ।

నిర్మమో నిరహంకారః స శాన్తి మధిగచ్ఛతి ॥ 2.71 ॥

ఏషా బ్రాహ్మీస్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి ।

స్థిత్వాఽస్యా మన్తకాలేఽపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ॥ 2.72 ॥

ఎవడు సమస్తములైన కోరికలను, శబ్దాదివిషయములను త్యజించి వానియందేమాత్రము ఆశలేక, అహంకారమమకారవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అర్జునా! ఇదియంతయు బ్రహ్మసంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికి విమోహమును జెందనేరడు. అంత్యకాలమునందు గూడ ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూప మోక్షమును బడయుచున్నాడు.

The highest goal of the liberated ones. For one who attains to Him, there is neither rebirth nor attaining to any thing higher, there being nothing higher than Him.

The second chapter of Bhagavad Gitā on 'The Path of Knowledge' provides elaboration on this divine name in multiple Ślokās.

Karmajaṃ buddhiyuktā hi falaṃ tyaktvā manīṣiṇaḥ,

Janmabandhavinirmuktāḥ padaṃ gacchantyanāmayam. (2.51)

Because, those who are devoted to wisdom, (they) becoming men of Enlightenment by giving up the fruits produced by actions, reach the state beyond evils by having become freed from the bondage of birth.

Vihāya kāmān yassarvān pumāṃ ścarati nisspr̥haḥ,

Nirmamō nirahaṃkāraḥ sa śānti madhigacchati. (2.71)

Ēṣā brāhmīsthiti pārthanaināṃ prāpya vimuhyati,

Sthitvā’syā mantakālē’pi brahmanirvāṇa mr̥cchati. (2.72)

That man attains peace who, after rejecting all desires, moves about free from hankering, without the idea of ('me' and) 'mine' and devoid of pride. O Parthā, this is the state of being established in Brahman. One does not become deluded after attaining this. One attains identification with Brahman by being established in this state even in the closing years of one's life.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।

अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।

అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।

Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

16 Sep 2020

శివగీత - 64 / The Siva-Gita - 64

🌹.   శివగీత - 64 / The Siva-Gita - 64   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము

🌻. గర్భో త్పత్త్యాది కథనము - 10 🌻

హా కాంతే ! హాధనం! పుత్రాః - క్రంద మానః సుదారుణమ్,

మాండూక ఇవ సర్పేణ - మ్రుత్యువా నీయతే నరః 56

మర్మ సూన్యథ్య మానే షు - ముచ్యమానే షు సంధిషు

యద్దు:ఖం మ్రియమాణస్య - స్మర్యతాంతన్ము ముక్షుభి: 57

దృష్టా వాక్షి ప్యమాణాయాం - సంజ్ఞ యా హ్రియమాణయా,

మృత్యు పాశేన బద్ధ స్య - త్రాతా నైనో పలభ్యతే 58

సంరుధ్య మాన స్తమసా - మహ చ్చిత్త మివా విశన్,

ఉపహూత స్తా జ్ఞాతీ - నీక్షతే దీన చక్షుషా 59

అయఃపాశేన కాలేన - స్నేహపాశేన బంధుభి:

ఆత్మావం కృష్య మాణం త - మీక్షతే పరి త స్తథా 60

ఓసి ప్రియురాలా! ఓ విత్తమా! ఓయీ! మిత్రురాలా! అని సంబోధిస్తూ భయంకరముగా దుఃఖిస్తూ మానవుడు కప్పను పామువలె మృత్యువు చేత కొనపోబడును.

మర్మ స్థానములు ప్రాణవాయువుతో వీడి పోవుచుండగా కరచరణాదుల సంధులు వీడిపోగా మరణము బొందువాని దుఃఖము వర్ణించుట యసాధ్యము కావున మొక్షే చ గ్భలవారి చేత సర్వదా పరమాత్ముడు స్మరింపబడు గాక.

యమకింకరుల చేత దృష్టి యాకర్షింపబడి చైతన్యమును కోల్పోయి మృత్యుపాశముతో బంధింపబడిన వాడిని కాపాడు వాడుండడు. (కనుక అన్ని విపత్తులబారి నుండి రక్షించు పరమాత్ముని ఎల్లప్పుడూ స్మరించవలెను).

అజ్ఞానముచేత బిలువబడిన ఆసన్న మరణుడు గొప్ప జ్ఞానమును బొందిన పగిది, బంధువులచేత బిలువబడి దీనత్వముగల చూపులతో, అందరిని అవలోకించును. (మాట్లాడు శక్తిలేమి చేత చూపుతోనే తృప్తి నొందును) యముని లోహపుత్రాడుతో గట్టబడిన వాడై, బంధువుల ప్రేమ త్రాటిచేత నిరువిపులా లాగాబడుచున్న యాత్మను చూచుచుండును. అల్లాంటప్పుడు జ్ఞానమును ప్రతిఫలము నిచ్చునది. భగవద్ద్యాన మొక్కటే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   The Siva-Gita - 64   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 10
🌻

O sweetheart! O my wealth! O dear friends! Like this a human cries out for help while being gobbled by the death as like as a frog cries in the clasp of a snake.

The pain and suffering which a human experiences at the time when his Pranas start leaving him, that pain can't be expressed in words.

One who remains filled with desire for liberation, he remembers the Paramatma always.

No one exists who protects one from the noose of Yama's attendants (therefore one should always remember the Paramatma who protects from every agony).

The ignorant one dies a pathetic death. He calls out the relatives for help, looks at everyone with a pitiful eyes to satisfy himself when the speech abandons him.

In order to avoid such suffering only way is knowledge and only remembrance of the divinity gives the fruition.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం ##శివగీత #SivaGita

16 Sep 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అరుణి మహర్షి - 4 🌻

21. గ్రోధం అంటే మర్రిచెట్టు. దాని కాయలను పగులగోడితే అందులో గింజలుటాయి. మరి గింజను పగులకొడితే ఏముంటుంది? ఆ గింజలో ఏమీ ఉండదు. అది భేదించబడి నప్పుడు ఏమీ ఉండదు. కాని అందులో ఆ మహావృక్షం యొక్క సూక్ష్మ రూపం ఉంది. అలాగే ఆ పరమాత్మయొక్క సూక్షమమైన బీజమందు ఇంత జగత్తూ ఇమిడిఉంది.

22. కాబట్టి నీవు దానిని భేదించటం సాధ్యపడదు. దానిని ఎవరూ భేదించలేరు. వీటన్నిటికీ మూలమైన ఒకానొక వస్తువన్నదనే జ్ఞానం – ఆ ఒక్కటీ ఏదో నీకు తెలియనక్కరలేదు- దానిని గురించిన ధ్యానమే నీకు తపస్సు అవుతుంది. అంటే తెలిసున్న వస్తువుగురించి ధ్యానము సులభమే. తెలియని వస్తువును గురించిన ధ్యానం కష్టం.

23. మనకు తెలిసినవాళ్ళు దూరదేశంలో ఉంటే, వాళ్ళను గురించి మనస్సులో భావనచేస్తాము, వారు మనకు తెలుసు కాబట్టి. విష్ణుధ్యానం చెయ్యమంటే, ఆయనను ఎవరు చూచారు? ఆయన ఎలా ఉంటాడు? ఎవరో పెద్దలు, ఆశ్రమవాసులు ఈ రూపంలో ఉంటాడు ఇట్లా ధ్యానం చెయ్యమని చెప్పారు.

24. జగత్తులో ఉండే వైవిధ్యాన్ని గుర్తించే ఈ బుద్ధి, ఇంద్రియముల సాయం తోటే మనస్సు అక్కడికి వెళ్ళుతుంది. అయినప్పటికీ ఏ ప్రకారంగా బోధించబడిందో ఆ వస్తువును అలాగ స్వయంగా చూడగలిగిన శక్తి దానికిలేదు.

25. కానీ అలా చేసినవాళ్ళు ఈ స్థితిలో అనుగ్రహంపొంది ఆ దర్శనం పొందుతున్నారు. ఇది ఎవరి శక్తి? ఇది మనోబుద్ధులయొక్క శక్తికాదు. దానిని అన్వేషిస్తూ వెళ్ళేవాడికి అదే ఎదురొచ్చి అనుగ్రహించి దర్శనమిచ్చే లక్షణము దానియందున్నది.

26. ఆ ఈశ్వరానుగ్రహంమీద ఆధారపడి తపస్సు ఫలించవలసిందే తప్ప, తపస్సుచేసేవాడి సమర్థతే అక్కడ లేదు. కాబట్టి ఆ కల్యాణ గుణం దానియందున్నది అనే భావనతో తపస్సు చేస్తే, పరమాత్మవస్తువు నీకు దర్శనం అవుతుంది.

27. తండ్రికి ఉండవలసింది మమకారం కాదు, వాత్సల్యం. వాత్సల్యంలో మోహం ఉండదు, ప్రేమ ఉంటుంది. ప్రేమవల్ల పిల్లలు మంచిమార్గంలో వెళతారు. కానీ మన కుండే మోహం వలన వాళ్ళు బాగుపడరు.

28. ప్రేమ పవిత్రమైనది. మోహమే బంధనము. మోహము తండ్రీకొడుకులిద్దరినీ దుఃఖంలో ముంచుతుంది. దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది మోహం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 96

🌹.   నారద భక్తి సూత్రాలు - 96   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 67

🌻 67. భక్తా ఏకాంతినో ముఖ్యాః || 🌻

ఎవరు కేవలం ప్రేమార్ధమే భగవంతుని ప్రేమిస్తారో వారు ఏకాంత భక్తులు.

భక్తి త్రివిధాలు :

1) బాహ్య భక్తి

(2) అనన్య భక్తి

(3) ఏకాంత భక్తి

1. బాహ్య భక్తి :

ఇది గౌణభక్తి క్రిందికి వస్తుంది. ఈ భక్తి కాయికంగాను, వాచికంగాను ఉంటుంది. సాధనచేత మానసికంగా మార్చుకోవాలి.

ఈ బాహ్య భక్తిలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, అర్చనం, ఆత్మ నివేదనం అని నవ విధాలు. పూజలు, వ్రతాలు, జపతపాలు, క్రతవులు కూడా బాహ్య భక్తి క్రిందకే వస్తాయి. ఈ బాహ్య భక్తి అనన్య భక్తిగా మారాలంటే అందరిలోనూ భగవంతుడిని చూడాలి.

దీనికి చేసే సాధనలో ముందుగా తనకంటే వేరైన వారిని నాలుగు తరగతులుగా విభజించి వారిలో ఒక్కొక్క రకం వారితో 1) ముదిత (2) కరుణ (3) మైత్రి (4) ఉపేక్ష అనే పద్ధతులుగా వ్యవహరించాలి.

ముదిత :

భాగవతోత్తములందు, పుణ్యాత్ములందు, సద్గుణ సంపన్నులందు, ముముక్షువులందు కలిగే సంతోషమే ముదిత.

కరుణ :

దుఃఖమందు, నికృష్ట గుణములున్న వాడియందు, అజ్ఞానులందు కలిగే సానుభూతిని కరుణ అంటారు.

మైత్రి :

దైవ భక్తులందు, ఉపాసకులందు, కర్మిష్టులందు, తనతో సమానమైన గుణములున్న వారితో, వీరంతా నావారు అనే బుద్ధిని మైత్రి అంటారు.

ఉపేక్ష :

పాపాత్ములు, పామరులు, మూర్ఖులు, నీచగుణాలున్న వారు కుటిలులు, దుర్మార్గులు, దుర్వ్యసనపరులందు ద్వేష రహితులై ఉదాసీనంగా ఉండాలి. దీనిని ఉపేక్ష అంటారు.

2. అనన్య భక్తి :

సర్వం భగవత్స్వరూపంగా భావించుకుంటూ అన్య చింతన వదలి మనస్సును తదేక నిష్ఠతో ఏకాగ్రం చేసి భగవంతుని నిరంతరం దర్శించడాన్ని అనన్య భక్తి అంటారు.

3. ఏకాంత భక్తి :

భగవదాకారం పొంది భగవంతుడు భక్తుడు వేరు కానట్టి స్థితిని ఏకాంత భక్తి అంటారు. ఇతడు భాగవతోత్తముడు, సత్పురుషుడు. ఇది ముఖ్యభక్తి క్రిందికి వస్తుంది.

ఏకాంత భక్తిని పతివ్రత యొక్క పతిభక్తితో పోల్చవచ్చును. వీరిలో విశేషమేమంటే వీరు ముక్తిని కూడా కోరరు. వీరు భగవంతుని ప్రేమ కోసమే ప్రేమిస్తారు.

అనపేక్షః శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః

సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్సమే ప్రియః

- భగవద్గీత (12:16)

ముఖ్యభక్తుడెవడంటే, ఏ మాత్రం కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనసులందు శుచియై ఉన్నవాడు, దక్షుడు, పక్షపాత రహితుడు, ఎట్టి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మలందు కర్తృత్వాభిమానం లేనివాడు. అట్టి ముఖ్యభక్తుడు నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

సంస్కృతంలో పరమప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము.

భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌.

అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము.

ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును.

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును.

అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...

........ .✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

16 Sep 2020

16-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 491 / Bhagavad-Gita - 491🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 279🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 179🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 0 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 96🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 67🌹
8) 🌹. శివగీత - 64 / The Shiva-Gita - 64🌹
9) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 53 / Gajanan Maharaj Life History - 54 🌹 
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 46🌹 
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 406 / Bhagavad-Gita - 406🌹

12) 🌹. శివ మహా పురాణము - 225🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 101 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112 🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 55🌹
16 ) 🌹 Seeds Of Consciousness - 176🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 32 📚
18) 🌹. అద్భుత సృష్టి - 33 🌹
19 ) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 12 / Vishnu Sahasranama Contemplation - 12 🌹
20 ) శ్రీ విష్ణు సహస్ర నామములు - 14 / Sri Vishnu Sahasranama - 14🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 491 / Bhagavad-Gita - 491 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 1 🌴*

01. శ్రీ భగవానువాచ
పరం భూయ: ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయ: సర్వే పరాం సిద్ధిమితో గతా: ||

🌷. తాత్పర్యం : 
దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : దేనిని తెలిసికొని మునులందరును పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియజేయుదును.

🌷. భాష్యము :
సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయపు అంతము వరకు పరతత్త్వమును, దేవదేవుడును అగు తనను గూర్చి విశదముగా వివరించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఇప్పుడు అర్జునునకు మరింత జ్ఞానవికాసమును కలిగించుచున్నాడు. 

తాత్త్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసికొనినచో మనుజుడు శీఘ్రముగా భక్తియోగమును అవగతము చేసికొనగలడు. నమ్రతతో జ్ఞానాభివృద్ధిని సాధించుట ద్వారా జీవుడు భౌతికబంధము నుండి ముక్తుడు కాగలడని గడచిన త్రయోదశాధ్యాయమున వివరింపబడినది. 

ఆలాగుననే ప్రకృతిత్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతికజగములో బంధితుడగుననియు పూర్వము తెలుపబడినది. ఇక ప్రస్తుతము ఈ అధ్యాయమున ప్రకృతి త్రిగుణములనేవో, అవి ఎట్లు వర్తించునో, ఏ విధముగా అవి బంధ, మోక్షములను గూర్చునో దేవదేవుడైన శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. 

ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము కన్నను మిగుల శ్రేష్టమని భగవానుడు పలుకుచున్నాడు. అట్టి ఈ జ్ఞానమును అవగాహనము చేసికొనుట ద్వారా పలువురు మునులు పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మికజగత్తును చేరిరి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 491 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 01 🌴*

01. śrī-bhagavān uvāca
paraṁ bhūyaḥ pravakṣyāmi
jñānānāṁ jñānam uttamam
yaj jñātvā munayaḥ sarve
parāṁ siddhim ito gatāḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Again I shall declare to you this supreme wisdom, the best of all knowledge, knowing which all the sages have attained the supreme perfection.

🌹 Purport :
From the Seventh Chapter to the end of the Twelfth Chapter, Śrī Kṛṣṇa in detail reveals the Absolute Truth, the Supreme Personality of Godhead. 

Now, the Lord Himself is further enlightening Arjuna. If one understands this chapter through the process of philosophical speculation, he will come to an understanding of devotional service. 

In the Thirteenth Chapter, it was clearly explained that by humbly developing knowledge one may possibly be freed from material entanglement. It has also been explained that it is due to association with the modes of nature that the living entity is entangled in this material world. 

Now, in this chapter, the Supreme Personality explains what those modes of nature are, how they act, how they bind and how they give liberation. The knowledge explained in this chapter is proclaimed by the Supreme Lord to be superior to the knowledge given so far in other chapters. 

By understanding this knowledge, various great sages attained perfection and transferred to the spiritual world. The Lord now explains the same knowledge in a better way. 

This knowledge is far, far superior to all other processes of knowledge thus far explained, and knowing this many attained perfection. Thus it is expected that one who understands this Fourteenth Chapter will attain perfection.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 279 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 35
*🌻 Explanation of ‘Ugra Thara Devi’ Sripada saves upasaka of Thara Devi - 3 🌻*

Sripada said, ‘Ammamma! This servant is telling lies. He did not have any bleeding. They were sweat drops. What I applied was not chilli powder. It was ‘chandan powder.’ The servant was asked to go and verify. When he saw, he found what Sripada said was true.  

Bapanarya said, ‘Sripada! You are a Satyavratha. If you say there are blood drops, there will be blood drops. If you say it is chandan powder, it will be chandan powder. Whatever you say, will be true. I think you are really the ‘form’ of Ugra Thara. I have heard that ‘Ugra Thara’ will give ‘Vak Siddhi’.  

You being ‘Ugra Thara’ really, can change the nature of any materiall present there at your will. You stop enjoying your ‘leela’ and grace him.’ Sripada said, ‘Thatha! You are right. You have said that my will gives effect immediately. To decide whether it is true or not, the help of Shastras is required.  

This man is a good Brahmin. He worships ‘Ugra Thara’. Good. But he took sanyasa deeksha on his own instead of taking the consent of Guru. His father struggled to bring him up. When he was in the womb, his mother experienced great torture. When he was born his mother lost blood heavily.  

Her pains were similar to the pains experienced when chilli powder was applied on bleeding wounds. They both died and by luck, are born in Peethikapuram. The servant working in Narasimha Varma’s house is none other than his father in previous birth. The servant’s wife was his mother in previous birth.  

Not doing properly the ‘pinda pradanam’ in the name of dead elders will cause ill fate. This man had not done ‘pinda pradanam’ as he took ‘sanyasa’. His sins and merit have brought him to Sri Peethikapuram which is also ‘Pada Gaya’ kshetram. 

 By giving him the little experience of pain, I destroyed his ill fate. The fetus stays in the womb of mother for 9 months. If one stays in Kaasi kshetram for 9 months, 9 days or 9 ghadias, the ‘pithru saapam’ (the curse of departed souls) will be removed.  

Sri Peethikapuram is equal to Kaasi Kshetram. If this man serves his parents of previous birth, the curse of ‘pithru devathas’ will go.’ I did as He said. I got His grace and blessings. The anklets given by him are kept safely in the puja room. I got Siddhi of ‘Ugra Thara’. 

 I am removing the mental and physical diseases of people with my ‘Thantra Shakti’. Before you came here, Sripada appeared to my mental eye and told me that Shankar Bhatt and Dharma Gupta were coming on that way and I should give them food and make arrangements for them to stay in the ashramam and give His anklets to them as gift.’   

End of Chapter 35

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

సంస్కృతంలో పరమప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము. 

భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌. 

అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము. 

ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును. 

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును. 

అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...
........ .✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Centres of the Solar System - 179 🌹*
*🌴 Mercury - The Light of the Soul - 3 🌴*
✍️ Master E. 
📚 . Prasad Bharadwaj

*🌻. Jupiter and Mercury 🌻*

Jupiter is love, wisdom and good will. Good will needs skill to express itself correctly, otherwise it remains impractical. Therefore Ganesha is said to be riding on a rat. Wisdom united with intelligence can bring itself to a good expression. 

Thus the impressions transmitted by Jupiter are received by Mercury and passed on. If Mercury isn’t connected to Jupiter, he lacks in determination and in continuity of focusing on a noble purpose. 

Through regular activities of good will the higher aspect of Mercury becomes active, the buddhic plane is stimulated and revelations of wisdom happen without our working for them.

Jupiter and Mercury together bring the light. Jupiter gives generosity and releases; he helps to liberate ourselves from the constriction of dense matter. 

Jupiter stands for the Master, the Guru; the disciple is Mercury when he rises to the light of the buddhic plane. The mind is transformed into Buddhi when it is freed from the astral and etheric influences. He who has realised the higher aspect of Mercury will be above motives. 

He has a fine organising ability and learns to transmit the wisdom of the higher planes to his fellow-men through books, talks or group-training. Mercury thus inspires through speech and elevates people to the awareness of the soul.

*🌻 Communication 🌻*

Speech can create harmony and equipoise. Therefore we should always speak pleasantly and express truth in a pleasant way. A poorly aspected Mercury leads to disputes, misconceptions and conflicts.

Mercury presides over thought, and thought is the communication of the Soul’s expression into the outer. 

If Mercury in the natal chart of an individual is badly afflicted, he lacks a good self-expression. If a person has Mercury in a good position, he can conduct excellent communication and thus lift up people. As far as we can communicate, there is an energy flow between people. Without communication the energies are blocked. 

Communication enables cooperation and gives the experience of communion. As planet of communication Mercury is therefore very important for group work.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Jupiter / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Astrology / Alchemy in the Aquarian Age.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 0 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🌻. పరిచయము 🌻*

లలితా దేవి, శ్రీ దేవి, దుర్గ, మహాలక్ష్మి మహా సరస్వతి, మహా కాళి, రాజ రాజేశ్వరి, త్రిపుర సుందరి, ఇవియన్నియు జగదంబ నామములే. విశ్వ చైతన్యమే జగదంబ. 

ఆమె నుండియే త్రిగుణములు, పంచభూతముల సృష్టి ఎర్పడుచున్నది. ఇవియే ఆమె అష్ట ప్రకృతులు. అందలి చైతన్యమామెయె. అష్ట ప్రకృతులకు మూలము కనుక ఆమెయె మూల ప్రకృతి. సృష్టికి మూలాధారము ఆమెయే. 

అవ్యక్తస్థితి యందు సత్యముగను, వ్యక్త స్టితి యందు మహాచైతన్యముగను విరాజిల్లునదియె శ్రీమాత.

సమస్త దేవతామూర్తులు, గ్రహగోళములు సర్వజీవకోటి శ్రీ లలిత నుండి ఎర్పడినవే. ఆమె లీలావిలాసము, సృష్టివైెభవము సహస్ర నామములతో కొనియాడ బడినది. 

వర్ణన కతీతమైనను ఆమెను వర్ణించు ప్రయత్నము, ఆ మహా చైతన్యమున స్టితిగొనుటకు వినియోగ పడును. అందులచే పారాయణము.

 అవగాహనతో కూడిన పారాయణము చేయుట వలన రుచి తెలియును. రుచియనగ వెలుగు. రుచియనగ అనుభూతి కూడ. 

అట్టి దర్శనము అందరికి దక్కవలెనని, అనుభూతి అందరికిని కలుగవలెనని బుషుల ఆకాంక్ష. అవగాహన అనుభూతికి మార్గము చూపును గనుక వ్యాఖ్యానములు.

 వాఖ్యానములు సరళముగనున్నచో అవగాహన సులభము. అందులకే ఈ వాఖ్యానము. సామాన్యులకు వినియోగపడినచో ఈ ప్రయత్నము సఫలము.
- పార్వతీ కుమార్‌.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 96 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 67

*🌻 67. భక్తా ఏకాంతినో ముఖ్యాః || 🌻*

ఎవరు కేవలం ప్రేమార్ధమే భగవంతుని ప్రేమిస్తారో వారు ఏకాంత భక్తులు. 

భక్తి త్రివిధాలు : 
1) బాహ్య భక్తి 
(2) అనన్య భక్తి 
(3) ఏకాంత భక్తి

1. బాహ్య భక్తి : 
ఇది గౌణభక్తి క్రిందికి వస్తుంది. ఈ భక్తి కాయికంగాను, వాచికంగాను ఉంటుంది. సాధనచేత మానసికంగా మార్చుకోవాలి. 

ఈ బాహ్య భక్తిలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, అర్చనం, ఆత్మ నివేదనం అని నవ విధాలు. పూజలు, వ్రతాలు, జపతపాలు, క్రతవులు కూడా బాహ్య భక్తి క్రిందకే వస్తాయి. ఈ బాహ్య భక్తి అనన్య భక్తిగా మారాలంటే అందరిలోనూ భగవంతుడిని చూడాలి. 

దీనికి చేసే సాధనలో ముందుగా తనకంటే వేరైన వారిని నాలుగు తరగతులుగా విభజించి వారిలో ఒక్కొక్క రకం వారితో 1) ముదిత (2) కరుణ (3) మైత్రి (4) ఉపేక్ష అనే పద్ధతులుగా వ్యవహరించాలి.
 
ముదిత : 
భాగవతోత్తములందు, పుణ్యాత్ములందు, సద్గుణ సంపన్నులందు, ముముక్షువులందు కలిగే సంతోషమే ముదిత. 

కరుణ : 
దుఃఖమందు, నికృష్ట గుణములున్న వాడియందు, అజ్ఞానులందు కలిగే సానుభూతిని కరుణ అంటారు.

మైత్రి : 
దైవ భక్తులందు, ఉపాసకులందు, కర్మిష్టులందు, తనతో సమానమైన గుణములున్న వారితో, వీరంతా నావారు అనే బుద్ధిని మైత్రి అంటారు.

ఉపేక్ష : 
పాపాత్ములు, పామరులు, మూర్ఖులు, నీచగుణాలున్న వారు కుటిలులు, దుర్మార్గులు, దుర్వ్యసనపరులందు ద్వేష రహితులై ఉదాసీనంగా ఉండాలి. దీనిని ఉపేక్ష అంటారు.

2. అనన్య భక్తి : 
సర్వం భగవత్స్వరూపంగా భావించుకుంటూ అన్య చింతన వదలి మనస్సును తదేక నిష్ఠతో ఏకాగ్రం చేసి భగవంతుని నిరంతరం దర్శించడాన్ని అనన్య భక్తి అంటారు.
 
3. ఏకాంత భక్తి : 
భగవదాకారం పొంది భగవంతుడు భక్తుడు వేరు కానట్టి స్థితిని ఏకాంత భక్తి అంటారు. ఇతడు భాగవతోత్తముడు, సత్పురుషుడు. ఇది ముఖ్యభక్తి క్రిందికి వస్తుంది.

 ఏకాంత భక్తిని పతివ్రత యొక్క పతిభక్తితో పోల్చవచ్చును. వీరిలో విశేషమేమంటే వీరు ముక్తిని కూడా కోరరు. వీరు భగవంతుని ప్రేమ కోసమే ప్రేమిస్తారు.
 
అనపేక్షః శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్సమే ప్రియః
- భగవద్గీత (12:16)

ముఖ్యభక్తుడెవడంటే, ఏ మాత్రం కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనసులందు శుచియై ఉన్నవాడు, దక్షుడు, పక్షపాత రహితుడు, ఎట్టి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మలందు కర్తృత్వాభిమానం లేనివాడు. అట్టి ముఖ్యభక్తుడు నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 64 / The Siva-Gita - 64 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము
*🌻. గర్భో త్పత్త్యాది కథనము - 10 🌻*

హా కాంతే ! హాధనం! పుత్రాః - క్రంద మానః సుదారుణమ్,
మాండూక ఇవ సర్పేణ - మ్రుత్యువా నీయతే నరః 56

మర్మ సూన్యథ్య మానే షు - ముచ్యమానే షు సంధిషు
యద్దు:ఖం మ్రియమాణస్య - స్మర్యతాంతన్ము ముక్షుభి: 57

దృష్టా వాక్షి ప్యమాణాయాం - సంజ్ఞ యా హ్రియమాణయా,
మృత్యు పాశేన బద్ధ స్య - త్రాతా నైనో పలభ్యతే 58

సంరుధ్య మాన స్తమసా - మహ చ్చిత్త మివా విశన్,
ఉపహూత స్తా జ్ఞాతీ - నీక్షతే దీన చక్షుషా 59

అయఃపాశేన కాలేన - స్నేహపాశేన బంధుభి:
ఆత్మావం కృష్య మాణం త - మీక్షతే పరి త స్తథా 60

ఓసి ప్రియురాలా! ఓ విత్తమా! ఓయీ! మిత్రురాలా! అని సంబోధిస్తూ భయంకరముగా దుఃఖిస్తూ మానవుడు కప్పను పామువలె మృత్యువు చేత కొనపోబడును. 

మర్మ స్థానములు ప్రాణవాయువుతో వీడి పోవుచుండగా కరచరణాదుల సంధులు వీడిపోగా మరణము బొందువాని దుఃఖము వర్ణించుట యసాధ్యము కావున మొక్షే చ గ్భలవారి చేత సర్వదా పరమాత్ముడు స్మరింపబడు గాక.

 యమకింకరుల చేత దృష్టి యాకర్షింపబడి చైతన్యమును కోల్పోయి మృత్యుపాశముతో బంధింపబడిన వాడిని కాపాడువాడుండడు. (కనుక అన్ని విపత్తులబారి నుండి రక్షించు పరమాత్ముని ఎల్లప్పుడూ స్మరించవలెను).

 అజ్ఞానముచేత బిలువబడిన ఆసన్న మరణుడు గొప్ప జ్ఞానమును బొందిన పగిది, బంధువులచేత బిలువబడి దీనత్వముగల చూపులతో, అందరిని అవలోకించును. (మాట్లాడు శక్తిలేమి చేత చూపుతోనే తృప్తి నొందును) యముని లోహపుత్రాడుతో గట్టబడిన వాడై, బంధువుల ప్రేమ త్రాటిచేత నిరువిపులా లాగాబడుచున్న యాత్మను చూచుచుండును. అల్లాంటప్పుడు జ్ఞానమును ప్రతిఫలము నిచ్చునది. భగవద్ద్యాన మొక్కటే.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 64 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 08 :
*🌻 Pindotpatti Kathanam - 10 🌻*

O sweetheart! O my wealth! O dear friends! Like this a human cries out for help while being gobbled by the death as like as a frog cries in the clasp of a snake. 

The pain and suffering which a human experiences at the time when his Pranas start leaving him, that pain can't be expressed in words. 

One who remains filled with desire for liberation, he remembers the Paramatma always. 

No one exists who protects one from the noose of Yama's attendants (therefore one should always remember the Paramatma who protects from every agony). 

The ignorant one dies a pathetic death. He calls out the relatives for help, looks at everyone with a pitiful eyes to satisfy himself when the speech abandons him. 

In order to avoid such suffering only way is knowledge and only remembrance of the divinity gives the fruition.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 67 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
*Part 61*

*🌻 Those who serve the Guru should always work on gaining a better understanding of ignorance, birth, karma, knowledge and detachment. 🌻* 

We were discussing karma and what it is to take birth without any residual karma. 

We discussed that some great souls take birth without any residual karma. We said Saint Namadev was an example. 

He was a great soul who was in communication with Lord Pandareenatha (Lord Vishnu) at all times. He was always conversing with Lord Vishnu Himself. 

He is the only one who used to converse with Lord Pandareenatha that we see references to these days. But, he wished for another birth. Why? Because, he had a little more karma left. That karma would be finished with just 9 months in the womb of a mother. 

That means that he would spend the rest of his life as per the Lord’s command, free from all karma. If we have another birth, we should get a birth where we can finish all the karma.  

It’s very difficult to get a birth without any karma. We need deliverance from ignorance and from karma. But, that in itself is not enough. 

Knowledge and detachment should bear fruit in us. For these to bear fruit, the karma that is the cause of births should be destroyed. 

How does it get destroyed? Can you Guru help you? Will he share some of your karma? He will not, whatsoever. You have to carry your own karma, there’s no escape. He will advise you on the ways to reduce your karma. That’s all he will do. 

That is why those who serve the Guru should always work on gaining a better understanding of ignorance, birth, karma, knowledge and detachment. 

There’s no other choice. They should always keep learning and understanding. Listening and understanding once is not enough. 

As long as you have this birth, you should keep learning and understanding, that’s the only way to reduce your karma. You can’t move on to the next lesson assuming you are done with this lesson. 

Regardless of how many lessons you learn and how much knowledge you acquire, knowledge and detachment need to be learned and understood over and over again. 

Some people mistakenly think that knowledge alone is enough, that detachment is unnecessary. “We don’t need both knowledge and detachment. It’s enough to have knowledge”. But, knowledge without detachment is futile.  

It is like serving someone an elaborate meal on a banana leaf and asking them to walk 10 miles to drink water. That does not work. For one that takes the ablutions of the Guru with devotion and complete surrender, all these will bear fruit. 

Otherwise, regardless of the amount of devotion you have, knowledge and devotion will not bear fruit until you have had the ablutions of the Guru. What’s the use serving such an elaborate meal if there is no water to drink?  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 54 / Sri Gajanan Maharaj Life History - 54 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 11వ అధ్యాయము - 2 🌻*

నేను మీయొక్క అవివేకమయిన పిల్లవాడిని. నాకు ఏది మంచిదో అది మీరే చెయ్యండి. తన పిల్లలకు ఏది మంచిదో తల్లి మాత్రమే అర్ధం చేసు కుంటుందని శ్రీతుకారాం తన కధనంలో అన్నారు. 

నేను మీ పిల్లవాడిని మరి నేను మిమ్మల్ని అర్ధించడం ఎందుకు ? మీరు జ్ఞానంఅనే మహాసముద్రం, అన్ని విషయాలు తెలిసినవారు అని భాస్కరు అన్నాడు. ఇదివిన్న శ్రీమహారాజు చాలా సఇతోషించారు. స్వయానా నిజాయితీ పరులైనవారికి, ఇతరుల నిజాయితీ సంతృప్తిని కలిగిస్తుంది. 

భాస్కరు తమ అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు కావున భాస్కరును రక్షించమని కొంతమంది భక్తులు శ్రీమహారాజును అర్ధించారు. 

సజ్జనులారా మీయొక్క తెలివి తక్కువ తనం వల్లనే మీకు ఈవిధంగా అనిపిస్తోంది. జీవన్మరణం అనేది అసత్యం అని తెలుసుకోండి. ఎవరూ జన్మించలేదు, మరణించలేదు. ఈమధ్యను గూర్చి అవగాహన చేసుకుందుకు అత్యంత గొప్పదయిన, ఆత్మగురించిన జ్ఞానం అవసరం అని మేధావులు సలహా ఇచ్చారు. 

పూర్వజన్మ కర్మఫలితాన్ని అనుభవించకుండా మీకు ఈజన్మనుండి విముక్తి లేదు. క్రిందటి జన్మలో మీరు ఏదో చేస్తారు, దానిఫలితాన్ని అనుభవించేందుకు మరల జన్మ ఎత్తుతారు, మరలా ఈజన్మలో చేసిన పనుల ఫలితాన్ని అనుభవించేందుకు మరలా జన్మఎత్తుతారు, ఇలా ఈచక్రం ముందుకు కొనసాగుతుంది. ఎంతకాలం ఈగొలుసును కొనసాగించడం ? 

భాస్కరు తన పూర్వజన్మ ఫలితాలను అనుభవించడం పూర్తిచేసాడు, ఇక మోక్షం పొందడం కోసం విముక్తుడయ్యాడు. కావున దయచేసి అతనిదారిలోకి రాక అతనిని వెళ్ళనివ్వండి. భాస్కరులాంటి భక్తుడు దొరకడం కష్టమే. 

ఈ కుక్క క్రితం జన్మలో భాస్కరుకు శత్రువు, కనుక అది ఈజన్మలో బాలాపూరులో ఇతనిని కరిచింది అని తెలుసుకోండి. ప్రతీకారం పూర్తి అయింది, కానీ ఈ సంఘటన వలన భాస్కరు మనసులో ఏమాత్రమయినా చేదు మిగిలితే, ఆకాటుకు ప్రతీకారం తీర్చుకోడంకోసం మరోజన్మ ఎత్తడానికి కారణం అవుతుంది. 

కావున ఈ రోజుతో క్రితం జన్మల శతృత్వాలన్నీ పూర్తి అయి, భాస్కరు ఆజన్మలన్నిటి నుండి పరిశుద్దుడయ్యాడు అని అర్ధంచేసుకోండి. 

ఇక ఇతనికి రెండు నెలలు ఆయుర్దాయం ఉంది, నేను ఇతనిని ఈ రెండు నెలలూ ఈ కుక్క కాటు పరిణామాలనుండి రక్షిస్తాను, అలా నేను చెయ్యకపోతే తిరిగి ఇతను రెండి నెలలు జీవించడం కోసం జన్మించాలి అని శ్రీమహారాజు అన్నారు. 

శ్రీమహారాజు చెప్పిన ఈబ్రహ్మజ్ఞానం గురించి చాలామంది అర్ధంచేసుకోలేక పోయారు, కానీ బాలాభవ్ చేసుకోగలిగి చాలా సంతోషించాడు. అతను భాస్కరు యొక్క నిష్కలమైన భక్తికీ, దానివల్ల జీవన మరణ చక్రంనుండి ముక్తి పొందడాన్ని పదేపదే పొగిడాడు. అప్పుడు అందరూ షేగాం తిరిగి వచ్చారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 54 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 11 - part 2 🌻*

Bhaskar said, I am an ignorant child of Yours. You do whatever is good for me. Shri Tukaram, in his Abhang, has said that only a mother understands everything that is good for her child; I am your child, so why should I request You? You are the ocean of all knowledge! 

Hearing this, Shri Gajanan Maharaj felt very happy, as truth always satisfies people who are themselves truthful. Some devotees requested Shri Gajanan Maharaj to save Bhaskar as he was one of the most dedicated disciples. 

Shri Gajanan Maharaj said, Gentlemen, it is your ignorance that makes you say so. Know that, this life and death themselves are unreal. Nobody is born and nobody dies. 

The intellectuals have advised the knowledge of the Supreme self to understand this illusion. You cannot be liberated from the present life, without suffering the effects of the deeds of your previous life. 

You do something in your past life and take birth to suffer the effects of those deeds and then you again take birth for the deeds of the present life and so on the cycle goes on. How long will you continue this chain? 

Bhaskar has finished suffering the effects of the deeds of his past life and now is liberated to attain Moksha (to merge with the Brahma). So please do not come in his way; let him go. It is difficult to get a devotee like Bhaskar. 

Know that, this dog was his enemy in the previous life and so it has bitten him in this life at Balapur. The revenge is now over. However, if this incident leaves any bitterness in the mind of Bhaskar, it will cause him to take another birth to avenge the bite. 

So understand that, as of today, the enmity of Bhaskar’s previous life is over and he is cleansed of all effects of that life. He is left with two more months of life, and I will save him from the effects of that dog bite for two months. 

If I do not do that, he will have to take birth again and live for two months. Many people were unable to understand this supreme knowledge given out by Shri Gajanan Maharaj , but Balabhau could comprehend and so was happy. 

He praised Bhaskar again and again for his sincere devotion to the saint and thereby againing the ultimate liberation from the cycle of life and death. Then all of them returned to Shegaon.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 46 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 13 🌻*

*ఆత్మ, ఒకసారి చైతన్యమును పొందిన తరువాత, ఆచైతన్యము అంత కంతకు వికాసమొందునేకాని, తరిగిపోదు.*

178. మానవరూపము:
యుగయుగాంతరము, చైతన్యపరిణామముతో పాటు పరిణామమొందిన,
పూర్ణరూపము
అత్యుత్తమరూపము
విశిష్టరూపము
దివ్యరూపము
ఈ మానవరూపమే, ఈ మానవరూములోనే చైతన్యము పుష్కలముగా, పూర్ణముగా, అభివృద్ధి చెందినది.

ఇప్పుడు ఆత్మ,యీ పూర్ణరూపమును ఉపయోగించుకొని,యీ రూపము ద్వారా సంస్కారములను రద్దు పరచు కొనెను.

179. మానవుడు }
లేక .}
జీవాత్మ. }=శరీరము+ప్రాణము+మనసు+
లేక } చైతన్యము+ఆత్మ.
ఇన్సాన్. }

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 225 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
50. అధ్యాయము - 5

*🌻. సంధ్య యొక్క చరిత్ర - 1 🌻*

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః | స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః || 1

సూతుడిట్లు పలికెను -

మునిశ్రేష్ఠుడగు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని, సంతసించిన మనస్సు గలవాడై, శంకరుని స్మరించి ఆనందముతో నిట్లనెను (1).

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే | అద్భుతా కథితా లీలా త్వయా చ శశిమౌలినః || 2

గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే | దక్షే చ స్వగృహం యాతే తథా హి త్వయి కర్తరి || 3

మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు | సంధ్యా కుత్ర గతా సా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః || 4

కిం చకార చ కేనైవ పురుషేణ వివాహితా | ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద || 5

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! విధీ! మహాత్మా! విష్ణుశిష్యా! మహాప్రాజ్ఞా! నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి (2). 

మన్మథుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్లగా, దక్షుడు తన గృహమును చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడ గృహమును పొందగా (3),

 మానసపుత్రులు కూడ తమ తమ ధామములకు చేరుకొనగా, బ్రహ్మ పుత్రి, పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచటకు వెళ్లెను ? (4) 

ఆమె ఏమి చేసెను? ఏ పురుషుని వివాహమాడెను? నీవు సంధ్య యొక్క చరిత్ర నంతనూ విస్తారముగా చెప్పుము (5).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మ పుత్రస్య ధీమతః | సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్త్వవిత్‌ || 6

సూతుడిట్లు పలికెను -

బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడునగు ఆ నారదుని మాటను విని, తత్త్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను (6)

బ్రహ్మో వాచ |

శృణు త్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభమ్‌ | యచ్ఛృత్వా సర్వకామిన్య స్సాధ్వ్యస్స్యు స్సర్వదా మునే || 7

సా చ సంధ్యా సుతా మే హి మనో జాతా పురాs భవత్‌ | తపస్తప్త్వా తనుం త్యక్త్వా సైవ జాతా త్వరుంధతీ || 8

మేధాతి థేస్సుతా భూత్వా మునిశ్రేష్ఠస్య ధీమతీ | బ్రహ్మ విష్ణు మహేశాన వచనా చ్చరితవ్రతా || 9

వవ్రే పతిం మహాత్మానం వసిష్ఠం శంసితవ్రతమ్‌ | పతివ్రతా చ ముఖ్యా భూద్వంద్యా పూజ్యా త్వభీషణా || 10

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ మునీ! దీనిని ఎల్లవేళలా వినే స్త్రీ లందరు సాధ్వీమణులగుదురు (7). 

ఆ సంధ్య ముందుగా నాకు కుమారైయై పుట్టెను. ఆమె తపస్సును చేసి, శరీరమును వీడి అరుంధతియై జన్మించెను (8). 

బుద్ధి మంతురాలగు ఆమె గొప్ప ముని యగు మేథా తిథికి కుమారైయై జన్మించెను. గొప్ప నిష్ఠ గల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే (9) 

మహాత్ముడు, ప్రశంసింపదగిన తపోనిష్ఠుడునగు వసిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కిరింపదగిన పూజ్యురాలు అయెను (10).

నారద ఉవాచ |

కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా | కథం శరీరం సా త్యక్త్వాsభవన్మేధాతిథే స్సుతా || 11

కథం వా విహితం దేవైర్బ్రహ్మ విష్ణు శివైః పతిమ్‌ | వసిష్ఠం తు మహాత్మానం సంవవ్రే శంసిత వ్రతమ్‌ || 12

ఏతన్మే శ్రోష్యమాణాయ విస్తరేణ పితామహ | కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్త్వతః || 13

నారదుడిట్లు పలికెను -

ఆ సంధ్య తపస్సును ఎచట, ఎందుకొరకు, ఎట్లు చేసెను? ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెను? (11) 

బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు, ప్రశంసింపదగిన తపో నిష్ఠ గలవాడు, మహాత్ముడు అగు వసిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను? (12) 

ఓ పితామహా! నేను ఈ అరుంధతీ చరిత్రను విన గోరుచున్నాను ఉత్కంఠ గల నాకు ఈ చరిత్రసారమును విస్తరముగా చెప్పుము (13).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 101 🌹*
Chapter 35
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Divine Answer - 1 🌻*

God is infinite and his infinity is indivisible. God is the infinite Ocean without limit, and the individual drops which seemingly exist are not drops at all, but the Ocean. 
 
The Ocean of God has no surface, no shore, but It has waves; these waves form the  
shadow of the Ocean. 

In creation, Creation is the waves of the Ocean. In creation, there is a play between God and his shadow, because of the movement of the waves. 

God is substance and his shadow is without substance; but because of the waves the shadow moves expands spreads out. Being without substance, the shadow is nothing; its appearance is the nothingness. 

The shadow appears active because of the Substance — the waves. It is the Substance which does everything, and though the shadow is seen doing things—the movement of creation—it does nothing. In reality, creation is not happening. 
 
It cannot do anything—it cannot move by itself—because it is shadow, nothingness. When a man stands, he finds that his shadow is projected. When he moves his hands or legs, the shadow also moves. The shadow moves only because the man moves. 

So it is the man who does everything and not the shadow, and what the shadow appears to be doing is a distortion of the man's existence. 

The waves in the Ocean are similar to thoughts within the mind. It Is the waves that make creation move, in the same way that thoughts make the body move—act.  

Why does man not realize that creation is only a projection of thought by the mind?  
Because he forgets, being so absorbed in the apparent movement of creation. 

Creation is a movie, sanskaras are the film, the human body is the projector, the subtle body is the electricity, and the mind is the operator. When you operate a movie projector you see the film on the screen. 

When you become so absorbed in seeing the film, you forget that you were the one who, wanting to see the film, turned on the machine. In other words, it was really your mind that made all this happen, but you forget this. 

Only if the electricity were to go out would you remember that it was you all along who was operating the machine. In the same way, each human mind is projecting a film on the screen of the world, but everyone is so absorbed in the movie that they have forgotten that the substance in them is doing this. That substance is the waves in the Ocean of Mind—our thoughts. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అరుణి మహర్షి - 4 🌻*

21. గ్రోధం అంటే మర్రిచెట్టు. దాని కాయలను పగులగోడితే అందులో గింజలుటాయి. మరి గింజను పగులకొడితే ఏముంటుంది? ఆ గింజలో ఏమీ ఉండదు. అది భేదించబడి నప్పుడు ఏమీ ఉండదు. కాని అందులో ఆ మహావృక్షం యొక్క సూక్ష్మ రూపం ఉంది. అలాగే ఆ పరమాత్మయొక్క సూక్షమమైన బీజమందు ఇంత జగత్తూ ఇమిడిఉంది. 

22. కాబట్టి నీవు దానిని భేదించటం సాధ్యపడదు. దానిని ఎవరూ భేదించలేరు. వీటన్నిటికీ మూలమైన ఒకానొక వస్తువన్నదనే జ్ఞానం – ఆ ఒక్కటీ ఏదో నీకు తెలియనక్కరలేదు- దానిని గురించిన ధ్యానమే నీకు తపస్సు అవుతుంది. అంటే తెలిసున్న వస్తువుగురించి ధ్యానము సులభమే. తెలియని వస్తువును గురించిన ధ్యానం కష్టం. 

23. మనకు తెలిసినవాళ్ళు దూరదేశంలో ఉంటే, వాళ్ళను గురించి మనస్సులో భావనచేస్తాము, వారు మనకు తెలుసు కాబట్టి. విష్ణుధ్యానం చెయ్యమంటే, ఆయనను ఎవరు చూచారు? ఆయన ఎలా ఉంటాడు? ఎవరో పెద్దలు, ఆశ్రమవాసులు ఈ రూపంలో ఉంటాడు ఇట్లా ధ్యానం చెయ్యమని చెప్పారు.

24. జగత్తులో ఉండే వైవిధ్యాన్ని గుర్తించే ఈ బుద్ధి, ఇంద్రియముల సాయం తోటే మనస్సు అక్కడికి వెళ్ళుతుంది. అయినప్పటికీ ఏ ప్రకారంగా బోధించబడిందో ఆ వస్తువును అలాగ స్వయంగా చూడగలిగిన శక్తి దానికిలేదు. 

25. కానీ అలా చేసినవాళ్ళు ఈ స్థితిలో అనుగ్రహంపొంది ఆ దర్శనం పొందుతున్నారు. ఇది ఎవరి శక్తి? ఇది మనోబుద్ధులయొక్క శక్తికాదు. దానిని అన్వేషిస్తూ వెళ్ళేవాడికి అదే ఎదురొచ్చి అనుగ్రహించి దర్శనమిచ్చే లక్షణము దానియందున్నది. 

26. ఆ ఈశ్వరానుగ్రహంమీద ఆధారపడి తపస్సు ఫలించవలసిందే తప్ప, తపస్సుచేసేవాడి సమర్థతే అక్కడ లేదు. కాబట్టి ఆ కల్యాణ గుణం దానియందున్నది అనే భావనతో తపస్సు చేస్తే, పరమాత్మవస్తువు నీకు దర్శనం అవుతుంది.

27. తండ్రికి ఉండవలసింది మమకారం కాదు, వాత్సల్యం. వాత్సల్యంలో మోహం ఉండదు, ప్రేమ ఉంటుంది. ప్రేమవల్ల పిల్లలు మంచిమార్గంలో వెళతారు. కానీ మన కుండే మోహం వలన వాళ్ళు బాగుపడరు. 

28. ప్రేమ పవిత్రమైనది. మోహమే బంధనము. మోహము తండ్రీకొడుకులిద్దరినీ దుఃఖంలో ముంచుతుంది. దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది మోహం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 32. గీతోపనిషత్తు - ప్రసాదము - ప్రసాదమనగా మనో నిర్మలత్వము. మనో నిర్మలత్వమును పొందుటకు మనస్సు స్వాధీనము కావలెను. మనస్సు స్వాధీనమగుటకు రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించవలెను. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 64 📚*

రాగద్వేష వియుకైస్తు విషయా నింద్రియై శ్చరన్ |
ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి || 64

ప్రసాదమనగా మనో నిర్మలత్వము. మనో నిర్మలత్వమును పొందుటకు మనస్సు స్వాధీనము కావలెను. మనస్సు స్వాధీనమగుటకు రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించవలెను.

ద్వంద్వముల నధిగమించిన మనస్సుతో ఇంద్రియముల నుండి ప్రవర్తించు మానవుడు మనో నిర్మలత్వమును పొందుచున్నాడు. ప్రసాద స్వీకరణము అనగా సాధారణముగ కట్టె పొంగళి, చక్రపొంగళి, చిత్రాన్నము ఇత్యాది ఆహార పదార్థములను పూజాది కార్యక్రమములు జరిగిన తరువాత భుజించుట అని భావింతురు. 

కేవలము భుజించుటే అయినచో అది భోజనమగును. భోజనమునకు, ప్రసాద స్వీకరణకు వ్యత్యాసము కలదు. నిర్మలమైన మనస్సు గలవాని ప్రసాద స్వీకరణము విశిష్టముగ నుండును. అతడు రుచియందు రాగముగాని, రుచి లేకపోవుట యందు ద్వేషము గాని భావింపక, రుచియందు యుక్తుడై యుండక ప్రశాంతము, నిర్మలము అగు మనస్సుతో అందించిన ప్రసాద మును బ్రహ్మమని భావన చేయుచు, బ్రహ్మమునకు సమర్పణగా ఇంద్రియముల ద్వారమున గైకొనును. ఇట్లే మిగిలిన ఇంద్రియ వ్యాపారము లందు కూడ ప్రవర్తించును. ఇట్లు ప్రవర్తించువాని మనో నిర్మలత్వము ఇంద్రియార్థముల కారణమున చెడదు. ప్రశాంతత చెదరదు. 

అట్లుకాక ప్రసాదములో ఉప్పెక్కువయిన దనియు, కార మెక్కువైనదనియు, పోపు తక్కువైనదనియు ప్రసంగించువారు నిర్మలచిత్తులు కాలేరు. కారణమేమన ఇంద్రియార్థముల యందు గల రాగ ద్వేషములు. ఇట్టి రాగ ద్వేషములు సన్నివేశములయందు, ఇతర జీవులయందు, కర్తవ్యముల యందు, కార్యముల యందు గోచరింప జేయువాడు ప్రశాంతతను పొందలేడు. మనో నిర్మ లత్వము ఎండమావివలె మురిపించునుగాని అనుభూతికి అందదు.

భగవానుడు మనో నిర్మలత్వమును పొందుటకు ఒక ఉపాయమును సూటిగా సూచించు చున్నాడు. అది యేమన “నిర్వర్తించుచున్న కార్యము నందు కర్తవ్యమునే దర్శింపుము. రాగ ద్వేపములను ప్రతిబింబింప కుండును." "రాగద్వేష వియుకై:" అని తెలుపుట ఇందులకే. అట్టివానికే మనసు స్వాధీనము కాగలదు. అట్టివాడు కర్మల యందున్నను నిర్మలత్వము కోల్పోవును. చేయు పనులలో కర్తవ్యము నుండి కామ ముద్భవించినచో అది రాగద్వేషములకు, కామక్రోధములకు, లోభమోహములకు, ఈర్ష్య అసూయలకు దారితీయును. అట్టివానికి మనస్సు వశము కాదు. జీవితమను ప్రసాదమును అనుభవించలేడు.

ప్రసాదమును అనుభవించు వాడే దేహమును గూడ ఒక రాజు ప్రాసాదముగ అనుభవింపగలడు. పై శ్లోకమున రాగద్వేష విముక్తుడగుట, అట్టి మనస్సుతో ఇంద్రియ ద్వారమున కర్మలను నిర్వర్తించుట, తత్కారణముగ మనస్సు స్వాధీనమగుట, అట్టి స్వాధీనమైన మనస్సు నిర్మలత్వమును, శాంతిని పొందుట సోపానములుగ తెలుపబడినది. ఇది ఉత్కృష్టమైన సాధనాంశము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 177 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 24. Worship the indwelling ‘I am’ in you, it is the ‘I am’ that is born, it is the ‘I am’ that will die, you are not that ‘I am’. 🌻*

This indwelling principle ‘I am’ that has appeared on your True being is the one that is born and it is the one that will die. 

You are not the ‘I am’, but in order to understand this and transcend the ‘I am’ you have to worship it, stay with it constantly only then will it be pleased with you and release you from its clutches.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 55 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 19 🌻*

ఈ ఆత్మతత్వాన్ని ఇప్పుడు తెలియబరిచేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. నీవు తెలుసుకొన దలుచు కొనునటువంటి ఆత్మతత్త్వం ఎంతటి విశేషమైనటువంటిదో, ఎలా పొందాలో ఈ రెండింటి లక్షణాలని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. 

‘ఆత్మ’ ఎక్కడ వున్నది? అని అందరి ప్రశ్న. ‘ఆత్మ’ ఎక్కడో ఉన్నది - అనటానికి వీలుకాదు. అంటే ఆకాశం అవతల. పాతాళానికి ఇవతల. ఇలా చెప్పటం కుదరదు. అంటే, “నకర్మణా, నప్రజయా, యద్ధనేనైక, త్యాగేనైక అమృతత్వమానసుః” - అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆత్మ ఉన్నది. 

అంటే, ఒకటి చేయడం ద్వారా కానీ, నకర్మణా, నప్రజయా - అనేక జనబాహూళ్యం చేత కానీ, యద్ధనేనైక - ధనబలం చేత కానీ, త్యాగేనైక అమృతత్వమానసుః - ఒక్క త్యాగం చేత మాత్రమే, త్యాగబుద్ధి చేత మాత్రమే ఆత్మ తెలియబడుతుంది. ఎట్లాగు? కారణమేమిటంటే, బుద్ధి గుహయందు వుందట.

    అసలు బుద్ధి అనేది ఎక్కడుంది అంటే స్థానం చెప్పడానికి చాలా కష్టమైనటువంటింది. నీ హృదయస్థానంలో నీకు ఆత్మతత్వం నిశ్చలంగా ప్రకాశిస్తూ వున్నది. అట్టి హృదయస్థానాన్ని తెలుసుకోవాలి అనంటే, బుద్ధిపూర్వకంగానే తెలుసుకోవాలి.

 బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి అంటే, నీ ప్రాణమనస్సుల యొక్క చలనం ఎక్కడి నుంచైతే పుడుతోందో, ఆ పుట్టుక స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలి. సాధనలన్నీ ఈ హృదయస్థానమును తెలుసుకొనటం కొరకే చెప్పబడ్డాయి. 

కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సూక్ష్మమైనటువంటి, బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి, చిత్తము కంటే సూక్ష్మమైనటువంటి, అహంకారమునకంటే సూక్ష్మమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞాతగా, తెలుసుకునేవాడుగా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కూటస్థుడుగా, కదలనివాడుగా, స్థిరముగా, స్థాణువుగా, ఉన్నటువంటి స్థానము, స్థితి ఏదైతే ఉన్నదో, దానిని ‘దుర్ధర్శుడు’ అని పేరుపెట్టారు దీనికి. అంటే అర్థం ఏమిటి?

    కష్టసాధ్యమైన వాటిళ్ళోకెల్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటి దర్శనం ఏదైనా వుంది అనంటే అది ఆత్మసాక్షాత్కారం. ఈ ప్రపంచంలో హిమాలయాల మీద, ఎవరెస్ట్‌ పర్వతం మీద ఆత్మ ఉన్నది. అన్నారనుకో మీరందరూ టకటకా టకటకా దానికి తగినట్లు ప్రయాణం పూర్తిచేసుకుని, ట్రైనింగ్‌ పొంది, ఎవరెస్ట్‌ పర్వతం ఎక్కి చూస్తారు కానీ, అంత కష్టసాధ్యమైనటువంటి పని కూడా సులభమే కానీ, ‘ఆత్మసాక్షాత్కారజ్ఞానం’ - సులభం కాదు.

    అయ్యా! రాకెట్‌ వేసుకుని చంద్రమండలం మీదకు వెళ్తే, నేను చంద్రమండలం మీద నడిస్తే, ఆత్మ నాకు తెలియబడుతుందా? తెలియబడదు. నువ్వు ఎంతకష్టపడైనా అంతరిక్ష ప్రయాణం పూర్తిచేసినప్పటికీ, ఆత్మానుభూతిని పొందలేవు. అందుకని దీనికి ‘దుర్దర్శుడు’ - అని పేరుపెట్టారు. 

ఈ ‘దుర్దర్శుడు’ అన్న పదం చేత మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏంటంటే, ఇంద్రియముల ద్వారా నువ్వు దీనిని అనుభవించలేవు. అందుకని ఏమంటున్నాడు? ఎట్లా పొందవచ్చటా? ఒకటే మార్గం వుంది. వేరే మార్గం లేదు. ఏమిటి? శబ్దాది విషయముల చేత అది మరుగపరచబడి యున్నది.
‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ - అనే స్థితికి బుద్ధి పరిణామం చెందితే తప్ప, వేరే మార్గం లేదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 32🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
*🌻. 7.సహస్రార స్థితి:- 🌻*

వైలెట్ కలర్, పిట్యూటరీ గ్రంధితో కనెక్ట్ అయి ఉంటుంది. దీని క్వాలిటీ - హయ్యర్ విల్ పవర్ కలిగి ఉండడం, జ్ఞానశక్తి కలిగి ఉంటుంది.
ఈ చక్రం శరీరంలో బ్రెయిన్ తోనూ, శరీరంలో సమస్తనాడులతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఎక్కడ శక్తి నిరోధకాలు ఉన్నా వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ చక్రాన్ని *"కిరీట చక్రం"* అంటారు. 

ఇందులో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనంతమైన (సహస్రం అంటే వేయి) పాజిబులిటీస్ (అవకాశాలు) ఉంటాయి. ఇది అనంతలోకాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రం *"అహంకారం"* అనే శక్తితో బ్లాక్ చేయబడి ఉంటుంది.

🌟. *లాభాలు:-* 

ఈ చక్రంలో ఉన్న శక్తి *"కృష్ణ చైతన్యం"* మనల్ని ఈ చక్రం గ్రేట్ క్రియేటర్ గా మార్చుతుంది. విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. అంతా తానే ఉన్నానన్న స్థితిని కలిగిస్తుంది. న్యాయబద్ధంగా జీవిస్తాం. న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాం మరి ఏకత్వంలో జీవిస్తాం.

🌀. *ఈ చక్రం అండర్ యాక్టివ్ లో ఉంటే:* ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటాం.

🔹. *ఈ చక్రం ఓవర్ యాక్టివ్ లో ఉంటే:* కాంతి, శక్తి ఎక్కువ అయినదన్న భావన కలుగుతుంది. భూమితో కనెక్షన్ (భౌతికతలో కనెక్షన్) ఉండదు. అహంకారపూరితంగా (అహంకారిగా) ఉంటాం.

💠. *ఈ చక్రం సమతుల్యంగా ఉండడం వలన:* ఉన్నత చైతన్యంతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటాం. హయ్యర్ కాన్షియస్ కి ఒక వారధిని ఏర్పరుచుతుంది. ఆధ్యాత్మిక అనుసంధానాన్ని ఇస్తుంది. పరిపూర్ణ భగవత్ స్థితిని పొందుతాం.

ఈ చక్రం సత్యలోకంతో కనెక్ట్ అయి మనల్ని *"దేవర్షి"* గా పరిపూర్ణ చైతన్యాలుగా మార్చుతుంది. ఈ చక్రం DNA లో 7 ప్రోగులతో కనెక్ట్ అయి యూనివర్స్ (విశ్వం) నుంచి చైతన్యాన్ని పొందుతుంది. ఇది పిట్యూటరీ హైపోథాలమస్ గ్రంధులతో అనుసంధానం అయి ఉంటుంది.

*"నీ విశ్వం నుండి నేను దేనినైతే పొందుతానో (అర్థనారీశ్వర తత్వం) దానినే అనుభవిస్తున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, పంచుతున్నాను, సృష్టిస్తున్నాను మరి సాధిస్తున్నాను."*

🌼. *సాధన ధ్యాన సంకల్పం 1:-* 

*"నా సహస్రార చక్రంలో ఉన్న సరికాని శక్తులన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. నాలో అహంకారం ద్వారా నేను ఏ ఆత్మ స్వరూపానికి అయినా కష్టాన్ని, నష్టాన్ని కలిగించి ఉంటే వాళ్ళు నన్ను మనఃస్పూర్తిగా క్షమించాలి. వీటికి సంబంధించిన కర్మలు, కర్మముద్రలు, గుర్తులు ఏమి ఉన్నా సెల్యులార్ స్థాయి నుంచి పూర్తిగా తొలగించబడాలి."*

*🌻. సంకల్పం -2 :* 

*"నా సహస్రారచక్రం అత్యంత శక్తివంతంగా మారాలి. దీనిలోని అనంత అవకాశాలు ఓపెన్ అవ్వాలి మరి నేను ఏకత్వంలో జీవించాలి. ఐ యాం ప్రజెన్స్ (అహం బ్రహ్మాస్మి) గా మారిపోవాలి. జ్ఞాన శక్తి నాలో పరిపూర్ణంగా మేల్కొనాలి."*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 12 / Vishnu Sahasranama Contemplation - 12 🌹* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*12. ముక్తానాం పరమా గతిః, मुक्तानां परमा गतिः, Muktānāṃ paramā gatiḥ*

*ఓం ముక్తానాం పరమాయై గతయే నమః | ॐ मुक्तानां परमायै गतये नमः | OM Muktānāṃ Paramāyai Gataye Namaḥ*

ముక్తి నందిన వారలకు ఉత్తమమగు గమ్యము (అగుదేవత); అతనిని చేరిన వారికి పునరావృత్తి లేదు కదా! భగవద్గీత సాంఙ్ఖ్య యోగాధ్యాయమునందు ఈ దివ్య నామము యొక్క వివరణ పలు శ్లోకాలలో కనబడుతుంది.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్ ॥ 2.51 ॥

సమత్వబుద్ధితో గూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వాని ఫలమును త్యజించివైచి జననమరణరూపమను బంధమునుండి విడుదలను బొందినవారై దుఃఖరహితమగు మోక్షపదవిని బొందుచున్నారు.

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శ్చరతి నిస్స్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాన్తి మధిగచ్ఛతి ॥ 2.71 ॥
ఏషా బ్రాహ్మీస్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాఽస్యా మన్తకాలేఽపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ॥ 2.72 ॥

ఎవడు సమస్తములైన కోరికలను, శబ్దాదివిషయములను త్యజించి వానియందేమాత్రము ఆశలేక, అహంకారమమకారవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అర్జునా! ఇదియంతయు బ్రహ్మసంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికి విమోహమును జెందనేరడు. అంత్యకాలమునందు గూడ ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూప మోక్షమును బడయుచున్నాడు.

The highest goal of the liberated ones. For one who attains to Him, there is neither rebirth nor attaining to any thing higher, there being nothing higher than Him.

The second chapter of Bhagavad Gitā on 'The Path of Knowledge' provides elaboration on this divine name in multiple Ślokās.

Karmajaṃ buddhiyuktā hi falaṃ tyaktvā manīṣiṇaḥ,
Janmabandhavinirmuktāḥ padaṃ gacchantyanāmayam. (2.51)

Because, those who are devoted to wisdom, (they) becoming men of Enlightenment by giving up the fruits produced by actions, reach the state beyond evils by having become freed from the bondage of birth.

Vihāya kāmān yassarvān pumāṃ ścarati nisspr̥haḥ,
Nirmamō nirahaṃkāraḥ sa śānti madhigacchati. (2.71)
Ēṣā brāhmīsthiti pārthanaināṃ prāpya vimuhyati,
Sthitvā’syā mantakālē’pi brahmanirvāṇa mr̥cchati. (2.72)

That man attains peace who, after rejecting all desires, moves about free from hankering, without the idea of ('me' and) 'mine' and devoid of pride. O Parthā, this is the state of being established in Brahman. One does not become deluded after attaining this. One attains identification with Brahman by being established in this state even in the closing years of one's life.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka 
पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 14 / Sri Vishnu Sahasra Namavali - 14 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - రోహిణి నక్షత్ర 2వ పాద శ్లోకం*

*14. సర్వగ స్సర్వవిద్భానుః విశ్వక్షేనో జనార్దనః|*
*వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః|| *

123) సర్వగః - 
అన్నిచోట్లా ప్రవేశించువాడు, ఎక్కడికైనా వెళ్లగలిగేవాడు. 

124) సర్వవిద్భానుః - 
సర్వము తెలిసిన జ్ఞానముతో ప్రకాశించేవాడు.

125) విష్వక్సేనః - 
విశ్వాన్ని రక్షించేందుకు సైన్యాధిపతిగా వ్యవహరించేవాడు. 

126) జనార్దనః - 
దుష్టశక్తుల నుండీ సజ్జనులను రక్షించువాడు. 

127) వేదః - 
సమస్త జ్ఞానముకలిగినవాడు, వేదమూర్తి.

128) వేదవిత్ - 
వేదములను సంపూర్ణముగా నెరిగినవాడు.

129) అవ్యఞ్గః - 
గుణ, జ్ఞానములందు ఎట్టి లోపములు లేనివాడు.

130) వేదాఞ్గః - 
వేదములే శరీర అంగములుగా గలవాడు, వేదమూర్తి.

131) వేదవిత్ - 
వేదసారమైన ధర్మమునెరిగినవాడు.

132) కవిః - 
సూక్ష్మ దృష్టి కలిగినవాడు,అన్నింటినీ చూచువాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 14 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*14. sarvagaḥ sarva vidbhānur viṣvaksenō janārdanaḥ |*
*vedō vedavidavyaṅgō vedāṅgō vedavit kaviḥ || 14 ||*

123) Sarvagaḥ: 
One who pervades everything, being of the nature of their material cause.

124) Sarvavid-bhānuḥ: 
One who is omniscient and illumines everything.

125) Viṣvakśenaḥ: 
He before whom all Asura armies get scattered.

126) Janārdanaḥ: 
One who inflicts suffering on evil men.

127) Vedaḥ: 
He who is of the form of the Veda.

128) Vedavid: 
One who knows the Veda and its meaning.

129) Avyaṅgaḥ: 
One who is self-fulfilled by knowledge and other great attributes and is free from every defect.

130) Vedāṅgaḥ: 
He to whom the Vedas stand as organs.

131. Vedavit: 
One who knows all the Vedas.

132) Kaviḥ: 
One who sees everything.

Contnues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹