1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20, శుక్రవారం, జూలై 2022 భృగు వాసరే Friday 🌹
2) 🌹 కపిల గీత - 43 / Kapila Gita - 43 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 82 / Agni Maha Purana - 82 🌹
4) 🌹. శివ మహా పురాణము - 598 / Siva Maha Purana - 598 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 217 / Osho Daily Meditations - 217 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 389 / Sri Lalitha Chaitanya Vijnanam - 389 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 22, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 7 🍀*
*7. శ్రీధైర్యలక్ష్మి నిజభక్తహృదన్తరస్థే సన్తానలక్ష్మి నిజభక్తకులప్రవృద్ధే ।*
*శ్రీజ్ఞానలక్ష్మి సకలాగమజ్ఞానదాత్రి శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భగవానుని నిజతత్త్వాన్ని పొందిన మీదట, ఆయన పూర్ణత్వాన్ని సాధించ వలసి వుంటుంది. మొదటిది నీకు దివ్యజ్ఞానం ప్రసాదించగా, రెండవది నిన్ను దివ్యకర్మల యందు ప్రతిష్ఠించి జగద్వ్యాపారంలో నీకు పూర్ణానంద మనుగ్రహిస్తుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ నవమి 09:34:39 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: భరణి 16:26:48 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శూల 12:30:33 వరకు
తదుపరి దండ
కరణం: గార 09:34:39 వరకు
వర్జ్యం: 00:44:48 - 02:29:16
మరియు 29:44:00 - 31:30:32
దుర్ముహూర్తం: 08:28:15 - 09:20:18
మరియు 12:48:28 - 13:40:31
రాహు కాలం: 10:44:52 - 12:22:27
గుళిక కాలం: 07:29:42 - 09:07:17
యమ గండం: 15:37:37 - 17:15:12
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 11:11:36 - 12:56:04
సూర్యోదయం: 05:52:08
సూర్యాస్తమయం: 18:52:47
చంద్రోదయం: 00:41:22
చంద్రాస్తమయం: 13:46:23
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మేషం
ముద్గర యోగం - కలహం 16:26:48
వరకు తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 43 / Kapila Gita - 43🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 17. సర్వ నియామకుడినైన నన్ను ఆశ్రయం పొందడం - 3 🌴*
*43. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః*
*క్షేమాయ పాదమూలం మే ప్రవిశన్త్యకుతోభయమ్*
*బుద్ధిమంతులైన వారూ, జ్ఞ్యానమున్న వారూ, వైరాగ్యం ఉన్నవారూ, వాటితో కూడిన భక్తి ఉన్న యోగులూ, తాము బాగుండాలంటే నా పాద మూలాన్ని ఆశ్రయిస్తారు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 43 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 17. Taking Shelter of Me, the Supreme Controller - 3 🌴*
*43. jnana-vairagya-yuktena bhakti-yogena yogina*
*k§emaya pada-mulam me pravisanty akuto-bhayam*
*The yogis, equipped with transcendental knowledge and renunciation and engaged in devotional service for their eternal benefit, take shelter of My lotus feet, and since I am the Lord, they are thus eligible to enter into the kingdom of Godhead without fear.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 82 / Agni Maha Purana - 82 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. దీక్షా విధి - 8 🌻*
పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధభావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానమోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను.
సర్వతత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధాను డగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధికుని సిద్ధిమార్గమును పొందింపచేయవలెను.
అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణవిషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను.
తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసకిని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను.
అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 82 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 8 🌻*
70. As before all the principles have to be purified gradually by beating etc. on the altar of Hari. Then (he) who is bent on the inquiry of the self has to set them aside after having taken them, and beating.
71. He should purify them befitting their nature and unite them with the deity. They are then collected with pure mental disposition and yoked in order.
72- 73. By means of contemplative mood and the pose of knowledge (jñānamudrā) (they) are all purified. When all the principles have been thus purified and the Supreme lord remains. as the main, the principles have to be burnt and (the fire) extinguished and the disciples have to be engaged in the service of the Lord. Then the excellent preceptor should conduct the aspirant on the path of accomplishment.
74. In the same manner, a householder becomes qualified by remaining vigilant in (the performance of) the rites. One has to remain purifying his self until there is dissipation of anger.
75. After having known himself as shorn of anger and purified from sins, a self-controlled person should confer the right on (his) son or the disciple.
76. After having burnt the noose composed of illusion, renouncing and remaining in (the contemplation) of the self, he, who possesses the unmanifest form, should remain waiting for the decay of his body.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 598 / Sri Siva Maha Purana - 598 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*
*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 7 🌻*
కార్తికేయుడిట్లు పలికెను -
సోదరా! నీకు సర్వము దెలియును. నీవు త్రికాల జ్ఞానివి. మృత్యుంజయుడగు శివుని ఆశ్రయించిన నిన్ను ఏమని ప్రశంసించవలెను? (61) సోదరా! ప్రాణులు తమ పూర్వకార్మాను సారముగా ఏయే యోనులయందు జన్మింతురో, వాటి యందే ఆనందమును పొందుచుందురు (62).
ప్రకృతి యొక్క అంశములగు ఈ కృత్తికలు జ్ఞానము గల యోగినులు. నేను వీరి స్తన్యము చేత, మరియు వీరు చేసిన నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడనైతిని (63). నేను వీరి పెంపుడు కొడుకును. ఈ స్త్రీలు నా వంశమునకు చెందిన వారే. వీరు ఆ ప్రకృతి యొక్క అంశలు. నేను ఆ స్వామి యొక్క తేజస్సు నుండి జన్మించితిని (64).
ఓ నందీశ్వరా! పార్వతితో నా బంధుత్వమునకు భంగము లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. వీరు కూడా నాకు తల్లులు అను విషయము సర్వసమ్మతము (65).
నిన్ను శంభుడు పంపెను. మహాత్ముడవగు నీవు శంభుని పుత్రునితో సమానమైన వాడవు. నేను నీతో వచ్చి దేవతలనందరినీ చూచెదను (66). అతనితో ఇట్లు పలికి కార్తికేయుడు కృత్తికల అనుమతిని పొంది శంకరుని గణములతో బాటు పయనమయ్యెను (67).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమారఖండములో కార్తికేయుని వెదుకుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 598 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*
*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 7 🌻*
Kārttikeya said:—
61. O brother, you know everything. You are perfectly wise possessing the knowledge of the past, present and future, since you are an attendant of Śiva. Hence no praise of yours is specially called for.
62. O brother, people get reconciled to whatever form of species of life they are born. Their own actions are responsible for their birth and they are satisfied.
63. The Kṛttikās are wise women of Yogic practice. They are the digits of Prakṛti. They have helped in nurturing me with their own breast milk.
64. I am their fostered son. They are my own part and parcel. I am born of Prakṛti and the semen of the lord of Prakṛti.
65. O Nandikeśvara, I am not severed from the daughter of the lord of mountains who is virtually my mother just as these ladies on the basis of virtuous rites.
66. You have been sent by Śiva. You are like a son unto Śiva. I am coming with you. I shall see the gods.
67. After saying so and hurriedly taking leave of the Kṛttikās, Kārttikeya started along with the attendants of Śiva.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 217 / Osho Daily Meditations - 217 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 217. నూతనత్వం 🍀*
*🕉. మార్పు అనేది జీవితం అని గుర్తుంచుకోండి. ప్రతి క్షణంలో మార్పు నూతనత్వంగా అందుబాటులో ఉంటుంది. 🕉*
*మనుషులు పాతవాటికి అతుక్కుపోతే మార్పు ఆగిపోతుంది. కొత్తదనంతో మార్పు వస్తుంది. పాతదానితో ఎటువంటి మార్పు ఉండదు, కానీ ప్రజలు పాతదాన్ని అంటిపెట్టుకుని ఉంటారు ఎందుకంటే ఇది సురక్షితంగా, సౌకర్యవంతంగా, సుపరిచితమైనదిగా కనిపిస్తుంది. మీరు దానితో జీవించారు, కాబట్టి మీకు అది తెలుసు, మీరు దానిలో నైపుణ్యం కలిగి ఉన్నారు, దాని గురించి జ్ఞానం కలిగి ఉన్నారు. మళ్లీ కొత్తదనంతో మీరు అజ్ఞానులుగా ఉంటారు. కొత్తదానితో మీరు తప్పులు చేయవచ్చు; కొత్తదానితో, అది ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి తెలుసు? అందువల్ల భయం పుడుతుంది, మరియు ఈ భయం వల్ల మీరు పాతదానికి కట్టుబడి ఉంటారు. మరియు మీరు పాతదాన్ని పట్టుకోవడం ప్రారంభించిన క్షణం, మీరు ప్రవహించడం ఆగిపోయారు. కొత్తదనానికి అందుబాటులో ఉండండి. ఎప్పుడూ గతానికి చచ్చిపోతూనే ఉండండి. అది పూర్తయింది!*
*నిన్నటిది నిన్న. అది ఎప్పటికీ తిరిగి రాదు. మీరు దానిని అంటిపెట్టుకొని ఉంటే మీరు దానితో చనిపోతారు; అది నీ సమాధి అవుతుంది. రాబోయే దానికి హృదయాన్ని తెరవండి. ఉదయించే సూర్యుడికి స్వాగతం పలకండి. ఎల్లప్పుడూ అస్తమించే సూర్యుడికి వీడ్కోలు చెప్పండి. కృతజ్ఞతతో అనుభూతి చెందండి, ఇది చాలా ఇచ్చింది అని. కాని కృతజ్ఞతతో, దానికి అతుక్కోవడం ప్రారంభించ వద్దు. మీరు దీన్ని గుర్తుంచుకోగలిగితే, మీ జీవితం పెరుగుతూనే ఉంటుంది, పరిపక్వం చెందుతుంది. ప్రతి కొత్త అడుగు, ప్రతి కొత్త సాహసం కొత్త సంపదను తెస్తుంది. జీవితమంతా ఒక కదలిక అయినప్పుడు, మరణం వచ్చే సమయానికి ఒక వ్యక్తి చాలా ఉన్నతుడిగా మారతాడు. అంతిమంగా చాలా గొప్పగా తెలుసుకుంటాడు. మరణం దేనినీ తీసివేయదు. చావు పేదవారికి మాత్రమే వస్తుంది - జీవించని వారికి మాత్రమే వస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 217 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 217. THE NEW 🍀*
*🕉. Just remember that change is life. In each moment remain available to the new. 🕉*
*When people cling to the old, change stops. Change comes with the new. With the old there is no change, but people cling to the old because it seems secure, comfortable, familiar. You have lived with it, so you know it, you have become skillful in it, knowledgeable about it. With the new again you will be ignorant. With the new you may commit mistakes; with the new, who knows where it will lead? Hence fear arises, and out of this fear you cling to the old. And the moment you start clinging to the old, you have stopped flowing. Remain available to the new. Always go on dying to the past. It is finished! Yesterday is yesterday, and it can never come back.*
*If you cling to it you will be dead with it; it will become your grave. Open the heart to that which is coming. Welcome the rising sun, and always say good-bye to the setting sun. Feel grateful-it has given so much-but out of gratefulness, don't start clinging to it. If you can remember this, your life will keep growing, maturing. Each new step, each new adventure, brings new richness. And when the whole of life is a movement, by the time death arrives one is so rich, and has known something so tremendously of the ultimate, that death cannot take anything away. Death comes only to poor people - those who have not lived.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 389 / Sri Lalitha Chaitanya Vijnanam - 389🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*
*🌻 389. 'నిరుపమ'🌻*
*సాటిలేనిది శ్రీమాత అని అర్ధము. సృష్టియందు ఎవ్వరినీ శ్రీమాతతో సరిపోల్చలేరు. త్రిమూర్తులు గాని, త్రిశక్తులు గాని, ఆదిత్యులు గాని, రుద్రులు గాని, వసువులు గాని, ప్రజాపతులు, సప్త ఋషులు, కుమారులు గాని, మనువులు, మానవులు గాని ఇందెవ్వరునూ శ్రీమాతతో సరిపోలరు. వీరందరూ ఆమె నుండి దిగివచ్చిన వారే. ఆమెలోని భాగములు. వారికుండు శక్తి గాని, జ్ఞానము గాని, వ్యాపనము గాని మితమైనవే. శ్రీమాత అపరిమిత. ఆమెనుండియే వీరందరునూ దిగివచ్చిరి. మొత్తము సృష్టికూడ ఆమెలో ఒక భాగమే. ఈమెకు సాటిలేదు అని శ్రుతియందు చెప్పబడెను. ఉపమానము లేనిది. సర్వ వ్యాపకమైన చైతన్యముతో సరిపోల్చ గలిగినది మరియొకటి ఎట్లుండును?*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 389 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini*
*Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻*
*🌻 389. Nirupamā निरुपमा 🌻*
*She is without comparison. Brahman is infinite and a person with finite (limited) cannot describe Him. Śvetāśvatara Upaniṣad (IV.19) says, “There is no way of describing Him. All you can say about Him is that He is what He is”.*
*Śaṃkara says “There is nothing like Him and nothing to which He can be compared. He is one without a second. He is limitless. The only way you can describe Him is to refer to His uniqueness, which is really saying nothing.”*
*There is a story about this concept. Two brothers were sent by their father to a guru to pursue the spiritual path. When they returned, father asked both of them to describe God. The elder brother gave an extensive lecture about God. When the younger one was asked, he kept quiet.*
*Their father said ‘You are not saying anything because, you realized that God is a subject about which nothing can be said without making a mistake’. This is the concept of God. Nobody can describe the Brahman in totality. At the most one can discuss about Him only by affirmations and negations.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹