శ్రీ శివ మహా పురాణము - 598 / Sri Siva Maha Purana - 598


🌹 . శ్రీ శివ మహా పురాణము - 598 / Sri Siva Maha Purana - 598 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴

🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 7 🌻

కార్తికేయుడిట్లు పలికెను -


సోదరా! నీకు సర్వము దెలియును. నీవు త్రికాల జ్ఞానివి. మృత్యుంజయుడగు శివుని ఆశ్రయించిన నిన్ను ఏమని ప్రశంసించవలెను? (61) సోదరా! ప్రాణులు తమ పూర్వకార్మాను సారముగా ఏయే యోనులయందు జన్మింతురో, వాటి యందే ఆనందమును పొందుచుందురు (62).

ప్రకృతి యొక్క అంశములగు ఈ కృత్తికలు జ్ఞానము గల యోగినులు. నేను వీరి స్తన్యము చేత, మరియు వీరు చేసిన నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడనైతిని (63). నేను వీరి పెంపుడు కొడుకును. ఈ స్త్రీలు నా వంశమునకు చెందిన వారే. వీరు ఆ ప్రకృతి యొక్క అంశలు. నేను ఆ స్వామి యొక్క తేజస్సు నుండి జన్మించితిని (64).

ఓ నందీశ్వరా! పార్వతితో నా బంధుత్వమునకు భంగము లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. వీరు కూడా నాకు తల్లులు అను విషయము సర్వసమ్మతము (65).

నిన్ను శంభుడు పంపెను. మహాత్ముడవగు నీవు శంభుని పుత్రునితో సమానమైన వాడవు. నేను నీతో వచ్చి దేవతలనందరినీ చూచెదను (66). అతనితో ఇట్లు పలికి కార్తికేయుడు కృత్తికల అనుమతిని పొంది శంకరుని గణములతో బాటు పయనమయ్యెను (67).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమారఖండములో కార్తికేయుని వెదుకుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 598 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴

🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 7 🌻


Kārttikeya said:—

61. O brother, you know everything. You are perfectly wise possessing the knowledge of the past, present and future, since you are an attendant of Śiva. Hence no praise of yours is specially called for.

62. O brother, people get reconciled to whatever form of species of life they are born. Their own actions are responsible for their birth and they are satisfied.

63. The Kṛttikās are wise women of Yogic practice. They are the digits of Prakṛti. They have helped in nurturing me with their own breast milk.

64. I am their fostered son. They are my own part and parcel. I am born of Prakṛti and the semen of the lord of Prakṛti.

65. O Nandikeśvara, I am not severed from the daughter of the lord of mountains who is virtually my mother just as these ladies on the basis of virtuous rites.

66. You have been sent by Śiva. You are like a son unto Śiva. I am coming with you. I shall see the gods.

67. After saying so and hurriedly taking leave of the Kṛttikās, Kārttikeya started along with the attendants of Śiva.


Continues....

🌹🌹🌹🌹🌹


22 Jul 2022

No comments:

Post a Comment