శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 389 / Sri Lalitha Chaitanya Vijnanam - 389


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 389 / Sri Lalitha Chaitanya Vijnanam - 389🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀


🌻 389. 'నిరుపమ'🌻


సాటిలేనిది శ్రీమాత అని అర్ధము. సృష్టియందు ఎవ్వరినీ శ్రీమాతతో సరిపోల్చలేరు. త్రిమూర్తులు గాని, త్రిశక్తులు గాని, ఆదిత్యులు గాని, రుద్రులు గాని, వసువులు గాని, ప్రజాపతులు, సప్త ఋషులు, కుమారులు గాని, మనువులు, మానవులు గాని ఇందెవ్వరునూ శ్రీమాతతో సరిపోలరు. వీరందరూ ఆమె నుండి దిగివచ్చిన వారే. ఆమెలోని భాగములు. వారికుండు శక్తి గాని, జ్ఞానము గాని, వ్యాపనము గాని మితమైనవే. శ్రీమాత అపరిమిత. ఆమెనుండియే వీరందరునూ దిగివచ్చిరి. మొత్తము సృష్టికూడ ఆమెలో ఒక భాగమే. ఈమెకు సాటిలేదు అని శ్రుతియందు చెప్పబడెను. ఉపమానము లేనిది. సర్వ వ్యాపకమైన చైతన్యముతో సరిపోల్చ గలిగినది మరియొకటి ఎట్లుండును?


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 389 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻

🌻 389. Nirupamā निरुपमा 🌻

She is without comparison. Brahman is infinite and a person with finite (limited) cannot describe Him. Śvetāśvatara Upaniṣad (IV.19) says, “There is no way of describing Him. All you can say about Him is that He is what He is”.

Śaṃkara says “There is nothing like Him and nothing to which He can be compared. He is one without a second. He is limitless. The only way you can describe Him is to refer to His uniqueness, which is really saying nothing.”

There is a story about this concept. Two brothers were sent by their father to a guru to pursue the spiritual path. When they returned, father asked both of them to describe God. The elder brother gave an extensive lecture about God. When the younger one was asked, he kept quiet.

Their father said ‘You are not saying anything because, you realized that God is a subject about which nothing can be said without making a mistake’. This is the concept of God. Nobody can describe the Brahman in totality. At the most one can discuss about Him only by affirmations and negations.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jul 2022

No comments:

Post a Comment