శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 338 / Sri Lalitha Chaitanya Vijnanam - 338


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 338 / Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀

🌻 338. 'వేదజననీ' 🌻

వేదములకు తల్లి శ్రీదేవి అని అర్థము. వేద మనగా ఏది తెలిసినచో ఇక తెలియవలసిన దేమియు ఉండదో అది వేదము. అనగా పూర్ణజ్ఞానము. తెలియుటకు తెలివి వలయును. తెలివి చైతన్యము నుండి పుట్టినది. మేల్కాంచిన వెనుకనే తెలివి పనిచేయును. నే మేల్కాంచిన వెనుకనే నేనున్నానని తెలియును. ఇట్లు మేల్కాంచుటకు చైతన్య మాధారము. చైతన్యము తత్త్వము యొక్క వ్యక్తస్థితి. అట్టి వ్యక్త స్థితి నుండి జీవులు పుట్టుదురు. వారి యందును ఉండుట, చైతన్యవంతులగుట జరుగుచుండును. చైతన్యవంతమైనపుడే నేనున్నానని తెలియును. తానున్నానని తెలిసినవాడే తన పరిసరము లను, సృష్టిని కూడా తెలియుటకు ప్రయత్నించును. తెలివి ఆధారము గనే తెలియుట జరుగును.

తెలుసుకొనువాడు, తెలుసుకొను విషయము, తెలుసుకొనుట అను కార్యము- మూడును కలిపి జ్ఞానము. తెలుసుకొను వాడు తెలియుట యందు నిమగ్నమై తెలియబడు విషయమున కరగును. అపుడు జ్ఞానమే తానుగ నున్నాడని తెలియును. చైతన్యమే తానుగ నున్నాడని తెలియును. తా నొకడు ప్రత్యేకముగా నున్నాడను భావము తొలగును. ఉన్నదంతయూ సత్ చిత్ లే అని తెలియును. ఇట్లు వేదము తెలియును. అది తెలియబడుటకు శుద్ధ చైతన్యమగు శ్రీమాతయే ఆధారము. ఆమెయే తెలియు వానికి, అతని యందలి తెలివికి, తెలియ వలెనను ఆసక్తికి, తెలియబడు విషయమునకు మూలము, పుట్టినిల్లు కనుక ఆమెయే వేదమాత. ఆమెయే 'వేదజనని'.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻

🌻 338. Veda-jananī वेद-जननी (338) 🌻


Creator of Veda-s. Literally this can be explained as ‘She gave birth to Veda-s’. Veda-s originated from the Brahman in the form of sound. This sound was realized by the ancient sages and taught to their disciples orally. Only in the recent past, Veda-s are made available in textual forms. More than the text, the orthoepy is important in Veda-s and any wrong recitals or wrong notes (svara) leads to undesired results. This was the reason for teaching Veda-s orally. Veda-s originate from Śabda Brahman (śabda means sound).

Muṇḍaka Upaniṣad (I.i.5) gives a different interpretation. “There are two categories of knowledge, secular or aparā and spiritual or parā. Aparā comprises of four Veda-s, phonetics, rituals, grammar, etymology, metre and astronomy. But parā is that by which one knows the Brahman, which is ever the same and never decays.”

But, Bṛhadāraṇyaka Upaniṣad (II.iv.10) puts this in a different perspective. “Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, history, mythology, arts, Upaniṣads, pithy verses, aphorisms, elucidations and explanations are like the breath of this infinite Reality. They are like the breath of this Supreme Self.”

Puruṣa-sūktam gives yet another interpretation. It says that ‘the Veda-s originated from sarvahuta yajñā that was conducted by gods and great sages, invoking Puruṣa as the lord of this fire ritual. This Puruṣa is called the Brahman, from whom the Veda-s originated.

Even though the interpretations are different, all of them concur that the Veda-s or its subtle form sound, originated from the Supreme.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 122-2


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 122-2 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అచేతనావస్థ మన అలవాటు. జన్మజన్మల అలవాటు. ఈ క్షణం నించీ మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో, ప్రతి అనుభూతిలో చైతన్యంతో వుండడానికి ప్రయత్నించాలి. 🍀


తూర్పు దేశాల్లో మనం పద్మంగా మారడం గురించి చెబుతాం. వేయి రేకుల పద్మంలా విచ్చుకోవడం గురించి చెబుతాం. ప్రతి ఒక్కరూ విత్తనాన్ని మోస్తూ వుంటారు. మొగ్గను మోస్తూ వుంటారు. కానీ చైతన్యానికి గొప్ప ప్రయత్నం అవసరం. అచేతనావస్థ మన అలవాటు. జన్మజన్మల అలవాటు. ఈ క్షణం నించీ మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో, ప్రతి అనుభూతిలో చైతన్యంతో వుండడానికి ప్రయత్నించాలి. ఈ మూడూ మూడు కోణాలు.

ఈ మూడు కోణాల గుండా మనం మరింత పరిశీలనాత్మకంగా, మరింత చురుగ్గా, మరింత సాక్షీభూతంగా మారుతాం. ఈ మూడింటి ద్వారా నాలుగోదయిన సాక్షిగా మండడం రంగంలోకి వస్తుంది. అదే మన అసలు తత్వం. ఒకసారి నువ్వు సాక్షితత్వాన్ని ఎట్లా ఆవిష్కరించాలో తెలుసుకుటే నువ్వు కళారహస్యాన్ని అందుకుంటావు. నీ అంతరాంతరాల్లోని అంధకార ఖండాన్ని కాంతితో నింపుతారు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 57


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 57 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 44. పరహితము - మోక్షము🌻


ఇద్దరు నావికులు పడవలో పోవుచుండగ పడవకు చిల్లుపడి మునిగెను. ఇద్దరును సముద్రములో రోజుల తరబడి యీదుచూ, తేలుచూ ఒక జనసంచారము లేని ద్వీపమును చేరిరి. ఆకలిదప్పులతో, భయముతో ప్రపంచమునకు దూరమై ప్రపంచము కొఱకై తపించు చుండిరి. కొన్ని దినములకు ఒక ఓడ అటుపోవుచుండగ నానా విధముల శ్రమపడి ఓడవారిని ఆకర్షించిరి. ఓడను ద్వీపమునకు మరలించి వారిద్దరిని ఓడలోనికి ఎక్కించుకొని స్వదేశమేగిరి. వారెంతయో ఆనందోత్సాహముతో తమ వారితో గడిపిన వెనుక మరల స్వచ్ఛందముగ ఆ ద్వీపమున కేగిరి. అచటనొక దీప స్తంభమును (Light house) ఏర్పరచి వచ్చు పోవు ఓడలకు సూచన లిచ్చుచు, సముద్రములోని రాళ్ళచే ఓడలు పగలకుండ కాపాడు చుండిరి. ఇదివరకు ఆ ద్వీపమున వారు దుఃఖపూరితులై సహాయము కొఱుకు తపనతో ఎదురు చూచుచుండిరి.

ఇప్పుడు అదే ద్వీపమున సంతోషముతో పలురకములుగ ప్రయాణము చేయువారికి తగు సూచనలు, సహకారము అందించుచు ఆనందముగ జీవించుచుండిరి. ఇదివరకు ఆ ద్వీపమున దుఃఖపడుటకును, ఇప్పుడు అదే ద్వీపమున ఆనందముగ నుండుటకును ఏమి కారణము? ఇదివరకు వారు ఒంటరులు, అనాధలు, ఇతర ప్రపంచముతో సంబంధము లేక అలమటించిన వారు. ఇపుడు వారు ఒంటరులు కారు, అనాధలు కారు. ఇతర ప్రపంచముతో సత్సంబంధములు ఏర్పరచుకొని పరహిత కార్యములను చేయుచున్నారు. మీ స్థితియు దాదాపుగ ద్వీపమున వేరుపడిన వారి స్థితియే. అందులకే భూమి జీవనము మీకు దుఃఖపూరితముగ గోచరించి, మోక్షము! మోక్షము! అని కేకలు పెట్టుదురు. దివ్య లోకములతో సంబంధము ఏర్పడినచో, యిక మోక్షమును గూర్చిన ఏడుపు యుండదు. ఇచ్చటనే దివ్యకార్యములను నిర్వర్తించుచూ ఆనందించ గలరు.మేము ప్రస్తుతము చేయుచున్నదదియే! మీరును ఈ మార్గమును ఎన్నుకొనవచ్చును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 540 / Vishnu Sahasranama Contemplation - 540


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 540 / Vishnu Sahasranama Contemplation - 540 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻540. సుషేణః, सुषेणः, Suṣeṇaḥ🌻

ఓం సుషేణాయ నమః | ॐ सुषेणाय नमः | OM Suṣeṇāya namaḥ

సుషేణః, सुषेणः, Suṣeṇaḥ

శ్రీవిష్ణోశ్శోభనా సేనా విద్యతే హి గణాత్మికా ।
యస్ససోఽయం సుషేణ ఇత్యుచ్యతే విదుషాం వరైః ॥

పార్షద గణ రూపమగు అనగా 'సు' లేదా శోభనమైన సేన గలవాడు అను విగ్రహమున సుషేణ శబ్దము విష్ణువును బోధించును.


:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::

వ.మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును సునంద నందకుముదాది సేవితుండును బ్రకృతిపురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియమనో మహాభూతంబులను షోడశ శక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభా విక సమస్తైశ్వర్యాతిశయుండునునై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుడును, రోమాంచకంచుకిత శరీరుండును, ఆనందబాష్పధారాసిక్త కపోలుండును నగుచు. (238)

అమూల్యమైన మణిమయ సింహాసనంలో కూర్చున్నవాడూ; సునందుడు, నందుడు, కుముదుడు మొదలైన పార్షదుల సేవలు గైకొనుచున్నవాడూ; ప్రకృతి, పురుషుడు, మహతత్త్వము, అహంకారము అనే నాలుగు శక్తులూ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే పంచ కర్మేంద్రియాలూ; శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనే పంచ జ్ఞానేంద్రియాలూ; మనస్సూ; పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే పంచభూతాలూ - ఈ పదునారు శక్తులూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రలూ తనచుట్టూ చేరి కొలుస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో భాసించేవాడూ; ఇతరులకు లభ్యం కానివీ, తనకు మాత్రమే స్వభావసిద్ధమైనవీ అయిన సకలైశ్వర్యాలతో ప్రకాశించేవాడూ; నిజస్వరూపంలోనే వినోదించేవాడూ, అంతటికీ అదినాథుడు, పరమపురుషుడు, పరమశ్రేష్ఠుడు, పద్మాక్షుడూ అయిన నారాయణుడిని బ్రహ్మ దేవుడు చూసినాడు. ఆయన హృదయపద్మము అమితానందముతో వికసించినది. ఆయన శరీరం గగుర్పాటు చెందినది. ఆయన చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో ఆర్ద్రములైనాయి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 540 🌹

📚. Prasad Bharadwaj

🌻540. Suṣeṇaḥ🌻


OM Suṣeṇāya namaḥ

श्रीविष्णोश्शोभना सेना विद्यते हि गणात्मिका ।
यस्ससोऽयं सुषेण इत्युच्यते विदुषां वरैः ॥

Śrīviṣṇośśobhanā senā vidyate hi gaṇātmikā,
Yassaso’yaṃ suṣeṇa ityucyate viduṣāṃ varaiḥ.


He who possesses the auspicious groups of senas or armies of the form of gaṇas. So Lord Viṣṇu is Suṣeṇaḥ.


:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे नवमोऽध्यायः ::

ददर्श तत्राखिलसात्वतां पतिं श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् ।
सुनन्दनन्दप्रबलार्हणादिभिः स्वपार्षदाग्रैः परिसेवितं विभुम् ॥ १४ ॥


Śrīmad Bhāgavata - Canto 2, Chapter 9

Dadarśa tatrākhilasātvatāṃ patiṃ śriyaḥ patiṃ yajñapatiṃ jagatpatim,
Sunandanandaprabalārhaṇādibhiḥ svapārṣadāgraiḥ parisēvitaṃ vibhum. 14.


Lord Brahmā saw Him in the Vaikun‌t‌ha, who is the Lord of the entire devotee community, the Lord of the goddess of fortune, the Lord of all sacrifices, and the Lord of the universe, and who is served by the foremost servitors like Nanda, Sunanda, Prabala and Arhan‌a, His immediate associates.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


13 Jan 2022

ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత Significance of Mukkoti Vaikuntha Ekadashi


🌹. ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🔅. శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా కొలిచే పండుగ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు చేస్తారూ అంటే చాలా మందికి తెలియని విషయం. సూర్య మానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కువగా ఇది పుష్య శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున అన్నీ వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు.

🔅. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కూడి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. మూడు కోట్ల దేవతలతో కూడి దర్శనం ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం. వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశి, పుత్ర ఏకాదశి అనికూడా పిలుస్తారు.

🔅. ముక్కోటి ఏకాదశి రోజునే క్షీర సాగర మధనంలో హాలాహలం పుట్టింది. సమస్త జీవకోటి హాలాహల ప్రభావంతో సతమతం అవుతుంటే, పరమ శివుడు విషాన్ని తన గొంతులో ధరించి జీవకోటికి ఉపశమనం కలిగిస్తాడు. తర్వాత అమృతం పుట్టింది.

🔅. విష్ణు పురాణంలో వైకుంఠ ఏకాదశి గురించి ఒక కథ ఉంది. పూర్వం ముర అనే రాక్షసుడు ప్రజలను, ఋషులను, దేవతలను హింసిస్తుండేవాడు. ముర పెట్టే బాధలకు తాళలేక, రాక్షసుని బారి నుంచి రక్షించమని దేవతలు విష్ణువును శరణు వేడుకొంటారు. మురను సంహరించాలంటే ప్రత్యేక మైన అస్త్రం కావాలని, అందుకు కొంతకాలం వేచియుండమని చెప్పి దేవతలను పంపి, బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి విశ్రమిస్తాడు. గుహలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును సంహరించడానికి వచ్చిన మురను, విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి సంహరిస్తుంది. అలా ఉద్భవించిన శక్తీకి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం, జాగారం, దాన ధర్మాలు చేసినట్లయితే వారి పాపములను హరిస్తానని ఏకాదశికి వరమిస్తాడు. అన్నీ ఏకాదశి పర్వదినాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పర్వదినాలు.

🔅. ముక్కోటి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అనే ప్రశ్న ఉదయించక మానదు. ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే ద్వాదశి నాడు రాత్రి బియ్యంతో చేసిన అన్నం/ఆహారం కాకుండా అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున తెల్లవారు జామున వీలయినంత త్వరగా నిద్ర లేచి శిర స్నానం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయటం మంచిది. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువతో పాటుగా మూడు కోట్ల దేవతలు కూడా కొలువై ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు పోతాయి. మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసమంటే పూర్తిగా ఆహారం లేకుండా ఉండటం కాదు. బియ్యంతో వండిన ఆహారం కాకుండా, పాలు, పళ్ళూ లాంటి వాటిని మితంగా తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ముర రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు కనుక బియ్యంతో వండిన ఆహార పదార్థములు భుజించరాదని చెపుతారు. ఏకాదశి రోజున పగలు మరియు రాత్రి నిద్ర పోకుండా జాగారం ఉండాలి. జాగారం అంటే వినోద కార్యక్రమాలతో మేలుకొని ఉండటం కాదు, మేలుకొని దైవ ధ్యానంలో గడపాలి. తెల్లవారిన తరువాత శుచిగా స్నానమాచరించి, పూజా మందిరం శుభ్రం చేసి విష్ణువును పూజించాలి. తరువాత శక్తి కొలది దానం చేయాలి. తరువాత ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయవచ్చు. ద్వాదశి రోజున పగలు నిద్ర పోరాదు. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సర్వ పాపములు నశించి, యమ భయం ఉండదు. వైకుంఠ ఏకాదశినాడు మరణించిన వారు నేరుగా వైకుంఠం చేరుతారని పురాణాలు చెబుతున్నాయి.

🔅. తమిళనాడులోని శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు వైభవంగా జరుగుతాయి. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

🔅. మన రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.

🔅. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో నిండి ఉంటాయి.


🙏. ఓమ్ నమోనారాయణాయ🌼ఓం నమో వెంకటేశయా 🙏

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2022

13-JANUARY-2022 గురువారం MESSAGES వైకుంఠ ఏకాదశి

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 13, జనవరి 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹
🌹. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 143 / Bhagavad-Gita - 143 - 3-24 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 540 / Vishnu Sahasranama Contemplation - 540 🌹
4) 🌹 DAILY WISDOM - 218🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 57 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 123🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 338 / Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 13, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం - 5 🍀*

*యస్మాద్విశ్వాభిరామాదిహ జననవిధౌ సర్వనందాదిగోపాః*
*సంసారార్తేర్విముక్తాః సకల సుఖకరాః సంపదః ప్రాపురేవ |*
*ఇత్థం పూర్ణేందువక్త్రః కలకమల దృశః స్వీయజన్మ స్తువంతః*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ 5*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 19:34:25
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: కృత్తిక 17:07:05
వరకు తదుపరి రోహిణి
యోగం: శుభ 12:34:58
వరకు తదుపరి శుక్ల
కరణం: విష్టి 19:33:26 వరకు
సూర్యోదయం: 06:49:03
సూర్యాస్తమయం: 18:00:18
వైదిక సూర్యోదయం: 06:52:54
వైదిక సూర్యాస్తమయం: 17:56:28
చంద్రోదయం: 14:20:28
చంద్రాస్తమయం: 02:51:10
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
వర్జ్యం: 03:33:30 - 05:21:58
దుర్ముహూర్తం: 10:32:48 - 11:17:33
మరియు 15:01:19 - 15:46:04
రాహు కాలం: 13:48:35 - 15:12:30
గుళిక కాలం: 09:36:52 - 11:00:47
యమ గండం: 06:49:03 - 08:12:58
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 14:24:18 - 16:12:46
లంబ యోగం - చికాకులు, అపశకునం
17:07:05 వరకు తదుపరి ఉత్పాద యోగం
- కష్టములు, ద్రవ్య నాశనం
పండుగలు : వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి, 
పౌష పుత్రదా ఏకాదశి
Vaikuntha Ekadashi
Pausha Putrada Ekadashi
లోహిరి Lohri (పంజాబ్‌)
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత 🌹*
 *📚. ప్రసాద్ భరద్వాజ*

*🔅. శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా కొలిచే పండుగ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు చేస్తారూ అంటే చాలా మందికి తెలియని విషయం. సూర్య మానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కువగా ఇది పుష్య శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున అన్నీ వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు.*

*🔅. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కూడి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. మూడు కోట్ల దేవతలతో కూడి దర్శనం ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం. వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశి, పుత్ర ఏకాదశి అనికూడా పిలుస్తారు.*
 
*🔅. ముక్కోటి ఏకాదశి రోజునే క్షీర సాగర మధనంలో హాలాహలం పుట్టింది. సమస్త జీవకోటి హాలాహల ప్రభావంతో సతమతం అవుతుంటే, పరమ శివుడు విషాన్ని తన గొంతులో ధరించి జీవకోటికి ఉపశమనం కలిగిస్తాడు. తర్వాత అమృతం పుట్టింది.*

*🔅. విష్ణు పురాణంలో వైకుంఠ ఏకాదశి గురించి ఒక కథ ఉంది. పూర్వం ముర అనే రాక్షసుడు ప్రజలను, ఋషులను, దేవతలను హింసిస్తుండేవాడు. ముర పెట్టే బాధలకు తాళలేక, రాక్షసుని బారి నుంచి రక్షించమని దేవతలు విష్ణువును శరణు వేడుకొంటారు. మురను సంహరించాలంటే ప్రత్యేక మైన అస్త్రం కావాలని, అందుకు కొంతకాలం వేచియుండమని చెప్పి దేవతలను పంపి, బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి విశ్రమిస్తాడు. గుహలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును సంహరించడానికి వచ్చిన మురను, విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి సంహరిస్తుంది. అలా ఉద్భవించిన శక్తీకి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం, జాగారం, దాన ధర్మాలు చేసినట్లయితే వారి పాపములను హరిస్తానని ఏకాదశికి వరమిస్తాడు. అన్నీ ఏకాదశి పర్వదినాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పర్వదినాలు.*

*🔅. ముక్కోటి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అనే ప్రశ్న ఉదయించక మానదు. ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే ద్వాదశి నాడు రాత్రి బియ్యంతో చేసిన అన్నం/ఆహారం కాకుండా అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున తెల్లవారు జామున వీలయినంత త్వరగా నిద్ర లేచి శిర స్నానం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయటం మంచిది. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువతో పాటుగా మూడు కోట్ల దేవతలు కూడా కొలువై ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు పోతాయి. మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసమంటే పూర్తిగా ఆహారం లేకుండా ఉండటం కాదు. బియ్యంతో వండిన ఆహారం కాకుండా, పాలు, పళ్ళూ లాంటి వాటిని మితంగా తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ముర రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు కనుక బియ్యంతో వండిన ఆహార పదార్థములు భుజించరాదని చెపుతారు. ఏకాదశి రోజున పగలు మరియు రాత్రి నిద్ర పోకుండా జాగారం ఉండాలి. జాగారం అంటే వినోద కార్యక్రమాలతో మేలుకొని ఉండటం కాదు, మేలుకొని దైవ ధ్యానంలో గడపాలి. తెల్లవారిన తరువాత శుచిగా స్నానమాచరించి, పూజా మందిరం శుభ్రం చేసి విష్ణువును పూజించాలి. తరువాత శక్తి కొలది దానం చేయాలి. తరువాత ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయవచ్చు. ద్వాదశి రోజున పగలు నిద్ర పోరాదు. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సర్వ పాపములు నశించి, యమ భయం ఉండదు. వైకుంఠ ఏకాదశినాడు మరణించిన వారు నేరుగా వైకుంఠం చేరుతారని పురాణాలు చెబుతున్నాయి.*
 
*🔅. తమిళనాడులోని శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు వైభవంగా జరుగుతాయి. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.*

*🔅. మన రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.*

*🔅. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో నిండి ఉంటాయి.*

*🙏. ఓమ్ నమోనారాయణాయ🌼ఓం నమో వెంకటేశయా 🙏*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -143 / Bhagavad-Gita - 143 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 24 🌴*

*24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదాహమ్ |*
*సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమా: ప్రజా: ||*

🌷. తాత్పర్యం :
*విధ్యుక్తధర్మమములను నేను నిర్వహింపనిచో లోకములన్నియును నాశామును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనై తద్ద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరచిన వాడనగుదును.*

🌷. భాష్యము : 
వర్ణసంకరమనగా మానవసంఘము యొక్క శాంతిని చెరచునటువంటి అవాంఛనీయ జనబాహుళ్యమని భావము. సంఘపు ఈ శాంతి భగ్నతను నివారించుటకే విధినియమములను నిర్ణయింపబడినవి. వాటి ద్వారా మనుజులు అప్రయత్నముగా శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. 

శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అట్టి నియమనిభందనలు గౌరవము మరియు అవసరములు కొనసాగు రీతిలో వాటిని అనుసరించును. శ్రీకృష్ణభగవానుడు జీవులందరినీ తండ్రి గనుక ఒకవేళ జీవులు తప్పుదారి పట్టినచో ఆ భాద్యత పరోక్షముగా అతనికే చెందును. కనుకనే ఎప్పుడు ధర్మనియమముల యెడ అగౌరము పొడసూపునో అప్పుడు అతడు అవతరించి సంఘము సరిచేయును. 

భగవానుని అడుగుజాడలలో నుడవవలసియున్నను ఎన్నడును అతనిని అనుకరించలేమనెడి సత్యమును మనము ఎరిగి యుండవలెను. అనుసరించుట మరియు అనుకరించుట యనునవి సమానమైనవి కావు. ఉదాహరణమునకు శ్రీకృష్ణుడు బాల్యములో చూపిన గోవర్ధనోద్ధరణమును మనము అనుసరింప లేము. ఏ మానవునికైనను అది అసాధ్యమైనదే. అనగా అతని ఉపదేశములను మనము అనుసరించగలము కాని ఎన్నడును అతనిని అనుకరింపలేము.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 143 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 24 🌴*

*24. utsīdeyur ime lokā na kuryāṁ karma ced aham*
*saṅkarasya ca kartā syām upahanyām imāḥ prajāḥ*

🌷Translation :
*If I did not perform prescribed duties, all these worlds would be put to ruination. I would be the cause of creating unwanted population, and I would thereby destroy the peace of all living beings.*

🌷 Purport :
Varṇa-saṅkara is unwanted population which disturbs the peace of the general society. In order to check this social disturbance, there are prescribed rules and regulations by which the population can automatically become peaceful and organized for spiritual progress in life. When Lord Kṛṣṇa descends, naturally He deals with such rules and regulations in order to maintain the prestige and necessity of such important performances. The Lord is the father of all living entities, and if the living entities are misguided, indirectly the responsibility goes to the Lord.

Therefore, whenever there is general disregard of regulative principles, the Lord Himself descends and corrects the society. We should, however, note carefully that although we have to follow in the footsteps of the Lord, we still have to remember that we cannot imitate Him. Following and imitating are not on the same level. We cannot imitate the Lord by lifting Govardhana Hill, as the Lord did in His childhood. It is impossible for any human being. We have to follow His instructions, but we may not imitate Him at any time.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 540 / Vishnu Sahasranama Contemplation - 540 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻540. సుషేణః, सुषेणः, Suṣeṇaḥ🌻*

*ఓం సుషేణాయ నమః | ॐ सुषेणाय नमः | OM Suṣeṇāya namaḥ*

*సుషేణః, सुषेणः, Suṣeṇaḥ*

శ్రీవిష్ణోశ్శోభనా సేనా విద్యతే హి గణాత్మికా ।
యస్ససోఽయం సుషేణ ఇత్యుచ్యతే విదుషాం వరైః ॥

*పార్షద గణ రూపమగు అనగా 'సు' లేదా శోభనమైన సేన గలవాడు అను విగ్రహమున సుషేణ శబ్దము విష్ణువును బోధించును.*

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
వ.మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును సునంద నందకుముదాది సేవితుండును బ్రకృతిపురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియమనో మహాభూతంబులను షోడశ శక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభా విక సమస్తైశ్వర్యాతిశయుండునునై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుడును, రోమాంచకంచుకిత శరీరుండును, ఆనందబాష్పధారాసిక్త కపోలుండును నగుచు. (238)

అమూల్యమైన మణిమయ సింహాసనంలో కూర్చున్నవాడూ; సునందుడు, నందుడు, కుముదుడు మొదలైన పార్షదుల సేవలు గైకొనుచున్నవాడూ; ప్రకృతి, పురుషుడు, మహతత్త్వము, అహంకారము అనే నాలుగు శక్తులూ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే పంచ కర్మేంద్రియాలూ; శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనే పంచ జ్ఞానేంద్రియాలూ; మనస్సూ; పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే పంచభూతాలూ - ఈ పదునారు శక్తులూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రలూ తనచుట్టూ చేరి కొలుస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో భాసించేవాడూ; ఇతరులకు లభ్యం కానివీ, తనకు మాత్రమే స్వభావసిద్ధమైనవీ అయిన సకలైశ్వర్యాలతో ప్రకాశించేవాడూ; నిజస్వరూపంలోనే వినోదించేవాడూ, అంతటికీ అదినాథుడు, పరమపురుషుడు, పరమశ్రేష్ఠుడు, పద్మాక్షుడూ అయిన నారాయణుడిని బ్రహ్మ దేవుడు చూసినాడు. ఆయన హృదయపద్మము అమితానందముతో వికసించినది. ఆయన శరీరం గగుర్పాటు చెందినది. ఆయన చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో ఆర్ద్రములైనాయి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 540 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻540. Suṣeṇaḥ🌻*

*OM Suṣeṇāya namaḥ*

श्रीविष्णोश्शोभना सेना विद्यते हि गणात्मिका ।
यस्ससोऽयं सुषेण इत्युच्यते विदुषां वरैः ॥

Śrīviṣṇośśobhanā senā vidyate hi gaṇātmikā,
Yassaso’yaṃ suṣeṇa ityucyate viduṣāṃ varaiḥ.

*He who possesses the auspicious groups of senas or armies of the form of gaṇas. So Lord Viṣṇu is Suṣeṇaḥ.*

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे नवमोऽध्यायः ::
ददर्श तत्राखिलसात्वतां पतिं श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् ।
सुनन्दनन्दप्रबलार्हणादिभिः स्वपार्षदाग्रैः परिसेवितं विभुम् ॥ १४ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 9
Dadarśa tatrākhilasātvatāṃ patiṃ śriyaḥ patiṃ yajñapatiṃ jagatpatim,
Sunandanandaprabalārhaṇādibhiḥ svapārṣadāgraiḥ parisēvitaṃ vibhum. 14.

Lord Brahmā saw Him in the Vaikun‌t‌ha, who is the Lord of the entire devotee community, the Lord of the goddess of fortune, the Lord of all sacrifices, and the Lord of the universe, and who is served by the foremost servitors like Nanda, Sunanda, Prabala and Arhan‌a, His immediate associates.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 218 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 5. To Thine Own Self be True 🌻*

*Never be in a hurry in the practice of yoga. Take only one step if it becomes necessary; do not try to make a hurried movement. If today you are capable of taking only one step, that is good enough. It is better to take only one step, but a firm step, rather than many steps which may have to be later retraced due to some errors that you have committed.*

*Quality is important, not quantity. Many days of meditation do not mean much; it is the kind of meditation that you have been practising, and the quality, that is involved there. Here, the Upanishads, or the Yoga Sutras of Patanjali, or the Bhagavadgita—all are telling you, finally, one and the same thing: “To thine own self be true,” as the poet has very rightly said. The whole of yoga can be said to be equanimous with this implication of the poet's words: “To thine own self be true.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 57 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 44. పరహితము - మోక్షము🌻*

*ఇద్దరు నావికులు పడవలో పోవుచుండగ పడవకు చిల్లుపడి మునిగెను. ఇద్దరును సముద్రములో రోజుల తరబడి యీదుచూ, తేలుచూ ఒక జనసంచారము లేని ద్వీపమును చేరిరి. ఆకలిదప్పులతో, భయముతో ప్రపంచమునకు దూరమై ప్రపంచము కొఱకై తపించు చుండిరి. కొన్ని దినములకు ఒక ఓడ అటుపోవుచుండగ నానా విధముల శ్రమపడి ఓడవారిని ఆకర్షించిరి. ఓడను ద్వీపమునకు మరలించి వారిద్దరిని ఓడలోనికి ఎక్కించుకొని స్వదేశమేగిరి. వారెంతయో ఆనందోత్సాహముతో తమ వారితో గడిపిన వెనుక మరల స్వచ్ఛందముగ ఆ ద్వీపమున కేగిరి. అచటనొక దీప స్తంభమును (Light house) ఏర్పరచి వచ్చు పోవు ఓడలకు సూచన లిచ్చుచు, సముద్రములోని రాళ్ళచే ఓడలు పగలకుండ కాపాడు చుండిరి. ఇదివరకు ఆ ద్వీపమున వారు దుఃఖపూరితులై సహాయము కొఱుకు తపనతో ఎదురు చూచుచుండిరి.*

*ఇప్పుడు అదే ద్వీపమున సంతోషముతో పలురకములుగ ప్రయాణము చేయువారికి తగు సూచనలు, సహకారము అందించుచు ఆనందముగ జీవించుచుండిరి. ఇదివరకు ఆ ద్వీపమున దుఃఖపడుటకును, ఇప్పుడు అదే ద్వీపమున ఆనందముగ నుండుటకును ఏమి కారణము? ఇదివరకు వారు ఒంటరులు, అనాధలు, ఇతర ప్రపంచముతో సంబంధము లేక అలమటించిన వారు. ఇపుడు వారు ఒంటరులు కారు, అనాధలు కారు. ఇతర ప్రపంచముతో సత్సంబంధములు ఏర్పరచుకొని పరహిత కార్యములను చేయుచున్నారు. మీ స్థితియు దాదాపుగ ద్వీపమున వేరుపడిన వారి స్థితియే. అందులకే భూమి జీవనము మీకు దుఃఖపూరితముగ గోచరించి, మోక్షము! మోక్షము! అని కేకలు పెట్టుదురు. దివ్య లోకములతో సంబంధము ఏర్పడినచో, యిక మోక్షమును గూర్చిన ఏడుపు యుండదు. ఇచ్చటనే దివ్యకార్యములను నిర్వర్తించుచూ ఆనందించ గలరు.మేము ప్రస్తుతము చేయుచున్నదదియే! మీరును ఈ మార్గమును ఎన్నుకొనవచ్చును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 122-2 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అచేతనావస్థ మన అలవాటు. జన్మజన్మల అలవాటు. ఈ క్షణం నించీ మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో, ప్రతి అనుభూతిలో చైతన్యంతో వుండడానికి ప్రయత్నించాలి. 🍀*

*తూర్పు దేశాల్లో మనం పద్మంగా మారడం గురించి చెబుతాం. వేయి రేకుల పద్మంలా విచ్చుకోవడం గురించి చెబుతాం. ప్రతి ఒక్కరూ విత్తనాన్ని మోస్తూ వుంటారు. మొగ్గను మోస్తూ వుంటారు. కానీ చైతన్యానికి గొప్ప ప్రయత్నం అవసరం. అచేతనావస్థ మన అలవాటు. జన్మజన్మల అలవాటు. ఈ క్షణం నించీ మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో, ప్రతి అనుభూతిలో చైతన్యంతో వుండడానికి ప్రయత్నించాలి. ఈ మూడూ మూడు కోణాలు.*

*ఈ మూడు కోణాల గుండా మనం మరింత పరిశీలనాత్మకంగా, మరింత చురుగ్గా, మరింత సాక్షీభూతంగా మారుతాం. ఈ మూడింటి ద్వారా నాలుగోదయిన సాక్షిగా మండడం రంగంలోకి వస్తుంది. అదే మన అసలు తత్వం. ఒకసారి నువ్వు సాక్షితత్వాన్ని ఎట్లా ఆవిష్కరించాలో తెలుసుకుటే నువ్వు కళారహస్యాన్ని అందుకుంటావు. నీ అంతరాంతరాల్లోని అంధకార ఖండాన్ని కాంతితో నింపుతారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 338 / Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*

*🌻 338. 'వేదజననీ' 🌻* 

*వేదములకు తల్లి శ్రీదేవి అని అర్థము. వేద మనగా ఏది తెలిసినచో ఇక తెలియవలసిన దేమియు ఉండదో అది వేదము. అనగా పూర్ణజ్ఞానము. తెలియుటకు తెలివి వలయును. తెలివి చైతన్యము నుండి పుట్టినది. మేల్కాంచిన వెనుకనే తెలివి పనిచేయును. నే మేల్కాంచిన వెనుకనే నేనున్నానని తెలియును. ఇట్లు మేల్కాంచుటకు చైతన్య మాధారము. చైతన్యము తత్త్వము యొక్క వ్యక్తస్థితి. అట్టి వ్యక్త స్థితి నుండి జీవులు పుట్టుదురు. వారి యందును ఉండుట, చైతన్యవంతులగుట జరుగుచుండును. చైతన్యవంతమైనపుడే నేనున్నానని తెలియును. తానున్నానని తెలిసినవాడే తన పరిసరము లను, సృష్టిని కూడా తెలియుటకు ప్రయత్నించును. తెలివి ఆధారము గనే తెలియుట జరుగును.*

*తెలుసుకొనువాడు, తెలుసుకొను విషయము, తెలుసుకొనుట అను కార్యము- మూడును కలిపి జ్ఞానము. తెలుసుకొను వాడు తెలియుట యందు నిమగ్నమై తెలియబడు విషయమున కరగును. అపుడు జ్ఞానమే తానుగ నున్నాడని తెలియును. చైతన్యమే తానుగ నున్నాడని తెలియును. తా నొకడు ప్రత్యేకముగా నున్నాడను భావము తొలగును. ఉన్నదంతయూ సత్ చిత్ లే అని తెలియును. ఇట్లు వేదము తెలియును. అది తెలియబడుటకు శుద్ధ చైతన్యమగు శ్రీమాతయే ఆధారము. ఆమెయే తెలియు వానికి, అతని యందలి తెలివికి, తెలియ వలెనను ఆసక్తికి, తెలియబడు విషయమునకు మూలము, పుట్టినిల్లు కనుక ఆమెయే వేదమాత. ఆమెయే 'వేదజనని'.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*

*🌻 338. Veda-jananī वेद-जननी (338) 🌻*

*Creator of Veda-s. Literally this can be explained as ‘She gave birth to Veda-s’. Veda-s originated from the Brahman in the form of sound. This sound was realized by the ancient sages and taught to their disciples orally. Only in the recent past, Veda-s are made available in textual forms. More than the text, the orthoepy is important in Veda-s and any wrong recitals or wrong notes (svara) leads to undesired results. This was the reason for teaching Veda-s orally. Veda-s originate from Śabda Brahman (śabda means sound).*

*Muṇḍaka Upaniṣad (I.i.5) gives a different interpretation. “There are two categories of knowledge, secular or aparā and spiritual or parā. Aparā comprises of four Veda-s, phonetics, rituals, grammar, etymology, metre and astronomy. But parā is that by which one knows the Brahman, which is ever the same and never decays.”*

*But, Bṛhadāraṇyaka Upaniṣad (II.iv.10) puts this in a different perspective. “Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, history, mythology, arts, Upaniṣads, pithy verses, aphorisms, elucidations and explanations are like the breath of this infinite Reality. They are like the breath of this Supreme Self.”*

*Puruṣa-sūktam gives yet another interpretation. It says that ‘the Veda-s originated from sarvahuta yajñā that was conducted by gods and great sages, invoking Puruṣa as the lord of this fire ritual. This Puruṣa is called the Brahman, from whom the Veda-s originated.*

*Even though the interpretations are different, all of them concur that the Veda-s or its subtle form sound, originated from the Supreme.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹