నిర్మల ధ్యానాలు - ఓషో - 122-2


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 122-2 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అచేతనావస్థ మన అలవాటు. జన్మజన్మల అలవాటు. ఈ క్షణం నించీ మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో, ప్రతి అనుభూతిలో చైతన్యంతో వుండడానికి ప్రయత్నించాలి. 🍀


తూర్పు దేశాల్లో మనం పద్మంగా మారడం గురించి చెబుతాం. వేయి రేకుల పద్మంలా విచ్చుకోవడం గురించి చెబుతాం. ప్రతి ఒక్కరూ విత్తనాన్ని మోస్తూ వుంటారు. మొగ్గను మోస్తూ వుంటారు. కానీ చైతన్యానికి గొప్ప ప్రయత్నం అవసరం. అచేతనావస్థ మన అలవాటు. జన్మజన్మల అలవాటు. ఈ క్షణం నించీ మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో, ప్రతి అనుభూతిలో చైతన్యంతో వుండడానికి ప్రయత్నించాలి. ఈ మూడూ మూడు కోణాలు.

ఈ మూడు కోణాల గుండా మనం మరింత పరిశీలనాత్మకంగా, మరింత చురుగ్గా, మరింత సాక్షీభూతంగా మారుతాం. ఈ మూడింటి ద్వారా నాలుగోదయిన సాక్షిగా మండడం రంగంలోకి వస్తుంది. అదే మన అసలు తత్వం. ఒకసారి నువ్వు సాక్షితత్వాన్ని ఎట్లా ఆవిష్కరించాలో తెలుసుకుటే నువ్వు కళారహస్యాన్ని అందుకుంటావు. నీ అంతరాంతరాల్లోని అంధకార ఖండాన్ని కాంతితో నింపుతారు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2022

No comments:

Post a Comment