నారద భక్తి సూత్రాలు - 108


🌹.   నారద భక్తి సూత్రాలు - 108   🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 78

🌻 78. అహింనా సత్య శౌచ దయాస్తిక్వాది చారిత్ర్యాణి పరిపాలనీయాణి ॥ 🌻

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం మొదలైనవి కూడా భక్తిని నిలుపు కోవడానికి ఉపయోగపదే సాధనలు.

అహింస అంటే తన వలన ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ విధమైన బాధ కలుగకుండుట. ఇతరులు బాధ పెట్టినా, ప్రతీకారంగా చెసేది కూడా హింసే అవుతుంది. ఇతరుల మనస్సుకు భక్తుడి వలన ఎట్టి బాధ కలుగకూడదు. సాధకుడు రజోగుణం విడిచి, సాత్వికుదైతే గాని భక్తి నిలవదు.

సాధకుడి వ్రతం అహింస గనుక, తన కారణంగా ఇతరులకు బాధ కలుగక పోయినా తన తలపులలో కూడా ఇతరులకు బాధను కలిగించే ఆలోచన రాకూడదు. అంతేకాదు, శత్రువును కూడా ప్రేమించ గలగాలి.

జిల్లళ్ళమూడి అమ్మ బాధల గురించి ఏమి నిర్వచించారో చూడండి. “శరీరానికి తగిలితే నొప్పి, మనస్సుకు తగిలితే బాధ. మనస్సుకు బాధ ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటె లేదు. సుఖంగా బాధను అనుభవిస్తే బాధ బాధ కాదు. బాధంటే చైతన్యమే. బాధ లేకపోతే స్థాణువై పోతాడు. బాధలు అనుభవిస్తున్నా అది బాధ అనిపించనప్పుడు సహజ సహనమవుతుంది. సర్వకాల సర్వావస్థలందు సహజ సహనమె సమాధి. సమాధి అంటే మోక్షమే కదా !

అహింసకు అమ్మ చెప్పిన భాష్యమేమంటే బాధలుండడం భగవంతుని దయ. ఎందుకంటె బాధలు సహించుకోవడాన్ని సహజం చేసుకోవడానికి పరీక్ష అవసరం. ఆ పరిక్ష కోసమే బాధలున్నాయి. కనుక ప్రతిచర్య హింస అవుతుంది.

సత్యం అంటే అబద్దములాడకుండుట. సత్య వాక్పరిపాలనకు శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు ఉదాహరణీయం. సత్యవ్రతం అంటే సత్యం జ్ఞానం అనంతం అయిన భగవంతునితో అనుసంధానం చేసుకోవడం. అనిత్య వస్తువుల యెడ ఆసక్తి వీడి, సత్యమైన భగవంతుని మీద అనురాగం పెంచుకోవడం. స్వార్ధాన్ని త్వాగం చేయదం సత్యమే అవుతుంది.

అంతఃకరణ శుద్ధి భక్తికి కావలసిన ఉత్సాహం బాహ్య శౌచం వలన కలుగుతుంది. సర్వ జీవులందు వాటి దీనత్వాన్ని బట్టి కలిగేది దయ. నా వారు, ఇతరులు అనే భేదం లేకుండా కలిగేది దయ.

భక్తి చేసేవాడికి “భగవంతుడున్నాడు, తప్పక అనుగ్రహిస్తాడు” అనె విశ్వాసం ఉండాలి. దీనినే ఆస్తిక్యము అంటారు. ఇట్టి దృఢ విశ్వాసం లేకపోతే భక్తి సఫలం కాదు.

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం ఉన్నప్పుడు, గొణభక్తి ముఖ్యభక్తిగా పరిణమిస్తుంది. రాగద్వేష అసూయలున్న వారికి భక్తి అనేది, కపట ప్రదర్శనే అవుతుంది. కనుక భక్తిని నిజాయితీగా సలపడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 12 (Sloka 71 to 80)

🌹.   విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 12   🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్



Audo file: Download / Listen    [ Audio file : VS-Lesson-12 Sloka 71 to 80.mp3 ]

https://drive.google.com/file/d/1chRNQBVf6kmQgxTJk43qVDX6F7g5TlMz/view?usp=sharing



బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ‖ 71 ‖



మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |

మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ‖ 72 ‖



స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ‖ 73 ‖



మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ‖ 74 ‖



సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ‖ 75 ‖



భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః |

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ‖ 76 ‖



విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |

అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ‖ 77 ‖



ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం |

లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ‖ 78 ‖



సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |

వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ‖ 79 ‖



అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ‖ 80 ‖

🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 4వ పాద శ్లోకం

🍀 24 . అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖ 🍀

🍀 218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.

🍀 219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.

🍀 220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.

🍀 221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.

🍀 222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.

🍀 223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.

🍀 224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.

🍀 225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.

🍀 226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.

🍀 227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Vishnu Sahasra Namavali - 24 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Midhuna Rasi, Arudra 4th Padam

🌻 24.  agraṇīrgrāmaṇīḥ śrīmān nyāyō netā samīraṇaḥ |
sahasramūrdhā viśvātmā sahasrākṣaḥ sahasrapāt || 24 || 🌻


🌻 218. Agraṇīḥ: One who leads all liberation-seekers to the highest status.
🌻 219. Grāmaṇīḥ: One who has the command over Bhutagrama or the collectivity of all beings.
🌻 220. Śrīmān: One more resplendent than everything.
🌻 221. Nyāyaḥ: The consistency which runs through all ways of knowing and which leads one to the truth of Non-duality.
🌻 222. Netā: One who moves this world of becoming.
🌻 223. Samīraṇaḥ: One who in the form of breath keeps all living beings functioning.
🌻 224. Sahasramūrdhā: One with a thousand, i.e. innumerable, heads.
🌻 225. Viśvātmā: The soul of the universe.
🌻 226. Sahasrākṣaḥ: One with a thousand or innumerable eyes.
🌻 227. Sahasrapāt: One with a thousand, i.e. innumerable legs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

అద్భుత సృష్టి - 41




🌹. అద్భుత సృష్టి - 41 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


❇ 7. టవర్ ఆఫ్ బాబిల్ సీల్ :

క్రీస్తు పూర్వము 3470 వ సంవత్సరంలో చీకటి శక్తుల కారణంగా "బిబ్లికల్ టవర్ ఆఫ్ బాబిల్ స్టోరీ" అనేది జరిగింది. చీకటి శక్తులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్పు చేశారు. దీని ప్రభావం వలన మన డిఎన్ఏ టెంప్లేట్స్ లో చాలా మార్పులు సంభవించాయి. సహజమైన కుండలినీ జాగృతి అనే దానిని బ్లాక్ చేశారు. పీనియల్, పిట్యూటరీ, హైపొథాలమస్ మరి థైరాయిడ్ అనే ఉన్నత శక్తి క్షేత్రాలు సరిగ్గా పనిచేయటం మాని వేశాయి. దీని కారణంగా మన జీవన ప్రమాణం తగ్గిపోయింది.

హైయ్యర్ సెన్నరీ ఫర్ సెప్షన్ ( అతీంద్రియ శక్తులు) తగ్గి మెమొరీ లాస్ (మతిమరుపు) వస్తుంది. DNAలో ఉన్న ఒరిజినల్ లాంగ్వేజ్ ప్యాట్రన్స్ ఇటు అటు అయ్యాయి. 12 అక్షరాలు ఉన్న భాషాస్థితి నుండి 5 అక్షరాల క్రిందికి నిర్మాణం చేయడం జరిగింది.

💫. ఈ లెటర్స్ (అక్షరాలు) సోలార్ ఎనర్జీతో తయారుచేయబడిన ఒక కోడింగ్ లెటర్స్ మన జన్మాంతర, గ్రహాంతర జ్ఞానం అంతా ఈ అక్షరాల లోనే నిక్షిప్తంగా ఉంటుంది. వీటిని "సోలార్ లెటర్స్" అంటారు.

ఎప్పుడైతే డిఎన్ఏ లో ఉన్న సోలార్ అక్షరాలను తొలగించారో ఆనందం, ఆరోగ్యం అనే కోడింగ్ అందక మన జాతి వ్యాధిగ్రస్తులుగా యవ్వనంలోనే మరణించేవారుగా తయారయింది.

మనం ఈ టవర్ ఆఫ్ బాబిల్ సీల్స్ ని తొలగించుకుంటే మన కుండలినీ జాగృతి పరిపూర్ణంగా జరుగుతుంది. ఉన్నత శక్తులు మనలో మేల్కొంటాయి. ఈ J సీల్స్ కారణంగా మనం మన ఒరిజినల్ డిజైన్ టెంప్లేట్స్ ని DNAలో తొలగించుకోవడం జరిగింది.

దీని కారణంగా మనం ఎవరో, ఈ భూమి మీదకు ఎందుకు వచ్చామో మన లైఫ్ పర్పస్ ఏమిటో మనకి తెలియకుండా పోయింది. లక్ష్యసిద్ధి లేకుండా పునరపి జననం- పునరపి మరణంలో పడిపొతున్నాము.

మనం వీటిని తొలగించుకుంటే మన ఒరిజినల్ టెంప్లేట్స్ అయిన ఇండిగో DNA,ఏంజెలిక్ DNA యాక్టివేషన్ లోకి వస్తాయి. ఇక్కడ మరణమనేది ఉండదు. భౌతిక దేహం కాంతి దేహం గా మారి భౌతిక అసెన్షన్ పొందుతాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 64




🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 64   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 28 🌻

బుద్ధి సూక్ష్మతని ఈ విచారణా క్రమములో మానవులందరూ తప్పక సంపాదించాలి. కారణం ఏమిటంటే అత్యంత సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమైనటువంటి పరబ్రహ్మమును గోచరింపచేసుకొనుట - అంటే కళ్ళకు కనబడేట్టుగా చేసుకొనడమనేది చాలా కష్ట తరమైనటువంటి పని. అది సాధ్యమయ్యేపని కాదు.

ఎందుకంటే అది నిరాకార నిర్గుణ నిరంజన నిరుపమాన స్వరూపం అది. మరి అన్ని నకార శబ్దములతో కూడుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మమును సరాసరిగా చూడగలగడం అనేది సాధ్యం కావడం లేదు. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకొనగోరేవారందరికీ కూడా ఒక మార్గముండాలి కదా. ఆ మార్గము పేరే ఓంకారము.

ఓంకారమనే శబ్దమును ఆశ్రయించి ఉపాసన చేసేటటువారందరూ ఈ ఓంకారమును వాచికముగా గ్రహించి పరబ్రహ్మను వాచ్యముగా గ్రహించగలుగుతారు. ‘నీవెరుగగోరిన తత్వము ఇదియే’ అని నిశ్చయముగా తెలియజేస్తున్నారు.

నాయనా! నీవు మరణానంతరం ఏముంది అన్న ప్రశ్నను అడిగావు గానీ, అసలు నువ్వు తెలుసుకోదలచుకున్నది ఏమిటయ్యా అంటే సర్వకాల సర్వావస్థలయందును మార్పుచెందక వుండేటటువంటి పరబ్రహ్మ తత్వమేదైతే వుందో అటువంటి పరబ్రహ్మ తత్వమును తెలుసుకొనగోరుతున్నావు కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను.

అది నాశము లేనిది అనేటటువంటి మొదటి లక్షణం చెప్పాడు. నశించేటటువంటివన్నీ జగత్తులోనివే. నశించేవన్నీ సృష్టిలోనివే. ఆద్యంతములు కలిగినటువంటివన్నీ పిపీలికాది బ్రహ్మపర్యంతము వుండేటటువంటివే అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతూ ఇంకా రెండు ఉపమానాలని అందిస్తున్నాడు. అత్యంత సూక్ష్మమైనది.

సూక్ష్మము అంటే ఎంత సూక్ష్మమండి. అణువుకంటే అణువు. మహత్తు కంటే మహత్తు. “అణోరణీయాన్ మహతో మహీయాన్” అనేటటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారనమాట. అయితే సూక్ష్మాతి సూక్ష్మం ఎంతండీ అంటే ఒక కణాన్ని బేధించుకుంటూ బేధించుకుంటూ బేధించుకుంటూ చిట్టచివరికి వెళ్ళిపోయాం. మైనస్ మైనస్ మైనస్ మైనస్ మిల్లీ మైక్రానులదాకా కూడా వెళ్ళిపోయాం.

అప్పుడు ఏదైతే వున్నదో అది గానీ, లేదా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాం, విశ్వ వ్యాపకంగా పెంచుకుంటూ వెళ్ళాం. కాస్మోసిస్ ఎంత వుందో అంత మేరకు పెంచుకుంటూ వెళ్ళాం. పెంచుకుంటూ వెళితే ఎంతయితే వున్నదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి వున్నది ఏదైతే వున్నదో అదంతా కూడా బ్రహ్మము. దానవతల పరబ్రహ్మము.

కాబట్టి ముందు దేనిని తెలుసుకోవాలటా? ఈ అణోరణీయాన్ మహతో మహీయాన్ గా వున్నటువంటి బ్రహ్మమును ఎరిగి, దానవతల అనేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు.

ఇంకేమిటటా నీకు ప్రయోజనం అంటే ఈ అణువు నుండి మహత్తు వరకూ వున్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వారికి కామ్య సిద్ధి కలుగుతుందట.

ఇదేమిటండీ అసలు కోరికలు త్యజిస్తేనే ఆత్మ విచారణకి పనికొస్తావని అంతకుముందు చెప్పి ఇప్పుడు మరలా కోరికలన్నీ సిద్ధిస్తాయి అంటారేమిటీ అంటే ఎవరైతే బ్రహ్మమును ఎరుగగోరుచున్నారో వారియొక్క లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగోరడం. అది ఆ ఒక్క కామ్యమే మిగిలివున్నది. ఇంకే కామ్యములు వారియందు మిగిలి లేవు. మోక్ష కాంక్ష. ముక్తి కాంక్ష. ఒక్క కోరిక మాత్రమే మిగిలి వుంది.

ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి అనేటటువంటి బలీయమైన ఆకాంక్ష ఒక్కటే తీవ్ర మోక్షేచ్చ ఒక్కటే మిగిలివున్నది కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ “కోరికలన్నియూ తీరును“ అనేటటువంటి రూపంలో తెలియజేస్తున్నారు.

ఈ రకంగా నచికేతునికి ఓంకార తత్వముయొక్క విశేషం “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” అనేటటువంటి సూత్రమును ఆశ్రయించి బోధించడం ప్రారంభించారు. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

40. గీతోపనిషత్తు - బ్రహ్మ నిర్వాణము - అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు




🌹. 40. గీతోపనిషత్తు - బ్రహ్మ నిర్వాణము - అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 72 📚

ఇది సాంఖ్యయోగమను అధ్యాయమునకు చిట్టచివరి శ్లోకము. ఈ శ్లోకమున భగవంతుడు అంతకుముందు శ్లోకములలో వివరించిన సోపాన క్రమమునకు గమ్యమును నిర్వర్తించు చున్నాడు.

ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాం స్యా మంతకాలే పి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి || 72

అర్జునుడు ప్రజ్ఞయందు స్థితి గొన్నవాని లక్షణములను గూర్చి నాలుగు ప్రశ్నలు శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణుని అడిగెను.

స్థితప్రజ్ఞుని లక్షణము లేవి? అతడేమి పలుకును? ఏ రీతిగ నుండును? ఎట్లు సంచరించును? అనునవి ఆ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికిని సమాధానములు వివరించుచు శ్రీకృష్ణుడు క్రమశః 71వ శ్లోకము చేరునప్పటికి నిరహంకార స్థితిని ఆవిష్కరించెను.

నిరహంకార స్థితి చేరినవారికి సమస్తము వ్యాపించియున్న తత్వమే తానుగా నున్నదనియు, మరియు సమస్త జగత్తు అదియే నిండియున్నదనియు తెలియును.

అంతటిలో నిండియున్నది, అన్నిటియందు నిండినది, తనయందు కూడ నిండియుండుటచే తాను, ఇతరము అను భేదము నశించును.

అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు.

తానే సమస్తమై యుండుటచే మరియు సమస్తమే తానుగ నుండుటచే మరియొకటి లేని స్థితి ప్రాప్తించుటచే మోహము, అంత్య కాలము అనునవి కూడ లేకుండును.

మరియొకటి లేని స్థితిని గూర్చి భగవానుడు భాషణము చేయుచున్నాడు. ఇదియొక అద్భుతమైన స్థితి. అనిర్వచనీయమైన స్థితి. అంతకుముందున్నవి అపుడుండవు. అంతకుముందు గోచరించిన సత్యములు కూడ నుండవు.

స్వప్నమున అనేకానేక రూపములను, సన్నివేశములను, భావములను అనుభూతి చెందుచున్న జీవుడు మేల్కాంచినపుడు స్వప్నము లోని విశేషములన్నియు, మేల్కాంచినపుడు ఎట్లు లేవో, అట్లే బ్రహ్మమునందు మేల్కాంచినవానికి ఈ సమస్త సృష్టియు, అందలి జీవులు, లోకములు స్వప్నమని తెలిసి నవ్వు కొనగలడు. అతని ఆనందమునకు అవధులు లేవు. అదియే బ్రహ్మానందము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 3 🌻

14. ధారణంగా మనుష్యులు చేసే పని ఏమంటే, మనధ్యేయం ఒకటి. ఆ ధ్యేయాన్ని అడగం. దానికి మార్గం అడుగుతాం. నాకు తృప్తిని ఇవ్వమని అడిగితే, ఐశ్వర్యం ఇవ్వమని అడగక్కరలేదు. అయితే తృప్తిని అడగకుండా ఐశ్వర్యాన్ని అడుగుతాం!

15. చిన్న విషయాలలో కూడా క్షేమమూ, లాభము, సుఖము, ఉంటాయనుకొని; ఇవి ఇచ్చే వస్తువులు ఏమైనా ఉంటేవాటిని అడుగుతాంకానీ, ఆ వస్తువుతో నిమిత్తంలేకుండానే క్షేమము, శాంతి, లాభము ఇక్కడ ఉన్నచోటే ఇవ్వమని అడగము!

16. ఆ వస్తువు తనకు లభిస్తే శాంతి, సుఖము, లాభము అన్నీ కలుగుతాయి అని అనుకుంటారు మనుష్యులు. ఆ నిర్ణయంలోనే దోషం ఉంది. ఏది శాంతి నిస్తుందో దన్ని అడగకుండా, ఏదో వస్తువును అడుగుతాడు. ఆ వస్తువును దేవతలు ఇచ్చిపోతారు.

17. లోకంలో సమస్త విజ్ఞానమూ కోరేవారు మత్స్యావతారంలో ఉన్న రూపాన్ని ఆరాధిస్తారు. కులవృద్ధి, వంశవృద్ధి, సంతానం పెరగాలంటే ఇతడిని కూర్మావతారంలో ఆరాధిస్తారు. ముక్తికోరేవాళ్ళు ఈయనను వరాహావతారరూపంలో ఆరాధిస్తారు.

18. చేసిన పాపం హరించాలి అనుకునేవాళ్ళు నృసింహస్వామి రూపాన్ని ఆరాధిస్తారు. లోకంలోని పరిజ్ఞానాన్ని, చాలా విషయాలను తెలుసుకోవలనుకునేవాళ్ళు వామనావతారాన్ని ఆరాధిస్తారు. ధనంకోరేవాళ్ళు బలరామావతారాన్ని, శత్రుజయం కోరే వాళ్ళు రామావతారాన్ని, మంచి సంతానం – ఒక్కడే కొడుకైనా పరవాలేదు బుద్ధిమంతుడు కావాలి అనుకునేవాళ్ళు – బలరామకృష్ణులను ఆరాధిస్తారు.

19. అపూర్వమైన గొప్ప సౌందర్యం కావాలనుకునేవాళ్ళూ బుద్ధుడిని ఆరాధిస్తారు.(ఇందులో నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. సందేహం ఏమీ లేదు) ఇతరులమీద ఆధిపత్యం కావాలనుకునేవాళ్ళు కల్కిఅవతారంగా ఆయనను ఆరాధిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

శ్రీ శివ మహా పురాణము - 234



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 234   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

51. అధ్యాయము - 6

🌻. సంధ్య తపస్సును చేయుట - 4 🌻

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా మహేశస్య ప్రసన్న మనసస్తదా | 
సంధ్యో వా చ సుప్రసన్నా ప్రణమ్య చ ముహుర్ముహుః || 31

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సు గల మహేశ్వరుని ఈ మాటను విని, సంధ్య మిక్కిలి ఆనందించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి ఇట్లు పలికెను (31).


సంధ్యోవాచ |

యది దేయో వరః ప్రీత్యా వరయోగ్యాస్మ్యహం యది | 
యది శుద్ధాస్మ్యహం జాతా తస్మాత్పాపాన్మహేశ్వర || 32

యది దేవ ప్రసన్నోsసి తపసా మమ సాంప్రతమ్‌ | 
వృతస్తదాయం ప్రథమో వరో మమ విధీయతా మ్‌ || 33

ఉత్పన్న మాత్రా దేవేశ ప్రాణినోస్మిన్న భస్థ్సలే | 
న భవంతు సమే నైవ సకామ స్సంభవంతు వై || 34

యద్ధి వృత్తా హి లోకేషు త్రిష్వసి ప్రథితా యథా | 
భవిష్యామి తథా నాన్యా వర ఏకో వృతో మయా || 35

సంధ్య ఇట్లు పలికెను -

ఓ మహేశ్వరా! ప్రీతితో వరము నిచ్చే పక్షములో, నేను వరమునకు యోగ్యురాలను అయినచో, నేను ఆ పాపమునుండి శుద్ధురాలను అయినచో (32),

హే దేవా! నా ఈ తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచో, నాకు దీనిని మొదటి వరముగా నీయవలెను (33).

హే దేవదేవా! ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుక తోడనే కామము గలవి గా పుట్టకుండుగాక! (34).

జరిగిన వత్తాంతము ముల్లోకములలో ప్రసిద్ధి చెంది నేను అపకీర్తిని పొందకుండునట్లు అనుగ్రహించుడు. ఇది నేను కోరు వరములలో ఒకటి (35).


సకామా మమ దృష్టిస్తు కుత్ర చిన్న పతిష్యతి | 
యో మే పతిర్భవేన్నాథ సోsపి మేsతిసుహృచ్చ వై || 36

యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషమ్‌ | 
నాశం గమిష్యతి తదా స చ క్లీబో భవిష్యతి || 37

ఏ వ్యక్తిపైననూ కామముతో గూడిన నా చూపు పడకుండుగాక! హేనాథా! నాకు భర్తయగు వ్యక్తి నాకు మంచి మిత్రుడై ఉండవలెను (36).

నన్ను కామముతో చూచు వ్యక్తి యొక్క పురుషత్వము నశించి, వాడు నపుంసకుడు కావలెను (37).


బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్యా శ్శంకరో భక్తవత్సలః | 
ఉవాచ సుప్రసన్నాత్మా నిష్పాపాయాస్తయేరితే || 38

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు శంకరుడు సర్వపాపవినిర్ముక్తురాలగు ఆమె పలుకులు విని మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (38).


మహేశ్వర ఉవాచ |

శృణు దేవి చ సంధ్యే త్వం త్వత్పాపం భస్మతాం గతమ్‌ | 
త్వయి త్యక్తో మయా క్రోధః శుద్ధా జాతా తపః కరాత్‌ || 39

యద్యద్వృతం త్వయా భ##ద్రే దత్తం తదఖిలం మయా | 
సుప్రసన్నేన తపసా తవ సంధ్యే వరేణ హి || 40

ప్రథమం శైశవో భావః కౌమారాఖ్యో ద్వితీయకః | 
తృతీయో ¸°వనో భావశ్చతుర్థో వార్ధకస్తథా || 41

తృతీయే త్వథ సంప్రాప్తే వయో భాగే శరీరిణః | 
సకామాస్స్యుర్ద్వితీయాంతే భవిష్యతి క్వచిత్‌ క్వచిత్‌ || 42


మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ సంధ్యాదేవీ!వినుము. నీ పాపము నశించినది. నీవు తపస్సును చేసి శుద్ధురాలవైతివి. నీపై గల కోపమును నేను వీడితిని (39).

ఓ మంగళస్వరూపులారా! సంధ్యా! నీ తపస్సు చేత, మరియు వరముల చేత నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని నీవు కోరిన వరములనన్నిటినీ నేను ఇచ్చితిని (40).

మానవులు ముందుగా శైశవము , తరువాతరెండవదియగు కౌమారము, మూడవదియగు ¸°వనము, నాల్గవదియగు వార్ధకము అను దశలను క్రమముగా పొందెదరు (41).

ప్రాణులు మూడవది యగు ¸°వనమును పొందినప్పుడు కామ భావనను కలిగియుందురు. కొన్ని సందర్భములలో రెండవది యగు కౌమారావస్థ అంతములో కూడా వారు సకాములు కావచ్చును (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

మంత్ర పుష్పం - భావగానం - 9



🌹.   మంత్ర పుష్పం - భావగానం - 9   🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మంత్రం పుష్పం - 20 to 23 🌻


🌻. మంత్ర పుష్పం 20.

యో౭పామాయతనం వేద

ఆయతనవాన్ భవతి

పర్జన్యో వా అపామాయతనం

ఆయతనవాన్ భవతి

యః పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి

అపోవై పర్జన్య స్యాయతనంవేద ఆయతనవాన్ భవతి

య ఏవంవేద


🍀. భావ గానం:

ఎవరు నీటి నివాసమెరిగెదరో

వారు ఆ నివాసం పొందెదరు.

మబ్బులు నీటి నివాసమని తెలిసెదరో

వారు ఆ నివాసం పొందెదరు.

మబ్బు , నీరుల నివాస మెరిగెదరో

వారు ఆ నివాసం పొందెదరు



🌻. మంత్ర పుష్పం 21

యో౭పామాయతనం వేద

ఆయతనవాన్ భవతి

సంవత్సరో వా అపామాయతనం

ఆయతనవాన్ భవతి

యస్సంవత్సరస్యాయతనం వేద

ఆయతనవాన్ భవతి

అపోవై సంవత్సరస్యాయతనం

ఆయతనవాన్ భవతి

య ఏవంవేద


🍀. భావ గానం:

ఎవరు నీటి నివాసమెరిగెదరో

వారు ఆ నివాసం పొందెదరు

నీరు సంవత్సర నివాసని తెలిసెదరో

వారు ఆ నివాసం పొందెదరు

సంవత్సరము నీరు నివాసని తెలిసెదరో

వారు ఆ నివాసం పొందెదరు

నీరు ,సంవత్సరాల నివాస మెరిగెదరో

వారు ఆ నివాసం పొందెదరు



🌻. మంత్ర పుష్పం 23

కిం తద్విష్ణోర్బల మాహుః

కా దీప్తిః కిం పరాయణం

ఏకొ యధ్ధారాయ ద్దేవః

రేజతీ రోదసీ ఉభౌ


🍀. భావగానం:

భూమి ఆకాశాలు రెండూనోయి

విష్ణువే భరించు దైవమోయి

అంత బలమెలా పొందెనోయి

అందుకు కారణమే మోయి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుస్పం

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

మంత్ర పుష్పం తత్వ విచారణ.... విజ్ఞానం


🌹.   మంత్ర పుష్పం తత్వ విచారణ.... విజ్ఞానం   🌹

📚. ప్రసాద్ భరద్వాజ

దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు కదా.. ఆ పరమాత్మ సర్వత్రా వున్నాడని చెప్పటమే ఆ మంత్రపుష్పం ఉద్దేశ్యం. మన లోపల, బయట కూడా వ్యాపించి వున్న ఆ దేవదేవుడు మన శరీరంలో ఏ రూపంలో వున్నాడో చెబుతుంది మంత్రపుష్పం.

‘‘మన శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడని వర్ణించబడింది’’

చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత, ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట.

మనలోనే వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి నేను, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని ఈసారి విన్నప్పుడు కళ్ళు మూసుకుని మీలోని ఆ పరమాత్మని దర్శనం చేసుకోండి.

🌻. మంత్రపుష్ప విజ్ఞానం 🌻

మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రాలున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు.

మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగుతాయని అధర్వ వేదం చెబుతోంది. ‘మన్‌’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది. విస్తృత అర్థంలో, మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం!

యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఆరణ్యకంలో మంత్రపుష్పం వివరాలున్నాయి. సర్వసామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు.

జీవజాలానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైందో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది మంత్రపుష్పం!

నీరు ఇహానికి, పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్రపుష్ప సారాంశం.

పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది.

అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది.

చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే! అందుకే ‘దైవం పరంజ్యోతి’ అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.

సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తిమంతుడినని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్యకుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే... బ్రహ్మాండంలో మనిషి స్థానమెంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకొంటే, మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

మంత్రపుష్పం ప్రకారం- జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య, ఉరుములోని వెలుగురేఖలా అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని, ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞానశాస్త్రమూ వెల్లడిస్తోంది.

మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి.

పడవకు నీటికి ఉన్నట్లే, దైవానికి-మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా, భక్తులు ఏ దైవానికి నమస్కరించినా, అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానంద కారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంధాల నుంచీ విముక్తి లభిస్తుందని వివరిస్తుంది మంత్రపుష్పం.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుస్పం


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 12 / Sri Lalitha Chaitanya Vijnanam - 12

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 6 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 12 / Sri Lalitha Chaitanya Vijnanam - 12 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల

🌻 11. 'పంచతన్మాత్రసాయకా' - 2 🌻

పై తెలిపిన నాలుగు మకరములు పరతత్త్వము నాలుగు స్థితుల లోనికి దిగివచ్చుటకు దేవి ఏర్పరచు వాహనములు. స్వామిత్వము కలవాడు ఈ వాహనముల నధిష్టించి విహరించు చుండును.

అది లేనివాడు వాహనములకు పట్టుబడును. “అత్యంత కాంతివంతమైన తెల్లని మొసలిపై వరుణదేవత ఆకాశమున త్రిశూలధారియై విహరించుచున్నాడని” వేదము తెలుపుచున్నది. అనగా అశ్విని దేవతయైన వరుణుడు మిత్రునితో కలసి సమస్త సృష్టిని అధిష్ఠించి విహరించు చున్నాడని తెలియవలెను. ఈ నాలుగు మకరములకు నాలుగు వర్ణములు కలవని కూడ తెలియవలెను.

అందు మొదటిది తెల్లని మకరము లేక దీనిని నీలముగ కూడ తెలుపుదురు. రెండవది ఎరుపు వర్ణము కలది, మూడవది పసుపు వర్ణము కలది, నాలుగవది గోధుమ వర్ణము గలది. ఈ నాలుగు మకరములు జీవ చైతన్యము నధిష్ఠించి లేక దానికి లోబడి యుండు నాలుగు స్థితులు. వీటినే “ధ్యాన్” అను హీబ్రూ గ్రంథమున నాలుగు గుఱ్ఱములని కూడ పేర్కొనిరి.

ఈ మకరములను అంతర్యామి సాధనముననే అధిష్ఠించుట వీలగును. ఇతర మార్గముల వీలుపడదు.

జ్యోతిశ్చక్రమున గల మకర రాశి ఈ సందర్భమున ప్రాముఖ్యము వహించును. మకరముల నుండి మోక్షణము పొందుటకు మకరరాశి తత్త్వము ఎంతయు ఉపయోగకరము.

ఇది కారణముగ కూడ మకర మాసమును పుణ్యకాల మందురు. ప్రతి సంవత్సరము మకర మాసమున

సూర్యోదయమున భూమిని, భూమి జీవులను ఊర్ధ్వముఖులుగ ప్రచోదన మొనరించుటకు సూర్యకిరణముల నుండి ఉద్ధారకమైన తత్త్వము

ప్రసరింపబడుచుండును. ఉత్తరాయణ పుణ్యకాల మనగా జీవులను మకర బంధముల నుండి ఉద్ధరించు పుణ్యకాలముగ భావించవలెను.

అటులనే జ్యోతిశ్చక్రమున ఐదవ రాశియైన సింహరాశి, అపసవ్య మార్గమున ఐదవ రాశియైన ధనుస్సు రాశి కూడ మకరముల నుండి ఉద్ధరింపబడుటకు సహకరించగలవు. జీవుని జాతక చక్రమున ఐదు, పది రాశులలో గల గ్రహముల నుండి తాననుసరించ వలసిన ప్రవర్తనము సూచింపబడుచున్నదని కూడ గ్రహింపవలెను.

ఇట్లు మకరవిద్య అతి విస్తారముగ ఋషులచే వివరింపబడినది. ఇది ఒక ప్రత్యేక విద్యగ సాధన చేయు బృందములు గలవు. ఈ సందర్భమున భాగవత మందలి ఒక పద్యమును ఇచ్చట ప్రస్తుతి చేయుచున్నాము.

మకర మొకటి రవిఁ జొచ్చెను

మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్

మకరాలయమునఁ దిరిగెడు

మకరంబులు కూర్మరాజు మఱువన కరిగెన్.

పై పద్యమును ధ్యానము చేసి మకర రహస్యముల నెరుగవలెను.

అట్లే సంఖ్యా శాస్త్రమున ఐదు (5) అంకెకు అత్యంత ప్రాముఖ్యము కలదు. ఈ ప్రాముఖ్యత ముందు నామములలో వివరింపబడును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 58



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 58   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 8 🌻

235. పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడవంటిది . కాబట్టి లోకానుభవము లన్నియు ,అయదార్ధమైనవి .

236. పూర్వజన్మ సంస్కారముల వలననే ప్రస్తుత జన్మ తయారగును . ఈ ప్రస్తుత రూపము ద్వారా పూర్వ జన్మ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు అగుచుండును .

237. ఆత్మ యొక్క చైతన్యము సంస్కారములలో కేంద్రీకరించి యున్నంతకాలము , ఆ సంస్కారానుభవమును పొందవలసినదే .

238. పునర్జన్మ ప్రక్రియలో, పూర్ణ చైతన్యముగల మానవాత్మ విధిగా అసంఖ్యాకమైన వివిధములైన ద్వంద్వ సంస్కారములు అనుభవమును సంపాదించ వలెను కనుక యీ మానవాత్మ, అసంఖ్యాకమైన సార్లు స్త్రీగను పురుషునిగాను, వేర్వేరు కులములలో, వేర్వేరు జాతులలో, వేర్వేరు తెగలలో , వేర్వేరు రంగులలో, వేర్వేరు ప్రదేశములలో,

ఒకప్పుడు ధనికుడగను, మరియొకప్పుడు దరిద్రునిగను, ఒకప్పుడు ఆరోగ్యవంతునిగాను, మరియొకప్పుడు అనారోగ్యవంతునిగాను, ఒకప్పుడు సుందరుడుగను, మరియొకప్పుడు కురూపిగను , ఒకప్పుడు పొడగరిగను

మరియొకప్పుడు పొట్టిగాను ,

ఇట్లు అసంఖ్యాక సంస్కారములను అనుభవించుచు వ్యతిరేక సంస్కారములను సృష్టించుకొనుచు ఏకకాల మందే వాటిని రద్దుగావించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 65 / Sri Gajanan Maharaj Life History - 65



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 65 / Sri Gajanan Maharaj Life History - 65 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 2 🌻

కావున ఈపుణ్యం అనేఔషధం మీశరీరంలో ఉన్న ప్రాపంచిక సుఖాలను, పాపం అనే జబ్బుని రక్షించేందుకు అవసరం. ఈపుణ్యం అనే ఔషధం ఆపాపం అనే రోగాన్ని నాశనం చేస్తుంది. కావున ఈ మీ వెర్రి ఆలోచనలు ఆపడానికి పుణ్యాన్ని పెంచండి. మంచిపనులు అనేవిత్తనాలు నాటి, సుఖాలు అనే పంటను పొందండి.

రాళ్ళమీద నాటిన విత్తనాలు ఎప్పటికి మొలకెత్తవు. చెడుకోరికలు, కార్యాలు ఇటువంటి రాళ్ళవంటివి, వాటిమీద విసిరిన విత్తనాలు పక్షులు, క్రిమికీటకాలు భక్షిస్తాయి. యోగులకు సేవ చెయ్యడంకంటే మించిన పుణ్యం వేరొకటిలేదు. ప్రస్తుతం శ్రీగజానన్ మహారాజు, యోగులలో మాణిక్యం వంటివారు. ఒక్కగింజ నాటితే అనేకములయిన గింజలు వస్తాయి.

అలానే యోగులకొరకు ఏదయినా ఇస్తే అది మీపుణ్యాన్ని లెఖ్కలేనన్నిసార్లు పెంచుతుంది. ఒకగింజ వెనక్కి ఎలా అయితే అనేకమయిన గింజలు ఇస్తుందో అలానే పుణ్యం విషయంలో కూడా అని అన్నాడు. ఇదివిన్న ఆ ఆకతాయి మనుషులు నిశ్శబ్ధంగా ఉండిపోయరు. నిజం అన్ని వాగ్వివాదాలను ఒకకొలిక్కి తెస్తుంది.

సంఘంలో గౌరవంవున్న వ్యక్తులనుండి మాత్రమే విరాళాలు సేకరించవచ్చు. సాధారణ వ్యక్తులు ఆకార్యానికి ఏమీ ఉపయోగం ఉండదు. అప్పడు శ్రీమహారాజు కొరకు సంపాదించిన స్థలంచుట్టూ గోడకట్టడం ప్రజలు ప్రారంభించారు.

షేగాంలో ప్రతీవాళ్ళు దీనికి చేయూతనిచ్చారు. రాళ్ళు, సున్నం, ఇసుక వంటి పనికి కావలసిన వస్తువులు ఎడ్లబండి మీద మోసుకు వెళ్ళబడ్డాయి. ఆసమయంలో శ్రీమహారాజు తమ పాతమఠంలో కూర్చుండేవారు. తను స్వయంగా వెళ్ళి ఆక్రొత్త స్థలంలో కూర్చుంటేతప్ప కట్టడం పని త్వరగా కాదని ఆయన అనుకున్నారు.

అలా ఆలోచించి మఠానికి ఇసుక మోసుకు వెళుతున్న ఒక ఎడ్లబండిమీద ఎక్కి కూర్చున్నారు. ఆబండి తోలేవాడు ఒక మహార్ కులానికి చెందినవాడు అవడంతో వెంటనే ఆబండికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆవిధంగా అతను ప్రవర్తించడానికి శ్రీమహారాజు కారణం అడుగుతూ, తను పరమహంసననీ, అచ్చుతులను ముట్టుకోవడం వల్ల తనకు ఏమీ పరిణామం ఉండదని అన్నారు.

అది నిజమేకానీ బండిమీద మీప్రక్కన కూర్చోడం నాకు సమంజసంకాదు, మారుతి శ్రీరామునితో ఒకడయ్యాడు కానీ ఎప్పడూ ఆయన ప్రక్కన కూర్చోలేదు. ఎప్పుడూ అతను ఆయనముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు అని ఆ మహర్ అన్నాడు.

శ్రీమహారాజు దానికి సమ్మతించి, ఆఎద్దులను ఆబండి తోలేవాడిని అనుసరించ వలసిందిగా అన్నారు. అవి నిజంగా చాలాబాగా ప్రవర్తించి బండి తోలేవాడు లేకపోయినా కోరుకున్న స్థలానికి బండిని తెచ్చాయి. శ్రీమహారాజు దిగి ప్రస్తుతం మందిరం నిలబడ్డ స్థలంలో మధ్యలో కూర్చున్నారు. ఈస్థలం రెండు సర్వేనంబర్లలో ఉంది 43/45. శ్రీమహారాజు కూర్చున్న చోటుని మందిరనిర్మాణానికి కేంద్రంగా పరిగణించాలి.

అలా చెయ్యాలంటే వాళ్ళు రెండు సర్వేనంబర్లనుండి స్థలం ఉపయోగించాలి. వాళ్ళకి ఒక ఎకరం మాత్రమే ఇవ్వబడింది కానీ ఈవిధంగా కేంద్రంనిర్ణయించడం వల్ల, 11 గజాలస్థలం వేరే స్థలంనుండి మఠం నిర్మాణానికి ఆక్రమించబడింది. కలక్టరు నిర్మాణంగతి చూసినతరువాత ఇంకా ఎక్కువ స్థలం ఇస్తానని హామీ ఇచ్చినకారణంగా వీళ్ళు ఈసాహసం చేసారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 65 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 2 🌻

Thus this medicine of Punya (good deeds) is required to protect your material pleasures, which are in your body, and sin is its disease.

This medicine of Punya will destroy the sin. Therefore, increase, your Punya and stop all this perverse thinking sow the wealth of good deeds to reap the crop of happiness. Grains sown on rocks get wasted and they never germinate. Bad desires and acts are like rocks and grains thrown on them will be consumed by birds and insects only.

There is no better Punya than rendering service to saints. At present, Shri Gajanan Maharaj is a gem amongst saints. A single grain sown gives out a bunch of grains; likewise anything given for cause of a saint adds to your Punya countless times.

One grain gives back multiple of grains same is the case with Punya.” Hearing this, the slanderers kept quiet, as truth puts an end to all arguments. Donations can be collected only with the help of men having prestige in this society. Ordinary persons are of no use for such work.

People, then, started the work of constructing a compound wall around the plot acquired for Shri Gajanan Maharaj . Everybody in Shegaon extended help for this work. The material like stone, lime and sand for the work was carried in bullock carts. At that time Shri Gajanan Maharaj was sitting in the old Matth.

He thought that unless He, Himself, went and sat in the new place, the work of the construction would not be expedited. Thinking so, he climbed a bullock cart carrying sand to the new place of Matth. The cartman, being a Mahar by caste, immediately moved away from the cart.

Shri Gajanan Maharaj asked him the reason for his behavior and added that He being a sainta Paramhansa was not affected by the contact of untouchables. There upon the Mahar said, It is true, but even then that is not proper for me to sit beside You on the cart.

Maroti became one with Shri Ram, but never sat by His side. He always stood before Him with folded hands. Shri Gajanan Maharaj agreed and asked the bullocks to follow the cartman. They really behaved well, and brought the cart, without the cartman, to the desired place.

Shri Gajanan Maharaj got down and sat in the center of the plot where the temple stands at present. This place is in two survey numbers: 43/45. The spot where Shri Gajanan Maharaj sat was treated as the centre for construction and for doing so they had to take land from both the survey numbers.

In fact they were sanctioned only one acre of land, but due to the centre already being fixed as above, an encroachment of eleven gunthas of land was done for the construction ol the Matth. They dared do this because the Collector had promised to allot more land after looking to the progress of construction. However, some mischeuous elements reported the matter to the Government.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

శివగీత - 76 / The Siva-Gita - 76



🌹.   శివగీత - 76 / The Siva-Gita - 76   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 2 🌻

నిత్యో నిశుద్ధ స్సర్వాత్మా - నిర్లేపో హం నిరంజనః
సర్వధర్మ విహీనశ్చ - న గ్రాహ్యొ మనసా పిచ 6

నాహం సర్వేంద్రి య గ్రాహ్యః సర్వేషాం గ్రాహాకో హ్యహమ్
జ్ఞాతామం సర్వలోకస్య - మను జ్ఞాతాన విద్య తే 7

దూర స్సర్వ వికారాణాం - పరిణామాది కస్య చ
యతో నాచో నివర్తం తే - అప్రా ప్య మనసా సహా 8

ఆనందం బ్రహ్మ మాం జ్ఞాత్వా - న బిభే తి కుత శ్చన,
యస్తు సర్వాణి భూతాని - మయ్యే వేతి ప్రపశ్య తి 9

మాం చ సర్వేషు భూతేషు - తతో న విజుగుప్సతే
యస్య సర్వాణి భూతాని - హ్య త్త్యే వాభూద్వి జానతః 10

నేను శాశ్వతుడను, నిర్మలుండును, అందరి యంతరంగమున నున్నవాడిని, సమస్త స్వరూపుడను. వృద్ధి బొందువాడిని, క్రియా శూన్యుడను, సర్వధర్మ రహితుడను మనస్సున కగోచరుడను.

సమస్తేంద్రియములతో నగ్రాహ్యుడను, సర్వమును గ్రహించువాడిని, సర్వలోకములకు తెలిసికొన్న వాడిని, నన్నెవరును తెలియని (గుర్తించని) వాడిని, పరిణామాది వికార రహితుడను, నన్ను వివరించుటలో నే వేదములైతే మనస్సుతో కూడా గుర్తించ లేక మౌనమును వహించునో అటువంటి యానందమయుడ నగు పరబ్రహ్మనైన నన్ను తెలిసికొనిన వాడెక్కడను భీతిల్లడు.

సమస్త ప్రాణులు నాయందే యున్నవని మదాత్మగాదలచునో నన్నన్ని ప్రాణులయందు వానినిగా నేవ్వడైతే తెలిసికొనునో అట్టివాడు సమస్త ప్రాణులనుండి తనను రక్షించు కొనదలచినవాడు కాడు. సమస్త ప్రాణులు నా పరమాత్మయేనని తెలిసికొనునట్టి ఐక్యమునే చూచునట్టి వాడికి మొహశోకము లెట్లు కలుగును?

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 76   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -2
🌻

I'm eternal, pure, am the indweller of all, all forms are my forms, I grow, I do not do any work, I am above all religions, I'm beyond the comprehension of mind, I'm beyond all senses, I comprehend everything, I know all the universes but no one knows me, I'm devoid of any results.

Incapable of describing me completely, the vedas themselves become silent; such a Parabrahman i am and the one who knows me in this way, he wouldn't fear of anything.

All creatures reside in me, hence a wise man who sees me in all creatures, such a one wouldn't fear of any creature.

One who understands the fact that all creatures are not different from me, how can such a wise one ever get immersed in attachment or sorrow?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 22 and 23 / Vishnu Sahasranama Contemplation - 22 and 23



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 22 and 23 / Vishnu Sahasranama Contemplation - 22 and 23 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān 🌻

ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ

యస్య వక్షసి నిత్యం శ్రీః వసతి ఎవని వక్షమునందు ఎల్లప్పుడును శ్రీ వసించునో అట్టివాడు 'శ్రీమాన్‌'.

'శ్రీ' అనగా ఐశ్వర్యము. జ్ఞానైశ్వర్యము, మనోనిర్మలత్వము, ధర్మముయెడల మోక్షముయెడల ఉత్సాహము ఎచటనుండునో అచట సాక్షాత్ పరమాత్మ వెలుగుచున్నారని గ్రహింపనగును. భగవత్తేజముయొక్క అంశమువలన అట్టి పవిత్రగుణము సంభవించునని చెప్పుటవలన భగవత్తేజము, ఈశ్వరీయశక్తి (ఐశ్వర్యము) అనంతమని, అందలి ఏ ఒకానొక అంశమువలననో ఇట్టి ఉత్తమవిభూతి, ఉత్సాహాది సద్గుణములు సంభవించునని తెలియుచున్నది. కాబట్టి జనులట్టి సద్గుణములకు తమ హృదయములందు స్థానమొసంగి తద్వారా భగవత్సాన్నిధ్యమును అనుభూతమొనర్చుకొనవలెను. మఱియు ఆ ప్రకారములైన సుగుణము లెవనియందున్నను, అతడేజాతివాడైనను భగవంతునివలె వంద్యుడే యగును.

:: భగవద్గీత - విభూతి యోగము ::

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోఽoశసమ్భవమ్ ॥ 41 ॥

ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు, కాంతివంతమైనదియు, ఉత్సాహముతో గూడినదియునగు వస్తువు ఏది యేది కలదో అదియది నా తేజస్సుయొక్క అంశమువలన కలిగిన దానినిగనే నీవెఱంగుము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹.   VISHNU SAHASRANAMA CONTEMPLATION - 22   🌹

📚. Prasad Bharadwaj

🌻 22 Śrīmān 🌻

22 OM Śrīmate namaḥ

One on whose chest the goddess Śrī always dwells. Śrī means opulence and prosperity. The Supreme Lord is the owner of all opulences.

Bhagavad Gīta - Chapter 10

Yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitameva vā ,
Tattadevāvagaccha tvaṃ mama tejo’ṃśasambhavam.(41)

Whatever object is verily endowed with majesty, possessed of prosperity or is energetic you know for certain each of them as having a part of My power as its source.

Śrī, also known as Goddess Lakṣmī is His Consort/power and has His chest as her abode. The above stanza clearly indicates that all of the opulences and prosperity, have a part of His power otherwise known as Śrī or Lakshmi as its source.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 23 / Vishnu Sahasranama Contemplation - 23🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 23. కేశవః, केशवः, Keśavaḥ 🌻

ఓం కేశవాయ నమః | ॐ केशवाय नमः | OM Keśavāya namaḥ

అభిరూపాః కేశాః యస్య సః సుందరములగు కేశములు ఎవనికి కలవో అతడు కేశవః.

కః అనగా బ్రహ్మ; అః అనగా విష్ణువు; ఈశః అనగా రుద్రుడు. బ్రహ్మయు, విష్ణుడును, రుద్రుడును ఎవని వశముచే ప్రవర్తిల్లుదురో అట్టి పరమాత్ముడు కేశవః అనబడును.

కేశి వదాత్ కేశవః కేశి అను రాక్షసుని వధ చేయుట వలన కేశవః అనబడును.

:: విష్ణు పురాణము - ఐదవ అధ్యాయము ::

యస్యా త్త్వయైష దుష్టాత్మా హతః కేశి జనార్ధన ।

తస్మా త్కేశవనామ్నా త్వం లోకే క్యాతో భవిష్యసి ॥ 16.23 ॥

జనార్ధనా! ఏ హేతువు వలన దుష్టాత్ముడగు 'కేశి' అను దైత్యుడు నిచే వధ చేయబడెనో - ఆ హేతువు వలన నీవు లోకమున 'కేశవ' నామముతో ఖ్యాతి నందినవాడవయ్యెదవు అని నారద వచనము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 23 🌹

📚. Prasad Bharadwaj

🌻 23.Keśavaḥ 🌻

OM Keśavāya namaḥ

Abhirūpāḥ keśāḥ yasya saḥ One whose Keśā or locks are beautiful he is Keśavaḥ.

Or one who is Himself the three - Kaḥ (Brahmā), Aḥ (Viṣṇu) and Īśaḥ (Siva) he is Keśava.

Or Keśi vadāt Kēśava One who destroyed the asura/demon Keśi in the Kr̥ṣṇa incarnation.


Viṣṇu Purāṇa - Part 5, Chapter 16

Yasyā ttvayaiṣa duṣṭātmā hataḥ keśi janārdhana,

Tasmā tkeśavanāmnā tvaṃ loke kyāto bhaviṣyasi. (23)

Sage Nārada delightedly exclaimed 'O Janārdhana! For this, that You have slain the impious Keśi, You shall be known in the world by the name of Keśava.'

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020