భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 58



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 58   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 8 🌻

235. పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడవంటిది . కాబట్టి లోకానుభవము లన్నియు ,అయదార్ధమైనవి .

236. పూర్వజన్మ సంస్కారముల వలననే ప్రస్తుత జన్మ తయారగును . ఈ ప్రస్తుత రూపము ద్వారా పూర్వ జన్మ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు అగుచుండును .

237. ఆత్మ యొక్క చైతన్యము సంస్కారములలో కేంద్రీకరించి యున్నంతకాలము , ఆ సంస్కారానుభవమును పొందవలసినదే .

238. పునర్జన్మ ప్రక్రియలో, పూర్ణ చైతన్యముగల మానవాత్మ విధిగా అసంఖ్యాకమైన వివిధములైన ద్వంద్వ సంస్కారములు అనుభవమును సంపాదించ వలెను కనుక యీ మానవాత్మ, అసంఖ్యాకమైన సార్లు స్త్రీగను పురుషునిగాను, వేర్వేరు కులములలో, వేర్వేరు జాతులలో, వేర్వేరు తెగలలో , వేర్వేరు రంగులలో, వేర్వేరు ప్రదేశములలో,

ఒకప్పుడు ధనికుడగను, మరియొకప్పుడు దరిద్రునిగను, ఒకప్పుడు ఆరోగ్యవంతునిగాను, మరియొకప్పుడు అనారోగ్యవంతునిగాను, ఒకప్పుడు సుందరుడుగను, మరియొకప్పుడు కురూపిగను , ఒకప్పుడు పొడగరిగను

మరియొకప్పుడు పొట్టిగాను ,

ఇట్లు అసంఖ్యాక సంస్కారములను అనుభవించుచు వ్యతిరేక సంస్కారములను సృష్టించుకొనుచు ఏకకాల మందే వాటిని రద్దుగావించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

No comments:

Post a Comment