శ్రీ శివ మహా పురాణము - 234



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 234   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

51. అధ్యాయము - 6

🌻. సంధ్య తపస్సును చేయుట - 4 🌻

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా మహేశస్య ప్రసన్న మనసస్తదా | 
సంధ్యో వా చ సుప్రసన్నా ప్రణమ్య చ ముహుర్ముహుః || 31

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సు గల మహేశ్వరుని ఈ మాటను విని, సంధ్య మిక్కిలి ఆనందించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి ఇట్లు పలికెను (31).


సంధ్యోవాచ |

యది దేయో వరః ప్రీత్యా వరయోగ్యాస్మ్యహం యది | 
యది శుద్ధాస్మ్యహం జాతా తస్మాత్పాపాన్మహేశ్వర || 32

యది దేవ ప్రసన్నోsసి తపసా మమ సాంప్రతమ్‌ | 
వృతస్తదాయం ప్రథమో వరో మమ విధీయతా మ్‌ || 33

ఉత్పన్న మాత్రా దేవేశ ప్రాణినోస్మిన్న భస్థ్సలే | 
న భవంతు సమే నైవ సకామ స్సంభవంతు వై || 34

యద్ధి వృత్తా హి లోకేషు త్రిష్వసి ప్రథితా యథా | 
భవిష్యామి తథా నాన్యా వర ఏకో వృతో మయా || 35

సంధ్య ఇట్లు పలికెను -

ఓ మహేశ్వరా! ప్రీతితో వరము నిచ్చే పక్షములో, నేను వరమునకు యోగ్యురాలను అయినచో, నేను ఆ పాపమునుండి శుద్ధురాలను అయినచో (32),

హే దేవా! నా ఈ తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచో, నాకు దీనిని మొదటి వరముగా నీయవలెను (33).

హే దేవదేవా! ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుక తోడనే కామము గలవి గా పుట్టకుండుగాక! (34).

జరిగిన వత్తాంతము ముల్లోకములలో ప్రసిద్ధి చెంది నేను అపకీర్తిని పొందకుండునట్లు అనుగ్రహించుడు. ఇది నేను కోరు వరములలో ఒకటి (35).


సకామా మమ దృష్టిస్తు కుత్ర చిన్న పతిష్యతి | 
యో మే పతిర్భవేన్నాథ సోsపి మేsతిసుహృచ్చ వై || 36

యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషమ్‌ | 
నాశం గమిష్యతి తదా స చ క్లీబో భవిష్యతి || 37

ఏ వ్యక్తిపైననూ కామముతో గూడిన నా చూపు పడకుండుగాక! హేనాథా! నాకు భర్తయగు వ్యక్తి నాకు మంచి మిత్రుడై ఉండవలెను (36).

నన్ను కామముతో చూచు వ్యక్తి యొక్క పురుషత్వము నశించి, వాడు నపుంసకుడు కావలెను (37).


బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్యా శ్శంకరో భక్తవత్సలః | 
ఉవాచ సుప్రసన్నాత్మా నిష్పాపాయాస్తయేరితే || 38

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు శంకరుడు సర్వపాపవినిర్ముక్తురాలగు ఆమె పలుకులు విని మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (38).


మహేశ్వర ఉవాచ |

శృణు దేవి చ సంధ్యే త్వం త్వత్పాపం భస్మతాం గతమ్‌ | 
త్వయి త్యక్తో మయా క్రోధః శుద్ధా జాతా తపః కరాత్‌ || 39

యద్యద్వృతం త్వయా భ##ద్రే దత్తం తదఖిలం మయా | 
సుప్రసన్నేన తపసా తవ సంధ్యే వరేణ హి || 40

ప్రథమం శైశవో భావః కౌమారాఖ్యో ద్వితీయకః | 
తృతీయో ¸°వనో భావశ్చతుర్థో వార్ధకస్తథా || 41

తృతీయే త్వథ సంప్రాప్తే వయో భాగే శరీరిణః | 
సకామాస్స్యుర్ద్వితీయాంతే భవిష్యతి క్వచిత్‌ క్వచిత్‌ || 42


మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ సంధ్యాదేవీ!వినుము. నీ పాపము నశించినది. నీవు తపస్సును చేసి శుద్ధురాలవైతివి. నీపై గల కోపమును నేను వీడితిని (39).

ఓ మంగళస్వరూపులారా! సంధ్యా! నీ తపస్సు చేత, మరియు వరముల చేత నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని నీవు కోరిన వరములనన్నిటినీ నేను ఇచ్చితిని (40).

మానవులు ముందుగా శైశవము , తరువాతరెండవదియగు కౌమారము, మూడవదియగు ¸°వనము, నాల్గవదియగు వార్ధకము అను దశలను క్రమముగా పొందెదరు (41).

ప్రాణులు మూడవది యగు ¸°వనమును పొందినప్పుడు కామ భావనను కలిగియుందురు. కొన్ని సందర్భములలో రెండవది యగు కౌమారావస్థ అంతములో కూడా వారు సకాములు కావచ్చును (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

No comments:

Post a Comment