🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 122 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నరనారాయణ మహర్షులు - 3 🌻
14. ధారణంగా మనుష్యులు చేసే పని ఏమంటే, మనధ్యేయం ఒకటి. ఆ ధ్యేయాన్ని అడగం. దానికి మార్గం అడుగుతాం. నాకు తృప్తిని ఇవ్వమని అడిగితే, ఐశ్వర్యం ఇవ్వమని అడగక్కరలేదు. అయితే తృప్తిని అడగకుండా ఐశ్వర్యాన్ని అడుగుతాం!
15. చిన్న విషయాలలో కూడా క్షేమమూ, లాభము, సుఖము, ఉంటాయనుకొని; ఇవి ఇచ్చే వస్తువులు ఏమైనా ఉంటేవాటిని అడుగుతాంకానీ, ఆ వస్తువుతో నిమిత్తంలేకుండానే క్షేమము, శాంతి, లాభము ఇక్కడ ఉన్నచోటే ఇవ్వమని అడగము!
16. ఆ వస్తువు తనకు లభిస్తే శాంతి, సుఖము, లాభము అన్నీ కలుగుతాయి అని అనుకుంటారు మనుష్యులు. ఆ నిర్ణయంలోనే దోషం ఉంది. ఏది శాంతి నిస్తుందో దన్ని అడగకుండా, ఏదో వస్తువును అడుగుతాడు. ఆ వస్తువును దేవతలు ఇచ్చిపోతారు.
17. లోకంలో సమస్త విజ్ఞానమూ కోరేవారు మత్స్యావతారంలో ఉన్న రూపాన్ని ఆరాధిస్తారు. కులవృద్ధి, వంశవృద్ధి, సంతానం పెరగాలంటే ఇతడిని కూర్మావతారంలో ఆరాధిస్తారు. ముక్తికోరేవాళ్ళు ఈయనను వరాహావతారరూపంలో ఆరాధిస్తారు.
18. చేసిన పాపం హరించాలి అనుకునేవాళ్ళు నృసింహస్వామి రూపాన్ని ఆరాధిస్తారు. లోకంలోని పరిజ్ఞానాన్ని, చాలా విషయాలను తెలుసుకోవలనుకునేవాళ్ళు వామనావతారాన్ని ఆరాధిస్తారు. ధనంకోరేవాళ్ళు బలరామావతారాన్ని, శత్రుజయం కోరే వాళ్ళు రామావతారాన్ని, మంచి సంతానం – ఒక్కడే కొడుకైనా పరవాలేదు బుద్ధిమంతుడు కావాలి అనుకునేవాళ్ళు – బలరామకృష్ణులను ఆరాధిస్తారు.
19. అపూర్వమైన గొప్ప సౌందర్యం కావాలనుకునేవాళ్ళూ బుద్ధుడిని ఆరాధిస్తారు.(ఇందులో నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. సందేహం ఏమీ లేదు) ఇతరులమీద ఆధిపత్యం కావాలనుకునేవాళ్ళు కల్కిఅవతారంగా ఆయనను ఆరాధిస్తారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
28 Sep 2020
No comments:
Post a Comment