✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 18 🌴
18. ఊర్థ్వం గచ్చన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసా: |
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసా: ||
🌷. తాత్పర్యం : సత్త్వగుణము నందున్నవారు క్రమముగా ఊర్థ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణము నందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణము నందున్నవారు నరకలోకములకు పతనము చెందుదురు.
🌷. భాష్యము : త్రిగుణములయందలి కర్మల వలన కలిగెడి ఫలితములు ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినవి. స్వర్గలోక సమన్వితమైన ఊర్థ్వగ్రహమండల మొకటి కలదు. ఆ లోకములందు ప్రతియొక్కరు ఉదాత్తులై యుందురు. జీవుడు తాను సత్త్వగుణమునందు పొందిన పురోగతి ననుసరించి అట్టి గ్రహమండలమందలి వివధలోకములకు ఉద్ధరింపబడుచుండును. ఆ లోకములలో బ్రహ్మలోకము (సత్యలోకము) అత్యంత ఉన్నతమైనది. అచ్చట విశ్వములో ముఖ్యుడైన బ్రహ్మదేవుడు నివసించును. బ్రహ్మలోకమందలి అధ్బుతమైన జీవనస్థితి పరిగణనకు అతికష్టమైనది ఇదివరకే మనము గాంచియున్నాము. కాని అత్యంత ఉన్నతస్థితియైన సత్త్వగుణము ద్వారా అది ప్రాప్తించగలదు. రజోగుణము సత్త్వ, తమోగుణముల నడుమ యుండుటచే మిశ్రితమైనది. మానవుడు సదా పవిత్రుడై యుండజాలడు. ఒకవేళ అతడు పూర్తిగా రజోగుణమునందున్నచో భూమిపై రాజుగనో, ధనవంతుడుగనో జన్మను పొందుచుండును. కాని వాస్తవమునకు రజోగుణము నందును అతడు సర్వదా నిలువలేనందున పతనము చెందుటయు సంభవించును. రజస్తమోగుణ సమన్వితులైన భూలోకవాసులు యంత్రముల ద్వారా బలవంతముగా ఊర్థ్వలోకములను చేరజాలరు. అంతియేగాక రజోగుణమునందున్నవాడు తదుపరి జన్మమున బుద్ధిహీనుడగుటకును అవకాశము కలదు.
అధమమైన తమోగుణము అత్యంత హేయమైనదిగా ఇచ్చట వర్ణింపబడినది. అట్టి తమోగుణఫలితము మిక్కిలి ప్రమాదకరముగా నుండును గనుకనే అది ప్రకృతి యొక్క అధమగుణమై యున్నది. మానవుని స్థాయి క్రింద పక్షులు, మృగములు, సరీసృపములు, వృక్షములు మొదలగు ఎనుబదిలక్షల జీవరాసులు గలవు. జీవుని తమోగుణప్రాబల్యము ననుసరించి ఈ వివిధ హేయస్థితుల యందు అతడు ప్రవేశపెట్టబడుచుండును. ఈ శ్లోకమునందు “తామసా:” యను పదము ప్రధానమైనది. ఉన్నతగుణమునకు వృద్ధి చెందకుండా నిరంతరము తమోగుణమునందే కొనసాగుగారిని ఈ పదము సూచించును. అట్టివారి భవిష్యత్తు మిగుల అంధకారమయముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 542 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 18 🌴
18. ūrdhvaṁ gacchanti sattva-sthā madhye tiṣṭhanti rājasāḥ
jaghanya-guṇa-vṛtti-sthā adho gacchanti tāmasāḥ
🌷 Translation : Those situated in the mode of goodness gradually go upward to the higher planets; those in the mode of passion live on the earthly planets; and those in the abominable mode of ignorance go down to the hellish worlds.
🌹 Purport : In this verse the results of actions in the three modes of nature are more explicitly set forth. There is an upper planetary system, consisting of the heavenly planets, where everyone is highly elevated. According to the degree of development of the mode of goodness, the living entity can be transferred to various planets in this system. The highest planet is Satyaloka, or Brahmaloka, where the prime person of this universe, Lord Brahmā, resides. We have seen already that we can hardly calculate the wondrous condition of life in Brahmaloka, but the highest condition of life, the mode of goodness, can bring us to this.
The mode of passion is mixed. It is in the middle, between the modes of goodness and ignorance. A person is not always pure, but even if he should be purely in the mode of passion, he will simply remain on this earth as a king or a rich man. But because there are mixtures, one can also go down. People on this earth, in the mode of passion or ignorance, cannot forcibly approach the higher planets by machine. In the mode of passion, there is also the chance of becoming mad in the next life. The lowest quality, the mode of ignorance, is described here as abominable. The result of developing ignorance is very, very risky. It is the lowest quality in material nature. Beneath the human level there are eight million species of life – birds, beasts, reptiles, trees, etc. – and according to the development of the mode of ignorance, people are brought down to these abominable conditions.
🌹 🌹 🌹 🌹 🌹